• facebook
  • whatsapp
  • telegram

తిలకం తయారీలో మూలకం సీసం!

రసాయన శాస్త్రం బిట్లు


సృష్టిలోని ప్రతి పదార్థం అణువుల సముదాయమే. గాలి, నీరు, నేల, వాడే వస్తువులు అన్నీ వాటితో ఏర్పడినవే. అణువుల మధ్య ఉండే రసాయనిక బంధాలే పదార్థాల లక్షణాలను నిర్ణయిస్తాయి. ఆ అంశాలను అధ్యయనం చేసేదే రసాయన శాస్త్రం. ఒక పదార్థం మరో పదార్థంతో కలిసినప్పుడు జరిగే మార్పులు, ఏర్పడే బంధాలను ఇది తెలియజేస్తుంది. వివిధ పదార్థాల రసాయనిక స్వభావాలు, ఉపయోగాలు తదితర ప్రాథమిక విషయాలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. పలు రకాల వాయువులు, లోహాలు, మూలకాలు, సమ్మేళనాలకు సంబంధించిన నిజజీవిత అనువర్తనాలను శాస్త్రీయంగా తెలుసుకోవాలి.


మాదిరి ప్రశ్నలు


1.    కిందివాటిలో న్యూక్లియాన్లను గుర్తించండి.

1) ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు     2) ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు

3) ప్రోటాన్లు మాత్రమే     4) ప్రోటాన్లు, న్యూట్రాన్లు


2.     విశ్వంలో తేలికైన వాయువు-

1) హైడ్రోజన్‌ (ఉదజని)    2) ఆక్సిజన్‌ (ఆమ్లజని)

3) నైట్రోజన్‌     4) ఫాస్ఫరస్‌


3.     కిందివాటిలో ఏరోజన్స్‌ అని వేటిని పిలుస్తారు?

1) క్షార లోహాలు          2) క్షార మృత్తిక లోహాలు

3) జడ వాయువులు          4) ప్రాథమిక వాయువులు


4.     సాధారణంగా కిరోసిన్‌లో ఏ మూలకాన్ని నిల్వ చేస్తారు? 

1) బంగారం    2) ఫాస్ఫరస్‌

3) సల్ఫర్‌    4) సోడియం


5.     80% కోక్‌ ఉండే బొగ్గును గుర్తించండి.

1) ఫీట్‌      2) లిగ్నైట్‌

3) బిట్యుమినస్‌        4) ఆంత్రసైట్‌


6. గ్రాఫిన్‌ కంటే స్టీల్‌ ఎన్నిరెట్లు తేలికైంది?

1) 10    2) 100     3) 1000   4) 6


7. చిప్స్‌ ప్యాకెట్లలో నింపే వాయువును గుర్తించండి.

1) నైట్రోజన్‌     2) హైడ్రోజన్‌   

3) నియాన్‌     4) ఆర్గాన్‌


8.     తాజ్‌మహల్‌ రంగు మారడంలో క్రియాశీలమైన వాయువు?

1) CO2 2) N2O

3) SO2 4) NH3


9.     కిందివాటిలో దేన్ని అధికంగా పీలిస్తే ‘ఫాసీజా’ అనే వ్యాధి వస్తుంది?

1) క్లోరిన్‌         2) నైట్రోజన్‌   

3) హైడ్రోజన్‌           4) ఫాస్ఫరస్‌


10. మద్యం తాగిన వ్యక్తిని పరీక్షించే నిర్ధారణ పరికరంలో ఉపయోగించే పదార్థం?

1) రాక్‌సాల్ట్‌     2) మైలుతుత్తం

3) పొటాషియం డైక్రోమేట్‌        4) పొటాషియం అయోడైడ్‌


11. ఇనుము తుప్పు పట్టినప్పుడు భారం ఏమవుతుంది?

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది    

3) మారదు          4) స్థిరం


12. టపాసులు పేలినప్పుడు జరిగే చర్యను గుర్తించండి.

1) భౌతిక చర్య        2) రసాయన చర్య  

3) విద్యుత్తు చర్య        4) అయానిక చర్య


13. సూపర్‌ హాలోజన్‌ అని ఏ వాయువును పిలుస్తారు?

1) ఫ్లోరిన్‌   2) క్లోరిన్‌  3) బ్రోమిన్‌ 4) హీలియం


14. గాల్వనైజేషన్‌ ప్రక్రియలో ఇనుముపై పూత పూసే మరొక లోహం?

1) జింక్‌          2) కాపర్‌   

3) అల్యూమినియం       4) వెండి


15. ఆటంబాంబు కింది ఏ చర్య ఆధారంగా పనిచేస్తుంది?

1) కేంద్రక సంలీనం     2) కేంద్రక విచ్ఛిత్తి      

3) ఆక్సీకరణ చర్య     4) క్షయకరణ చర్య


16. పరమాణు ద్రవ్యరాశి, సంఖ్యలు వేర్వేరుగా ఉండి న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండే ఐసోటోప్‌?

1) ఐసోబార్‌        2) ఐసోటోప్‌  

3) ఐసోటోన్‌       4) ఐసోమర్స్‌


17. మురిగిన కోడిగుడ్డు వాసన ఉండే వాయు సమ్మేళనం?

1) అమ్మోనియా     2) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌

3) మురుగునీరు     4) HCl వాయువు


18. ‘ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి, రసాయన చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశుల మొత్తానికి సమానం’ అని తెలిపే నియమం?

1) స్థిరానుపాత నియమం        2) బహ్వానుపాత నియమం

3) ద్రవ్యనిత్యత్వ నియమం       4) అవగాడ్రో నియమం


19. నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం?

1) మెగ్నీషియం        2) నికెల్‌   

3) ఐరన్‌        4) టిన్‌


20. తెల్ల ఫాస్ఫరస్‌ను వేటిని చంపడానికి ఉపయోగిస్తారు?

1) ఎలుకలు     2) పందులు  

3) కుక్కలు     4) పాములు


21. కిందివాటిలో బ్రైన్‌ ద్రావణాన్ని గుర్తించండి.

1) చక్కర - నీరు ద్రావణం        2) ఉప్పు - నీరు ద్రావణం

3) గ్లూకోజ్‌ - నీరు ద్రావణం     4) నీరు - ఆల్కహాల్‌ ద్రావణం


22. కిందివాటిలో తన ద్వారా విద్యుత్తును ప్రసరింపజేసే అలోహం?

1) సోడియం        2) పొటాషియం           3) సల్ఫర్‌       4) గ్రాఫైట్‌


23. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే లోహం?

1) పాదరసం  (మెర్క్యూరీ)      2) బంగారం    

3) అల్యూమినియం           4) జింక్‌


24. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచించడానికి బదులు సంకోచిస్తుంది?

1) 0°C - 4°C 2) 5°C - 10°C

3) 0°C - 10°C 4) 15°C - 20°C


25. అధిక కాటనేషన్, చతుర్‌ సంయోజకత ఉండే మూలకం?

1)  సల్ఫర్‌          2) కార్బన్‌    

3) అయోడిన్‌         4) కాడ్మియం


26. అడుగు అంటుకోని వంటపాత్రలకు దేనితో పూత పూస్తారు?

1) PVC         2) టెప్లాన్‌   

3) గ్రాఫైట్‌         4) జర్మేనియం


27. కిందివాటిలో ఉత్పతనం చెందని పదార్థాన్ని గుర్తించండి.

1) నాఫ్తలీన్‌ గోలీలు        2)  కర్పూరం

3)  అమ్మోనియం క్లోరైడ్‌    4) కాపర్‌ సల్ఫేట్‌


28. కిందివాటిలో అత్యంత కఠినమైన పదార్థాన్ని గుర్తించండి.

1) వజ్రం         2) ప్లాటినం     

3) గ్రాఫైట్‌           4) ఆస్టాటిన్‌


29. తాత్కాలిక కాఠిన్యత జలంలో వేటి బైకార్బొనేట్‌లు నీటిలో ఉంటాయి?

1) Na, Mg 2) Ca, Mg

3) Na, Al 4) Be, Mg


30. వీటిలో ఏ వాయువు దగ్గరగా మండుతున్న అగ్గిపుల్లను ఉంచితే ‘టప్‌’ మనే శబ్దంతో ఆరిపోతుంది?

1) NH3     2) Cl2    3) CO2   4) H2


31. MRI స్కానింగ్‌లో వాడే ప్రధానమైన మూలకాన్ని గుర్తించండి.

1)  గెడలోనియం        2)  మెగ్నీషియం

3)  ఇనుము          4)  వెండి


32. లాఫింగ్‌ గ్యాస్‌ (నవ్వును పుట్టించే వాయువు)ను గుర్తించండి.

1) నైట్రోజన్‌ డయాక్సైడ్‌    2) నైట్రిక్‌ ఆక్సైడ్‌ 

3) నైట్రస్‌ ఆక్సైడ్‌    4) నైట్రోజన్‌ మోనాక్సైడ్‌ 


33. ఉరుములు, మెరుపుల ద్వారా వాతావరణంలో ఏర్పడే ఆమ్లం?

1) ఫాస్ఫరిక్‌ ఆమ్లం        2) ఎసిటిక్‌ ఆమ్లం

3) నత్రికామ్లం            4) ఫార్మిక్‌ ఆమ్లం


34. మొదటిసారిగా యూరియాను తయారు చేసిన శాస్త్రవేత్త? 

1) వోలర్‌  2) మోలార్‌  3) రోలర్‌  4) అవగాడ్రో 


35. రూథర్‌ఫర్డ్‌ ఆల్ఫాకణ పరీక్షేపణ ప్రయోగం ద్వారా కనుక్కున్న కణం? 

1) ప్రోటాన్‌        2) ఎలక్ట్రాన్‌    

3) న్యూట్రాన్‌       4) కేంద్రకం


36. వాహనాల టైరులో గాలి పీడనాన్ని కనుక్కునే పరికరం? 

1) హైగ్రోమీటర్‌        2) మానోమీటర్‌ 

3) బారోమీటర్‌         4) హైడ్రోమీటర్‌


37. తిలకం తయారీలో ఉపయోగించే మూలకం? 

1) మెర్క్యూరీ          2) సీసం    

3) వెండి          4) సీజియం 


38. చిత్రపటాలు, పట్టువస్త్రాలు, ఉన్ని లాంటి వాటి రంగును పోగొట్టేందుకు దేనిని ఉపయోగిస్తారు? 

1) H2O2          2) H2O

3) H3BO3       4) C6H6


39. మొలాసిస్‌ నుంచి కిణ్వన ప్రక్రియ ద్వారా దేన్ని తయారు చేస్తారు?

1) మీథైల్‌ ఆల్కహాల్‌    2) ఇథైల్‌ ఆల్కహాల్‌ 

3) మీథేన్‌     4) బెంజిన్‌


40. సబ్బు కవర్‌పై ఉండే T.F.M. దేన్ని తెలియజేస్తుంది? 

1) టోటల్‌ ఫ్యాటి మ్యాటర్‌        2) టోటల్‌ ప్యూర్‌ మ్యాటర్‌ 

3) టోటల్‌ ఫైన్‌ మ్యాటర్‌    4) టోటల్‌ ఫ్రేమ్‌ మ్యాటర్‌ 


41. పుచ్చకాయ నమూనాలో థామ్సన్‌ గింజలను వేటితో పోల్చాడు? 

1) ప్రోటాన్లు         2) ఎలక్ట్రాన్లు    

3) న్యూట్రాన్లు       4) పాజిట్రాన్లు


42. స్పృహ కోల్పోయేందుకు ఉపయోగించే రసాయనం గుర్తించండి.

1) మీథేన్‌  2) ఈథేన్‌  3) బెంజిన్‌ 4) క్లోరోఫామ్‌


43. హిమోగ్లోబిన్‌లో ఉండే మూలకం-

1) వెండి   2) జింక్‌   3) ఐరన్‌  4) క్యాల్షియం


44. హైడ్రోజన్‌ బాంబులో జరిగే చర్యను గుర్తించండి.

1) రసాయన సంయోగం    2) రసాయన స్థానభ్రంశం

3) కేంద్రక విచ్ఛిత్తి       4) కేంద్రక సంలీనం


45. కిందివాటిలో దహన దోహదకారి వాయువు ఏది?

1) నైట్రోజన్‌         2) క్లోరిన్‌    

3) ఆక్సిజన్‌         4) అమ్మోనియా


46. సున్నపునీటిలోకి ఏ వాయువును పంపితే అది తెల్లటి పాలలా మారుతుంది?

1) CO2     2) NO2     3) SO2    4) Cl2


47. కిందివాటిలో ద్రవస్థితిలో ఉన్న అలోహం?

1) అయోడిన్‌ 2) బ్రోమిన్‌ 3) ఫాస్ఫరస్‌ 4) సల్ఫర్‌


48. కిందివాటిలో ఉత్కృష్ట వాయువు కానిది గుర్తించండి.

1) క్లోరిన్‌  2) హీలియం  3) నియాన్‌  4) క్రిప్టాన్‌


49. కిందివాటిలో రేడియోథార్మిక మూలకం కానిది-

1) రెడాన్‌         2) యురేనియం    

3) రేడియం       4) మెర్క్యూరీ


50. మట్టి నీటి నుంచి మట్టిని వేరుచేయడానికి ఉపయోగించే పద్ధతి?

1) స్వేదనం              2) తేర్చుట

3) అంశ్విక స్వేదనం       4) వడబోత



సమాధానాలు

1-4; 2-1; 3-3; 4-4; 5-4; 6-4; 7-1; 8-3; 9-4; 10-3; 11-1; 12-2; 13-1; 14-1; 15-2; 16-3; 17-2; 18-3; 19-2; 20-1; 21-2; 22-4; 23-1; 24-1; 25-2; 26-2; 27-4; 28-1; 29-2; 30-4; 31-1; 32-3; 33-3; 34-1; 35-1; 36-2; 37-2; 38-3; 39-1; 40-1; 41-2; 42-2; 43-3; 44-4; 45-3; 46-1; 47-2; 48-1; 49-4; 50-2.

Posted Date : 29-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌