• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ పరిజ్ఞానం పిల్లల హక్కు! 

స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, ప్రవేశిక, బాలల హక్కులు

హక్కులు పెద్దలకే కాదు, పిల్లలకూ ఉంటాయి. భావి పౌరులైన బాలల భద్రత, సంరక్షణ, అభివృద్ధికి భారత రాజ్యాంగం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి. చిన్నారుల హక్కులను స్థూలంగా తెలుసుకోవాలంటే ముందుగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ నిర్మాణ క్రమం, ప్రవేశికకు ఉన్న ప్రాధాన్యం, రాజ్యాంగం ఆమోదం సందర్భంగా జాతీయ నాయకులు చెప్పిన మాటలను గుర్తుచేసుకోవాలి. ప్రాథమిక హక్కుల ఉద్దేశం, వాటి రక్షణకు చట్టపరంగా ఉన్న ఏర్పాట్లపై అవగాహన పెంచుకోవాలి.

1.    1942లో అఖిల భారత షెడ్యూల్డ్‌ తెగల సమాఖ్య అనే పార్టీ స్థాపించినవారు? 

1) గాంధీజీ     2) అంబేడ్కర్‌ 

3) జవహర్‌లాల్‌ నెహ్రూ     4) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 


2.     1932లో పూనా ఒప్పందంపై సంతకాలు చేసినవారు?

1) గాంధీజీ, అంబేడ్కర్‌      2) గాంధీజీ, నెహ్రూ 

3) నెహ్రూ, అంబేడ్కర్‌     4) నెహ్రూ, జిన్నా 


3.     1942, డిసెంబరులో అలహాబాద్‌లో జరిగిన షెడ్యూల్డ్‌ కులాల ప్రత్యేక రాజకీయ సమావేశంలో భారతదేశం ఒకే దేశం కాదని, అది దేశాల సమాహారమని ఎవరు ప్రకటించారు?    

1) గాంధీజీ          2) జవహర్‌లాల్‌ నెహ్రూ 

3) అంబేడ్కర్‌        4) వల్లభాయ్‌ పటేల్‌

4.     రాజ్యాంగ పరిషత్‌లో ఐఎన్‌సీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

1) 202    2) 208    3) 296   4) 292


5.     పాకిస్థాన్‌ దేశం ఏర్పడిన సంవత్సరం?    

1) 1947, ఆగస్టు 15      2) 1947, ఆగస్టు 14 

3) 1947, ఆగస్టు 18      4) 1947, ఆగస్టు 20

6.     రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన ఎంతమంది సభ్యులు ఉన్నారు?

1) 208    2) 93    3) 15     4) 26 


7.     సోవియట్‌ యూనియన్‌ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని, భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించినవారు?

1) మౌలానా హస్రత్‌ మొహానీ   2) డి.ఎస్‌.సేథ్‌ 

3) రంజన్‌ ఠాకూర్‌               4) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ 

8.     అమెరికాలోని అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి?    

1) ప్రధానమంత్రి     2) సెక్రటరీ 

3) గవర్నర్‌     4) అధ్యక్షుడు


9.     భారత అధ్యక్షుడు ఎవరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాటు చేసింది? 

1) స్పీకర్‌     2) గవర్నర్‌ 

3) కేంద్ర మంత్రులు     4) రాయబారులు


10. భారత ద్వంద్వ రాజ్యతంత్రం ఏ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంది?    

1) ఐర్లాండ్‌  2) రష్యా 3) అమెరికా  4) ఇంగ్లండ్‌


11. ఉప రాజ్యతంత్రాలు ఏ వ్యవస్థలో ఉంటాయి?

1) ఏకకేంద్ర     2) సమాఖ్య 

3) అధ్యక్ష తరహా     4) పార్లమెంటరీ 


12. కిందివాటిలో ఏకీకృత రాజ్యాంగ లక్షణం కానిది?

1) కేంద్ర రాజ్యతంత్రం           2) ఏక పౌరసత్వం

3) ద్వంద్వ రాజ్యతంత్రం    4) ఉప సర్వసత్తాక రాజ్యతంత్రాలు లేకపోవడం


13. ముసాయిదా రాజ్యాంగానికి చేసిన సవరణల్లో ఆమోదం పొందినవి?

1) 2473   2) 2743  3) 2374  4) 2347


14. భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన కాలం?    

1) 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు

2) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు

3) 2 సంవత్సరాల 11 నెలల 28 రోజులు

4) 2 సంవత్సరాల 10 నెలల 18 రోజులు

15. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ     2) మోతీలాల్‌ నెహ్రూ 

3) బి.ఎన్‌.రావు     4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


16. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం?

1) 1947, ఆగస్టు 15     2) 1948, ఆగస్టు 14 

3) 1949, నవంబరు 26     4) 1950, జనవరి 26 


17. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

1) 1947, ఆగస్టు 14    2) 1947, ఆగస్టు 15 

3) 1949, నవంబరు 26     4) 1950, జనవరి 26 

18. కిందివాటిలో రాజ్యాంగ సభకు సంబంధించి తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి.

1) రాజ్యాంగ సభ సభ్యులు - 389 2) చీఫ్‌ కమిషనర్‌ పాలిత ప్రాంతాల నుంచి - 6 

3) ముస్లిం లీగ్‌ - 73 4) స్వదేశీ సంస్థానాల నుంచి - 93


19. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 

1) 1947, ఆగస్టు 15     2) 1947, ఆగస్టు 29

3) 1947, ఆగస్టు 14     4) 1948, నవంబరు 4


20. రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, పరిచయం, గుండె లాంటివి ఏవి?

1) ప్రవేశిక 2) ప్రస్తావన     3) భూమిక 4) పైవన్నీ 


21. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా?    

1) 120 కోట్లు     2) 121 కోట్లు 

3) 125 కోట్లు     4) 127 కోట్లు 


22. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని భాషలు?

1) 1652   2) 22   3) 6748   4) 1562 

23. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. రాజులు, రాణులు లేకుండా సాగే ఈ పరిపాలనను ఏమంటారు?

1) సామ్యవాదం 2) సార్వభౌమాధికారం

3) లౌకికరాజ్యం 4) ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం


24. బాలల హక్కులు ప్రధానంగా ఎన్ని రకాలు? 

1) 4     2) 3     3) 6     4) 7

25. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రం - చైల్డ్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరు?

1) 108   2) 100   3) 1098  4) 112


26. ఫీజుల వసూలు, చదవలేదని, ఇంటిపని చేయలేదని శిక్షించడం చట్ట ప్రకారం నేరం. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే సంప్రదించాల్సిన నంబరు?

1) 1098     2) 18004253525 

3) 18004252908     4) 100

27. కేరళలో ఎన్ని బాలల పార్లమెంట్లు ఉన్నాయి? 

1) 2227  2) 2727  3) 2722  4) 7222


28. 6 నుంచి 18 సంవత్సరాల వయసున్న 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసింది? 

1) బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం    2) బాలల పార్లమెంట్‌ 

3) చైల్డ్‌లైన్‌   4) బాలల హక్కుల పరిరక్షణ క్లబ్‌ 

29. బాలల హక్కులపై యూఎన్‌ కన్వెన్షన్‌ 1989 ప్రకారం కిందివాటిలో బాలల హక్కు కానిది?

1) హానికరమైన మందుల నుంచి రక్షణ పొందే హక్కు.

2) పిల్లలు చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచి రక్షణ పొందే హక్కు.

3) విషయ పరిజ్ఞానం, ప్రపంచం గురించి అవగాహన పెంచుకునే హక్కు. 

4) హింస, హానికరమైన సంఘటనల నుంచి రక్షణ పొందే హక్కు.

30. హెలెన్‌ కెల్లర్‌ ఏ దేశస్థురాలు?

1) అమెరికా  2) బ్రిటన్‌  3) ఐర్లాండ్‌  4) జర్మనీ 


31. బ్రిటిష్‌ వారు మనల్ని దాదాపు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు?    

1) 100    2) 200    3) 300   4) 400


32. ‘1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత ఉంటుంది. కానీ సామాజిక, ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది. రాజకీయాల్లో ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నాం. మన సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక చట్రం కారణంగా ఒక మనిషి ఒక విలువ అనే  సూత్రాన్ని అమలు చేయలేం’ అని వ్యాఖ్యానించినవారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ         2) గాంధీజీ 

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 4) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ 


33. ‘మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాల్లో ఉండబోవడం లేదు. గతంలో పలుమార్లు చేసిన ప్రతిజ్ఞలు, ఈరోజు చేయబోతున్న ప్రతిజ్ఞను నిలుపుకోవడానికి మనం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశానికి సేవ చేయడమంటే అందులో ఉంటున్న కోట్లాది వ్యధార్తులకు సేవ చేయడమే’ అని వ్యాఖ్యానించినవారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ         2) గాంధీజీ 

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌     4) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ 


34. భారతదేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చింది? 

1) 1947, ఆగస్టు 14     2) 1947, ఆగస్టు 15

3) 1947, ఆగస్టు 29     4) 1948, ఆగస్టు 15

35. కిందివాటిలో గాంధీజీ పత్రిక కానిది?

1) హరిజన్‌     2) యంగ్‌ ఇండియా 

3) నవజీవన్‌     4) ఆల్‌హిలాల్‌ 


36. ‘పాలిటిక్స్‌’ గ్రంథ రచయిత? 

1) అరిస్టాటిల్‌ 2) రూసో    3) ప్లేటో 4) సోక్రటీస్‌

37. సామాజిక ఒడంబడిక (సోషల్‌ కాంట్రాక్ట్‌) గ్రంథ రచయిత?

1) అరిస్టాటిల్‌ 2) రూసో    3) ప్లేటో 4) సోక్రటీస్‌


38. కిందివాటిలో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానివి?

ఎ) వ్యక్తుల హేతుబద్ధ కోరికలే హక్కులు.    

బి) కోరికలకు చట్టం నుంచి రక్షణ ఉంటుంది.

సి) భారత రాజ్యాంగంలోని రెండో భాగంలో ఉంటాయి.

డి) అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

1) ఎ మాత్రమే       2) సి మాత్రమే

3) ఎ, బి           4) ఎ, బి, డి

39. కిందివాటిలో సరైంది?

ప్రవచనం (A): రాజ్యాంగ హక్కులను కాపాడటం, అమలయ్యేలా చూడటం కోసం ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని ‘రిట్‌’ అంటారు.

కారణం (R): రిట్‌ న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు.

1) A మాత్రమే సరైంది.    2) A సరైంది కాదు, R సరైంది. 

3) R సరైంది కాదు, A సరైంది   4) A, R రెండూ సరైనవి

40. కిందివాటిని జతపరచండి.

1) చట్ట రక్షణలో సమానత్వం      ఎ) ప్రభుత్వం పౌరుల పట్ల వివక్షత చూపకూడదు

2) సామాజిక సమానత్వం    బి) అంటరానితనాన్ని నిషేధిస్తుంది

3) అవకాశాల్లో సమానత్వం    సి) సమన్యాయ పాలన

4) అస్పృశ్యత నిషేధం   డి) బీసీ, ఎస్సీ, ఎస్టీ తెగలకు ఉద్యోగాలు రిజర్వు చేయవచ్చు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి 

3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ       4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


సమాధానాలు

1-2; 2-1; 3-3; 4-2; 5-2; 6-4; 7-2; 8-4; 9-3; 10-3; 11-2; 12-3; 13-1; 14-2; 15-4; 16-3; 17-4; 18-2; 19-4; 20-4; 21-2; 22-1; 23-4; 24-1; 25-3; 26-2; 27-3; 28-2; 29-1; 30-1; 31-2; 32-3; 33-1; 34-2; 35-4; 36-1; 37-2; 38-2; 39-4; 40-2.


రచయిత: అయితరాజు లక్ష్మణ్‌ 

Posted Date : 27-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.