• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక శాస్త్రం ఆశయాలు - విలువలు - లక్ష్యాలు 

1. 1927లో భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు 'బ్రిటీష్ వారి తుపాకీ గొట్టానికి తన గుండెను ఎదురొడ్డటం' అనే అంశం ద్వారా విద్యార్థుల్లో పెంపొందే విలువ ఏది?
జ: సాహసగుణం

 

2. 'సౌందర్యాన్ని చూడగలిగే హృదయం మనకున్నట్లయితే సృష్టిలో ప్రతివస్తువూ సౌందర్యాత్మకంగానే కనిపిస్తుంది' అని సౌందర్యాత్మక విలువను గురించి పేర్కొన్నది?
జ: జాన్ కీట్స్

 

3. కింది ఆశయాలు, విలువల మధ్య బేధాలు ఇచ్చారు. వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి.
   1) ఆశయాలు ఆశించిన ఫలితాలు, విలువలు కోరుకున్న గమ్యాలు.
   2) ఆశయాలు ప్రయోగ నిరూపణ లేని ఆదర్శాలు, విలువలు ప్రయోగ నిరూపణ ఫలితాలు.
   3) ఆశయాలు చేతన రూప గమ్యాలు, విలువలు ఆచరణ ఫలితాలు.
   4) ఆశయాలు తాత్విక ఆధారం, విలువలు వాస్తవిక ఆధారం.
జ: 1

 

4. లక్ష్యానికి ఆధారం ఏది?
   1) సామాజిక కారకాలు        2) మనోవైజ్ఞానిక కారకాలు
   3) పాఠ్యాంశాల స్వభావం     4) పైవన్నీ
జ: 4

 

5. బోధన - అభ్యసనకు ప్రాణం లాంటివి ఏవి?
జ: లక్ష్యాలు-స్పష్టీకరణలు

 

6. 'ప్రజలకు సామాజిక సంస్థలతో ఉన్న సంబంధం' అనేది ఏ లక్ష్యం?
జ: అవగాహన

 

7. 'మదర్ థెరీసా సేవానిరతి' విన్న విద్యార్థిలో ఏ విలువను పెంపొందించడానికి అవకాశం ఉంది?
 

జ: సామాజిక సేవ
 

8. బోధన అభ్యసన అనుభవాల ద్వారా విద్యార్థుల్లో కలిగే బాహ్య మానసిక పరివర్తన, విద్యార్థి చేయగలిగే కార్యక్రమాలను సూచించే క్రియాత్మక విధులకు ఏమని పేరు?
జ: స్పష్టీకరణలు

 

9. కిందివాటిలో ఏవి అభ్యసన ఫలితాల్లో కనిపిస్తాయి?
   1) లక్ష్యాలు            2) లక్ష్యాలు-స్పష్టీకరణలు
   3) స్పష్టీకరణలు     4) ఆశయాలు
జ: 2

 

10. ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? ఏది? ఎన్ని? ఏమిటి? అనే ప్రశ్నల ద్వారా విద్యార్థులు సాధించగలిగే లక్ష్యం?
జ: జ్ఞాన లక్ష్యం

 

11. 1893లో చికాగోలో జరిగిన సమావేశంలో స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసం ఏ రకమైన లక్ష్యానికి సంబంధించింది?
జ: అభివ్యంజన నైపుణ్యం

 

12. క్షేత్ర పర్యటనలు, విహార యాత్రల ద్వారా విద్యార్థుల్లో పెంపొందే నైపుణ్యం ఏది?
జ: పరిశీలన

 

13. మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి అంశం ఏది?
జ: సహజీకరణ

 

14. విద్యార్థుల్లో ఉత్తమ లక్షణం వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు?
జ: వైఖరి

 

15. తోటివారిలో ఉత్తమ లక్షణాలను గుర్తించి, అభినందించడాన్ని ఏమంటారు?
జ: ప్రశంస
 

16. మూఢ నమ్మకాలను విస్మరించడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించింది?
జ: విలువ కట్టడం

 

Posted Date : 13-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు