• facebook
  • whatsapp
  • telegram

 రసాయనశాస్త్రం పరిశ్రమలు

బిట్లు

1. నూనెలు లేదా కొవ్వులు అనేవి
జ‌: గ్లిసరాల్, ఫాటీ ఆమ్లాల ట్రై ఎస్టర్‌లు
 

2. నూనెలు లభించే ముఖ్య వనరులు
జ‌: జంతువులు, వృక్షాలు
 

3. జీవుల్లో ఉండే కొవ్వులను, చెట్ల గింజల్లో ఉండే నూనెలను, వాటి ఉత్పాదనలను ఏమంటారు?
జ‌: లిపిడ్స్
 

4. కిందివాటిలో సంతృప్త ఫాటీ ఆమ్లం ఏది?
A) ఓలియిక్ ఆమ్లం           B) లినోలినిక్ ఆమ్లం
C) స్టియరిక్ ఆమ్లం            D) ఫామిటోలియిక్ ఆమ్లం
జ‌: C( స్టియరిక్ ఆమ్లం)
 

5. లారిక్ ఆమ్లం సాంకేతికం
జ‌: C11H23COOH
 

6. లినోలినిక్ ఆమ్లం స్వభావం
జ‌: అసంతృప్తం
 

7. గది ఉష్ణోగ్రత వద్ద కొవ్వుల స్థితి
జ‌: ఘనం
 

8. గది ఉష్ణోగ్రత వద్ద నూనెలు ....... గా ఉంటాయి.
జ‌: ద్రవం
 

9. నూనెలను హైడ్రోజనీకరణం చేసినప్పుడు ఏర్పడే పదార్థం
జ‌: కొవ్వులు
 

10. నూనెలను హైడ్రోజనీకరణం చేయడంలో ఉపయోగించే ఉత్ప్రేరకం
జ‌: Ni
 

11. కిందివాటిలో శాఖీయ నెయ్యి ఏది?
      A) నూనె        B) గ్లిసరాల్         C) వనస్పతి      D) పాల్మిటిక్ ఆమ్లం
జ‌: C( వనస్పతి)
 

12. కిందివాటిలో సంతృప్త ఫాటీ ఆమ్లం ఏది?
A) మిరిస్టోలియిక్ ఆమ్లం                    B) లారిక్ ఆమ్లం
C) ఫామిటోలియిక్ ఆమ్లం                  D) లినోలినిక్ ఆమ్లం
‌: B(లారిక్ ఆమ్లం)
 

13. నూనెలు, కొవ్వులు నీటి ఆవిరితో చర్య జరిపి వేటిని ఏర్పరుస్తాయి?
జ‌: గ్లిసరాల్, ఫాటీ ఆమ్లాలు
 

14. నూనెలు లేదా కొవ్వులను NaOH లేదా KOH తో చర్య జరిపినప్పుడు ఏర్పడేది?
జ‌: గ్లిసరాల్, సబ్బు
 

15. కఠినజలంలో నురగను ఇవ్వనిది?
జ‌: సబ్బులు
 

16. సబ్బు ఫాటీ ఆమ్లాల ......... లవణం.
జ‌: సోడియం లేదా పొటాషియం
 

17. సబ్బులో ఉండే సాధారణ గ్రూపు
జ‌: RCOONa
 

18. డిటర్జెంట్‌ల్లో ముఖ్యంగా ఉండేది?
జ‌: సోడియం లారైల్ సల్ఫేట్
 

19. డిట‌ర్జెంట్‌ల‌లో ఉన్న సాధార‌ణ గ్రూపు
జ‌: R-O-SO3Na
 

20. కఠిన జలంలో కూడా నురగను ఇచ్చేది
జ‌: డిటర్జెంట్‌లు
 

21. షేవింగ్‌కు వాడే సబ్బులో ఏ పదార్థం అధికంగా ఉంటుంది?
జ‌: స్టియరిక్ ఆమ్లం
 

22. డ్రై క్లీనింగ్‌లో వాడే సబ్బుల్లో ఉండే కాటయాన్
జ‌: ట్రై ఇథనాల్ అమ్మోనియం
 

23. సబ్బులన్నింటిలోనూ ఉండే నీటి శాతం
జ‌: 30%
 

24. శరీర శుభ్రతకు వాడే సబ్బుల్లో ఉండే ఫాటీ ఆమ్లాల లవణం
జ‌: K+
 

25. పారదర్శక సబ్బులు కలిగి ఉండేది
జ‌: గ్లిసరాల్
 

26. శరీర దుర్వాసనను తొలగించే సబ్బులో ఉండేది
జ‌: 3, 4, 5 - ట్రై బ్రోమో సాలిసిలేనిలైడ్
 

27. సూక్ష్మ క్రిమినాశక సబ్బులో ఉండేది
జ‌: 3, 4, 5 - ట్రై బ్రోమో సాలిసిలేనిలైడ్
 

28. ముఖానికి వాడే పౌడర్‌లో ఉన్న సబ్బు లాంటి ఫాటీ ఆమ్లాల లవణం ఏది?
జ‌: Mg2+ లవణం
 

29. నీటిలో తడవని దుస్తుల తయారీకి ఉపయోగించే సబ్బు ఫాటీ ఆమ్లాల లవణం
జ‌: Ca2+, Al3+
 

30. కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు ఉపయోగపడతాయి. ఎందుకంటే?
జ‌: అవి కఠినజల అయాన్లతో చర్య పొందుతాయి కానీ అవక్షేపం ఏర్పడదు.
 

31. దుస్తులు ఉతికే సబ్బులో ఉండేది
జ‌: ఫాటీ ఆమ్లాల Na+ లవణం
 

32. సోడియం లారైల్ సల్ఫేట్ ఫార్ములా
జ‌: CH3(CH2)11OSO3Na
 

33. క్షార సమక్షంలో నూనెలను జల విశ్లేషణం చేసినప్పుడు సబ్బు ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
జ‌: సపోనిఫికేషన్
 

34. నీటిలో సబ్బు కణాలు గోళాకృతిలో గుంపుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
జ‌: మిసిలీ
 

35. నూనెలను కొవ్వులుగా ఏ విధంగా మార్పు చేస్తారు?
జ‌: హైడ్రోజనీకరణం
 

36. సిమెంట్ దేని మిశ్రమం?
జ‌: కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్
 

37. సిమెంట్ బూడిద రంగు గట్టి బంతులను ఏమంటారు?
జ‌: క్లింకర్ సిమెంట్
 

38. గట్టిపడే కాలాన్ని తగ్గించేందుకు సిమెంట్ క్లింకర్‌కు కలిపే పదార్థం
జ‌: జిప్సం
 

39. సిమెంట్ తయారీలో ఉపయోగించని పదార్థం
జ‌: గ్రాఫైట్
 

40. సిమెంట్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ‌: జోసెఫ్ ఆస్పిడిన్
 

41. ఏ మిశ్రమాన్ని తీవ్రంగా వేడిచేస్తే సిమెంట్ ఏర్పడుతుంది?
జ‌: సున్నపు రాయి, బంకమట్టి
 

42. సిమెంట్ గట్టిపడటం దేని వల్ల జరుగుతుంది?
జ‌: జల విశ్లేషణ
 

43. కిందివాటిలో అతిశీతలీకరణం చెందిన ద్రవం
A) సిమెంట్              B) సిరామిక్స్            C) గాజు               D) ప్లాస్టిక్
జ‌: C(గాజు)
 

44. గాజు రసాయన సంఘటనం
జ‌: Na2SiO3, CaSiO3, 4 SiO2
 

45. గాజు తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలు
A) సోడాయాష్        B) సున్నపు రాయి      C) ఇసుక        D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

46. అనేక సిలికేట్‌ల సంశ్లిష్ట మిశ్రమాన్ని ఏమంటారు?
జ‌: గాజు
 

47. గాజును నెమ్మదిగా చల్లార్చే విధానాన్ని ఏమంటారు?
జ‌: మందశీతలీకరణం
 

48. గాజు తయారీలో వాడే సోడాయాష్, సున్నపు రాయి, ఇసుకల మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు?
జ‌: బాచ్
 

49. గాజు తయారీలో బాచ్‌కి కలిపే గాజు ముక్కలను ఏమంటారు
జ‌: కల్లేట్
 

50. గాజు తయారీలో ఏర్పడిన మలినాలను ఏమంటారు?
జ‌: గాజుగాల్
 

51. ద్రవగాజుకు ఏ లోహ లవణాన్ని కలిపితే ఆకుపచ్చ రంగు గాజు లభిస్తుంది?
జ‌: Cr2O3
 

52. కెంపు రంగు గాజును పొందడానికి ద్రవగాజుకు కలపాల్సిన లోహ లవణం ఏది?
జ‌: AuCl3
 

53. ద్రవగాజుకు ఏ లోహ లవణాన్ని కలిపితే ఎరుపు రంగు గాజు లభిస్తుంది?
జ‌: Cu2O
 

54. కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీకి వినియోగించే గాజు
జ‌: సోడాగాజు
 

55. విద్యుత్ బల్బులు, దృశ్యా పరికరాల తయారీలో వినియోగించే గాజు
జ‌: క్వార్ట్జ్ గాజు
 

56. గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియకు ఉపయోగపడే గాజు
జ‌: పైరెక్స్ గాజు, బోరోసిలికేట్ గాజు
 

57. సిలికాను గాలిలో అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు ఏర్పడే రంగు లేని గాజు ఏది?
జ‌: క్వార్ట్జ్ గాజు
 

58. పొటాషియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా మిశ్రమాన్ని ఏమంటారు?
జ‌: గట్టిగాజు
 

59. పొటాషియం సిలికేట్, లెడ్ సిలికేట్ మిశ్రమాన్ని ఏమంటారు?
జ‌: ప్లింట్ గాజు
 

60. కటకాలు, పట్టకాలు, దృశ్యా పరికరాలు తయారుచేయడానికి ఉపయోగించే గాజు
జ‌: ప్లింట్ గాజు
 

61. జతపరచండి.
i) మెత్తని గాజు               a) దృశ్యా పరికరాలు, విద్యుత్ బల్బులు
ii) క్వార్ట్జ్ గాజు                b) వంట పరికరాలు, ప్రయోగశాల పరికరాలు
iii) పైరెక్స్ గాజు              c) కిటికీ అద్దాలు, గాజు సీసాలు
iv) బోరోసిలికేట్ గాజు        d) ప్రయోగశాలలోని గాజు పరికరాలు
జ‌: i-c, ii-a, iii-d, iv-b
 

62. కొన్ని లోహ ఆక్సైడ్‌లను/ లోహ లవణాలను ద్రవగాజుకు కలిపితే రంగు గాజులు ఏర్పడతాయి. అయితే కిందివాటిని జతపరచండి.
i) CoO                          a) ఊదా రంగు
ii) Cu2O                         b) నీలం రంగు
iii) MnO2                        c) ఆకుపచ్చ రంగు
iv) Cr2O3                        d) ఎరుపు రంగు
జ‌: i-b, ii-d, iii-a, iv-c
 

63. బంకమన్ను లాంటి పదార్థాల నుంచి తయారు చేసే వస్తువులు
జ‌: మృణ్మయ పాత్రలు
 

64. సిరామిక్ తయారీకి వాడే ముడిపదార్థాలు
A) బంకమన్ను       B) ఫెల్‌స్ఫార్       C) ఇసుక      D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

65. బోరోసిలికేట్ గాజుకు ఉండే ప్రత్యేక ధర్మం
జ‌: వేడిని తట్టుకోగలదు
 

66. గ్లాస్ బ్లోయింగ్ జరపడానికి ఉపయోగించేది
జ‌: పైరెక్స్ గాజు
 

67. గాజు బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట ఏది?
జ‌: ఆక్సీ - ఎసిటిలిన్ మంట
 

68. టెర్రా కోటా పరికరాలు
జ‌: సచ్ఛిద్రాలు
 

69. సాధారణ కుండపాత్ర
జ‌: సాధారణ ఇటుకలు
 

70. కిందివాటిలో మృత్తికా పాత్రలు
A) కుండలు         B) ఇటుకలు     C) స్పార్క్ ప్లగ్      D) కూజాలు
జ‌: C(స్పార్క్ ప్లగ్)
 

71. కిందివాటిలో మృత్తికా పాత్రలు కానివి
A) విద్యుత్ బంధనపు వస్తువులు              B) పింగాణి వస్తువులు
C) నునుపుగా ఉండే గోడ పెంకులు            D) కూజాలు
జ‌: D(కూజాలు)
 

72. మృణ్మయ వస్తువుల ఉపయోగం కానిది
A) లోహ పరిశ్రమలో కొలిమి నిర్మాణాలకు
B) చైనా పింగాణిగా శుభ్రత పరిరక్షణలో
C) విద్యుత్ పరిశ్రమలో విద్యుత్ బంధకాలుగా
D)ప్రయోగశాల గాజు పరికరాలు
జ‌: D(ప్రయోగశాల గాజు పరికరాలు)
 

73. కిందివాటిలో సహజంగా లభించే పాలిమర్ ఏది?
A) PS        B) PP        C) PVC                   D) ప్రొటీన్‌లు
జ‌: D(ప్రొటీన్‌లు)
 

74. కిందివాటిలో సహజ పాలిమర్ కానిది?
A) ప్రొటీన్‌లు      B) సిల్క్          C) ఫాలిథీన్       D) ఉన్ని
జ‌: C(ఫాలిథీన్)
 

75. కిందివాటిలో పాలిమర్ కానిది ఏది?
A) ప్రొటీన్           B) సెల్యూలోజ్      C) మీథేన్        D)లక్క
జ‌: C(మీథేన్)
 

76. కిందివాటిలో సంకలన పొలిమెరీకరణ రెసిన్లు కానివి
A) పాలిథీన్    B)పాలివినైల్ క్లోరైడ్     C) పాలిఎక్రిలో నైట్రేట్     D)నైలాన్
జ‌: D(నైలాన్)
 

77. కింది సంఘనన పొలిమెరీకరణ రెసిన్ ఏది?
A) పాలిథీన్    B)పాలి ఎస్టర్     C) పాలిఎక్రిలో నైట్రేట్    D)పాలివినైల్ క్లోరైడ్
జ‌: B(పాలి ఎస్టర్)
 

78. కిందివాటిలో సహజ దారం ఏది?
     A) రేయాన్       B)నైలాన్       C) పాలిస్టర్          D)పట్టు
: D(పట్టు)

జ‌: HDPE
 

80. పాలి ఎమైడ్‌లు, హెక్సా మిథిలీన్ మోనోమర్‌లు, డయామీన్, అడిపిక్ ఆసిడ్‌లతో తయారయ్యే కృత్రిమ దారం
ఏది?
జ‌: నైలాన్
 

81. డై మిథైల్ ఈథర్, టెరఫ్తాలిక్ ఆమ్లం చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నం డై హైడ్రిక్ ఆల్కహాల్‌తో చర్యజరిపి ఏర్పరిచే కృత్రిమ దారం ఏది?
జ‌: పాలిస్టర్
 

82. కార్బొనిక్ ఆమ్లం, ఫార్మాల్డిహైడ్‌లతో ఏర్పడే పదార్థం ఏది?
జ‌: బేకలైట్
 

83. నైలాన్ ఉపయోగం
A) తాళ్ల తయారీ
B) చేపల వేటకు వాడే వలలు
C)దంతాలు శుభ్రం చేసుకోవడానికి వాడే బ్రష్ కుంచె
D)అన్నీ
జ‌: D(అన్నీ)
 

84. కిందివాటిలో నైలాన్ ఉపయోగం కానిది?
A) నేలపై పరిచే వస్తువుల తయారీ      B) సీట్ బెల్టుల తయారీ
C) తెరల తయారీ                                D) మేజోళ్ల తయారీ
జ‌: A( నేలపై పరిచే వస్తువుల తయారీ)
 

85. ప్రస్తుతం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్ ఏది?
జ‌: టెర్లిన్
 

86. టెర్లిన్, నూలు మిశ్రణం చెంది ఏర్పడేది
జ‌: టెరికాట్
 

87. టెర్లిన్ పాలిస్టర్, ఉన్నితో మిశ్రణం చెంది ఏర్పరిచేది?
జ‌: టెరిఊల్
 

88. కిందివాటిలో పాలిస్టర్ ఉపయోగం ఏది?
A) PET సీసాలు    B)ఫిల్మ్‌లు     C) వంట పరికరాలు D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

89. బేకలైట్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ‌: లియో హెండ్రిక్ బేక్‌లాండ్
 

90. పార్కెసిన్ అనే మొదటి ప్లాస్టిక్‌ను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: అలెగ్జాండర్ పార్క్స్
 

91. థర్మో ప్లాస్టిక్‌లను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త
జ‌: హెర్మాన్ స్టాడింగర్
 

92. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు
జ‌: లియో హెండ్రిక్ బేక్‌లాండ్
 

93. విద్యుత్ స్విచ్ బోర్డుల తయారీకి ఉపయోగించేది
జ‌: బేక్‌లైట్
 

94. కంప్యూటర్, టీవీ పరికరాల పైభాగం తయారీలో ఉపయోగించేది
జ‌: మెలమిన్
 

95. కిందివాటిలో బేకలైట్ ఉపయోగం కానిది
A) వంట సామగ్రి పిడులు               B) స్విచ్ బోర్డులు
C) కృత్రిమ ముత్యాలు                   D) నేలపై పరిచే వస్తువులు
జ‌: D(నేలపై పరిచే వస్తువులు)
 

96. వినైల్ క్లోరైడ్ సంకలన పాలిమెరీకరణం వల్ల ఏర్పడేది?
జ‌: PVC
 

97. పాలి ఇథిలీన్ అనే పాలిమర్ ఏ పదార్థం పాలిమెరీకరణం చెందడం వల్ల ఏర్పడుతుంది?
జ‌: ఇథిలీన్
 

98. కిందివాటిలో PVC మోనోమర్
A) ఇథిలీన్      B) ప్రొపలీన్     C) వినైల్ క్లోరైడ్        D) వినైల్ ఎసిటేట్
జ‌: C( వినైల్ క్లోరైడ్)
 

99. కిందివాటిలో సంకలన పాలిమర్ కానిది ఏది?
A) PVC         B) PVA          C) పాలి ఇథిలీన్      D) నైలాన్ 6, 6'
జ‌: D(నైలాన్ 6, 6')
 

100. కిందివాటిలో సహజ పాలిమర్
A) నైలాన్         B) అక్రైలిక్       C) పాలి ఇథిలీన్       D) సెల్యూలోజ్
జ‌: D(సెల్యూలోజ్)
 

101. కిందివాటిలో కృత్రిమ దారం
A) నైలాన్         B) పాలిస్టర్      C) అక్రైలిక్                  D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

102. కిందివాటిలో సహజ జిగురు ఏది?
A) లక్క                                        B) సిలికోన్‌లు
C) యూరియా ఫార్మాల్డిహైడ్ రెజిన్          D) ఇపాక్సీ రెజిన్
జ‌: A( లక్క)
 

103. డెక్స్‌ట్రిన్ అనేది
జ‌: సహజ జిగురు
 

104. కిందివాటిలో కృత్రిమ జిగురు ఏది?
A) లక్క         B) తుమ్మ జిగురు      C) ఇపాక్సీ రెసిన్      D) డెక్స్‌ట్రిన్
జ‌: C(ఇపాక్సీ రెసిన్)
 

105. లోహాలను అతికించడానికి ఉపయోగించే జిగురు?
జ‌: సిలికాన్ రెసిన్లు
 

106. గాజు, పింగాణీలను అతికించడానికి ఉపయోగించే జిగురు ఏది?
జ‌: ఎరాల్ డైట్
 

107. చెక్క సామగ్రికి, ఫ్త్లెవుడ్ లామినేషన్ కోసం ఉపయోగించే జిగురు?
జ‌: యూరియా ఫార్మాల్డిహైడ్ రెసిన్
 

108. సహజ దారాల్లో ముఖ్య ఘటకంగా ఉండేది?
జ‌: పాలి గ్లూకోజ్‌
 

109. కిందివాటిలో సహజ దారం ఏది?
A) ఓర్లాన్        B)పాలిస్టర్             C) నైలాన్     D) పట్టు దారం
జ‌: D(పట్టు దారం)
 

110. కిందివాటిలో సహజ దారం కానిది ఏది?
A) నూలు       B)జనపనార            C) రేయాన్   D) ఉన్ని
జ‌: C(రేయాన్)
 

111. గలన పద్ధతిలో తయారుచేసే దారం?
జ‌: డెక్రాన్
 

112. మొదటి కృతిమ దారం
జ‌: నైలాన్
 

113. బేకలైట్‌తో తయారైన వస్తువుకు ఉదాహరణ?
జ‌: విద్యుత్ స్విచ్
 

114. పీవీసీని విస్తరించండి.
జ‌: పాలి వినైల్ క్లోరైడ్
 

115. పర్వతారోహణకు వాడే తాడును ........తో తయారు చేస్తారు.
జ‌: నైలాన్
 

116. పొడి పద్ధతిలో తయారుచేసే దారం?
జ‌: టెర్లాన్
 

117. సహజ దారాల్లో ఉండే ముఖ్యమైన సంఘటనం
జ‌: సెల్యులోజ్
 

118. కిందివాటిలో ఏ దారాలను మండిస్తే జుట్టు కాలిన వాసన వస్తుంది?
A) నైలాన్        B)రేయాన్       C) ఉన్ని లేదా పట్టు D) నూలు
జ‌:  C (ఉన్ని లేదా పట్టు)
 

119. కిందివాటిలో ఏ దారాలను మండిస్తే కాగితం కాలిన వాసన వస్తుంది?
A) నైలాన్           B)ఉన్ని         C) అక్రైలిక్           D) నూలు
జ‌: D(నూలు)
 

120. దారాలను మండించినప్పుడు అది జ్వాలతో కరుగుతున్నట్లయితే
జ‌: నైలాన్
 

121. కృత్రిమ పట్టు దారంగా పిలిచే మానవ నిర్మిత దారం
జ‌: రేయాన్
 

122. నకిలీ ఉన్నిగా పిలిచే మానవ నిర్మిత దారం
జ‌: అక్రైలిక్
 

123. చర్మ రక్షణకు వాడే సౌందర్య సాధనం?
జ‌: శీతల లేపనం
 

124. శీతల లేపనం అనేది?
జ‌: నూనె - నీటి ఎమల్షన్
 

125. శీతల లేపనంలో ఏ పదార్థాలు ఉంటాయి?
A) తేనెతెట్టె నుంచి లభించే మైనం    B) బాదం నూనె
C) గులాబీ నీరు                             D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

126. గోళ్ల ఆకర్షణ కోసం గోరుపై పూసే సౌందర్య సాధనం?
జ‌: గోళ్ల రంగు
 

127. గోళ్లరంగులో ఉన్న కర్బన పదార్థ పాలిమర్ రెసిన్
జ‌: పైరోక్సిలిన్
 

128. గోళ్ల రంగులో ఉండే ప్లాస్టిసైజర్లు ఏవి?
జ‌: ఆముదం నూనె లేదా పాలి ఎస్టర్
 

129. గోళ్ల రంగులోని అల్ప బాష్పీభవన ఉష్ణోగ్రత ఉండే ద్రావణి
జ‌: ఆల్కహాల్, ఎరోమాటిక్ హైడ్రో కార్బన్‌లు
 

130. ముఖంపై ఉండే నూనెను, చెమటను తొలగించడానికి ఉపయోగించే సౌందర్య సాధనం?
జ‌: పౌడర్
 

131. పౌడర్‌లో ఉండే గరిష్ఠ సంఘటనం?
జ‌: టాల్క్
 

132. టాల్క్ రసాయన సంఘటనం?
జ‌: Mg2(SiO5)2.Mg(OH)2
 

133. పౌడర్‌లో ఉండే అపారదర్శక పదార్థం
జ‌: టైటానియం డై ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, కాంజికాభ బంకమన్న, మెగ్నీషియం ఆక్సైడ్
 

134. పౌడర్ తయారీలో జారుడు గుణం కోసం ఉపయోగించే పదార్థం
జ‌: టాల్క్
 

135. పౌడర్‌లో ఉండే అపారదర్శక పదార్థం
జ‌: జింక్ ఆక్సైడ్
 

136. పౌడర్‌లో ఉండే అసంజనత పదార్థం
జ‌: జింక్ స్టియరేట్
 

137. పౌడర్‌లో శోషణ ధర్మం గల పదార్థం
జ‌: సుద్ద
 

138. దారం, వస్త్రాలపై రంగును ఆపాదించ గల పదార్థాలను ఏమంటారు?
జ‌: రంజనాలు
 

139. నీలిమందును దేని నుంచి సేకరిస్తారు?
జ‌: ఇండిగో మొక్కలు
 

140. నత్తల నుంచి సేకరించే సహజ రంగు ఏది?
జ‌: ఊదా
 

141. కృత్రిమంగా రంగును మొదటి సారిగా రూపొందించిన శాస్త్రవేత్త
జ‌: విలియం హెన్రీ పెర్కిన్
 

142. మొదట రూపొందించిన కృత్రిమ రంగు
జ‌: మావ్
 

143. రంజనాల అణు నిర్మాణంలో ఉండే సమూహాలు
జ‌: క్రోమోఫోర్‌లు, ఆక్సో క్రోమ్‌లు
 

144. కిందివాటిలో ఏది క్రోమోఫోర్?
A) C = S          B)  -N = N -      C) -NO2        D)అన్నీ
జ‌: D(అన్నీ)
 

145. కిందివాటిలో క్రోమోఫోర్ కానిది?
A) -NHR      B) -NO2          C) -N = N-        D) -NO
జ‌: A(-NHR)
 

146. కిందివాటిలో ఏది ఆక్సో క్రోమ్‌కు ఉదాహరణ?
A) C = O    B) -COOH        C) C = S         D) -NO
జ‌: B(-COOH)
 

147. కిందివాటిలో ఆక్సో క్రోమ్ కానిది?
A) -OH          B) -NR2           C) C = O       D) -SO3H
జ‌: C(C = O)
 

148. క్రోమోఫోర్‌కు ఒక ఉదాహరణ
జ‌: C = O
 

149. అద్దకం రంగుకు రంగును ఆపాదించే సమూహం ఏది?
జ‌: క్రోమోఫోర్‌లు
 

150. రంజనం రంగు తీవ్రతను పెంచే సమూహం ఏది?
జ‌: ఆక్సో క్రోమ్‌లు
 

151. కిందివాటిలో సంశ్లేషిత అద్దకం రంగు ఏది?
A) మాల్ రంగు                       B)ఎనిలిన్ పసుపు రంగు
C) మిథైల్ ఆరెంజ్                   D)అన్నీ
జ‌: D(అన్నీ)
 

152. రోగ నిరోధానికి, నిర్ధారణకు, రోగ నిర్మూలనకు వాడే పదార్థాలు
జ‌: మందులు
 

153. ఆదర్శవంతమైన మందు లక్షణం కానిది
A) ఇది విషమయం కాకూడదు.
B) దీని చర్య సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
C) దీని చర్య రోగి శరీరమంతా కేంద్రీకృతమై ఉండాలి.
D) ఇది రోగి శరీర కణజాలాలను గాయపరచరాదు.
జ‌: C(దీని చర్య రోగి శరీరమంతా కేంద్రీకృతమై ఉండాలి.)
 

154. కిందివాటిలో హార్మోన్ మందుకు ఉదాహరణ?
A) యాంటీ బయాటిక్స్    B)ఎంటాసిడ్   C) పారాసిటమాల్    D)కార్టిసోన్
జ‌: D(కార్టిసోన్)
 

155. మందుల సహజ వనరులు
A) సూక్ష్మజీవులు        B) మొక్కలు      C) జంతువులు       D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

156. రక్తప్రసరణ వ్యవస్థపై పనిచేసే మందులు
జ‌: గుండె రక్తనాళ మందులు
 

157. ఇన్సులిన్ అనేది
జ‌: హార్మోన్

జ‌: ఆస్పిరిన్

: పారాసిటమాల్
 

160. పెట్రోలియం ఉత్పన్నాల నుంచి తయారుచేసే కర్బన రసాయన పదార్థాలను ఏమంటారు?
జ‌: పెట్రో రసాయనాలు
 

161. పెట్రోలియంను శుద్ధి చేయడంలో ఉపయోగించే దశల్లో ఒకటి
జ‌: అంశిక స్వేదనం
 

162. కిందివాటిలో దేన్ని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు?
A) నేలబొగ్గు     B)కిరోసిన్     C) డీజిల్       D) పెట్రోలియం
జ‌: D(పెట్రోలియం)
 

163. కిందివాటిలో పెట్రో కెమికల్స్ కానిది?
A) ప్లాస్టిక్స్      B)వార్నిష్‌లు          C) కోక్           D) వంట గ్యాస్
జ‌: C(కోక్)
 

164. పెట్రోలియం నుంచి ప్రత్యక్షంగా పొందే పెట్రోల్‌ను ఏమంటారు?
జ‌: సరళ లభ్య పెట్రోల్
 

165. ఎల్‌పీజీ వాయువులో ముఖ్య సంఘటనం
జ‌: బ్యూటేన్
 

166. మండిన తర్వాత వ్యర్థ పదార్థాలను మిగల్చని మంచి ఇంధనం
జ‌: ఎల్‌పీజీ
 

167. పెట్రోల్‌లో ఉన్న హైడ్రో కార్బన్‌లలోని కార్బన్ పరమాణువుల సంఖ్య పరిధి
జ‌: C5 - C9
 

168. కిందివాటిలో మిశ్రమ ఎరువు ఏది?
A) NH4Cl     B) NH2CONH2       C) KNO3       D) నైట్రోపాస్క్
జ‌: D( నైట్రోపాస్క్)
 

169. కిందివాటిలో సహజ పోషకాలు
A) కార్బన్          B) హైడ్రోజన్    C) ఆక్సిజన్          D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

170. కిందివాటిలో సూక్ష్మ పోషకాలు
A) కాపర్            B) మాంగనీస్   C) జింక్           D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

171. కిందివాటిలో సూక్ష్మ పోషకం కానిది
A) మెగ్నీషియం      B) బోరాన్     C) ఇనుము     D) జింక్
జ‌: A(మెగ్నీషియం)
 

172. కిందివాటిలో ప్రాథమిక పోషకాలు ఏవి?
A) C, H, O     B) N, P, K         C) Ca, Na, S, Mg        D) Cu, Mn, Zn, B, Fe
జ‌: B( N, P, K)
 

173. కిందివాటిలో ద్వితీయ పోషకాలు ఏవి?
A) C, H, O      B) N, P, K       C) Ca, Na, S, Mg             D) Cu, Mn, Zn, B, Fe
జ‌: C(Ca, Na, S, Mg)
 

174. కిందివాటిలో పొటాషియం ఎరువు ఏది?
A) KNO3        B) KCl          C) K2SO4          D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

175. నైట్రోజన్ ఎరువుకు ఉదాహరణ
జ‌: NH4Cl
 

176. కిందివాటిలో ఫాస్ఫరస్ ఎరువు ఏది?
A) Ca(H2PO4)2     B) KCl      C) NH4NO3       D) NH2CONH2
జ‌: A(Ca(H2PO4)2)

 

177. ఏకమాత్ర ఎరువుకు ఉదాహరణ
జ‌: NH4Cl
 

178. కిందివాటిలో ఏక పోషక ఎరువు కానిది?
A) NH4Cl          B) NH4NO3       C) KCl           D) KNO3
జ‌: D(KNO3)
 

179. యూరియా రసాయన సంఘటనం
జ‌: NH2CONH2
 

180. ఒక పూర్తి ఎరువులో ఉండేవి
A) N       B) P         C) K           D)అన్నీ
జ‌: D(అన్నీ)

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌