• facebook
  • whatsapp
  • telegram

గ్లోబు భూమికి నమూనా

ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే ఊహారేఖ అక్షం!


విశ్వంలో నీటిజాడ, జీవుల మనుగడ ఉన్న అద్భుత గ్రహం భూమి. నిరంతరం తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఎన్నో మార్పులకు గురవుతుంటుంది. సౌరకుటుంబంలో భూమి ఉనికి నుంచి భూమిపై ఉండే వివిధ భౌగోళిక, నైసర్గిక స్వరూపాల వరకు అన్నీ భూగోళశాస్త్రంలో భాగాలే. దిక్కులు, ధ్రువాలు, దేశాల ఉనికి, ప్రాంతాలవారీగా ఉష్ణోగ్రతల వ్యత్యాసం, ఎప్పటికప్పుడు ఏర్పడే వాతావరణ పరిస్థితులతో పాటు అక్షాంశ రేఖాంశాల ప్రాధాన్యం గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. భూమి నమూనా అయిన గ్లోబుపై కనిపించే ప్రతి భాగం, ప్రాంతం, రేఖలపై అవగాహన పెంచుకోవాలి.  


1.    కొలంబస్‌ ఏ దేశానికి చెందినవాడు?

1) పోర్చుగల్‌ 2) ఇటలీ 3) ఫ్రాన్స్‌ 4) జర్మనీ

2. మీరు ఉత్తర అభిముఖంగా ఉంటే మీ కుడివైపు ఏ దిక్కును సూచిస్తుంది?

1) తూర్పు     2) పడమర    3) ఆగ్నేయం     4) వాయవ్యం

3. కిందివాటిలో గడ్డకట్టిన మహాసముద్రం ఏది?

1) అంటార్కిటికా     2) ఆర్కిటిక్‌    3) అట్లాంటిక్‌     4) పసిఫిక్‌


4.  అక్షాంశాలను భూమికి అడ్డంగా ఏ దిక్కు నుంచి గీస్తారు?

1) పడమర నుంచి తూర్పుకు     2) తూర్పు నుంచి పడమరకు

3) 1, 2    4) చెప్పలేం

5.   కిందివాటిలో ఏవి ఒకే రకమైన పొడవు కలిగి ఉంటాయి?

1) అక్షాంశాలు     2) రేఖాంశాలు   3) 1, 2     4) చెప్పలేం



6. అక్షాంశాల్లో పొడవైన అక్షాంశం ఏది?

1) కర్కటరేఖ     2) మకరరేఖ    3) భూమధ్యరేఖ     4) 1, 2



7.  కిందివాటిలో ఏ అక్షాంశం భారతదేశాన్ని రెండు సమభాగాలుగా చేస్తుంది?

1) భూమధ్యరేఖ     2) కర్కటరేఖ 

3) మకరరేఖ     4) ఆర్కిటిక్‌ వలయం



8.     ధ్రువాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమంటారు?

1) అక్షాంశాలు    2) రేఖాంశాలు    3) కక్ష్య     4) అక్షం



9.  గ్లోబును రెండు సమభాగాలుగా చేస్తున్న అక్షాంశం ఏది?

1) కర్కటరేఖ     2) మకరరేఖ    3) భూమధ్యరేఖ     4) చెప్పలేం



10. కిందివాటిలో  0O రేఖాంశాన్ని గుర్తించండి.

1) తూర్పు పశ్చిమ రేఖాంశం  2) గ్రీనిచ్‌ రేఖాంశం

3) అంతర్జాతీయ దినరేఖ    4) చెప్పలేం



11. 1800ల రేఖాంశాన్ని ఏమంటారు?

1) తూర్పు రేఖాంశం       2) పశ్చిమ రేఖాంశం

3) తూర్పు, పశ్చిమ రేఖాంశం     4) గ్రీనిచ్‌ రేఖాంశం



12. కిందివాటిలో ముఖ్యమైన అక్షాంశం ఏది?

1) కర్కటరేఖ     2) మకరరేఖ 

3) భూమధ్యరేఖ     4) అన్నీ



13. కిందివాటిలో అంతర్జాతీయ దినరేఖ ఏది?

1) 0Oరేఖాంశం    2) 180Oరేఖాంశం

3) 81 1/2Oరేఖాంశం     4) చెప్పలేం

14. మనం ఉత్తరాభిముఖంగా ఉంటే మన ఎడమ వైపు ఏ దిక్కుని సూచిస్తుంది?

1) తూర్పు     2) పడమర 

3) ఆగ్నేయం     4) ఈశాన్యం

15. కిందివాటిలో భూమి భ్రమణ దిశను గుర్తించండి.

1) తూర్పు నుంచి పడమరకు 

2) పడమర నుంచి తూర్పుకు

3) 1, 2     4) చెప్పలేం


 

16. భూమి మధ్య నుంచి ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీసిన ఊహారేఖను ఏమంటారు?

1) అక్షం     2) మధ్యాహ్నరేఖ 

3) భూమధ్యరేఖ     4) చెప్పలేం

17. భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం?

1) అధికంగా అడవులు ఉండటం

2) నీటి భాగం అధికంగా ఉండటం

3) పర్వతాలు అధికంగా ఉండటం

4) చెప్పలేం

18. కొలంబస్‌ వంటి నావికులు ఏ సంవత్సరంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్‌ నుంచి బయలుదేరారు?

1) 1498     2) 1492     3) 1504     4) 1508

19. కిందివాటిలో విపరీతంగా కురిసిన మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం?

1) ఆర్కిటిక్‌     2) అంటార్కిటికా 

3) అట్లాంటిక్‌     4) చెప్పలేం

20. భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడాన్ని ఏమని పిలుస్తారు?

1) భ్రమణం    2) పరిభ్రమణం

3) 1, 2    4) చెప్పలేం

21. గ్లోబు మీద ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, తూర్పు నుంచి పడమరకు అనేక ఊహారేఖలు ఉంటాయి. వాటిని ఏమంటారు?

1) అక్షాంశాలు     2) రేఖాంశాలు     

3) 1, 2    4) చెప్పలేం


 

22. భూగోళంపై గ్రిడ్‌ అమరిక అంటే ఏమిటి?

1) అక్షాంశాల అమరిక      2) రేఖాంశాల అమరిక

3) అక్షాంశ రేఖాంశాల అమరిక     4) చెప్పలేం


 

23. కిందివాటిలో 180Oల రేఖాంశాన్ని గుర్తించండి?

1) అంతర్జాతీయ దినరేఖ     2) తూర్పు పశ్చిమ రేఖాంశం

3) 1, 2    4) చెప్పలేం

24. భూగోళంపై ఏ అర్ధగోళంలో నీటి భాగం అధికంగా ఉంది?

1) ఉత్తరార్ధ గోళం    2) దక్షిణార్ధ గోళం

3) 1, 2    4) చెప్పలేం

25. భారతదేశం ఆసియా ఖండంలో ఏ దిశలో ఉంది?

1) ఉత్తర ఆసియా    2) దక్షిణ ఆసియా

3) తూర్పు ఆసియా    4) పశ్చిమ ఆసియా

26. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది?

1) అట్లాంటిక్‌     2) హిందూ మహాసముద్రం

3) పసిఫిక్‌ మహాసముద్రం       ఆర్కిటిక్‌

27. భూమి ఆకృతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి.

  1) భూమి గుండ్రంగా ఉండదు.

  2) కచ్చితమైన గోళాకారంలో ఉండదు.

  3) ధ్రువాల వద్ద నొక్కుతూ భూమధ్యరేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది.

  4) చెప్పలేం

28. భూగోళంపై ఉన్న ప్రదేశాలను వివరించడానికి అక్షాంశాలు, రేఖాంశాలు, ధ్రువాలు వంటి పదజాలాన్ని ఉపయోగించిన భారతీయ పూర్వీకుడు?

1) ఆర్యభట్ట    2) సి.వి.రామన్‌

3) శ్రీనివాస రామానుజన్‌    4) బ్రహ్మగుప్త

29. సూర్యుడు ఎప్పుడూ తూర్పున ఉదయించడానికి కారణం?

1) భూమి తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేయడం.

2) భూమి పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేయడం.

3) భూమి భ్రమణం లేకుండా స్థిరంగా ఉండడం.

4) చెప్పలేం

30. రేఖాంశాలు భూగోళాన్ని ఎలా విభజిస్తాయి?

1) ఉత్తర - దక్షిణ అర్ధ గోళాలుగా

2) తూర్పు - పశ్చిమ అర్ధ గోళాలుగా

3) 1, 2    4) చెప్పలేం

31. కిందివాటిలో అమెరికాను కనుక్కున్నవారు?

1) వాస్కోడగామా    2) కొలంబస్‌

3) హెన్రీ    4) అమెరిగో వెస్ఫూచి

32. సముద్ర మార్గం ద్వారా భారత్‌కు చేరిన మొదటి పోర్చుగీసు నావికుడు?

1) కొలంబస్‌    2) హెన్రీ

3) వాస్కోడగామా    4) అమెరిగో వెస్ఫూచి

33. అక్షాంశాలు, రేఖాంశాలు అనేవి?

1) వాస్తవ రేఖలు    2) ఊహాజనిత రేఖలు

3) 1, 2    4) చెప్పలేం

34. రేఖాంశాలు మొత్తం ఎన్ని ఉంటాయి?

1) 180    2) 360    3) 362  4) 361

35. అక్షాంశాలు మొత్తం ఎన్ని ఉంటాయి?

1) 180     2) 360    3) 181   4) 361

36. కింది వాటిలో ఒకే రకమైన పొడవును కలిగి ఉన్నవి?

1) అక్షాంశాలు    2) రేఖాంశాలు

3) 1, 2    4) ఏదీకాదు

37. కింది వాటిలో గ్రీనిచ్‌ రేఖాంశం ఏది?

1) 180O రేఖాంశం    2) 0Oరేఖాంశం

3) 1, 2    4) చెప్పలేం

38. భూమిపై ఒక ప్రదేశం ఉనికిని కింది వేటి ద్వారా తెలుసుకోవచ్చు?

1) అక్షాంశాల ద్వారా మాత్రమే

2) రేఖాంశాల ద్వారా మాత్రమే

3) గ్రీడ్‌ అమరిక్‌ ద్వారా    4) చెప్పలేం

39. కర్కటరేఖ, మకరరేఖ, భూమధ్యరేఖలు వెళ్లే ఖండం ఏమిటి?

1) ఆసియా     2) ఆఫ్రికా 

3) ఐరోపా     4) దక్షిణ అమెరికా

40. ప్రపంచంలోని మొత్తం ఖండాలు ఎన్ని?

1) 6      2) 7    3) 5      4) 8

41. కిందివాటిలో భారతదేశ ప్రామాణిక రేఖాంశం?

1) 72  1/2O తూర్పు రేఖాంశం

2) 0Oరేఖాంశం

 3) 180Oతూర్పు రేఖాంశం

4) 82 1/2O తూర్పు రేఖాంశం


 

42. గ్రీనిచ్‌ రేఖాంశానికి, భారతదేశ ప్రామాణిక  రేఖాంశానికి మధ్య కాలవ్యవధి?

 1) 3:30 గంటలు    2) 4:30 గంటలు

3) 5:30 గంటలు    4) 6:30 గంటలు

43. కిందివాటిలో ఉత్తరార్ధ గోళంలోని ప్రధాన అక్షాంశాలు?

1) కర్కటరేఖ    2) ఆర్కిటిక్‌ వలయం

3) 1, 2     4) చెప్పలేం

44. రేఖాంశాలకు సంబంధించింది?

1) రేఖాంశాలు వృత్తాలు   2) రేఖాంశాలు అర్ధవృత్తాలు

 3) 1, 2     4) చెప్పలేం

45. కిందివాటిలో అక్షాంశాలకు సంబంధించింది?

1) అక్షాంశాలు వృత్తాలు    

2) అక్షాంశాలు అర్ధవృత్తాలు

3) ఎ, బి    4) చెప్పలేం

46. లాటిట్యూడ్‌ అనేది ఏ భాషా పదం?

1) ఫ్రెంచ్‌   2) గ్రీకు   3) లాటిన్‌  4) అరబిక్‌

47. కిందివాటిలో లాంగిట్యూడ్‌ అంటే అర్థం ఏమిటి?

1) పొడవు  2) వ్యవధి  3) నిడివి  4) పైవన్నీ


 

48. కిందివాటిలో వేటిని మధ్యాహ్న రేఖలు అంటారు?

1) అక్షాంశాలు      2) రేఖాంశాలు 

3) 1, 2     4) ఏదీకాదు

49. కిందివాటిలో ప్రామాణిక రేఖాంశం ఏది?

1) 82 1/2O తూర్పు రేఖాంశం 

 2) 180Oతూర్పు రేఖాంశం    

3) 0Oరేఖాంశం    4) 1, 2



50. కిందివాటిలో పగలు, రాత్రి దేనివల్ల ఏర్పడతాయి?

1) భూభ్రమణం      2) భూపరిభ్రమణం

3) 1, 2      4) చెప్పలేం

51. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది?

1) 1680 కి.మీ.    2) 1650 కి.మీ.

3) 1610 కి.మీ.     4) 1690 కి.మీ.


                    రచయిత: బండ్ల శ్రీధర్‌

సమాధానాలు

1-2; 2-1; 3-2; 4-1; 5-2; 6-3; 7-2; 8-2; 9-3; 10-2; 11-3; 12-4; 13-2; 14-2; 15-2; 16-1; 17-2; 18-2; 19-2; 20-1; 21-3; 22-3; 23-3; 24-2; 25-2; 26-3; 27-3; 28-1; 29-2; 30-2; 31-2; 32-3; 33-2; 34-2; 35-3; 36-2; 37-2; 38-3; 39-2; 40-2; 41-4; 42-3; 43-3; 44-2; 45-1; 46-3; 47-4; 48-2; 49-3; 50-1; 51-3. 

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌