• facebook
  • whatsapp
  • telegram

కొలతలు - ప్రమాణాలు

మీటర్‌లో బిలియన్‌ భాగం నానోమీటర్‌!


గంటకు అరవై నిమిషాలు అనేది ప్రామాణిక కొలమానం. కానీ అది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అదే విధంగా మీటరుకు వంద సెంటీమీటర్లు ప్రస్తుతం ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న విధానం. దాన్ని దేశాల వారీగా వేర్వేరుగా నిర్ణయించుకుంటే పొడవు పెద్ద సమస్యగా మారిపోతుంది. ఉష్ణోగ్రత, బరువు మొదలైనవి కూడా అలాంటివే. అందుకే సైంటిస్టులు, ఇంజినీర్లు సహా ప్రజలందరూ గందరగోళ పడకుండా స్థిరమైన, కచ్చితమైన, నమ్మకమైన, సార్వత్రిక కొలతలను, ప్రమాణాలను భౌతిక శాస్త్రంలో నిర్దేశించారు. వీటి గురించి పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ కొలతలకు సూచించిన ప్రమాణాలనూ తెలుసుకోవాలి. 


1.     దేని సహాయంతో ధ్వని తీవ్రతను కొలవచ్చు?

1) హెర్ట్జ్‌ 2) డెసిబెల్‌  3) జౌల్స్‌  4) ఆంగ్‌స్ట్రామ్‌


2.     పారెసెక్‌ యూనిట్‌ కొలమానం?

1) శక్తి  2) ఒత్తిడి 3) కాలం  4) ఖగోళదూరం


3.     ఒక మైలు ఎన్ని కిలో మీటర్లకు సమానం?

1) 1.609  2) 2.609  3) 0.609  4) 3.162


4. ఒక కిలోగ్రామ్‌ ఎన్ని పౌండ్లకు సమానం?

1) 2.2 పౌండ్లు     2) 3.2 పౌండ్లు  

3) 2.8 పౌండ్లు      4) 1.9 పౌండ్లు


5.     డైన్‌ అనే యూనిట్‌ దేనికి కొలమానం?

1) ఒత్తిడి   2) పని   3) శక్తి   4) ద్రవ్యవేగం


6.     కెలోరీస్‌ దేని ప్రమాణం?

1) ధ్వని   2) ఉష్ణం  3) కాంతి   4) పీడనం


7. ఇళ్లల్లో వినియోగించే విద్యుత్తు శక్తిని కొలిచే ప్రమాణాలు?

1) జౌల్‌      2) ఆంపియర్‌ - సెకను  

3) కిలోవాట్‌      4) కిలోవాట్‌ - గంట


8. సముద్ర యానంలో వేగాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం?    

1) నాట్‌  2) ఓమ్‌ 3) పాథమ్‌ 4) అశ్వసామర్థ్యం


9. పరమాణు కేంద్రక వ్యాసార్ధాన్ని కొలిచే ప్రమాణం?

1) ఆంగ్‌స్ట్రామ్‌     2) మైక్రాన్‌ 

3) ఫెర్మీ     4) నానోమీటర్‌


10. పాయిజ్‌ ప్రమాణం?    

1) యంగ్‌ గుణకం     2) స్థితిస్థాపక గుణకం 

3) స్నిగ్ధతా గుణకం      4) తలతన్యత 


11. షేక్‌ అనే ప్రమాణం దేని కొలమానం?

1) పొడవు 2) కంపనం 3) కాలం  4) ద్రవ్యరాశి


12. క్యూరీ దేనికి ప్రమాణం?

1) ఉష్ణోగ్రత      2) రేడియోధార్మికత  

3) అర్ధ జీవితకాలం     4) ఏదీకాదు


13. శక్తి ప్రమాణం?

1) ఎలక్ట్రాన్‌ ఓల్ట్‌      2) ప్రోటాన్‌ ఓల్ట్‌ 

3) న్యూట్రాన్‌ ఓల్ట్‌      4) పైవన్నీ


14. ఒక మీటర్‌లోని మైక్రాన్‌ల సంఖ్య?

1) 10    2) 103    3) 106    4) 109


15. పరమాణు వ్యాసార్ధ ప్రమాణం?

1) ఆంగ్‌స్ట్రామ్‌      2) ఎలక్ట్రాన్‌ ఓల్ట్‌     

3) మోల్‌      4) కిలోజౌల్‌


16. ఒక బ్యారెల్‌ చమురు ఎన్ని లీటర్లకు సమానం?

1) 159    2) 131    3) 251    4) 321


17. కిందివాటిలో ఎక్కువ విలువ కలిగి ఉండేది?

1) ఫెర్మి 2) మైక్రాన్‌ 3) ఆంగ్‌స్ట్రామ్‌ 4) మిల్లీమీటర్‌


18. ఒక జౌల్‌ ఎన్ని గ్రాములకు సమానం?

1) 24.35 గ్రా.     2) 25.35 గ్రా.  

3) 26.35 గ్రా.      4) 28.35 గ్రా.


19. ఒక గ్యాలన్‌ ఎన్ని లీటర్లకు సమానం?

1) 3.8 లీ.      2) 3.0 లీ. 

3) 4.5 లీ.      4) 4.0 లీ.


20. కెల్విన్‌మాన ఉష్ణోగ్రతలో నీటి బాష్పీభవన స్థానం?

1) 100   2) 273    3) 373    4) 212


21. ఇండక్షన్‌ ఎస్‌.ఐ. ప్రమాణం?

1) ఫారడే  2) ఓమ్‌  3) హెన్రీ  4) క్యాండిలా


22. పాథమ్‌ అనేది దేని ప్రమాణం?

1) దూరం   2) కాలం   3) లోతు  4) శబ్దం


23. స్టెరేడియన్‌ అనేది దేని కొలమానం?

1) సముద్ర లోతు     2) ఘన కోణం  

3) కటక సామర్థ్యం      4) సమతల కోణం


24. బార్‌ దేని ప్రమాణం?

1) ఉష్ణం     2) ఉష్ణోగ్రత 

3) విద్యుత్తు     4) వాతావరణ పీడనం 


25. కాంతి సంవత్సరం దేని ప్రమాణం?

1) శక్తి    2) వేగం   3) దూరం   4) తీవ్రత


26. గతిశక్తి ప్రమాణం కిందివాటిలో దేనికి సమానంగా ఉంటుంది?

1) బలం  2) పని  3) ద్రవ్యవేగం  4) వేగం


27. ఒక కెలోరి విలువ జౌల్స్‌లో ఎంతకి సమానం?

1) 5.2    2) 4.2    3) 5.8    4) 4.8


28. ఒక మోల్‌ ప్రొపేన్‌ దహనానికి ఎన్ని మోల్స్‌  ఆక్సిజన్‌ అవసరం?

1) 2        2) 3       3) 4     4) 5 


29. ఒక ట్రాక్టర్‌ సామర్థ్యాన్ని ఏ యూనిట్‌లో కొలుస్తారు?

1) హార్స్‌పవర్‌     2) కిలోవాట్స్‌     

3) జౌల్స్‌    4) ఎర్గ్‌


30. నీటి పరమాణువు బరువు ఎంత?

1) 10 గ్రామ్‌/మోల్‌      2) 15 గ్రామ్‌/మోల్‌ 

3) 18 గ్రామ్‌/మోల్‌      4) 20 గ్రామ్‌/మోల్‌


31. 18 క్యారెట్‌ గోల్డ్‌లో ఎంత శాతం బంగారం ఉంటుంది?

1) 75 శాతం     2) 100 శాతం 

3) 50 శాతం     4) 80 శాతం


32. జడత్వం ప్రమాణం దేనికి సమానం?

1) బలం      2) గాఢత  3) ద్రవ్యరాశి      4) ఘనపరిమాణం


33. ఒక క్వింటాల్‌ కిందివాటిలో దేనికి సమానం?

1) 200 కేజీ      2) 150 కేజీ  

3) 100 కేజీ      4) 250 కేజీ


34. నానోమీటర్‌ అంటే?

1) ఒక మీటర్‌లో మిలియన్‌ భాగం    2) ఒక మీటర్‌లో బిలియన్‌ భాగం

3) ఒక మిలియన్‌ మీటర్లు   4) ఒక బిలియన్‌ మీటర్లు


35. వర్షపాత కొలతను దేనిలో పేర్కొంటారు?

1) మిల్లీమీటర్‌        2) సెంటీమీటర్‌  

3) మిల్లీమీటర్, సెంటీమీటర్‌  4) ఫీట్స్‌


36. కిందివాటిలో సదిశరాశిని గుర్తించండి.

1) ద్రవ్యవేగం      2) పీడనం  

3) త్వరణం     4) పైవన్నీ


37. నీటి ప్రవాహరేటు ప్రమాణం క్యూసెక్‌ విలువ?

1) ఘనపు మీటర్‌/సెకన్‌      2) ఘనపు అడుగు/సెకన్‌      

3) ఘనపు సెంటీమీటర్‌/సెకన్‌  4) 1000 లీటర్స్‌/సెకన్‌


38. సోనిక్‌ బూమ్‌ దేనికి సంబంధించింది?

1) లేజర్‌ కిరణాలు     2) రాడార్‌  

3) సూపర్‌సోనిక్‌      4) పరావర్తనం


39. పీడనం ఎస్‌.ఐ. ప్రమాణం?

1) డిగ్రీలు 2) పాస్కల్‌ 3) న్యూటన్‌  4) జౌల్‌ 


40. విమాన వేగాన్ని సూచించేది?

1) నాట్‌      2) మాక్‌సంఖ్య 

3) రేనాల్డ్‌ సంఖ్య      4) స్టెరేడియన్‌


41. పడవ వేగాన్ని కొలిచే ప్రమాణం?

1) నాట్‌     2) నాట్‌ సెకన్‌  

3) పాథమ్‌     4) పారెసెక్‌


42. ఒక కిలోవాట్‌ అంటే ఎన్ని వాట్స్‌కు సమానం?

1) 10 వాట్స్‌      2) 100 వాట్స్‌  

3) 1000 వాట్స్‌      4) 500 వాట్స్‌


43. అయస్కాంత అభివాహం ప్రమాణం?

1) గాస్‌     2) టెస్లా 

3) వెబర్‌      4) ఫుట్‌క్యాండిల్‌


44. మొగలుల పరిపాలనా కాలంలో భూమిని దేనితో కొలిచేవారు?

1) గుంట  2) మీటర్‌ 3) అంగుళం 4) గజం


45. వంద మైళ్లకు సమాన దూరం కిలోమీటర్లలో సుమారుగా?    

1) 145 కి.మీ.     2) 150 కి.మీ. 

3) 160 కి.మీ     4) 155 కి.మీ.


46. కారు వేగాన్ని కొలిచే పరికరం?

1) స్పీడోమీటర్‌     2) అనిమోమీటర్‌  

3) మానోమీటర్‌      4) ఒడోమీటర్‌ 


47. సాంద్రత ఎస్‌.ఐ., సి.జి.ఎస్‌. ప్రమాణాలకు మధ్య ఉండే నిష్పత్తి?

1) 103   2) 102   3) 10-2   4) 10-4


48. ఎస్‌.ఐ. యూనిట్లలో ప్లాంక్‌ స్థిరాంకం విలువ?

1) 6.62 × 10-34 జౌల్స్‌ సెకన్‌  2) 6 × 1023 జౌల్స్‌ సెకన్‌  

3) 10 × 106 మీటర్‌-1  4) 8.314 × 10-7 జౌల్స్‌


49. కాంతితీవ్రత ఎస్‌.ఐ. ప్రమాణం?

1) క్యాండిలా      2) లక్స్‌  

3) ఫుట్క్యాండిల్‌      4) టెస్లా


50. మెట్రిక్‌ పద్ధతులను భారతదేశంలో ఎప్పుడు  ప్రవేశపెట్టారు?

1) 1971  2) 1956  3) 1957  4) 1961


51. ఎంకేఎస్, సీజీఎస్, ఎఫ్‌పీఎస్‌ పద్ధతుల్లో ఒకే ప్రమాణం ఉండే భౌతిక రాశి?

1) ద్రవ్యరాశి 2) సాంద్రత     3) కాలం 4) పొడవు


52. భారతదేశంలో ఎస్‌ఐ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1957  2) 1987  3) 1961  4) 1971


53. 5 కేఎంఎస్‌ ఎన్ని మీటర్లకు సమానం?

1) 500  2) 5000  3) 50  4) 1000 


54. ఒక వస్తువు ఆక్రమించిన సమతల కొలతను ఏమంటారు?

1) వైశాల్యం     2) ఘనపరిమాణం 

3) సాంద్రత     4) పీడనం 


55. అక్రమాకార ఉపరితలాల వైశాల్యాని కొలవడానికి ఉపయోగించేది?

1) దారం 2) గ్రాఫ్‌ కాగితం 3) కొలపాత్ర    4) స్కేలు


56. ఒక మిల్లీ లీటర్‌ ఎన్ని ఘన సెంటీమీటర్లకు సమానం?

1) 10     2) 100     3) 50     4) 1


57. రిజర్వాయర్ల నుంచి వదిలివేసే వరద ప్రవాహాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) క్యూసెక్‌లు     2) లీటర్లు 

3) గ్యాలన్‌లు     4) టీఎంసీలు


58. ఘనాకార వస్తువుల ఘనపరిమాణాన్ని కొలవడానికి దేని ఉపయోగిస్తారు?    

1) మీటర్‌      2) చదరపు మీటర్‌ 

3) క్యూబిక్‌ మీటర్‌     4) సెంటీమీటర్‌


59. సెంటీ¨మీటరు స్కేలును ఉపయోగించి కొలవగలిగే అతిచిన్న కొలత?    

1) సెంటీమీటర్‌     2) మిల్లీమీటర్‌ 

3) మీటర్‌     4) మైక్రోమీటర్‌


60. తక్కువ దూరాలను మీటర్, సెంటీమీటర్లలో  కొలుస్తారు. మరి ఎక్కువ దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?

1) హెక్టామీటర్‌     2) డెకామీటర్‌ 

3) డెసీమీటర్‌     4) కిలోమీటర్‌  


సమాధానాలు

1-2; 2-4; 3-1; 4-1; 5-1; 6-2; 7-4; 8-1; 9-3; 10-3; 11-3; 12-2; 13-1; 14-3; 15-1; 16-1; 17-4; 18-4; 19-3; 20-3; 21-3; 22-3; 23-2; 24-4; 25-3; 26-2; 27-2; 28-4; 29-1; 30-3; 31-1; 32-3; 33-3; 34-2; 35-3; 36-4; 37-4; 38-3; 39-2; 40-2; 41-1; 42-3; 43-3; 44-4; 45-3; 46-1; 47-4; 48-1; 49-1; 50-3; 51-3; 52-4; 53-2; 54-1; 55-2; 56-4; 57-1; 58-3; 59-2; 60-4. 
 

Posted Date : 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌