• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర పాఠ్య ప్రణాళిక

* కరికులం అనే ఆంగ్ల పదం 'కరిరే' అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
* కరిరే అంటే 'పరిగెత్తే మార్గం' అని అర్థం.
* విద్యా నిఘంటువు ప్రకారం 'పాఠశాల ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని సమాజానికి తగిన పౌరుడిగా, ఏదైనా వృత్తి లేదా పనిలో నిపుణుడిగా తయారు చేయడానికి అందించే శిక్షణ, విద్యా అనుభవాల సమాహారమే పాఠ్యప్రణాళిక'.
* 'పాఠశాల విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే పాఠ్యప్రణాళిక'. - ఆల్బర్టీ

 

నిర్మాణ సూత్రాలు
విద్యార్థి కేంద్రీకృత సూత్రం:
విద్యార్థి స్వభావానికి అనుగుణంగా, ప్రభావవంతంగా ఉండాలని చెప్పేది.
కృత్య కేంద్రీకృత సూత్రం: ఇది అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది.
జీవిత కేంద్రీకృత సూత్రం: విద్యార్థి జీవితాన్ని సాంఘికంగా ప్రయోజనకారిగా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా తీర్చిదిద్దుతుంది.
సృజనాత్మక సూత్రం: విద్యార్థిలోని సృజనాత్మక శక్తిని, నిర్మాణాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
వైవిధ్యతా సూత్రం: విద్యార్థుల వివిధ అవసరాలు, సామర్థ్యాలు, ప్రజ్ఞలకు అనుగుణంగా వ్యక్తిగత విభేదాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
ఉపయోగితా సూత్రం: విద్యార్థులకు ఆచరణాత్మకంగా వృత్తి, సాంకేతికపరమైన అంశాలకు, పని అనుభవాలకు సహకరిస్తుంది.
విరామ సమయ సద్వినియోగ సూత్రం: నమూనాలు తయారు చేయడం, చార్టులు గీయడం, ప్రయోగాలు చేయడం లాంటి కృత్యాల్లో విద్యార్థులు పాల్గొనేందుకు తోడ్పడుతుంది.
సమతౌల్యతా సూత్రం: విషయాంశాలతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలకు కూడా తగిన స్థానాన్ని కల్పించాలని సూచిస్తుంది.
పరిపక్వత సూత్రం: విద్యార్థి శారీరక, మానసిక స్థాయిలను అనుసరించి రూపొందించింది.
పరిరక్షణ సూత్రం: సమాజంలోని ఉత్తమమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, విలువలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించడానికి ఉపయోగపడుతుంది.
సర్వాంగీణ వికాస సూత్రం: విద్యార్థులకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాల్లో అనుభవాలను అందిస్తుంది.

 

భౌతిక రసాయన శాస్త్రాల పాఠ్యగ్రంథం
* తరగతి గదిలో బోధించే విషయాలను, బోధనా పద్ధతులను నిర్దేశించే ముఖ్య సాధనమే పాఠ్యగ్రంథం.
* 'పాఠ్యగ్రంథం అనేది తరగతి గదిలో ముద్రిత రూపంలో ఉపయోగించే ఒక ముఖ్య బోధనోపకరణం'. - సింప్సన్
* ఇది ఒక క్రమబద్ధమైన బోధనకు ఉపయోగపడుతుంది.
* పాఠ్యగ్రంథం స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేలా, శాస్త్రీయ వైఖరులను పెంపొందించేలా; బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలతో పాటు కోర్సు లక్ష్యాలనూ సాధించేదిగా ఉండాలి.

* సహ పాఠ్య కార్యక్రమాలకు, ప్రయోగాలకు, ప్రాజెక్టులకు తగిన అవకాశాన్ని కల్పించాలి.
* ఉత్తమ పాఠ్యగ్రంథ రచయితకు తగిన విద్యార్హతలు, అనుభవం ఉండాలి.
* పాఠ్యగ్రంథంలో విషయం తార్కికంగా, మనో వైజ్ఞానిక పద్ధతిలో ఉండాలి.
* మంచి పాఠ్య గ్రంథంలో ప్రత్యామ్నాయ పరికరాలు చేయడానికి ప్రోత్సహించే అంశాలుండాలి.
* శాస్త్రీయ పదాలకు బ్రాకెట్లలో ఆంగ్ల పారిభాషిక పదజాలం ఉండాలి.

 

Posted Date : 28-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు