• facebook
  • whatsapp
  • telegram

భక్తి ఉద్యమాలు

‘మనుషుల మధ్య సమానత్వం ఉండాలి’
 


 

భారతదేశం ప్రాచీన కాలం నుంచి వివిధ మత విశ్వాసాలకు కేంద్ర బిందువు. మధ్యయుగంలో భక్తి ఉద్యమాల ప్రభావంతో ఉదారవాదం, మానవతావాదం వ్యాపించి మత నియమాల్లో భాగమయ్యాయి. దేశంలోని ప్రధాన మతాలు, మత విశ్వాసాలు, సంబంధిత ఉత్సవాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. భక్తి, సూఫీ ఉద్యమాలు సంప్రదాయ మతాచారాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, సమాజంలో తెచ్చిన చైతన్యం, హిందూ ముస్లింల మధ్య స్నేహసంబంధాలకు దోహదపడిన మత బోధకులు, వారి బోధనల విశిష్టతల గురించి తెలుసుకోవాలి.


1. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన  గ్రామదేవత?

1) మైసమ్మ    2) పోచమ్మ  

3) ఎల్లమ్మ   4) మారేడమ్మ


2.  పశుసంపదను కాపాడే దేవత ఎవరు?

1) మైసమ్మ    2) పోచమ్మ   

3) ఎల్లమ్మ    4) మారేడమ్మ


3. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టేవారు పూజించే దేవత?

1) గంగమ్మ    2) పోలేరమ్మ   

3) అంకాళమ్మ   3) ఎల్లమ్మ


4. ఎల్లమ్మను ఇలా కూడా పిలుస్తారు?

1) పోలేరమ్మ   2) రేణుకామాత  

3) సోమలమ్మ   4) పైవన్నీ


5. కిందివారిలో వ్యవసాయ భూములను తెగుళ్ల బారి నుంచి కాపాడేవారు?

1) పోతురాజు    2) గంగమ్మ  

3) కాటమరాజు   4) శివుడు


6. గొర్రెలు, పశువులను కాపాడే దేవుడు?

1) కాటమరాజు   2) పోతురాజు  

3) బీరప్ప   4) 1, 3


7. ముస్లింలు మొహర్రంను ఎవరి జ్ఞాపకార్థ నిర్వహిస్తారు? 

1) మహమ్మద్‌ ప్రవక్త       2) అల్లా

3) మహమ్మద్‌ ప్రవక్త మనుమడు      

4) పై అందరూ


8.  ఇస్లాం మతంలో ఏ తత్వాన్ని ప్రచారం చేసిన గురువుల సమాధులపై దర్గాలు నిర్మిస్తారు?

1) సున్నీ   2) సూఫీ   3) 1, 2    4) ఇస్లాం


9.  అమీన్‌పీర్‌ - దర్గా ఎక్కడ ఉంది?

1) నెల్లూరు   2) కడప     

3) కర్నూలు   4) అనంతపురం


10. అమీన్‌పీర్‌ - దర్గా వద్ద ఉన్న సమాధి ఎవరిది? 

1) మహమ్మద్‌    2) భక్తయార్‌ కాకీ

౩) ఖాజాపీరుల్లా    4) పై అందరూ 


11. శ్రీనాథుడు రాసిన ‘పల్నాటి వీరుల చరిత్ర’లో పేర్కొన్న దైవం?

1) పోతురాజు   2) కాటమరాజు          

3) రాముడు   4) శివుడు


12. మైలార దేవత, ఇతర మాతృదేవతల ఆరాధన ఏ గ్రంథంలో ఉంది?

1) క్రీడాభిరామం   2) పల్నాటి వీరుల చరిత్ర

3) ఆముక్తమాల్యద   4) బాలచంద్రుడి కథలు


13. ‘సిరిమాను ఉత్సవం’ ఏ రాజుల కాలంలో ప్రారంభమైంది?

1) కాకతీయులు    2) విజయనగర రాజులు   

3) శాతవాహనులు   ౪) చాళుక్యుల


14. అత్యంత ప్రభావవంతమైన భారతీయ తత్వవేత్తల్లో ఒకరు?

1) రామానుజాచార్యులు  2) శంకరాచార్యులు    

3) బసవన్న   4) కన్నప్ప


15. శంకరాచార్యులు ఏ శతాబ్దంలో కేరళలో జన్మించారు?    

1) 7వ    2) 8వ    3) 9వ    4) 10వ


16. అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రచారం చేశారు?

1) రామానుజాచార్యులు   2) శంకరాచార్యులు   

3) మధ్వాచార్యులు   4) గోపన్న


17. ‘జీవాత్మ-పరమాత్మ ఒక్కటేనని - అదే పరమాత్మ స్వరూపం’ అని అన్నదెవరు? 

1) రామానుజాచార్యులు   2) శంకరాచార్యులు     

3) చైతన్య మహాప్రభు   4) గోపన్న


18. 11వ శతాబ్దిలో దక్షిణ భారతదేశంలో జన్మించిన భక్త సాధువు?

1) రామానుజాచార్యులు     2) చైతన్య మహాప్రభు   

3) గోపన్న   4) బసవన్న


19. రామానుజాచార్యులు ప్రవచించింది?

1) అద్వైతం   2) విశిష్టాద్వైతం  

3) దైత్వదైత్యం    4) ద్వైతం


20. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమానికి ఎవరి సిద్ధాంతం గొప్ప ప్రేరణ ఇచ్చింది?

1) రామానుజాచార్యులు   2) శంకరాచార్యులు   

3) బసవన్న     4) మీరాబాయి


21. ‘మనుషుల మధ్య సమానత్వం ఉండాలి’ అని పేర్కొన్నవారు?

1) బసవన్న     2) శంకరాచార్యులు  

3) రామానుజాచార్యులు    4) మీరాబాయి


22. వీరశైవాన్ని ప్రతిపాదించింది ఎవరు?

1) రామానుజాచార్యులు  2) శంకరాచార్యులు  

3) చైతన్య  4) బసవన్న


23. 13 - 17 శతాబ్దాల మధ్య మహారాష్ట్రలోని భక్త సాధువులు?

1) జ్ఞానేశ్వర్‌     2) నామ్‌దేవ్‌  

3) ఏక్‌నాథ్, తుకారాం  4) పై అందరూ


24. ‘‘ఇతరుల బాధను అర్థం చేసుకునేవాళ్లే వైష్ణవులు’’ అని అన్న గుజరాత్‌ భక్తుడు? 

1) ఏక్‌నాథ్‌     2) సక్కుబాయి  

3) నర్సీమెహతా   4) సంత్‌ తుకారాం


25. సామాజిక వ్యవస్థ, మత విధానాలను తార్కిక వాదాలతో విమర్శించినవారు?

1) నాథ పంథీలు   2) సిద్ధులు  

3) యోగులు   4) పై అందరూ


26. భావ్యమైన మతనిష్టను వ్యతిరేకించిన ఇస్లాం సాధువులు?

1) సున్నీలు     2) సూఫీలు  

3) మహమ్మద్‌      4) పై అందరూ 


27. సూఫీతత్వంలోని ముఖ్య విధానాలు?

1) దేవుడి మీద ప్రేమ, భక్తి; సమస్త మానవులపై దయ, కరుణ ఉండాలి

2) దేవుడిలో ఐక్యాన్ని కోరడం

3) ప్రపంచాన్ని మరిచి గానం చేయడం

4) పైవన్నీ


28. సూఫీ మత గురువులు సమావేశాలు జరిపే ప్రదేశం- 

1) తరీకా   2) సిల్‌సిలా  3) ఖాన్‌కాహ్‌  4) రక్స్‌


29. ‘షరియత్‌’ అనే పవిత్ర న్యాయాన్ని వ్యతిరేకించినవారు?

1) సున్నీలు   2) సూఫీలు  

3) ఇస్లాం    4) పై అందరూ


30. సూఫీ మతస్థుల విధానం/విధానాలు?

1) జిక్ర్‌    2) సామ    3) రక్స్‌   4) పైవన్నీ


31. ఏ శతాబ్దంలో సూఫీలు భారత్‌కు వచ్చారు?

1) 9వ    2) 10వ    3) 11వ    4) 12వ


32. ఎవరి కాలంలో సూఫీలు అధికంగా భారత్‌కు వచ్చారు?

1) మొగలులు  2) ఢిల్లీ సుల్తానులు 

3) రాజపుత్రులు   4) కాకతీయులు


33. కిందివాటిని జతపరచండి.

ఎ) అజ్మీర్‌  1) ఖ్వాజా మొయిద్దీన్‌ చిష్టీ
బి) ఢిల్లీ  2) కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకీ
సి) పంజాబ్‌ 3) బాలా ఫరీద్‌
డి) గుల్బర్గా 4) బందనవాజ్‌

1) ఎ-1, బి-2, సి-3, డి-4     2) ఎ-2, బి-1, సి-4, డి-3

3) ఎ-1, బి-3, సి-4, డి-2     4) ఎ-1, బి-2, సి-4, డి-3


34. రాముడు, అల్లా ఒక్కరేనని ప్రవచించినవారు?

1) తులసీదాస్‌   2) మీర్‌దాస్‌  

3) రామదాసు    4) కబీర్‌


35. సూఫీ మత గురువులకు ఏ విధమైన శక్తులున్నాయని ప్రజల నమ్మకం?

1) పెద్ద శక్తులు     2) గొప్ప శక్తులు

3) అలౌకిక శక్తులు     4) సాధారణ శక్తులు


36. ఏ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో మత ఉద్యమం కొత్త తరంగంలా పైకి లేచింది?

1) 11వ   2) 12వ   3) 13వ   4) 14వ


37. పోతన రాసిన గ్రంథం?

1) మహాభారతం     2) మహాభాగవతం   

3) 1, 2     4) రామాయణం


38. బమ్మెర పోతనను ఏమంటారు? 

1) సహజ కవి      2) కవిత్రయం  

3) అసహజ కవి      4) పైవన్నీ


39. ఆంధ్ర పదకవితా పితామహుడు ఎవరు?

1) తిక్కన   2) కృష్ణదేవరాయలు  

3) అన్నమయ్య    4) రామదాసు


40. శ్రీ వేంకటేశ్వర స్వామిపై అన్నమయ్య రాసిన  కీర్తనలు ఎన్ని?

1) 29,000   2) 18,000  

3) 30,000    4) 32,000


41. చైతన్య మహాప్రభు భారత్‌లోని ఏ ప్రాంతానికి చెందినవారు? 

1) మధ్య భారత్‌    2) దక్షిణ భారత్‌

3) ఉత్తర భారత్‌   4) తూర్పు భారత్‌


42. కృష్ణుడిని పూజించే ‘హరే కృష్ణ’ మంత్రాన్ని బహుళ ప్రచారం చేసినవారు?

1) తులసీదాస్‌   2) చైతన్య మహాప్రభు  

3) సూర్‌దాస్‌    4) కబీర్‌


43. భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించినవారు? 

1) తులసీదాస్‌      2) చైతన్య మహాప్రభు  

3) సూర్‌దాస్‌      4) మీరాబాయి


44. దాశరథి శతకాన్ని ఎవరు రచించారు?

1) రామదాసు     2) రామలింగడు 

3) బసవన్న     4) దాశరథి


45. దాశరథి శతకంలోని పద్యాల సంఖ్య?

1) 100    2) 102    3) 108    4) 118


46. దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న ఎవరికి అంకితం చేశారు?

1) శ్రీ వేంకటేశ్వర స్వామి  2) శ్రీరాముడు  

3) శ్రీకృష్ణుడు    4) శివుడు


47. రామచరిత మానస్‌ను రాసింది?

1) రామదాసు   2) కబీర్‌  

3) తులసీదాస్‌   4) తాన్‌సేన్‌


48. రామచరిత మానస్‌ ఏ భాషలో ఉంది?

1) బెంగాలీ   2) మగధి  

3) తెలుగు   4) అవధి


49. ‘నామ్‌ఘర్‌’ అనే పేరుతో భగవన్నామ జపధ్యాన మందిరాలను ఏర్పాటు చేసినవారు?

1) తులసీదాస్‌    2) శంకరదేవుడు  

3) చైతన్య మహాప్రభు    4) పై అందరూ


50. మీరాబాయి ఏ శతాబ్దానికి చెందిన రాజపుత్ర స్త్రీ?

1) 14వ    2) 15వ    3) 16వ   4) 17వ


51. మీరాబాయి ఎవరి శిష్యురాలు?

1) కబీర్‌దాసు   2) రవిదాస్‌  

3) గురునానక్‌   4) గురుగోవింద్‌ సింగ్‌ 


52. మీరాబాయి ఎవరి భక్తురాలు?

1) కృష్ణుడు  2) శివుడు  

3) కాళికా మాత   4) రాముడు


53. మీరాబాయి రచనలు ఏ భాష/భాషల్లో అధిక ప్రచారం పొందాయి?

1) రాజస్థానీ    2) గుజరాతీ  

3) 1, 2   4) బెంగాలీ


54. హిందూ, ఇస్లాం మతపరమైన బాహ్య ఆరాధనను వ్యతిరేకించినవారు?

1) గురునానక్‌    2) కబీర్‌   

3) నందనార్‌    4) రవిదాసు


55. ముస్లిం నేతపని వారి కుటుంబంలో జన్మించిన భక్త సాధువు?

1) తులసీదాస్‌  2) కబీర్‌  

3) మీర్‌దాస్‌   4) 1, 2


సమాధానాలు


1-2; 2-1; 3-1; 4-4; 5-1; 6-4; 7-3; 8-2; 9-2; 10-3; 11-1; 12-2; 13-2; 14-2; 15-2; 16-2; 17-2; 18-1; 19-2; 20-1; 21-1; 22-4; 23-4; 24-3; 25-4; 26-2; 27-4; 28-3; 29-2; 30-4; 31-3; 32-2; 33-1; 34-4; 35-3; 36-3; 37-2; 38-1; 39-3; 40-4; 41-4; 42-2; 43-2; 44-1; 45-3; 46-2; 47-3; 48-4; 49-2; 50-3; 51-2; 52-1; 53-3; 54-2; 55-2.


 

Posted Date : 29-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌