• facebook
  • whatsapp
  • telegram

కణంలోనూ ఉంటుందో వంటగది!

కణ జీవశాస్త్రం 

జీవులన్నీ కణాలతో రూపొందినవే. కణాల నిర్మాణం, వాటి లక్షణాలు, ప్రవర్తన, పనితీరును అధ్యయనం చేసే జీవశాస్త్ర విభాగాన్ని కణ జీవశాస్త్రం అంటారు. జంతువులు, మొక్కలతో పాటు మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి, రకరకాల రుగ్మతలను గుర్తించి అవసరమైన ఔషధాలు తయారుచేసేందుకు ఈ శాస్త్రం కీలకం. జీవికి సంబంధించిన ప్రాథమిక యూనిట్‌గా, అతిసూక్ష్మ భాగంగా ఉన్న కణం, అందులోని భాగాలు, వాటి నిర్మాణం, విధులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. కణాలు ఎలా పుడతాయి, ఏవిధంగా పనిచేస్తాయి, ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, రచనల గురించి తెలుసుకోవాలి.

1.     కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి రక్షణ కల్పించేది- 

1) కణత్వచం     2) కణకవచం  

3) కేంద్రక త్వచం       4) 1, 2


2.     కిందివాటిని జతపరచండి.

1) కణకవచం ఎ) కామిల్లో గాల్జీ
2) ప్లాస్మాత్వచం  బి) స్లీడన్, ష్వాన్‌
3) గాల్జీ సంక్షిష్టం  సి) సెల్యులోజ్‌
4) ఆధునిక కణసిద్ధాంతం డి) ప్రొటీన్లు, లిపిడ్లు

1) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి    2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి     4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ


3.     కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్‌ అని నామకరణం చేసింది?

1) ష్లీడన్‌    2) రుడాల్ఫ్‌ విర్షా 

3) ష్వాన్‌    4) 1, 3


4.     కిందివాటిని గమనించి, సరైనవి గుర్తించండి.

ఎ) కణంలో కణం, ఆదిమ కణం - రైబోజోమ్‌లు

బి) కణవిచ్ఛిత్తి సంచులు - లైసోజోమ్‌లు

సి) కణశక్త్యాగారం - అంతర్జీవ ద్రవ్యజాలం

డి) కణాన్ని కనుక్కున్నది - రాబర్ట్‌ హుక్‌

1) ఎ, బి, సి, డి      2) ఎ, బి, డి 

3) ఎ, డి          4) ఎ, బి 


5.     సజీవ కణాన్ని కనుక్కున్నది?

1) ఆంటన్‌వాన్‌ లీవెన్‌ హాక్‌     2) రాబర్ట్‌ హుక్‌ 

3) రాబర్ట్‌ బ్రౌన్‌         4) 1, 2


6.     జంతు కణంలో త్వచ ఆచ్ఛాదనం లేని కణాంగం?

1) రైబోజోమ్‌     2) లైసోజోమ్‌ 

3) సెంట్రియోల్‌     4) 1, 3


7. ఆమ్నిస్‌ సెల్లులా - ఇ - సెల్లూలా సిద్ధాంత రూపకర్త?

1) ష్లీడన్, ష్వాన్‌     2) రుడాల్ఫ్‌ విర్షా 

3) రాబర్ట్‌ సన్‌     4) కె.ఆర్‌. పోర్టర్‌


8. గుడ్లగూబ నాడీకణాల్లో కనుక్కున్న కణాంగం?

1) రిక్తిక     2) మైటోకాండ్రియా 

3) గాల్జీసంక్లిష్టం      4) ప్లాస్మా త్వచం


9. కిందివాటిలో నిర్మాణపరంగా భిన్నమైనవి..

1) కేంద్రకం     2) పెరాక్సీజోమ్‌ 

3) రిక్తికలు     4) లైసోజోమ్‌లు


10. ‘అనాటమీ ఆఫ్‌ ప్లాంట్స్‌’ గ్రంథకర్త-

1) కిర్చర్‌     2) సొమ్మర్‌ డమ్‌     

3) నెహేమియా గ్రూ     4) కె.ఆర్‌.పోర్టర్‌


11.     టమాటాలో ప్లాస్టిడ్ల వరుస క్రమం?

ఎ) ఎరుపు   బి) తెలుపు   సి) ఆకుపచ్చ

1) ఎ, బి, సి    2) బి, సి, ఎ 3) సి, బి, ఎ     4) బి, సి


12. కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర పోషించేది-

1) రిక్తిక     2) మైటోకాండ్రియా 

3) లైసోజోమ్‌     4) కణద్రవ్యం


13.  మొదటిసారి  సంయుక్త  సూక్ష్మదర్శినిని కనుక్కున్నవారు?

1) నాలో, రస్కీ     2) జకారస్‌ జాన్సన్‌ 

3) లీవెన్‌ హుక్‌     4) 2, 3


14. మొక్కల్లో అతి పెద్ద కణం-

1) మైకో ప్లాస్మా     2) రామి నార 

3) అసిటాబ్యులేరియా     4) 2, 3


15. ప్లాస్మాత్వచం ఒక ట్రైలాయోల్లార్‌ నమూనా అన్నది.    

1) డానియల్లి, డేవ్‌సన్‌     2) సింగర్, నికోల్సన్‌ 

3) పర్కింజి     4) ష్వాన్‌


16. కణంలోని వంటగది ఏది?

1) గ్రానా     2) స్ట్రోమా 

3) మైటోకాండ్రియా      4) రైబోజోమ్‌లు


17. కణ విభజనను మొదటిగా వివరించినవారు?

1) జె.బి.పార్మర్‌     2) జె.ఇ.మూర్‌ 

3) రుడాల్ఫ్‌ విర్షా     4) ఆర్‌.ఆల్ట్‌మన్‌


18. సెల్యూలా అనేది ఏ భాషా పదం?
1) ఇంగ్లిష్‌   2) లాటిన్‌   3) ఫ్రెంచ్‌  4) గ్రీక్‌


19. వృక్ష కణంలోని రిక్తికా రసంలో మొక్క భాగాలకు రంగునిచ్చేది...

1) ప్లాస్టిడ్లు     2) ఆంథోసయనిన్‌ 

3) క్లోరోఫిల్‌     4) క్రోమోప్లాస్టిడ్లు


20. ప్లాస్టిడ్లను మూడు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి?

1) కె.ఆర్‌.పోర్టర్‌    2) జార్జ్‌ పెలేడ్‌

3) షింపర్‌    4) రాబర్ట్‌సన్‌


21. ప్రొటీన్ల సంశ్లేషణలో 2 - 6 రైబోజోమ్‌లు కలిసి ఏర్పడిన గొలుసును ఏమంటారు?

1) ఎర్గోజోమ్‌లు    2) డిక్టియోజోమ్‌లు

3) ఇథియోజోమ్‌లు    4) బేకర్‌ నిర్మాణం


22. రైబోజోమ్‌లు ఉత్పత్తి చేసిన ప్రొటీన్లను తమలో తాత్కాలికంగా నిల్వ చేసుకునే కణాంగాలు?

1) లైసోజోమ్‌లు       2) గాల్జీసంక్లిష్టం

3) కణ ద్రవ్యం       4) 1, 2


23. కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించేందుకు కణంలో ఏ భాగం అంతర పీడనాన్ని కలిగిస్తుంది?

1) కణకవచం       2) ప్లాస్మాపొర   

3) కణద్రవ్యం       4) కేంద్రకత్వచం


24. కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నగా ఉండి, 100-150 సంఖ్యగా ఉండే కణాంగాలు-

1) రైబోజోమ్‌లు      2) అంతర్జీవ ద్రవ్యజాలం

3) మైటోకాండ్రియాలు    4) రిక్తికలు


25. అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉన్న రేణువుల విధి?

1) ప్రొటీన్ల సంశ్లేషణ  2) లిపిడ్ల సంశ్లేషణ

3) ద్రవాభిసరణ     4) ప్రొటీన్, లిపిడ్ల సంశ్లేషణ


26. సకశేరుకాల కాలేయ కణాల్లోని ఏ కణాంగాలు విష, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో సహాయపడతాయి?

1) గరకు అంతర్జీవ ద్రవ్యజాలం  2) గాల్జీ సంక్షిష్టం

3) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం  4) ప్లాస్మాత్వచం


27. పిండ కణాలపై పరిశోధన చేసి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయని పేర్కొన్నదెవరు?

1) రాబర్ట్‌ రెమెక్‌      2) రాబర్ట్‌ హుక్‌

3) రాబర్ట్‌ బ్రౌన్‌      4) రాబర్ట్‌ గాల్‌


28. రెండు కణ విభజనలకు మధ్య ఉండే సమయాన్ని ఏమంటారు?

1) M - దశ 2) G2 - దశ 3) ప్రథమ దశ 4) అంతర్దశ


29. కణవిభజనలను వరుసలో అమర్చండి.

A) G1 B) G2 C) S D) M

1) A, B, C, D 2) A, C, D, B

3) A, C, B, D 4) D, A, C, B


30. కేంద్రక త్వచం అదృశ్యమవడం ఏ దశలో జరుగుతుంది?

1) ప్రథమ దశ       2) మధ్య దశ   

3) అంతర దశ       4) G1 దశ


31. కిందివాటిలో ప్లాస్మా పొర విధికానిది..

1) కణంలోని అంశాలను రక్షించేందుకు యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది.

2) ఎండోసైటాసిస్‌

3) సమాచార ప్రసారం  4) కణ నిరంతరత చూపకపోవడం


32. ఆస్మా అనే పదం ఏ భాషకు చెందింది?

1) గ్రీకు  2) లాటిన్‌   3) ఫ్రెంచ్‌   4) జర్మన్‌


33. వాయుగోణుల్లో ఉండే కణజాలం?

1) ఉపకళా కణజాలం      2) పొలుసు కణజాలం

3) స్తంభాకార కణజాలం     4) గ్రంథి కణజాలం


34. హాప్లోపాపస్‌లో ఉండే క్రోమోజోమ్‌లు?

1) 24     2) 14    3) 4    4) 18


35. అతిఎక్కువ క్రోమోజోమ్‌లుండే మొక్క-

1) బఠాణి 2) బఫియోగ్లాసం 3) హాప్లోపాపస్‌ 4) వరి


36. కేంద్రకం అధ్యయనాన్ని ఏమంటారు?

1) కారియాలజీ          2) సైటాలజీ

3) అనాటమీ           4) మార్పాలజీ


37. రైబోజోమ్‌లోని ఉప ప్రమాణాలను కలిపి ఉంచే అయాన్‌...

1) క్యాల్షియం 2) ఫాస్ఫరస్‌ 3) జింక్‌ 4) మెగ్నీషియం


38. బాహ్య, అంతర ఉద్దీపనలను చూపే కణజాలం?

1) నాడీ కణజాలం    2) ఉపకళా కణజాలం

3) ఘనాకార ఉపకళ    4) స్తంభాకార కణజాలం


39. అంత్యదశలో జరగని ప్రక్రియ-

1) పిల్ల కేంద్రకాల చుట్టూ కేంద్రక త్వచం ఏర్పడుతుంది.    2) క్రోమాటిడ్‌ పొడవుగా మారుతుంది.

3) కడ్డీ లాంటి సెంట్రియోల్స్‌ ఏర్పడతాయి.    4) పిల్లకణాలు వేరవుతాయి.


40. పిండిపదార్థాలను నిల్వ చేసుకునే ప్లాస్టిడ్లు?

1) అమైలో ప్లాస్ట్‌లు        2) ఇలియోప్లాస్ట్‌లు

3) అల్యురోప్లాస్ట్‌లు       4) 1, 2


41. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) మైటోకాండ్రియా - కణకొలిమి   2) రిక్తిక - రక్షక ఆశ్రయం

3) లైసోజోమ్స్‌ - ఆత్మాహుతి సంచులు  4) హరితరేణువు - కణకొలిమి


42. కీటకాహార మొక్కల్లో ఉండే ప్రొటియోలైటిక్‌లను ఉత్పత్తి చేసే కణజాలం?

1) పోషక కణజాలం     2) మృదు కణజాలం

3) సరళ కణజాలం     4) ప్రత్యేక కణజాలం


43. క్రోమోజోమ్‌లను హాఫ్‌మిశ్చర్‌ ఏ మొక్కలో కనుక్కున్నారు?

1) సిక్వియా     2) క్విర్క్‌ సూబర్‌ 

3) ట్రడెష్కాన్షియా     4) విల్లో


44. క్రోమోజోమ్‌లు పొట్టిగా మారడాన్ని ఏమంటారు?

1) టీలోమియర్‌     2) ప్రోజేరియాసిస్‌ 

3) ఇడియోగ్రామ్‌     4) శాటిలైట్‌


45. డీఎన్‌ఏలో ఉండి ఆర్‌ఎన్‌ఏలో లేని నత్రజని క్షారం?

1) థైమిన్‌     2) యురాసిల్‌     

3) అడినిన్‌     4) గ్వానిన్‌


46. డీఎన్‌ఏ ద్వికుండలి నిర్మాణాలకు గాను నోబెల్‌ బహుమతి పొందినవారు-

1) వాట్సన్‌     2) ఫ్రాన్సిస్‌ క్రిక్‌ 

3) విల్కిన్స్‌     4) అందరూ


47. క్రోమోజోమ్‌ల పరంగా కిందివాటిలో భిన్నమైంది...

1) ప్రతిపాదక కణం     2) పిండం 

3) జంతు దేహం     4) సంయుక్త బీజం

48. జీవ పరిణామానికి తోడ్పడేది-

1) సమ విభజన     2) క్షయకరణ విభజన 

3) అసమ విభజన     4) 1, 2


49. ఆధునిక మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పిత?

1) విలియం హార్వే     2) మార్సెల్లో మాల్ఫిజీ 

3) ఆండ్రిస్‌ వెసాలియస్‌     4) లాజ్జారో స్పెలాంజ్సి


50. కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?

1) సైటాలజీ     2) హిస్టాలజీ 

3) అగ్రస్టాలజీ     4) ప్రీనాలాజీ


51. మొక్కల్లో కణుపు మధ్యమాల్లో కనిపించే కణజాలం?

1) విభాజ్య కణజాలం     2) సరళ కణజాలం 

3) సంక్లిష్ట కణజాలం     4) ప్రత్యేక కణజాలం


52. వాణిజ్యపరంగా విలువైన నారలు ఎందులో భాగం?

1) మృదు కణజాలం     2) స్థూలకోణ కణజాలం

3) దృఢ కణజాలం     4) సంక్లిష్ట కణజాలం


53. ఆర్కిడేసి కుటుంబపు మొక్కలో బాష్పశీల తైలాలను ఉత్పత్తి చేసేవి?

1) ఆస్మోఫోరా         2) లాసిఫెరస్‌లు 

3) మకరంద గ్రంథులు         4) స్రావక కుహరాలు

సమాధానాలు

1-1; 2-3; 3-4; 4-2; 5-1; 6-4; 7-2; 8-3; 9-1; 10-3; 11-2; 12-1; 13-2; 14-3; 15-1; 16-2; 17-3; 18-2; 19-2; 20-3; 21-1; 22-2; 23-1; 24-3; 25-1; 26-3; 27-1; 28-4; 29-3; 30-1; 31-4; 32-1; 33-1; 34-3; 35-2; 36-2; 37-4; 38-1; 39-3; 40-1; 41-4; 42-4;  43-3; 44-2; 45-1; 46-4; 47-1; 48-2; 49-3; 50-2; 51-1; 52-3; 53-1.

రచయిత: వట్టి గౌనళ్ల పద్మనాభం 

Posted Date : 02-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌