• facebook
  • whatsapp
  • telegram

జంతు వర్గీకరణ శాస్త్రం

చేపల్లో శీతలం.. పక్షుల్లో ఉష్ణం!


జీవుల అధ్యయనానికి సంబంధించిన జీవశాస్త్రంలోని ప్రధాన విభాగాల్లో జంతు వర్గీకరణ శాస్త్రం ఒకటి. సృష్టిలోని ఉన్నత శ్రేణి జీవులన్నీ జంతువర్గంలోనే ఉన్నాయి. వీటి లక్షణాలు, స్వభావాలు, మనుగడ తీరు ఆధారంగా మళ్లీ సమూహాలుగా విభజించారు. జీవ పరిణామ క్రమాన్ని, జంతు వర్గంలోని జాతుల మధ్య సంబంధాన్ని వివరించే ఈ అంశంపై పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. పలు జీవుల ప్రత్యేకతలు, ఆహార గొలుసులో అవి  నిర్వర్తించే పాత్ర గురించి అవగాహన పెంచుకోవాలి.
 

1.    జంతుశాస్త్ర పితామహుడు?

1) అరిస్టాటిల్‌     2) థియోఫ్రాస్టస్‌ 

3) ప్లేటో     4) పరాశరుడు


2.     వాదన (ఎ): వేర్వేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే ఒకే జాతిజీవుల మధ్య వైవిధ్యం తక్కువ.

కారణం (బి): జీవులను వర్గీకరించేందుకు ఈ వైవిధ్యతే ఆధారం.

1) ఎ, బి లు సరైనవి.     2) ఎ సరైంది, బి సరికాదు.3) ఎ సరికాదు     4) బి సరైంది


3.     కిందివారిలో అకశేరుకాలపై పరిశోధన చేసినవారు? 

1) అరిస్టాటిల్‌ 2) ప్లేటో 3) హైమన్‌ 4) లిన్నేయస్‌


4.     కిందివాటిలో పొరిఫెరాకు సంబంధించి భిన్నమైంది? 

1) కాల్కేరియా     2) ఆంథోజోవా 

3) డెమోస్పాంజియా     4) హెగ్జాక్టినెల్లిడా


5.     కిందివాటిలో మొదట ఏర్పడిన లూకా కణం నుంచి ఏర్పడనిది? 

1) అరాఖియా     2) బ్యాక్టీరియా 

3) యూకేరియా     4) హెమీకార్డేటా


6.     కిందివాటిలో అతి పురాతన బ్యాక్టీరియా వర్గం?

1) ఆర్కె బ్యాక్టీరియా     2) యూ బ్యాక్టీరియా 

3) సయనో బ్యాక్టీరియా     4) 1, 3


7.     కిందివాటిలో ఉల్బరహిత జీవులు? 

1) చేపలు     2) ఉభయచరాలు 

3) పక్షులు     4) 1, 2


8.     జంతు రాజ్యంలో అతి ప్రాచీన జీవులున్న వర్గం?

1) పొరిఫెరా     2) ప్రోటోజోవా 

3) నిడేరియా     4) ప్లాటీహెల్మింథిస్‌


9.     కిందివాటిలో ప్రోటియస్‌ యానిమల్‌ క్యూల్‌? 

1) అమీబా     2) యూగ్లీనా 

3) పారామీషియం     4) 1, 2


10. కిందివాటిలో మొక్క లక్షణాలున్న జంతువు? 

1) పారామీషియం     2) యూగ్లీనా 

3) అమీబా     4) ప్లాస్మోడియా 


11. కిందివాటిలో ప్రోటోజోవా వర్గానికి చెందిన పరాన్నజీవి? 

1) ప్లాస్మోడియం      2) టీనియా సోలియం

3) డ్రాకంకులిస్‌       4) ఆస్కారిస్‌


12. జపాన్‌లో పెళ్లిళ్లకు కానుకగా ఇచ్చే జీవి?

1) యూస్పాంజియా     2) యూప్లెక్టిల్లా 

3) క్లయోనా     4) యూగ్లీనా


13. కిందివాటిని జతపరచండి.

1) స్లిప్పర్‌ యానిమల్‌ ఎ) అరీలియా
2) మృతుడి వేలు బి) కాలినా
3) అతిపెద్ద కీటకం సి) పారామీషియం
4) జెల్లీఫిష్‌ డి) ఆఫ్రికా చీమ

1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ 2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి  

3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి  


14. ‘పోర్చుగీస్‌ మ్యాన్‌ ఆఫ్‌ వార్‌’ అనే జంతువు?

1) సముద్ర విసనకర్ర     2) అరీలియా 

3) ఫైసేలియా     4) అడామ్సియా


15. పొరిఫెరా అనే పదాన్ని ప్రతిపాదించినవారు?

1) రాబర్ట్‌ హుక్‌     2) రాబర్ట్‌ గ్రాంట్‌ 

3) రాబర్ట్‌ బ్రౌన్‌     4) 1, 2


16. దంశ కణాలున్న వర్గం?

1) పొరిఫెరా     2) నిడేరియా 

3) ప్లాటీ హెల్మింథిస్‌     4) ప్రోటోజోవా


17. కిందివాటిలో మొదటి విసర్జక అవయవం?

1) జ్వాలా కణం     2) వృక్క గ్రంథి 

3) మూత్రపిండం     4) మాల్ఫీజియన్‌ నాళం


18. కిందివాటిలో లివర్‌ ఫ్లూక్‌?

1) షిస్టోసోమా     2) టీనియా సోలియం 

3) ట్రైఖినెల్లా     4) బద్దెపురుగు


19. పరాన్నజీవులు అధికంగా ఉన్న వర్గం?

1) అనెలిడా     2) నిమాటి హెల్మింథిస్‌ 

3) ప్లాటీ హెల్మింథిస్‌     4) 1, 2


20. హెల్మెంథాలజీ అంటే ఏ వర్గాల అధ్యయనం?

1) ప్లాటీ, నిమాటి      2) అనెలిడా 

3) పొరిఫెరా     4) ఆర్థ్రోపోడా


21. మిథ్యాకుహరం ఏర్పడిన జీవులున్న వర్గం?

1) నిమాటి హెల్మింథిస్‌     2) పొరిఫెరా    

3) అనెలిడా       4) ఆర్థ్రోపోడా


22. పృష్ఠవంశం పాక్షికంగా ఉండే జీవుల వర్గం?

1) సెఫలో కార్డేటా       2) వర్టిబ్రేటా   

3) యూరో కార్డేటా      4) 1, 2


23. జీవించి ఉన్న దవడలు లేని ఏనేతా తరగతి?

1) సైక్లోస్టోమేటా       2) నేతోస్టోమేటా   

3) ఏవ్స్‌       4) ఆస్టిక్తిస్‌


24. అతిపొడవైన ప్రవాళావరోధం ఏ దేశంలో ఉంది?

1) అమెరికా       2) ఆస్ట్రేలియా   

3) మాల్దీవులు       4) ఇండియా


25. కిందివాటిలో జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం?

1) ఆర్థ్రోపోడా        2) అనెలిడా   

3) మొలస్కా        4) పొరిఫెరా


26. కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు?

1) మొలకాలజీ       2) కైరిప్టాలజీ   

3) ఎంటమాలజీ       4) ఆర్నిథాలజీ


27. కిందివాటిలో క్లైటెల్లం ఉన్న జీవి?

1) వానపాము       2) జలగ   

3) బద్దెపురుగు        4) 1, 2


28. కిందివాటిలో సరికానిది? 

ఎ) ఈగ - మగ్గట్‌ 

బి) దోమ - రిగ్లర్‌

సి) పట్టుపురుగు - కాటర్‌ పిల్లర్‌

డి) తేనెటీగ - నింఫ్‌

ఇ) దోమ ప్యూపా - గబ్‌

1) ఎ, బి, ఇ        2) డి, ఇ  

3) సి, డి, ఇ        4) బి, సి, ఇ 


29. కిందివాటిలో మొదటి ద్విస్తరిత జీవులు?

1) సీలంటరేటా       2) నిమటోడా    

3) పొరిఫెరా       4) ప్రోటోజోవా


30. సీలంటరేటా వర్గానికి చెందిన పగడాల పరిమాణం?

1) 10 ఎంఎం       2) 3 - 40 ఎంఎం   

3) 3 - 56 ఎంఎం       4) 100 ఎంఎం


31. కిందివాటిలో సరైంది?

ఎ) మొదటి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శించే జీవులు - ప్లాటీ హెల్మింథిస్‌

బి) మొదటి త్రిస్తరిత జీవులు - ప్లాటీ హెల్మింథిస్‌ జీవులు

సి) పంచ వ్యాసార్ధ సౌష్ఠవం ఉన్న జీవులు -  ఇఖైనోడర్మేటా జీవులు

డి) జంతు రాజ్యంలో 80% జీవులున్న  వర్గం - ఆర్థ్రోపోడా

1) ఎ, బి, సి, డి       2) ఎ, డి  

3) ఎ, బి, సి       4) సి, డి 


32. కిందివాటిని జతపరచండి.

జీవులు లక్షణాలు
1) చేపలు  ఎ) నాలుగు గదుల గుండె
2) పక్షులు బి) ఎలుక
3) మొసలి సి) ఉష్ణరక్త జీవులు
4) రోడెంట్స్‌ డి) శీతలరక్త జీవులు

1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ     2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి   

3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి     4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి


33. కిందివాటిలో భిన్నమైంది?

1) చిలుక       2) పిచ్చుక   

3) రాబందు       4) గబ్బిలం


34. కిందివాటిలో సరీసృపాలు, పక్షులకు సంధానకర్త?

1) ఆర్కియోప్టెరిక్స్‌       2) ఆస్ట్రిచ్‌   

3) ఉడ్‌కాక్‌       4) కోయెల్‌


35. పక్షి ఖండం అని దేనికి పేరు?

1) ఉత్తర అమెరికా        2) ఆసియా   

3) దక్షిణ అమెరికా       4) ఆఫ్రికా


36. జీవసామ్రాజ్యంలో అతిపెద్ద కణం ఉన్న జీవి?

1) కివి   2) ఆస్ట్రిచ్‌     3) డోడో   4) స్విఫ్ట్‌


37. ప్రస్తుతం జీవించి ఉన్న సరీసృపాల్లో అతిపెద్దది?

1) తాబేలు       2) డైనోసార్స్‌   

3) మొసలి       4) స్ఫీనోడాన్‌


38. పాన్‌ సీ బాల్డ్‌ అనే శాస్త్రవేత్త ఏ వర్గం జీవుల కణ నిర్మాణం ఆధారంగా వాటికి నామకరణం చేశారు?

1) ప్రోటోజోవా        2) పొరిఫెరా   

3) సీలెంటరేటా       4) టీనోఫోరా


39. కిందివాటిలో ‘బాత్‌రూమ్‌ స్పాంజ్‌’ అని దేన్ని పిలుస్తారు?

1) క్లయోనా       2) చాలినా   

3) యూస్పాంజియా       4) స్పాంజిల్లా


40. న్యూజిలాండ్‌లో మావోరి తెగవారు ఏ జీవులను ఆహారంగా తీసుకుంటారు?

1) వానపాము       2) జలగ   

3) ప్లనేరియా       4) ఫాసియోలా


41. వైద్యరంగంలో ప్లీబోటమికి ఉపయోగించే జీవులు?

1) వానపాము        2) ప్లనేరియా    

3) జలగ        4) ఫాసియోలా


42. కిందివాటిలో సరైంది? 

ఎ) పొరిఫెరా అంటే రంధ్రాలున్న జీవులు.

బి) నిడేరియాకు చెందిన హైడ్రా, జెల్ల్లీఫిష్‌లు ఒంటరిగా నివసిస్తాయి.

సి) ప్లాటీ హెల్మెంథిస్‌లో స్వతంత్రంగా జీవించే జీవి ప్లనేరియా.

డి) అనెలిడా వర్గపు జీవులు రిబ్బన్‌ ఆకారంలో చదునుగా ఉంటాయి.

1) ఎ, బి      2) ఎ, బి, సి 

3) ఎ, బి, సి, డి     4) డి


43. ఇఖైనస్‌ అనేది ఏ భాష పదం?

1) లాటిన్‌   2) జర్మన్‌   3) గ్రీకు   4) ఆంగ్లం


44. కిందివాటిలో అభివృద్ధి చెందిన తెలివైన జీవులు?

1) ప్రైమేట్స్‌        2) రోడెంట్స్‌   

3) మార్సుపియల్స్‌       4) 1, 2


45. కిందివాటిలో సముద్ర క్షీరదాలు?

1) డాల్ఫిన్‌     2) చేపలు 

3) తిమింగలం     4) 1, 3


46. చీమలు కుట్టినప్పుడు వెలువడే ఆమ్లం?

1) ఫార్మిక్‌ ఆమ్లం     2) లాక్టిక్‌ ఆమ్లం 

3) ఆగ్జాలిక్‌ ఆమ్లం     4) మాలిక్‌ ఆమ్లం


47. జీవులను సకశేరుక, అకశేరుకాలుగా వర్గీకరించినవారు?

1) లిన్నేయస్‌ 2) హార్వే 3) అరిస్టాటిల్‌ 4) 1, 2


48. కిందివాటిలో అతిపెద్ద అకశేరుకం?

1) సెపియా     2) అర్కిట్యూథిస్‌ 

3) ఆక్టోపస్‌     4) టెరిడో


49. చీమల అధ్యయనాన్ని ఏమంటారు? 

1) పెలాలజీ     2) కైరెప్టాలజీ 

3) మిర్మికాలజీ     4) ఎంటమాలజీ


50. కిందివాటిలో డెవిల్‌ఫిష్‌?

1) ఆక్టోపస్‌     2) లెపిస్మా 

3) అరీలియా     4) సెపియా


51. కిందివాటిలో అతిచిన్న చేప? 

1) ఎక్సో సీటస్‌  2) డయోడాన్‌ 

3) ఫీడోసిఫ్రిన్‌   4) సార్డినెల్లా 



సమాధానాలు


1-1; 2-1; 3-3; 4-2; 5-4; 6-1; 7-4; 8-2; 9-1; 10-2; 11-1; 12-2; 13-1; 14-3; 15-2; 16-2; 17-1; 18-1; 19-3; 20-1; 21-1; 22-3; 23-1; 24-2; 25-1; 26-3; 27-4; 28-2; 29-1; 30-3; 31-1; 32-2; 33-4; 34-1; 35-3; 36-2; 37-3; 38-1; 39-3; 40-1; 41-3; 42-2; 43-3; 44-1; 45-4; 46-1; 47-3; 48-2; 49-3; 50-1; 51-3.


 

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 
 

Posted Date : 01-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌