1. కాఫీలోని 'ఫ' అనే ధ్వని-
జ: దంతోష్ఠ్యం
2. 'నన్నయ ఉభయకవి మిత్రుడు' అనే భాషణ దోషం ఏ కోవకు చెందింది?
జ: భావదోషం
3. భాషా కౌశలాలు ఎన్ని?
జ: 4
4. అతి సులభంగా భావ గ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం-
జ: శ్రవణం
5. చూపుమేర, పలుకుమేరల సహ సంబంధం ఏ భాషా నైపుణ్యానికి చెందింది?
జ: పఠనం
6. అల్ప ప్రాణం నాదాత్మకమైన భాషా ధ్వని-
జ: డ
7. 'కరము' బదులుగా 'ఖరము' అని పలకడం ఏ దోషం వల్ల కలుగుతుంది?
జ: అల్పప్రాణం బదులు మహాప్రాణం పలకడం
8. ఉభయోష్ఠ్యాలైన ప/ ఫ/ బ/ భ/ మ ధ్వనుల ఉత్పత్తి ఏ భేదం వల్ల కలుగుతుంది?
జ: ప్రయత్నం
9. నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావాల్సిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పఠనం-
జ: విస్తార పఠనం
10. భాషణం కేవలం శ్రవణ గోచరం. లేఖనం-
జ: నయన గోచరం
11. భాషా నైపుణ్యాల క్రమం-
జ: శ్రవణం -భాషణం - పఠనం - లేఖనం
12. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానాన్ని పొందడానికి అంతే అవసరమైంది-
జ: పఠనం
13. ధ్వన్యనుకరణ శబ్దాలను అధికంగా ప్రవేశపెట్టవలసిన కథలు-
జ: నీతి కథలు
14. అ - ఉ అనే రెండు స్వరాలు అవ్యవహితంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్తాచ్చు-
జ: ఔ
15. విద్యార్థుల ఉచ్ఛారణ దోషాలను సవరించడానికి ఏ పఠనం చేయించాలి?
జ: బాహ్య పఠనం
16. విషయ పరిజ్ఞానానికి చెందిన దోషం-
జ: భావ దోషం
17. భాషా బోధనలో పఠన, లేఖనాల్లో ముందుగా జరిగేది-
జ: పఠనం
18. పంక్తి మధ్య పఠనం, ఆమూలాగ్ర పఠనం అనే పఠన విధానాలను సూచించిన కవి-
జ: నెల్లుట్ల వెంకటేశ్వరరావు
19. ఉపాధ్యాయుడు చెబుతుంటే విద్యార్థులు వింటూ అక్షర స్వరూపాలను గుర్తుకు తెచ్చుకుంటూ రాసే లేఖనం-
జ: ఉక్త లేఖనం
20. 'భాష ఆలోచనలకు ఆకృతి' అని చెప్పింది-
జ: జాన్సన్
21. 'ప్రాతిపదిక నైపుణ్యం' అని ఏ భాషా నైపుణ్యానికి పేరు?
జ: శ్రవణం
22. ఆధునిక పరిభాషలో పరుషాలను ఏమంటారు?
జ: శ్వాసాలు
23. 'మల్లెమొగ్గ, మల్లెమొగ్గ మెల్లగ వచ్చి గిల్లిపో' అనే ఆట ద్వారా పెంపొందించే భాషా నైపుణ్యం-
జ: శ్రవణం
24. కరణం ఒక్కసారిగా వెనక్కువచ్చి పైనున్న స్థానాన్ని తాకి, కిందికి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వని-
జ: తాడితం
25. వర్ణ వ్యత్యయ దోషానికి ఉదాహరణ-
జ: సుతిలి
26. పదపద్ధతిలో పఠనాన్ని బోధించేటప్పుడు మొదట ఉపయోగించాల్సిన మెరుపు అట్టలు-
జ: గుర్తింపు అట్ట
27. అంతస్థాలను సరిగా ఉచ్ఛరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్ఛారణ దోషం-
జ: అంత్రం
28. ప్రకాశ పఠనానికి భిన్నమైంది-
జ: మౌన పఠనం
29. బాహ్య నైపుణ్య చతుష్కంలో 'వాచిక చర్య' అని దేన్ని అంటారు?
జవాబు: భాషణం
30. 'చిన్నది యిదిగో చిటికెన వ్రేల్.... ఉన్నది ప్రక్కన ఉంగరపు వ్రేల్' అనేది-
జవాబు: అభినయ గేయం
31. మౌఖికంగా కూర్చే రచన-
జవాబు: ఉక్త రచన
32. వర్ణమాలలో తరచుగారాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పే పఠన పద్ధతి-
జవాబు: నవీనాక్షర పద్ధతి
33. ఒక్కగుక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం-
జవాబు: పలుకుమేర
34. 'కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయమొక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు' అన్నది-
జవాబు: నాష్
35. 'లేఖనం' అనేది ఏ పదం నుంచి ఏర్పడింది?
జవాబు: లింపతి
36. వివరంగా ఉన్న విషయాన్ని కుదించి, అతి క్లుప్తంగా, సంగ్రహంగా రాయడాన్ని ఏమంటారు?
జవాబు: సంక్షిప్త లేఖనం
37. పూర్వ పాఠశాల దశలో శిక్షణ లేకుండా, అతి సులభంగా శిశువు నేర్చుకునే భాషా నైపుణ్యం-
జవాబు: భాషణం
38. వాచిక చర్యను పెంపొందిచడానికి ఏది ఉపకరిస్తుంది?
జవాబు: కథా కథనం
39. పిల్లల్లో జ్ఞాపకశక్తిని, సమస్యా పరిష్కార మార్గాన్ని, లోకజ్ఞతను కలిగించేవి-
జవాబు: పొడుపు కథలు
40. అనునాసిక దోషానికి ఉదాహరణ-
జవాబు: వీన