• facebook
  • whatsapp
  • telegram

రసాయన శాస్త్రం

నురగ ఇవ్వని నీరు కఠినం!

 ప్రతి పదార్థం రసాయన చర్యతో ఏర్పడిందే. మూలకాలు, లోహాలు, ద్రవాలు, వాయువులు, ఔషధాలు, విటమిన్లు, పాలిమర్లు తదితరాలన్నీ ఒకదాంతో మరొకటి కలిసినప్పుడు సరికొత్త బంధాలు ఏర్పడుతుంటాయి. శరీరంలోని జీవక్రియల నుంచి వాయు, జల కాలుష్యం వరకు ప్రతి ప్రక్రియను రసాయన శాస్త్రం వివరిస్తుంది. విస్తృత పరిధి ఉన్న ఈ శాస్త్రంలోని ప్రాథమికాంశాలపై పరీక్షార్థులకు పరిజ్ఞానం ఉండాలి. నిత్యజీవిత అవసరాలతో పాటు ఇతర ప్రయోజనాలకు వినియోగించే రసాయన సమ్మేళనాల తయారీ, అందులో వాడే పదార్థాలు, చికిత్స విధానాల్లో జరిగే రసాయనిక ప్రక్రియల గురించి అవగాహన పెంచుకోవాలి.


మాదిరి ప్రశ్నలు

 
1. నిర్జలీకరణ సమయంలో సాధారణంగా శరీరం కోల్పోయే పదార్థం?

1) సోడియం క్లోరైడ్‌       2) చక్కెర   

3) క్యాల్షియం ఫాస్ఫేట్‌      4) పొటాషియం క్లోరైడ్‌


2. మండేందుకు సహాయపడే గాలిలోని వాయువును గుర్తించండి.

1) హైడ్రోజన్‌       2) ఆక్సిజన్‌   

3) నైట్రోజన్‌       4) హీలియం


3. టైఫాయిడ్‌ చికిత్సకు సాధారణంగా ఉపయోగించే ఔషధం?

1) ఆస్కార్బిక్‌ ఆమ్లం       2) క్లోరోమైసిన్‌   

3) క్లోరోక్విన్‌        4) సల్ఫాడ్రగ్‌


4. కార్బన్‌ డేటింగ్‌ను కిందివాటిలో దేని వయసును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?

1) భూమి       2) రాళ్లు   

3) శిలాజాలు       4) పురాతన భవనాలు


5. భూమి పైపొరల్లో అత్యధికంగా లభించే లోహ మూలకం?

1) నికెల్‌       2) ఐరన్‌   

3) కాపర్‌       4) అల్యూమినియం


6. భూమి లోపలి పొరల్లో అధికంగా లభించే లోహ  మూలకం?

1) కాపర్‌      2) జింక్‌   

3) నికెల్‌       4) సోడియం


7. రేడియేషన్‌ క్వాంటం సిద్ధాంతాన్ని స్థాపించినవారు?

1) ఐన్‌స్టీన్‌      2) ప్లాంక్‌  

3) బోర్‌       4) హైగెన్స్‌


8. ఎసిటైల్‌ సాల్సిలిక్‌ ఆమ్లాన్ని సాధారణంగా ఎందులో ఉపయోగిస్తారు?

1) ఎరువులు       2) పెయిన్‌ కిల్లర్‌   

3) టియర్‌ గ్యాస్‌       4) ఉపశమనకారి


9. కంప్యూటర్లలో ఐసీ చిప్స్‌ దేనితో తయారు చేస్తారు?

1) ఐరన్‌ ఆక్సైడ్‌       2) క్రోమియం   

3) నికెల్‌       4) సిలికాన్‌


10. జీవన వ్యవస్థతో వ్యవహరించే కెమిస్ట్రీ శాఖను   ఏమంటారు?

1) భౌతిక కెమిస్ట్రీ       2) అకర్బన కెమిస్ట్రీ   

3) జీవ రసాయన శాస్త్రం   4) కర్బన రసాయన శాస్త్రం


11. పాలను పెరుగుగా మార్చే ప్రక్రియను ఏమంటారు?

1) కిణ్వ ప్రక్రియ       2) రిట్టింగ్‌   

3) వల్కనైజేషన్‌       4) పాశ్చరైజేషన్‌


12. కిందివాటిలో సంయోజనీయ సమ్మేళనాన్ని గుర్తించండి.

1) మెగ్నీషియం క్లోరైడ్‌    2) క్యాల్షియం క్లోరైడ్‌    

3) కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌  4) సోడియం క్లోరైడ్‌


13. నీటిఅణువుల మధ్య ఉండే బంధాన్ని గుర్తించండి.

1) ఎలక్ట్రో వాలెంట్‌ బంధం      2) వాండర్‌వాల్‌ బంధం   

3) సంయోజనీయ బంధం       4) హైడ్రోజన్‌ బంధం


14. కలపను కాలిస్తే విడుదలయ్యే వాయువు?

1) SO2 2) CO2 3) CH4 4) CO


15. ఇథైల్‌ ఆల్కహాల్‌కు కిందివాటిలో దేనిని కలిపితే తాగడానికి పనికిరాదు?

1) పొటాషియం క్లోరైడ్‌       2) మిథైల్‌ ఆల్కహాల్‌   

3) పొటాషియం సైనైడ్‌       4) క్లోరోఫాం


16. డీడీటీ అనేది కిందివాటిలో దేని రసాయన నామం?

1) ఎరువులు       2) పురుగుల మందు   

3) యాంటీబయాటిక్‌       4) క్రిమి సంహారిణి


17. కిందివాటిలో నత్రజని గరిష్ఠ మొత్తాన్ని కలిగి ఉన్న పదార్థాన్ని గుర్తించండి.

1) యూరియా       2) అమ్మోనియం క్లోరైడ్‌   

3) అమ్మోనియం సల్ఫేట్‌      4) అమ్మోనియం నైట్రేట్‌


18. డయాబెటిక్‌ రోగుల మూత్ర నమూనా కలిగి ఉండే పదార్థం?

1) గ్లూకోజ్‌     2) మాల్టోజ్‌ 

3) సుక్రోజ్‌     4) లాక్టోజ్‌


19. మానవ శరీరంలో కిందివాటిలో అధికంగా ఉండే పదార్థం?

1) ప్రొటీన్స్‌       2) ప్లాస్మా   

3) నీరు      4) కొవ్వులు


20. కిందివాటిలో రాన్‌బాక్సీ సంస్థ తయారుచేసే పదార్థం?

1) భారీ రసాయనాలు     2) ఔషధాలు 

3) ప్లాస్టిక్స్‌     4) వస్త్రాలు 


21. సిట్రిక్‌ ఆమ్లం ఏ ఫలాల్లో అధికంగా ఉంటుంది?

1) ఆపిల్‌     2) ఉసిరి 

3) నిమ్మ, నారింజ     4) ద్రాక్ష, చింతపండు 


22. విటమిన్‌ ‘సి’ రసాయన నామం గుర్తించండి.

1) ఎసిటిక్‌ ఆమ్లం     2) టార్టారిక్‌ ఆమ్లం 

3) లాక్టిక్‌ ఆమ్లం     4) ఆస్కార్బిక్‌ ఆమ్లం


23. కిందివాటిలో సహజంగా లభించే అధిక మూలకం?

1) పొలోనియం     2) పాదరసం 

3) యురేనియం     4) థోరియం


24. గాలి లేనప్పుడు ధాతువును వేడి చేసే ప్రక్రియను గుర్తించండి. 

1) శుద్ధి చేయడం     2) భస్మీకరణం 

3) భర్జనం     4) స్మెల్టింగ్‌


25. నీటిని మూలకాలు లేదా ఖనిజాలతో రసాయనికంగా కలపడాన్ని ఏమంటారు?

1) డిసిలికేషన్‌   2) ఆర్థ్రీకరణ (హైడ్రేషన్‌) 

3) ఆక్సీకరణ     4) కార్బొనేషన్‌


26. పిండికి బేకింగ్‌ సోడాను కలపడానికి ప్రధాన కారణం?

1) రంగు ఇవ్వడానికి     2) రుచి కోసం 

3) CO2 ఉత్పత్తికి     4) తేమను ఇవ్వడానికి


27. పిప్పరమెంట్ నూనె నుంచి ఔషధపరంగా ఉపయోగకరమైన సమ్మేళనం? 

1) మెంతోల్‌     2) మార్ఫిన్‌ 

3) థైమాల్‌     4) పిప్పరిన్‌


28. సేంద్రియ సంశ్లేషణంలో ప్రాచుర్యం పొందిన ఎంజైమ్‌లు?

1) సూక్ష్మజీవులు     2) మొక్క ఉత్పన్నం 

3) జంతు ఉత్పన్నం     4) సింథటిక్‌


29. బిట్యుమినస్‌ అనే కోక్‌ దేని నుంచి ఉత్పత్తి అవుతుంది?

1) సంశ్లేషణ     2) క్రాకింగ్‌ 

3) ప్రత్యామ్నాయం     4) విధ్వంసక స్వేదనం


30. ఆక్వారీజియా మిశ్రమం కిందివాటిలో వేటి మిశ్రమం-

1) HCl, HF             2) HCl, HBr

3) HCl, H2SO4      4) HCl, HNO3


31. లోహ అయాన్‌ ఉన్న విటమిన్‌ను గుర్తించండి.

1) విటమిన్‌ B12     2) విటమిన్‌ B6 

3) విటమిన్‌ A     4) విటమిన్‌ C


32. భూమి వేడెక్కడం అనే ముప్పు దేనివల్ల పెరుగుతుంది?

1) SO2 2) NO2 3) CO2 4) CO


33. అగ్గిపుల్లకు ఉండే నల్లపదార్థం దేనితో తయారవుతుంది?

1) తెల్ల  ఫాస్ఫరస్‌    2) ఎర్ర  ఫాస్ఫరస్‌

3) కోక్‌     4) సల్ఫర్‌ 


34. కిందివాటిలో రసాయనాల ద్వారా కుళ్లిపోని పదార్థం?

1) వెండి       2) చక్కెర   

3) గాలి       4) నీరు 


35. యాంటిబయాటిక్‌ మిటోమైసిన్‌ ఏ చికిత్సలో ఉపయోగిస్తారు?

1) పోలియో     2) క్యాన్సర్‌ 

3) సిఫిలిన్‌     4) ఎయిడ్స్‌ 


36. పెట్రోలియం అనే హైడ్రోకార్బన్‌ల మిశ్రమాన్ని ఎక్కడ కనుక్కున్నారు? 

1) భూ ఉపరితంలపైన    2) భూ ఉపరితలం కింద 

3) వాతావరణంలో    4) క్రస్ట్‌లో 


37. ఒక పరమాణు సూత్రంతో ఉన్న సమ్మేళనాలు, వాటి నిర్మాణాల్లో విభిన్నంగా ఉంటే ఏమంటారు?

1) ఐసోటోపులు     2) పాలిమర్‌లు 

3) ఐసోమర్‌లు     4) ఐసోబార్‌లు 


38. 5% నీరు ఉన్న ఇథనాల్‌ను ఏమని పిలుస్తారు?

1) సంపూర్ణ ఆల్కహాల్‌    2) పవర్‌ ఆల్కహాల్‌ 

3) పలుచని ఆల్కహాల్‌     4) సరిదిద్దిన ఆల్కహాల్‌


39. క్లోరోఫ్లోరో కార్బన్స్‌ (CFC)ను ఎందులో విస్తృతంగా ఉపయోగిస్తారు?

1) రిఫ్రిజిరేటర్‌లు     2) సౌరహీటర్‌లు 

3) మైక్రోఅవెన్‌లు     4) వాషింగ్‌మెషిన్‌లు


40. పారిశ్రామిక ప్రక్రియలో పొందిన అశుద్ధ సోడియం కార్బొనేట్‌ను ఏమంటారు?

1) నల్ల బూడిద     2) సున్నం 

3) వాషింగ్‌ సోడా     4) బేకింగ్‌ సోడా 


41. ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు సమాన నిష్పత్తిలో ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు?

1) బ్రౌన్‌ షుగర్‌     2) విలోమ చక్కెర 

3) సుక్రోజ్‌     4) చెరకు చక్కెర


42. వేడి, పీడనం ద్వారా శాశ్వతంగా వైకల్యం చెందని పదార్థం?

1) థర్మోసెట్టింగ్‌ ప్లాస్టిక్‌     2) థర్మోప్లాస్టిక్‌ 

3) పాలిమర్‌     4) కెమికల్‌ సమ్మేళనం


43. వ్యాపించడాన్ని, క్షీణించడాన్ని అరికట్టే ఔషధం?

1) క్రిమినాశక     2) అనాల్జిసిక్‌ 

3) జెర్మిసైడ్‌     4) యాంటీ మలేరియా డ్రగ్‌


44. బోరిక్‌ ఆమ్లం అనేది ఒక..?

1) జెర్మిసైడ్‌         2) యాంటీనిమోటిక్‌ 

3) బలమైన క్రిమినాశకం 4) తేలికపాటి క్రిమినాశకం


45. కిందివాటిలో మురికి, గ్రీజులను తొలగించే పదార్థం ఏమిటి?

1) ఆమ్లాలు     2) ఎరువులు 

3) డిజర్జంట్స్‌     4) బ్లీచింగ్‌ పౌడర్‌


46. సబ్బుతో తేలికగా నురగను ఉత్పత్తి చేయని నీటిని ఏమంటారు? 

1) మినరల్‌ వాటర్‌     2) భారీ నీరు 

3) మృదువైన నీరు     4) కఠినమైన నీరు


47. బెలూన్లను నింపడానికి ఉపయోగించే వాయువును గుర్తించండి. 

1) నైట్రోజన్‌     2) గాలి 

3) ఫ్లోరిన్‌     4) హైడ్రోజన్‌


48. ‘మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా’ అనేది ఒక...?

1) ఆంటాసిడ్‌     2) క్రిమినాశకం 

3) పెయిన్‌ కిల్లర్‌     4) యాంటీ బయాటిక్‌


49. పెక్టిన్‌ అని పిలిచే సమ్మేళనాల తయారీలో ఉపయోగించేవి?

1) ప్రొటీన్స్‌     2) హార్మోన్స్‌ 

3) కార్బొహైడ్రేట్స్‌     4) విటమిన్స్‌ 


50. కిందివాటిలో నవ్వించే వాయువును గుర్తించండి. 

1) N2O5 2) N2O3

3) N2O 4) NOసమాధానాలు

1-1, 2-2, 3-2, 4-3, 5-4, 6-3, 7-2, 8-2, 9-4, 10-3, 11-1, 12-3, 13-4, 14-2, 15-2, 16-2, 17-1, 18-1, 19-3, 20-2, 21-3, 22-4, 23-3, 24-2, 25-2, 26-3, 27-1, 28-1, 29-4, 30-4, 31-1, 32-3, 33-2, 34-1, 35-2, 36-2, 37-3, 38-4, 39-1, 40-1, 41-3, 42-1, 43-1, 44-4, 45-3, 46-4, 47-4, 48-1, 49-3, 50-3.  

Posted Date : 08-02-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు