• facebook
  • whatsapp
  • telegram

కణ విభజన

ప్రత్యుత్పత్తికి.. పెరుగుదలకు మూలాధారం!

అండం నుంచి పిండం, దాని నుంచి శిశువు పుడుతుంది, అది పెరిగి పెద్దదవుతుంది. ఎలాంటి గాయమైనా నయమైపోయి శరీరం  మామూలుగా మారిపోతుంది. చిన్న విత్తనం నుంచి మహావృక్షాలు ఆవిర్భవిస్తాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నట్లు కనిపించినప్పటికీ, దాని వెనుక పెద్ద ప్రక్రియ కొనసాగుతుంది. అదే కణవిభజన. జీవుల పెరుగుదలకు, జీవం కొనసాగడానికి ఈ విభజన అత్యంత కీలకం. పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి మూలాధారమైన  కణ విభజన  రకాలు, దాని వల్ల క్రోమోజోములు, డీఎన్‌ఏల్లో కలిగే మార్పులు, వాటిలోని దశలు, ఫలితాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సంబంధిత శాస్త్రవేత్తలు, వారి సిద్ధాంతాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. 


1. కణ విభజన అనేది కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?

1) జీవం కొనసాగింపు     2) జీవి పెరుగుదల    3) 1, 2     4) ఏదీకాదు




2. కిందివాటిని గమనించి సత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ) జీవం కొనసాగింపు ప్రక్రియ శాఖీయ, లైంగిక కణాల నుంచి ప్రారంభమవుతుంది.

బి) కణ విభజన ద్వారా జరిగే నూతన కణాల ఉత్పత్తి ప్రాధాన్యతను వివరించిన సిద్ధాంతం - ఆమ్నిస్‌ సెల్యులాడే సెల్యులా.

సి) నూతన కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి - రుడాల్ఫ్‌ విర్షా.

డి) ఒక జీవి దేహ నిర్మాణంలో పాల్గొనే శారీరక, సంయోజ బీజాలను ఉత్పత్తి చేసే కణాలను జన్యు కణాలు అంటారు.

1) ఎ, బి      2) ఎ, బి, సి, డి     3) ఎ, సి, డి      4) ఎ, బి, డి


3. పిండ కణాలపై పరిశోధన ద్వారా కణవిభజనను పరిశీలించిన వ్యక్తి?

1) రెనిలెనిక్‌      2) ఆగస్ట్‌ వీస్‌మన్‌   3) థియోడర్‌ బొవెరి      4) రాబర్ట్‌ రెమెక్‌

4. ఈస్ట్‌లో కణ చక్రం పూర్తవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది?

1) 90    2) 120    3) 150   4) 60


5. కిందివాటిలో భిన్నమైన దశను గుర్తించండి.

1) ప్రథమ దశ     2)మధ్యస్థ దశ   3) అంతర్దశ     4) చలన దశ


 

6. కిందివాటిని సరైన వరుసలో అమర్చండి.

ఎ)  జైగోటీన్‌     బి) పాకీటీన్‌     సి) లెప్టోటీన్‌     డి) డిప్లోటీన్‌    ఇ) డయాకైనసిస్‌

1) ఎ, బి, సి, డి, ఇ      2) సి, ఎ, బి, డి, ఇ      

3) సి, ఎ, బి, ఇ, డి      4) సి, ఎ, ఇ, డి, బి

7.  మానవుడి శరీరంలో ఏ అవయవాలు కణ చక్రంలో శాంత దశను ప్రదర్శిస్తాయి?

1) హృదయ కణాలు     2) నాడీ కణాలు    3) నెఫ్రాన్‌లు    4) మయోసైట్లు


8. కిందివాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి. 

ఎ) జంతువుల్లో సమ విభజన - ద్వయ స్థితిక శారీరక, లైంగిక కణాల్లో జరుగుతుంది.

బి) M - దశను సమవిభజన అంటారు.

సి) M - దశను దృశ్యమాన కణవిభజన దశ అంటారు.

డి) అంతర్దశలో దశల వరుస  G1, G2, S

1) ఎ, బి     2) బి, సి   3) ఎ, సి   4) ఎ, డి



9.  కిందివాటిలో సరికానిది.

1) ఏక స్థితికం  పిండం

2) ఏక స్థితికం  పిండకోశం

3) ద్వయ స్థితికం  సంయుక్తబీజం

4) త్రయ స్థితికం  అంకురచ్చదం

10. క్షయకరణ విభజన అనే పదాన్ని ప్రవేశపెట్టినవారు?    

1) జె.బి.ఫార్మర్, జె.ఇ.మూర్‌     2) రుడాల్ఫ్‌ విర్షా  

3) ఎడ్విన్‌ సదరన్‌        4) రెమెక్

11. మానవుడిలో కణాలు ఎంత సమయానికి ఒకసారి విభజన చెందుతాయి?

1) 50 నిమిషాలు      2) ఒక గంట

3) గంటా 20 నిమిషాలు    4) 45 నిమిషాలు


12. కిందివాటిలో డీఎన్‌ఏ ప్రతికృతి చెందని దశ ఏది?

1) G2, G1    2)  G1   3) G2    4) S దశ



13. ప్రొటీన్లు సంశ్లేషణ చెందే దశ-

1) G2    2) G1   3) G1, G2  4) S దశ


 

14. బఠాణి మొక్కలోని అనువంశికత సూత్రాలను పునఃపరిశీలన చేసింది ఎవరు?    

1) వాల్టర్‌ ఫ్లెమింగ్‌      2)విల్‌ హల్మ్‌రౌక్స్‌    3) వీస్‌మన్‌      4) 1, 3

15. సమవిభజనకు, డీఎన్‌ఏ ప్రతికృతి ఆరంభానికి మధ్య ఉన్న దశ?

1) G1     2) G2     3) S      4)  M

16. కిందివాటిలో కణం పెరిగే దశ? 

1) G1     2) S       3) G2     4)  M 


17. క్రొమాటిడ్లు సెంట్రోమియర్‌ వద్ద ఒకదానికి మరొకటి అతికి ఉండే దశ?

1) ప్రథమ దశ       2) మధ్యస్థ దశ      3) చలన దశ       4) అంత్య దశ


18. క్రోమోజోముల బాహ్య స్వరూపాన్ని స్పష్టంగా అధ్యయనం చేసే దశ?

1) ప్రథమ దశ     2) చలన దశ     3) మధ్యస్థ దశ      4) అంత్య దశ


19. కణంలో కణాంగాలు ఏ దశలో అదృశ్యమవుతాయి?

1) ప్రథమ దశ      2) చలన దశ    3)మధ్యస్థ దశ      4) అంత్య దశ


 

20. రక్త కణాల ఏర్పాటులో పాల్గొనేది?

1) క్షయకరణ విభజన   2) సమ విభజన    3) అసమ విభజన     4)1, 2


21. విభాజ్య కణావళి ఉన్న కాండాగ్ర భాగం పార్శ్వ విభాజ్య కణావళిలో కనిపించే విభజన ఏది?    

1) అసమ విభజన     2) క్షయకరణ విభజన     3) సమ విభజన      4) 1, 3



22. కిందివాటిని జతపరచండి.

జీవులు          క్రోమోజోముల సంఖ్య

1) మానవుడు           ఎ) 1260

2) కుక్క                   బి) 46

3) ఓఫియోగ్లాసమ్‌     సి) 78

4) సీతాకోక చిలుక    డి) 380

1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి   2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి   4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


23. కిందివాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

1)క్షయకరణ విభజనలో క్షయవిభజన  I, II లు జరుగుతాయి.

2) క్షయకరణ విభజనలో డీఎన్‌ఏ ప్రతికృతి రెండుసార్లు జరుగుతుంది.

3) క్షయకరణ విభజనలో నాలుగు ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి.

4) క్షయకరణ విభజన ఫలితంగా మొక్కలు, జంతువుల్లో సంయోగ బీజాలు ఏర్పడతాయి.


 

24. క్రోమోజోముల కుదింపు ప్రక్రియ ఏ దశలో జరుగుతుంది?

1) లెప్టోటీన్‌     2) జైగోటీన్‌      3) పాకీటీన్‌    4) డయాకైనసిస్‌
 

25. సూత్రయుగ్మన సమజాతీయ క్రోమోజోములతో ఏర్పడిన సంక్లిష్టాన్ని ఏమంటారు?

1) సూత్రయుగ్మనం    2) రికాంబినేజ్‌   3) బైవలెంట్‌     4) 1, 2


 

26. కొబ్బరిలో అంకురచ్చదం ఏర్పాటుకు కారణం?

1) కణద్రవ్య విభజన జరగడం

2) కణ ద్రవ్య విభజన జరగకపోవడం

3) కణ ద్రవ్య విభజన జరగకుండా బహు కేంద్రక స్థితి ఏర్పడటం

4) కణ ద్రవ్య విభజన జరిగి బహుకేంద్రక స్థితి ఏర్పడుతుంది.


 

27. కణ ద్రవ్య విభజనలో ఏ కణాంగాలు పిల్ల కణాల్లో వితరణ చెందుతాయి?

1) మైటోకాండ్రియా     2) రిక్తిక    3) కేంద్రకం    4) కణకవచం


28. కిందివాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి.

1) కణ విభజనలో డీఎన్‌ఏ ప్రతికృతి, కణం పెరుగుదల జరుగుతాయి.

2) కణ చక్రం అంటే ఒక మాతృకణం రెండు పిల్ల కణాలుగా మారిపోవడం.

3) కణ చక్రంలో డీఎన్‌ఏ సంశ్లేషణ నిర్దిష్ట సమయంలో మాత్రమే జరుగుతుంది.

4) పైవన్నీ



29. ఈస్ట్‌లో కణచక్రం పూర్తవడానికి పట్టే సమయం ఎంత?

1) 90 నిమిషాలు     2)  60 నిమిషాలు     3) 24 గంటలు     4)12 గంటలు


30. కిందివాటిలో క్రోమోజోములు రెట్టింపు అయ్యే దశ ఏది?

1) G1       2)  M         3) G2         4) S


31. కిందివాటిలో పారగతి జరిగే దశ-

1) పాకీటీన్‌      2) జైగోటీన్‌     3) లెప్టోటీన్‌     4) డయాకైనసిస్‌




32. సినాప్టోనియల్‌ సంక్లిష్టం కరిగిపోయే దశ?

1) పాకీటీన్‌     2) జైగోటీన్‌     3) డిప్లోటీన్‌      4) డయాకైనసిస్‌ 


 

33. కిందివాటిలో సమ విభజనను పోలిన క్షయకరణ విభజన ఏది?

1) క్షయకరణ విభజన - I   2) క్షయకరణ విభజన - II      3)చలన దశ-I        4) డిప్లోటీన్‌


 

34. తల్లి కేంద్రకంలోని క్రోమోజోముల సంఖ్య పిల్ల కేంద్రకంలోని క్రోమోజోముల సంఖ్యకు సమానమైన దశ ఏది?

1) సమ విభజన      2) క్షయకరణ విభజన    3) అసమ విభజన      4) డిప్లోటీన్‌

35. పిల్ల కణాలు వాటి మాతృకణాల పోలికలకు భిన్నంగా ఉండే విభజన-

1) సమ విభజన      2) అసమ విభజన     3) క్షయకరణ విభజన      4) 1, 3


36. ప్రథమ దశలో జరిగే మార్పులకు వ్యతిరేకంగా ఉండే దశ-

1) చలన దశ      2) అంత్య దశ    3) మధ్యస్థ దశ     4) 1, 2




37. కణ సంలీన ప్రక్రియను ఉపయోగించిన వ్యక్తులు?

1) పోటు నరసింహారావు     2) జాన్సన్‌    3)రెమెక్‌      4) 1, 2



 

38. అసమాన విభజన ఫలితంగా జీవిలో ఏర్పడే కణాల గుంపు?

1) ట్యూమర్‌      2) ఆంకోసైట్స్‌     3) మెలనోసైట్స్‌    4) లింఫోసైట్స్‌




39. కిందివాటిలో కార్సినోజెనిక్‌ ఏజెంట్స్‌?

1) డీడీటీ      2) పొగాకు    3)  బీహెచ్‌సీ    4) పైవన్నీ

40. కణవిభజన ద్వారా అధిక పెరుగుదలను చూపు మొక్క/మొక్కలు?

1) వెదురు      2) సిక్వియం     3) యూకలిప్టెస్‌      4) 1, 2

41. బహుస్థితిక క్రోమోజోమ్‌ స్థితిని ప్రేరేపించే కందం?

1) కొలకేషియా         2) కాల్చికమ్‌ ఆటమ్నేల్‌     3) అమార్ఫోపాలస్‌     4) 1, 2 


 

42. కిందివాటిని జతపరచండి.

1) డౌన్‌ సిండ్రోమ్‌                    ఎ) పురుషుల్లో శ్రీక్రోమోజోమ్‌ అధికంగా ఉండటం

2) క్లీన్‌ ఫెల్టర్‌ సిండ్రోమ్‌           బి) 45 క్రోమోజోమ్స్‌

3) టర్నల్‌ సిండ్రోమ్‌               సి) మంగోలాయిడ్‌  సిండ్రోమ్‌

1) 1ఎ, 2బి, 3సి      2) 1సి, 2బి, 3ఎ 

3) 1సి, 2ఎ, 3బి     4) 1బి, 2ఎ, 3సి


సమాధానాలు

1-3; 2-2; 3-4; 4-1; 5-3; 6-2; 7-1; 8-4; 9-1; 10-1; 11-4; 12-2; 13-1; 14-2; 15-1; 16-3; 17-1; 18-3; 19-1; 20-2; 21-3; 22-2; 23-2; 24-1; 25-3; 26-3; 27-1; 28-4; 29-1; 30-4; 31-1; 32-3; 33-2; 34-1; 35-3; 36-2; 37-4. 38-1; 39-4; 40-1; 41-2; 42-3.

రచయిత: వట్టి గౌనళ్ల పద్మనాభం 


 

Posted Date : 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌