• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర బోధనా ఉద్దేశాలు, విలువలు

 1. కిరణజన్య సంయోగ క్రియ అనేది కాంతి ప్రభావాన్ని వివరించడానికి ఉపయోగపడే ఏ శాస్త్ర పరిజ్ఞానం?
జ: భౌతిక శాస్త్రం


2. ఎముకలు - ఎముక విరపులు - రకాలు అనే పాఠ్యాంశ బోధనకు ఉపకరించే శాస్త్ర పరిజ్ఞానం?
జ: భౌతిక శాస్త్రం

 

3. 'చేపల చెరువుల నిర్మాణం' అనే పాఠ్యాంశ బోధనలో నర్సరీ, చెరువులు, పెంపక చెరువు, స్టాకింగ్ కొలనుల నిర్మాణానికి అవసరమయ్యే శాస్త్ర పరిజ్ఞానం?
జ: గణిత శాస్త్రం

 

4. హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం లాంటి విప్లవాల ప్రాముఖ్యాన్ని వివరించడానికి అవసరమయ్యే శాస్త్ర పరిజ్ఞానం?
జ: చరిత్ర


5. రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగించుకుంటే?
జ: ఉపయోగాత్మక విలువ

 

6. విద్యార్థి పుష్పం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడం?
జ: సౌందర్య విలువ

 

7. కిశోర్ అణుపరిజ్ఞానాన్ని మానవ కల్యాణం కోసం కాకుండా వినాశనానికి ఉపయోగిస్తే అతడిలో లోపించిన విలువ?
జ: నైతిక విలువ

 

8. వినాయకుడు మంత్రాల వల్ల పాలు తాగుతున్నాడు అనే విషయాన్ని విద్యార్థి ఖండించాడు. అయితే అతడిలో పెంపొందిన విలువ?
జ: నైతిక విలువ

 

9. రాణి శ్వాసక్రియలో వేడి విడుదలవుతుందని నిరూపించే ప్రయోగంలో గంట గంటకు తన పరిశీలనలను నిజాయతీతో నమోదు చేసింది. అయితే ఆమెలో పెంపొందిన విలువ?
జ: శాస్త్రీయ వైఖరి

 

10. జీవశాస్త్ర అభ్యసనం ద్వారా వ్యక్తిలో వచ్చే ప్రవర్తనా మార్పు?
జ: విలువలు

 

11. మన కళ్ల ముందు కనిపిస్తూ చేసే ప్రతి కృత్యాన్ని దిశా నిర్దేశం చేసేవి?
జ: ఉద్దేశాలు

 

12. విద్యార్థి ఒక విషయాన్ని వినూత్న విధానంలో అమర్చితే అతడు కలిగి ఉన్న విలువ?
జ: సృజనాత్మక విలువ

 

13. విద్యార్థి ఒక సమస్యను నిశితంగా పరిశీలించి, సమగ్రంగా ఆలోచించి, పరికల్పనలు రూపొందించి పరీక్షిస్తే అతడిలో ఉండే విలువ?
జ: క్రమశిక్షణ విలువ

 

14. విలువలు అనేవి?
జ: అమూర్త గమ్యాలు

 

15. మనం జన్మించినప్పటి నుంచి మరణించే వరకు ప్రతిచర్య జీవశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఏ విలువ?
జ: ఉపయోగాత్మక విలువ

16. కిందివాటిలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించని ప్రక్రియ?
1) శాస్త్ర నియమాలను కంఠతా చేయడం      2) ప్రయోగాలు చేయడం 
3) పరికల్పన చేయడం                4) సర్వే చేయడం
జ: 1 ( శాస్త్ర నియమాలను కంఠతా  చేయడం)

 

17. 'మొక్కల్లో నీటి ప్రసరణ' అనే పాఠ్యాంశంలో జీవశాస్త్రంతో సహసంబంధాన్ని కలిగి ఉండేది?
జ: శరీరధర్మ శాస్త్రం, భౌతిక శాస్త్రం

 

18. విద్య అనే బాలిక జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలను తీసుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. అయితే ఆమె కలిగి ఉండే విలువ?
జ: బౌద్ధిక విలువ

 

19. 'ప్రయోగాలు, పరిశీలనలు నిజాయతీతో జరపాలి' అనే అంశాలను కలిగి ఉన్న విజ్ఞాన శాస్త్ర విలువ?
జ: నైతిక విలువ

 

20. విజ్ఞాన శాస్త్రంలో బోధించే ఉపాధి సామాజిక బాధ్యత?
జ: సమాజంలోని మూఢాచారాల విశ్వాసాలను తొలగించడం.

రచయిత: రాధాకృష్ణ 

Posted Date : 13-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు