• facebook
  • whatsapp
  • telegram

రసాయన శాస్త్రం

లోహాల్లో ఉందో ‘రాగి భూతం’!


వివిధ పదార్థ లక్షణాలు, వాటి సంయోగాలు, మిశ్రమాలు, మార్పుల గురించి విస్తృతంగా వివరించేదే రసాయన శాస్త్రం. మనం పీల్చే గాలి నుంచి ఉపయోగించే పెన్ను, వాహనం వరకు ప్రతీది రసాయన ప్రక్రియలతో ఏర్పడినవే. లోహాలు, వాయువులు, మూలకాలు, విటమిన్లు, ఆమ్లాలు, కాంతి లాంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. పలు విభాగాలుగా, విస్తృతంగా ఉన్న రసాయన శాస్త్రానికి సంబంధించిన ప్రాథమికాంశాలు, నిజజీవిత అనువర్తనాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రధాన లోహాలు, వాయువుల స్వభావం, లభ్యమయ్యే తీరు, విభిన్న ఉపయోగాలు, మిశ్రమ పదార్థాల్లోని సమ్మేళనాల గురించి పరిజ్ఞానం పెంచుకోవాలి.


మాదిరి ప్రశ్నలు


1.    స్టెయిన్‌లెస్‌ స్టీలు తయారీలో ఉపయోగించే లోహాలు?

1) ఇనుము, క్రోమియం     2) కాపర్, స్టీలు 

3) ఇనుము, తగరం       4) కాపర్, ఇనుము


2.     ‘రాగి భూతం’ అని పిలిచే లోహాన్ని గుర్తించండి.

1) ఐరన్‌  2) నికెల్‌   3) సీసం   4) మెగ్నీషియం


3.     హాల్‌ ప్రాసెస్‌ ద్వారా భూమి నుంచి వెలికితీసే లోహ మూలకం?

1)  పాదరసం       2) బంగారం  

3) వెండి      4) అల్యూమినియం


4.     గృహోపకరణాల్లో మిశ్రమ పదార్థంగా అధికంగా ఉపయోగించే లోహ మూలకం?

1)  రాగి        2) అల్యూమినియం  

3) ఇనుము      4) తగరం


5.     తక్షణ శక్తి కోసం అథ్లెట్లు తీసుకునే విటమిన్‌ను గుర్తించండి.

1) గ్లూకోజ్‌     2) సుక్రోజ్‌  

3) గెలాక్టోజ్‌      4) గ్లైకోజన్‌


6.     ఆహారాన్ని వండేటప్పుడు అధికంగా కోల్పోయే సమ్మేళనాలు-

1) కార్పోహైడ్రేట్లు      2) ప్రొటీన్లు  

3) కొవ్వులు      4) విటమిన్లు


7.     చాక్లెట్లలో ఉండే లోహాన్ని గుర్తించండి.

1) నికెల్‌   2) జింక్‌   3) ప్లంబం   4) కోబాల్ట్‌


8.     కిందివాటిలో త్వరగా చల్లారే వాయువు ఏది? 

1) నైట్రోజన్‌      2) ఆక్సిజన్‌      

3) ఆర్గాన్‌        4) హీలియం


9.     కంచు అనే మిశ్రమ లోహంలో అధికంగా ఉండే లోహం?

1) కాపర్‌   2) జింక్‌  3) ఐరన్‌  4) సిల్వర్‌


10. కిందివాటిలో ఎకోఫ్రెండ్లీగా పిలిచే వాయువు-

1) ఎల్‌పీజీ        2) సీఎన్‌జీ

3) గోబర్‌ గ్యాస్‌      4) కోల్‌ గ్యాస్‌


11. అయోడిన్‌ పిండిపదార్థాన్ని ఏ రంగులోకి మారుస్తుంది?

1) నీలం   2) తెలుపు  3) నలుపు  4) పసుపు


12. పాన్‌ నమిలినప్పుడు జరిగే మార్పును గుర్తించండి.

1) రసాయన      2) భౌతిక   

3) ద్విగత       4) ఆవర్తన 


13. కిందివాటిలో ఏది భౌతిక మార్పు కాదు?

1) రొట్టెపిండి తయారీ      2) వేసవిలో చర్మం రంగు మారడం  

3) అద్దం ముక్కలుగా చేయడం 4) ఇడ్లీ పిండి తయారీ


14. పిచ్‌బ్లెండ్‌ దేని ఖనిజం? 

1) బంగారం      2) జింక్‌  

3) అల్యూమినియం      4) యురేనియం


15. కిందివాటిలో హాలోజన్‌ కాని మూలకాన్ని గుర్తించండి.

1) క్లోరిన్‌      2) ఫ్లోరిన్‌  

3) అయోడిన్‌     4) క్రిప్టాన్‌


16. షాపింగ్‌లో వాడే క్యారీ బ్యాగుల తయారీలో వినియోగించే పదార్థం ఏది?

1) స్టైరిన్‌  2) ఇథిలీన్‌  3) పీవీసీ   4) ఫినాల్‌


17. సాధారణంగా గాలిలో లేని వాయువును గుర్తించండి.

1) క్లోరిన్‌      2) నైట్రోజన్‌  

3) ఆక్సిజన్‌       4) హీలియం


18. కిందివాటిలో అధిక కెలోరిఫిక్‌ విలువ ఉన్న పదార్థం?

1) పెట్రోల్‌     2) మీథేన్‌    

3) సీఎన్‌జీ     4) హైడ్రోజన్‌


19. ఇనుపగొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింక్‌ లాంటి చురుకైన లోహాల పూత పూయడాన్ని ఏమంటారు?

1) ఎలక్ట్రోప్లేటింగ్‌     2) గాల్వనైజేషన్‌  

3) బ్లోయింగ్‌      4) ఎన్నీలింగ్‌


20. వాతావరణ పరిశీలనలో వాడే బెలూన్లలో నింపే వాయువు?

1) హీలియం     2) నియాన్‌  

3) ఆక్సిజన్‌      4) ఫ్లోరిన్‌


21. ముత్యాల్లోని రసాయన పదార్థాన్ని గుర్తించండి.

1) క్యాల్షియం కార్బొనేట్‌     2) క్యాల్షియంహైడ్రాక్సైడ్‌ 

3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌       4) సోడియం కార్బొనేట్‌


22. గోల్డెన్‌ రైస్‌ ద్వారా లభించే విటమిన్‌-

1) విటమిన్‌-డి      2) విటమిన్‌-ఇ   

3) విటమిన్‌-ఎ       4) విటమిన్‌-సి


23. హెల్మెట్ల తయారీలో ఏ స్టీలును వాడతారు?

1) క్రోమియం స్టీలు     2) మాంగనీస్‌ స్టీలు 

3) టంగ్‌స్టన్‌ స్టీలు     4) స్టెయిన్‌లెస్‌ స్టీలు


24. మానవుడి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం?

1) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం      2) ఎసిటిక్‌ ఆమ్లం  

3) సిట్రిక్‌ ఆమ్లం      4) ఆగ్జాలిక్‌ ఆమ్లం


25. కిందివాటిలో అత్యంత ప్రమాదకరమైంది?

1) ఫ్లైయాష్‌     2) మసి  

3) స్మాగ్‌      4) దుమ్ము కాలుష్యం


26. మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు?

1) నైట్రస్‌ ఆక్సైడ్‌      2) కార్బన్‌ డయాక్సైడ్‌  

3) సల్ఫర్‌ డయాక్సైడ్‌      4) నైట్రోజన్‌ డయాక్సైడ్‌


27. 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం?

1) 8.4   2) 10.2   3) 11.4   4) 12.6


28. గన్‌మెటల్‌లో ఉండే లోహాలను గుర్తించండి.

1) కాపర్‌   2) టిన్‌   3) జింక్‌   4) పైవన్నీ


29. స్టోరేజీ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి?

1) టిన్‌      2) మెర్క్యురీ  

3) లెడ్‌      4) కాడ్మియం


30. పంటి ఫిల్లింగ్‌లకు ఉపయోగపడే దంత ఎమాల్గంలో ఉండే లోహం?

1) సిల్వర్‌  2) టిన్‌   3) మెర్క్యురీ  4) ఐరన్‌


31. ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియ?    

1) మూలకాల ప్రసారం          2) హైబ్రిడేషన్‌   

3) అయానిక బంధం ఏర్పడటం  4) కృత్రిమ రేడియోధార్మికత


32. మంటలను అదుపు చేయడానికి ఉపయోగించే వాయువు?

1) ఆక్సిజన్‌        2) కార్బన్‌ డయాక్సైడ్‌   

3) హీలియం        4) హైడ్రోజన్‌


33. ఇసుక నుంచి సమృద్ధిగా లభించే మూలకాన్ని తెలపండి.

1) అల్యూమినియం        2) తగరం    

3) ఐరన్‌         4) సిలికాన్‌  


34. కిందివాటిలో దేనిలో కార్బన్‌ శాతం అతి తక్కువగా ఉంటుంది?

1) చేత ఇనుము       2) దుక్క ఇనుము   

3) కాస్ట్‌ ఇనుము      4) స్పాంజి ఐరన్‌


35. చక్కెర ద్రావణ కిణ్వన ప్రక్రియలో ఉద్భవించే వాయువు?

1) సల్ఫర్‌ డయాక్సైడ్‌       2) కార్బన్‌ డయాక్సైడ్‌   

3) నైట్రోజన్‌ డయాక్సైడ్‌     4) మీథేన్‌


36. యాంటీ¨ మలేరియా ఔషధంగా ఉపయోగించే సమ్మేళనం?

1) పెన్సిలిన్‌    2) హైడ్రోక్వినైన్‌

3) క్లోరోక్విన్‌    4) ఆస్పరిన్‌


37. ఆకుపచ్చ పండ్లను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే వాయువు?

1) ఎసిటిలిన్‌    2) ఇథిలీన్‌    

3) ఈథేన్‌    4) అమ్మోనియా


38. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం?

1) క్యాల్షియం     2) కార్బన్‌    

3) ఆక్సిజన్‌    4) హైడ్రోజన్‌


39. చక్కెరను గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లుగా మార్చే ఎంజైమ్‌ను గుర్తించండి.

1) లైపేజ్‌    2) ఇన్వర్టేజ్‌

3) జైమేజ్‌    4) డయాస్టేన్‌


40. నత్రజని స్థాపనకు కారణమైన బ్యాక్టీరియా ఏ మొక్కల్లో కనిపిస్తుంది?

1) సిట్రస్‌ మొక్కలు    2) ఎగబాకే మొక్కలు

3) గడ్డి మొక్కలు         4) లెగ్యుమినేసి మొక్కలు


41. ఇసుకలో పాదముద్ర గుర్తులను వేయడానికి ఉపయోగించే పదార్థం?    

1) సీసం        2) జింక్‌    

3) పారాఫిన్‌ మైనం     4) ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ POP


42. టేప్‌రికార్డర్‌లో ధ్వనులను రికార్డు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్‌ టేప్‌ను దేనితో పూత పూస్తారు?

1) మెగ్నీషియం ఆక్సైడ్‌     2) జింక్‌ ఆక్సైడ్‌

3) నైట్రిక్‌ ఆక్సైడ్‌     4) ఐరన్‌ ఆక్సైడ్‌


43. రేడియో కార్బన్‌ డేటింగ్‌ను వేటి వయసు అంచనాకు ఉపయోగిస్తారు?

1) శిలాజాలు      2) ఖనిజాలు

3) పురాతన భవనాలు     4) పురాతన చెట్లు


44. జీవన వ్యవస్థల్లో వ్యవహరించే కెమిస్ట్రీ శాఖను గుర్తించండి.

1) ఫిజికల్‌ కెమిస్ట్రీ         2) ఆర్గానిక్‌ కెమిస్ట్రీ

3) ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ         4) బయోలాజికల్‌ కెమిస్ట్రీ


45. వాణిజ్యపరంగా అమ్మోనియాను ఎందులో ఉపయోగిస్తారు?

1) సబ్బుల తయారీ     2) కృత్రిమ రబ్బరు తయారీ

3) ఎరువుల ఉత్పత్తికి     4) ప్రొటీన్ల తయారీ


46. లోతైన సముద్రపు డైవర్లు కృత్రిమ శ్వాస కోసం ఉపయోగించే మిశ్రమ పదార్థం?

1) హైడ్రోజన్, ఆక్సిజన్‌     2) ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్‌

3) నైట్రోజన్, హైడ్రోజన్‌     4) ఆక్సిజన్, హీలియం


47. మొదట కృత్రిమంగా తయారుచేసిన సేంద్రియ సమ్మేళనం?

1) బెంజిన్‌    2) యూరియా    

3) గ్లూకోజ్‌     4) మీథేన్‌


48. మొదటి ప్రపంచ యుద్ధంలో రసాయన ఆయుధంగా ఉపయోగించిన రసాయనం?

1) హైడ్రోజన్‌ సైనైడ్‌    2) ప్రొడ్యూసర్‌ గ్యాస్‌

3) మస్టర్డ్‌ గ్యాస్‌    4) కార్బన్‌ మోనాక్సైడ్‌


49. కార్బొరండం సమ్మేళనాన్ని గుర్తించండి.

1) Ca 2) Ge 3) Br 4) Si


50. విద్యుత్తు బల్బులో నింపే వాయువు?

1) ఆక్సిజన్‌         2) హైడ్రోజన్‌

3) నైట్రోజన్‌     4) కార్బన్‌ డయాక్సైడ్‌సమాధానాలు

1-1; 2-2; 3-4; 4-2; 5-1; 6-4; 7-3; 8-1; 9-1; 10-2; 11-1; 12-1; 13-4; 14-4; 15-4; 16-4; 17-1; 18-4; 19-2; 20-1; 21-1; 22-3; 23-2; 24-1; 25-2; 26-1; 27-1; 28-4; 29-3; 30-4; 31-1; 32-2; 33-4; 34-1; 35-2; 36-3; 37-1; 38-3; 39-2; 40-4; 41-3; 42-4; 43-1; 44-4; 45-3; 46-4; 47-2; 48-3; 49-4; 50-3. 
 

Posted Date : 27-01-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు