• facebook
  • whatsapp
  • telegram

రుతుపవనాలు - (మాన్‌సూన్)

* మాన్‌సూన్ అనే ఆంగ్లపదం 'మౌసమ్' అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం రుతువు.
* విశాలమైన భూమి, జలభాగాలు (సముద్రాలు) చల్లబడటం, వేడెక్కడంలో తేడాల వల్ల రుతుపవనాలు ఏర్పడతాయి.
* భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల సంభవిస్తుంది. దేశంలో అన్ని అంశాలు రుతుపవనాలతో ముడిపడి ఉన్నాయి.
* ఆగ్నేయ వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటడంతో వాయువ్య భారతంలో రుతుపవనాలు ఏర్పడతాయి.
* కొరియాలిస్ ప్రభావం వల్ల భారత ద్వీపకల్పంలో, పొరుగుదేశాల్లో నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి.
* శీతాకాలంలో పీడన మేఖలు మారడంతో ఈశాన్య వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటుతాయి. కొరియోలిస్ ప్రభావం వల్ల ఇవి ఉత్తర, ఈశాన్య ఆస్ట్రేలియాలో వాయువ్య రుతుపవనాలు అవుతాయి.

 

స్థానిక పవనాలు
      స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు, పీడనాల్లో తేడాల వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. ఇవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి.

* స్థానిక పవనాలు ట్రోపో ఆవరణంలోని దిగువ పొరల్లో వీస్తాయి.
* కొండ, లోయ, పవనాలు, సముద్ర, భూపవనాలు కూడా ఒక రకమైన స్థానిక పవనాలే.
* వాతావరణంలో కింది పొరలు వేడెక్కడం, చల్లబడటంలో తేడాల వల్ల ఏర్పడే పీడన తేడాల కారణంగా ఈ పవనాలు ఏర్పడతాయి.
* స్థానిక పవనాలు రెండు రకాలు అవి:
i) ఉష్ణ స్థానిక పవనాలు
ii) శీతల స్థానిక పవనాలు

 

ఉష్ణ స్థానిక పవనాలు
      ఉష్ణ స్థానిక పవనాలు ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను పెంచుతాయి.
ఉదా: చినూక్.
* ఉత్తర అమెరికాలోని అమెరికా - కెనడా ప్రాంతంలో ఉన్న రాకీ పర్వతాల కింది భాగంలో వీచే పవనాలను 'చినూక్' అంటారు.
* చినూక్ అంటే 'మంచును తినేది' అని అర్థం.
* వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలో ఒక జాతి పేరు.
* ఈ పవనాల వల్ల పచ్చిక మైదానాల్లో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది.

ఫొన్:
* యూరప్‌లో వీచే పవనాలను ఫొన్ అంటారు.
* ఇవి ఆల్ఫ్స్ పర్వతాల ఉత్తరవాలుల మీదుగా వీస్తాయి.
* ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్షపళ్లు త్వరగా పండటానికి ఈ పవనాలు సహాయం చేస్తాయి.

 

వడగాలులు (లూ):
* ఉత్తర భారతదేశంలో మే - జూన్‌ల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి, పొడి పవనాలను 'లూ' అంటారు.
* అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలకు 'వడదెబ్బ' తగలవచ్చు.
* అరేబియా ఎడారిలో స్థానిక ఉష్ణప్రవాహం - సిమ్మన్.
* జపాన్‌లో స్థానిక ఉష్ణ ప్రవాహం - యోమా.
* న్యూజిలాండ్‌లో స్థానిక ఉష్ణప్రవాహం - నార్వెస్టర్.

 

శీతల స్థానిక పవనం
     శీతల స్థానిక పవనాల వల్ల ఒక్కోసారి ప్రభావిత ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే కిందకు పడిపోతాయి.
ఉదా: మిస్ట్రాల్:

* శీతల స్థానిక పవనాల్లో ఆల్ఫ్ పర్వతాల నుంచి ఫ్రాన్స్ మీదిగా మధ్యధరా సముద్రం వైపుకు వీచే మిస్ట్రాల్ గాలులు పేరుగాంచినవి.
* ఇవి రోమ్‌లోయ ద్వారా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగా, పొడిగా ఉంటాయి.
ప్యూనా: ఇవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు.
పాంపెరా: ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల (గడ్డి మైదానాల) ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు.

 

Posted Date : 14-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు