• facebook
  • whatsapp
  • telegram

నిరంతర సమగ్ర మూల్యాంకనం

అభ్యసన సామర్థ్యాలకు నిరంతర మెరుగు!

ప్రాథమిక తరగతుల్లో బట్టీ విధానాన్ని దూరం చేసి, చిన్నపిల్లల్లో సృజనాత్మకతతో కూడిన చదువులనుపెంపొందించేలా ప్రవేశపెట్టిన విద్యావిధానమే నిరంతర సమగ్ర మూల్యాంకనం. 2009 విద్యాహక్కు చట్టం   ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు. ఏడాదంతా చిన్నచిన్న పరీక్షల ద్వారా నిరంతరం మూల్యాంకనం చేస్తూ, వార్షిక పరీక్షల సమయానికి పిల్లలపై ఒత్తిడి, పనిభారం తగ్గిస్తారు. విద్యార్థి వికాసాలను కేవలం పాఠ్యాంశాల పరంగానే చూడకుండా, వారి అభిరుచులు, వైఖరులు, సామర్థ్యాలను ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లలను శారీరకంగా, మానసికంగా, నైతికంగా, సాంఘికంగా ఉత్తమ పౌరులుగా తయారుచేసే ఈ విధానంలోని 
ప్రాథమిక భావనలు, బోధనా విధానాలను ఉపాధ్యాయ అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


1.    కిందివాటిలో అతి ముఖ్యమైన మదింపు ఏది?

1) అభ్యసనంతో పాటు మదింపు     2) అభ్యసనం కోసం మదింపు

3) అభ్యసనం యొక్క మదింపు     4) అంతర్గత అభ్యసన మదింపు

2.  కిందివాటిలో ఒక కార్యక్రమంగానే కాకుండా అభ్యసన ప్రక్రియగా కూడా ఉపయోగపడే మదింపు?

1) స్వీయ మదింపు    2) తోటి పిల్లలతో మదింపు

3) ఉపాధ్యాయుడి మదింపు    4) జట్టు మదింపు




3. విద్యార్థులకు నేర్చుకోవడం ఎలాగో నేర్పే మదింపు?

1) అభ్యసనం యొక్క మదింపు     2) అభ్యసనం కోసం మదింపు

3) అభ్యసనంతో పాటు మదింపు    4) అంతర్గత అభ్యసన మదింపు




4.  కిందివాటిలో సరికాని వాక్యం?

1) మదింపు విధానానికి ప్రాధాన్యం ఇస్తే, మూల్యాంకనం ఫలితానికి ప్రాధాన్యం ఇస్తుంది.

2) మదింపు నిర్ధారణకు రావడానికి జరిగే ప్రక్రియ. మూల్యాంకనం నిర్ధారించే ప్రక్రియ.

3) మదింపు నమ్యత గలది. మూల్యాంకనం స్థిరమైంది

4) మదింపులో పరీక్షించబడుతున్నట్లు విద్యార్థికి ముందుగా తెలుస్తుంది, కానీ మూల్యాంకనంలో తెలియదు.





5. నిర్మాణాత్మక మదింపులో ఏ సామర్థ్యానికి గరిష్ఠ మార్కులు కేటాయిస్తారు?

1) రాత అంశాలు     2) పిల్లల భాగస్వామ్యం - ప్రతిస్పందనలు

3) ప్రాజెక్టు పనులు     4) లఘు పరీక్ష



 

6.  కింది మూల్యాంకన సాధనాలలో నిర్మాణాత్మక మదింపులోని ‘రాత అంశాలు’ అనే సామర్థ్యాన్ని మదింపు కోసం ఉపయోగించని మూల్యాంకన సాధనం?

1) నోటు పుస్తకాలు     2) విద్యార్థుల డైరీ 

3) పోర్టు ఫోలియోలు     4) రూబ్రిక్స్‌




7. నిర్మాణాత్మక మదింపులోని లఘు పరీక్ష ప్రశ్నపత్రం తయారీకి సంబంధించి సరికాని అంశం?

1) విద్యార్థులు సొంతంగా సమాధానాలు రాయడానికి వీలుగా ప్రశ్నలు తయారు చేయాలి.

2) లఘు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎలాంటి ముందస్తు సమాచారం విద్యార్థులకు ఇవ్వరాదు.

3) లఘు పరీక్ష సమాధానాలను CCE నోట్‌బుక్‌లోనే రాయాలి.

4) ప్రశ్నపత్ర తయారీకి నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి, దీనిలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఉండదు.




8. రూబ్రిక్స్‌ అనే మూల్యాంకన సాధనం ఏ పాండిత్యేతర మూల్యాంకన సాధనాన్ని పోలి ఉంటుంది?

1) శోధన సూచిక     2) నిర్ధారణ మాపని     

3) సాంఘికమితి     4) సంచిత పత్రావళి



 

9. KWL చార్టులో W అంటే?  

1) నాకేం తెలుసు      2) నేనేం తెలుసుకున్నాను

3) నేనేమి తెలుసుకోవాలి    4) నాకు అన్నీ తెలుసు



 

10. ‘విడి దస్త్రాలు’ అనే మూల్యాంకన సాధనం ద్వారా నిర్మాణాత్మక మదింపులోని ఏ సామర్థ్యాన్ని మదింపు చేయవచ్చు?

1) రాత అంశాలు      2) పిల్లల భాగస్వామ్యం - ప్రతిస్పందనలు 

3) ప్రాజెక్టు పనులు        4) లఘుపరీక్ష




11. కిందివాటిలో సమగ్ర రూబ్రిక్స్‌ లక్షణం కానిది? 

1) వీటిని తయారు చేయడం సులభం.     2) ఇవి విస్తృత పరిపుష్టిని అందిస్తాయి.

3) సృజనాత్మకత ప్రాధాన్యతను ఇస్తాయి.    4) పూర్తి కృత్యాన్ని ఒకే మొత్తంగా చూసి గణన చేస్తుంది.



 

12. పోర్టుఫోలియోలను వృద్ధి/తయారు చేసేవారు?

1) ఉపాధ్యాయులు         2) విద్యార్థులు 

3) తల్లిదండ్రులు         4) సమాజం 




13. ఒక వ్యక్తి లక్షణాంశం యొక్క ప్రమాణాన్ని తెలిపేది? 

1) శోధన సూచిక         2) రేటింగ్‌ స్కేలు 

3) క్యుములేటివ్‌ రికార్డు     4) సాంఘిక మితి  



14. స్వర్ణలత అనే ఉపాధ్యాయురాలు నిహాల్‌ అనే విద్యార్థితో కలిసి ఎవరెవరు కృత్యాల్లో పాల్గొంటారో తెలుసుకోవాలనుకుంది. ఆమె ఉపయోగించాల్సిన మూల్యాంకన సాధనం?

1) సంఘటన రచనా పత్రావళి  2) శోధన సూచిక 

3) క్యుములేటివ్‌ రికార్డు        4) సాంఘిక మితి 





15. రూబ్రిక్స్‌ అనే పదానికి మూలమైన ‘రెడ్‌’ అనేది ఏ భాషా పదం? 

1) గ్రీకు   2) రోమన్‌    3) ఇటాలియన్‌     4) లాటిన్‌



 

16. RTE - 2009 నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలియజేసే అధ్యాయం ఎన్నోది?    

1) 4వ అధ్యాయం         2) 5వ అధ్యాయం

3) 3వ అధ్యాయం        4) 7వ అధ్యాయం



 

17. రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఏ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు?

1) 2011 - 12        2) 2012 - 13    3) 2013 - 14        4) 2010 - 11




18. కిందివాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్షణం కానిది? 

1) మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం. 

2) పిల్లల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం.

3) బోధనాభ్యసన ప్రక్రియను విద్యార్థి కేంద్రీకృతంగా సాగించడం.

4) విద్యార్థుల అభ్యసనంపై తుది నిర్ణయం చేసి ఫలితాలు ప్రకటించడం.




19. జాహ్నవి అనే విద్యార్థినికి మూడో నిర్మాణాత్మక మదింపులో రాత అంశాలు సామర్థ్యంలో 8 మార్కులు వచ్చాయి. ఆ సామర్థ్యంలో ఆమె గ్రేడు ఎంత?

1)  A గ్రేడు     2) A+ గ్రేడు 

3) B గ్రేడు     4) B+ గ్రేడు




20. నిరంతర సమగ్ర మూల్యాంకనలో భాగంగా పాఠశాలలో అనుసరించాల్సిన అవసరం లేని రిజిస్టరు?

1) CCE రిజిస్టరు      2) క్యుములేటివ్‌ రికార్డు

3) CMR రిజిస్టరు     4) పోర్టుఫోలియో రిజిస్టరు



 

21. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు ఎలాంటి బోర్డు పరీక్ష నిర్వహించరాదని, ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థికే ఇవ్వాలని విద్యాహక్కు చట్టంలోని ఎన్నో సెక్షన్‌ తెలియజేస్తుంది?

1) సెక్షన్‌ 29      2) సెక్షన్‌ 30  

3) సెక్షన్‌ 25      4) సెక్షన్‌ 26




22. కిందివాటిలో నిర్మాణాత్మక మదింపు లక్షణం కానిది?

1) అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది.

2) అభ్యసనం ఎలా జరుగుతుంది అనే విధానంపై దృష్టి పెడుతుంది.

3) ఇది సూక్ష్మస్థాయి పరిశీలన.

4) ఇది అంత్య స్వభావం గలది.



 

23. అభ్యసనం - పరీక్ష - పరిపుష్టి మళ్లీ అభ్యసనం - పరీక్ష - పరిపుష్టిలా కొనసాగే మదింపు?

1) అభ్యసనం యొక్క మదింపు    2) అభ్యసనం కోసం మదింపు 

3) అభ్యసనంతో పాటు మదింపు    4) అంతర్గత అభ్యసన మదింపు

24. ప్రశ్నపత్రం తయారీలో కాఠిన్యత స్థాయి భారత్వ పట్టిక తయారు చేయడం వల్ల ప్రశ్నపత్రానికి ఏ లక్షణం పెంపొందుతుంది?

1) లక్ష్యాత్మకత       2) సప్రమాణత   

3) విశ్వసనీయత       4) విచక్షణాశక్తి



 

25. సంగ్రహణాత్మక మదింపులో సాంఘిక శాస్త్రం సబ్జెక్టుకు సంబంధించి ఏ విద్యా ప్రమాణానికి అధిక మార్కులు కేటాయించాలి?

1) విషయావగాహన        2) పట నైపుణ్యాలు  

 3) సమాచార నైపుణ్యాలు    4) ప్రశంస - విలువలు




26. మూల్యాంకనంలో ఇంతకుముందు అనుసరించిన విధానానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి ప్రధానమైన భేదం?

1) పాత విధానంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే విద్యార్థిని పరీక్షించేవారు. కానీ ప్రస్తుతం నిరంతరం పరీక్షిస్తున్నారు.

2) పూర్వం పాండిత్య, పాండిత్యేతర రంగాలను కూడా పరీక్షించేవారు కానీ ప్రస్తుతం పాండిత్య రంగాన్ని మాత్రమే పరీక్షిస్తున్నారు.

3) పూర్వం మూల్యాంకనం అభ్యసనంలో అంతర్భాగం. ప్రస్తుతం మూల్యాంకనం, అభ్యసనం వేర్వేరు.

4) పూర్వం కంటే ప్రస్తుతం మూల్యాంకనం కఠినతరమైంది.



 

27. నిర్మాణాత్మక మదింపులో తి గ్రేడు గుణాత్మక సూచి? 

1) ప్రతిభగలవారు     2) చాలా బాగుంది  

3) బాగుంది     4) ఫరవాలేదు



 

28. విద్యార్థులను తమతో తాము కాకుండా ఇతరులతో పోటీపడేలా చేసే మదింపు?

1) నిర్మాణాత్మక మదింపు    2) సంగ్రహణాత్మక మదింపు

3) నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మదింపు     4) ప్రాగుక్తీకరణ మదింపు




29. వంట చేసే వ్యక్తి తన వంటను తానే రుచి చూస్తే అది నిర్మాణాత్మక మదింపు. ఇతరులు రుచి చూస్తే సంగ్రహణాత్మక మదింపు అని పేర్కొన్నవారు?

1) ఎన్‌హేన్స్‌ డ్రీమ్స్‌      2) ఆర్‌.స్టేక్‌  

3) కొఠారి కమిషన్‌      4) టేలర్‌




30. ప్రశ్నపత్రానికి గణన పథకం తయారుచేయడం వల్ల ఏ లక్షణం పెంపొందుతుంది?

1) లక్ష్యాత్మకత       2) సప్రమాణత   

3) విశ్వసనీయత       4) ఆచరణాత్మకత 




31. విద్యాహక్కు చట్టంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలియజేసే సెక్షన్‌?    

1) 28వ   2) 29వ   3) 30వ   4) 31వ 



 

32. APSCF-2011 నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించని ప్రతిపాదన?

1) మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం.

2) మూల్యాంకనం విద్యార్థులను అంచనా వేయడానికే కాకుండా నేర్చుకోవడానికి దోహదపడాలి.

3) మూల్యాంకనంలో బహువిధాలైన సమాధానాలు వచ్చే ప్రశ్నలు అడగాలి.

4) పిల్లలను కేవలం పరీక్షల ద్వారానే అంచనా వేయాలి.




33. NCF - 2005  ఏ స్థాయి వరకు పుస్తకాధారిత పరీక్షలను నిషేధించింది?

1) ఎలిమెంటరీ స్థాయి        2) సెకండరీ స్థాయి  

 3) హయ్యర్‌ సెకండరీ స్థాయి 4) ప్రాథమిక స్థాయి




34. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు ఇచ్చే 10 మార్కుల్లో ప్రాజెక్టు నివేదిక తయారీకి ఎంత శాతం మార్కులు కేటాయించాలి?

1) 30%  2) 20%  3) 40%  4) 50%



35. విద్యాహక్కు చట్టంలో 5వ అధ్యాయంలోని సెక్షన్లు?    

1) 28, 29     2) 29, 30     3) 30, 31    4) 31, 32


 

36. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి RTE - 2009 పేర్కొనని అంశం?

1) పిల్లల సమగ్ర అభివృద్ధికి దోహదపడాలి.

2) ఎలిమెంటరీ విద్య పూర్తయ్యాక వారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.

3) రాజ్యాంగ విలువలను పెంపొందించేలా ఉండాలి.

4) బాలల సామర్థ్యాలకు మించి సవాలును స్వీకరించే ప్రశ్నల ద్వారా మూల్యాంకనం చేయాలి.




37. ఉపాధ్యాయుడు ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను నెరవేర్చేదిగా ఉండే ప్రశ్నపత్రానికి ఏ లక్షణం ఉంటుంది? 

1) విశ్వసనీయత       2) లక్ష్యాత్మకత   3) సప్రమాణత   4) ఆచరణాత్మకత



సమాధానాలు

1-2; 2-2; 3-2; 4-4; 5-4; 6-4; 7-4; 8-2; 9-3; 10-1; 11-2; 12-2; 13-2; 14-4; 15-4; 16-2; 17-2; 18-4; 19-1; 20-4; 21-2; 22-4; 23-3; 24-4; 25-1; 26-1; 27-2; 28-2; 29-2; 30-1; 31-2; 32-4; 33-1; 34-4; 35-2; 36-4; 37-3.



రచయిత: బి. ఉపేంద్ర నాయుడు

Posted Date : 25-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌