• facebook
  • whatsapp
  • telegram

ధ్వని పరిణామం - భేదాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ‘నవ్వులాట’ ‘నవ్వుటాల’గా మారడం ఏ ధ్వని పరిణామం?
జ: వర్ణ వ్యత్యయం

 

2. రెండు భిన్న వర్ణాలు కలసి ఏక వర్ణంగా మారడం?
జ: వర్ణ విభేదం

 

3. కిందివాటిలో ‘స్వరభక్తి’కి ఉదాహరణ?
1) గుర్రాలు     2) అరథం     3) రాతిరి     4) తెల్లవారు
జ: 3 (రాతిరి)

 

4. ‘అనుచిత విభాగం’ అంటే?
జ: పదాలను తప్పుగా విరిచి, వ్యవహరించడం

 

5. ‘హోళిగ’ - ‘ఓళిగ’ కావడం?
జ: అజాదిత్వం

 

6. ఒక పదం అర్థం పాతకాలంలో కంటే తర్వాతి కాలంలో విస్తృతమైతే అది .....
జ: అర్థ వ్యాకోచం

 

7. ఒకప్పుడు ‘పాక’ అనే అర్థంలో ఉన్న ‘ఇల్లు’ నేడు ‘డాబా’ అనే అర్థాన్నివ్వడం ఏ కోవకు చెందిన అర్థ పరిణామం?
జ: వస్తు పరిణామం

 

8. ‘అక్కినేని నడిచే విజ్ఞాన సర్వస్వం’ అనడం ఏ అర్థ పరిణామం?
జ: ఆలంకారిక ప్రయోగం

 

9. భాషలోని ధ్వని మార్పులను మొదట వివరించింది?
జ: టాలెమీ

 

10. ‘చూపించు’ అనేది ఏ ధ్వని పరిణామం?
జ: వర్ణ విభేదం

 

11. మూల ద్రావిడ భాషలోని పదాది ‘క’ కారం తాలవ్యాచ్చులు పరమైనప్పుడు ‘చ’ కారంగా మారడం?
జ: తాలవ్యీకరణం

 

12. పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పును ‘అర్థ పరిణామం’ అని నిర్వచించింది?
జ: ఆచార్య జి.ఎన్‌.రెడ్డి

 

13. ‘చీకు’ అనేది ఏ ధ్వని పరిణామం?
జ: లోపదీర్ఘత

 

14. అర్థవ్యాకోచానికి ఉదాహరణ?
జ: చెంబు

 

15. ‘చిలుకలు’ అనేది ఏ ధ్వని పరిణామం?
జ: అనుచిత విభాగం

 

16. వర్ణ వ్యత్యయానికి మరో పేరు?
జ: అక్షర విపర్యయం

 

17. ‘సన్యాసి’ అనేది ఏ అర్థపరిణామం?
జ: అర్థాపకర్ష
 

18. ‘ఎండ నిప్పులు చెరుగుతోంది’ అనేది ఏ అర్థ పరిణామం ?
జ: ఆలంకారిక ప్రయోగం

 

19. 'శ్రీ శివభారతం'లో హరిహర బ్రహ్మలను పురిటి బిడ్డలజేసి జోల పాడింది ఎవరు?
జ: అనసూయ

 

20. షట్చక్రవర్తుల్లోని చక్రవర్తి ఎవరు?
జ: సగరుడు

 

21. సూర్యుడి రథ సారథి?
జ: అనూరుడు

 

22. ‘పొమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు సెప్పన్‌’’ అన్నది?
జ: ధర్మరాజు శ్రీకృష్ణుడితో

 

23. ‘మధువనమెల్ల గొల్లగొన, మర్కట వల్లభునాజ్ఞద్రోయ మమ్మధముల జేయు నెంతఘనులు’ అని పలికిన పాత్ర?
జ: దధిముఖుడు

 

24. రామయ్య మొదటిసారి వేసిన పంట?
జ: వేరుశనగ

 

25. ‘మారిన అలవాటు’ పాఠంలో ఎవరి అలవాటు గురించి పేర్కొన్నారు?
జ: గోపి 

Posted Date : 26-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు