• facebook
  • whatsapp
  • telegram

కేరళలో కలియుగ కల్పవృక్షం!

ఆర్థిక వృక్షశాస్త్రం


 


మనిషి ప్రతి అవసరాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొక్కలే తీరుస్తాయి. ప్రాణవాయువు, ఆహారం, మందులు తదితర ప్రాథమిక అవసరాలతోపాటు వాణిజ్యపరంగానూ అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ విధంగా మొక్కలతో మనుషులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆ బంధాన్ని ఆర్థిక వృక్షశాస్త్రం వివరిస్తుంది. అందుకే  ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ఆహార, వాణిజ్య పంటలు, వృక్షజాతులు, వాటి వల్ల కలిగే  ప్రయోజనాలు, ప్రత్యేక లక్షణాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. నిత్యం మనం వినియోగించే ఆహార, వినియోగ ఉత్పత్తులు ఏయే మొక్కల నుంచి వస్తున్నాయి, ధాన్యాల్లోని పోషక విలువలు, వాటిని ప్రధానంగా పండించే ప్రాంతాలు, దేశాల గురించి తెలుసుకోవాలి.


1.    కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) నాగుల పద్ధతి అంటే విత్తనాలు అరువు తీసుకోవడం.        

బి) కలుపు నియంత్రణకు ఉపయోగించే పరికరం తొళ్లు.

సి) ప్రపంచంలో వరిని అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఏకైక దేశం జపాన్‌.

డి) మర నాగలితో దున్నినప్పుడు ఏర్పడే చాళ్ల ఆకారం U/V.

1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, సి

3) ఎ, బి, డి       4) ఎ, బి


2.     ప్రపంచ ఆర్థిక వృక్షశాస్త్ర పిత ఎవరు?

1) జి.పి.హెక్టార్‌     2) హిల్‌ 

3) హెకెల్‌     4) లిన్నేయస్‌


3.     పూసా నాఫియర్‌ గడ్డి అనేది?

1) వన్య జాతి     2) పెరటి మొక్క 

3) కుండీ మొక్క      4) సాగు మొక్క


4. ఖరీఫ్, రబీ అనేవి ఏ భాషా పదాలు?

1) అరబిక్‌       2) జర్మన్‌  

3) లాటిన్‌      4) గ్రీకు 


5.     కిందివాటిలో ఖరీఫ్‌ పంట కానిది?

1) మినుములు     2) సోయాబీన్స్‌  

3) అవిసెలు      4) మిరప


6.     ఒరైజా అనే పదాన్ని ప్రతిపాదించినవారు?

1) లిన్నేయస్‌     2) హెక్టార్‌ 

3) హిల్‌      4) హెకెల్‌


7.     అమెరికాలో పండే వరి రకం?

1) ఒరైజా గ్లోబెర్రిమా     2) గ్లూమో పాట్యులా 

3) అమృతసారీ     4) సోనా


8.  కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) వరి - అతిపురాతన పంట     

బి) వరి - విశ్వధాన్యం పంట 

సి) వరి - వేదకాల పంట 

డి) ధాన్యాల రాణి - వరి 

1) ఎ, బి, సి            2) ఎ, బి, డి

3) ఎ, బి, సి, డి        4) ఎ, సి


9.  జపాన్‌లో ఎన్ని మిలియన్‌ హెక్టార్లలో వరి పండిస్తున్నారు?

1) 37 మి.హె.     2) 40 మి.హె. 

3) 2.5 మి.హె.     4) 130 మి.హె.


10. వరిలో అడవి జాతి రకాలు?

1) 18     2) 2     3) 10     4) 35 


11. జాతీయ వరి పరిశోధన సంస్థ (CRRI) ఎక్కడ ఉంది? 

1) ఒడిశా     2) మనీలా 

3) అర్జెంటీనా     4) జపాన్‌ 


12. నీటిలో నానబెట్టిన 40 నిమిషాల్లో ఆహారం తయారయ్యే వరి రకాలు? 

1) నల్‌బోరా     2) అగాని 

3) బొగాలి     4) పైవన్నీ


13. గోధుమ శాస్త్రీయ నామం?

1) ఒరైజా సటైవమ్‌    2) జియామేజ్‌ 

3) ట్రిటికమ్‌ వల్గేర్‌     4) పుంగామియా 


14. ప్లాస్టిక్‌ తయారీలో ఉపయోగించే మొక్క? 

1) ఒరైజా     2) జియామేజ్‌     

3) ట్రిటికమ్‌     4) పుంగామియా 


15. గ్లూకోజ్, ప్లాస్టిక్‌ తయారీలో ఉపయోగించే మొక్క? 

1) పెన్నిసిటం     2) అరాఖిస్‌ 

3) రెసినస్‌ కమ్యూనస్‌     4) జియామేజ్‌


16. కేరళ కలియుగ కల్పవృక్షం? 

1) కోకస్‌ న్యూసిఫెరా     2) గాసిపియం 

3) టెక్టోనియా     4) సాల్విక్స్‌ 


17. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే మొక్క?

1) మోరస్‌ ఆల్బా     2) అజాడిరెక్టా 

3) అభిస్‌ ఆల్బా     4) శాంటలం ఆల్బం 


18. కలప అధ్యయనాన్ని ఏమంటారు?

1) డెండ్రాలజీ     2) డాక్టాలజీ     

3) ట్రైకాలజీ     4) పల్మనాలజీ 


19. క్రికెట్‌ బ్యాట్‌ తయారీలో ఉపయోగించే మొక్క?

1) సోరియా రొబొస్టా       2) సాల్విక్స్‌ పర్పూరియా  

3) పుంగామియా పిన్నెటా     4) డాల్‌ బర్జియా 


20. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్పించే మొక్క? 

1) జినియా     2) పుంగామియా 

3) నీలకురింజి     4) వెదురు 


21. కిందివాటిలో బంగారు నార?

1) జనప      2) కిత్తనార  

3) బూరుగ      4) పత్తి 


22. శానిటరీ ప్యాడ్స్‌ తయారీలో ఉపయోగించే మొక్క? 

1) పత్తి     2) జనుము 

3) అరటి     4) అగేవ్‌ అమెరికానా 


23. సుగంధ ద్రవ్యాల రాజు?

1) పైపర్‌ నైగ్రం     2) ఎలెట్టేరియా 

3) సిన్నామోమం     4) యూజినియా 


24. పిన్నాటల్‌ అనే ఆల్కలాయిడ్‌ ఏ మొక్క నుంచి వస్తుంది?

1) వేప       2) అవిసె   

3) కానుగ      4) గన్నేరు


25. ‘కేంఫర్‌’ అనే ఆల్కలాయిడ్‌ ఏ మొక్క నుంచి వస్తుంది? 

1) వేప      2) తులసి  

3) పసుపు      4) సర్పగంధి 


26. కాఫీ రుచిని పెంచేది? 

1) అరాబికా     2) కేషియా     

3) చికోరియా ఇంటిబస్‌     4) ప్లాక్స్‌ గ్లవ్‌ 


27. కిందివాటిలో మలేరియా వ్యాధి నివారిణి? 

1) క్వినైన్‌      2) నింబిన్‌  

3) మెంథాల్‌     4) రిసర్పిన్‌ 


28. కిందివాటిలో భిన్నమైంది?

1) అమృతసారీ     2) బంగారు తీగ 

3) ఎస్‌ఆర్‌ఐ రకం     4) పైవన్నీ


29. ఎస్‌ఆర్‌ఐ వరిని కనుక్కున్నవారు?

1) హెన్రీ పాయింకర్‌     2) హెన్రీ డి లౌలా 

3) లిన్నేయస్‌     4) హెక్టార్‌ 


30. ప్రపంచంలో కందుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం? 

1) జపాన్‌     2) అమెరికా 

3) చైనా     4) ఇండియా


31. ప్రపంచంలో అత్యధిక జనాభా వాడుతున్న వంట నూనె?

1) సోయాబీన్స్‌     2) పొద్దుతిరుగుడు 

3) శనగలు     4) ఆవాలు 


32. కిందివాటిలో బెంగాల్‌ గ్రామ్‌?

1) కందులు     2) మినుములు 

3) శనగలు     4) కేసరి పప్పు


33. కిందివాటిలో పేదవాడి మాంసం? 

1) శనగలు     2) సోయాబీన్స్‌ 

3) చిక్కుడు     4) కందులు 


34. కందెన తయారీలో ఉపయోగపడే నూనె?

1) ఆముదం     2) వేరుశనగ 

3) కానుగ     4) కుసుమ 


35. కిందివాటిలో స్వల్పకాలిక పంట?

1) జొన్న      2) పెసర  

3) కందులు      4) పైవన్నీ


36. కిందివాటిలో ప్రొటీన్‌లు అధికంగా ఉండే వరి రకం?

1) బ్లాక్‌ రైస్‌     2) నల్‌బోరా     

3) అగాని     4) గోల్డెన్‌ రైస్‌ 


37. ఐఆర్‌ఆర్‌ఐ ఎక్కడ ఉంది?

1) మనీలా     2) ఒడిశా 

3) ఇక్రిశాట్‌ (హైదరాబాద్‌)     4) అమెరికా


38. కిందివాటిలో బ్రాన్‌ ఆయిల్‌ను దేని నుంచి తీస్తారు? 

1) నువ్వులు     2) పొద్దుతిరుగుడు

3) వరి     4) కుసుమ 


39. ప్రస్తుతం గోధుమ రొట్టెల తయారీలో ఉపయోగిస్తున్న గోధుమ రకం?

1) ట్రిటికమ్‌ వల్గేర్‌     2) ట్రిటికమ్‌ డైకోకమ్‌ 

3) ట్రిటికమ్‌ మోనోకోకమ్‌     4) ట్రిటికమ్‌ ఏస్టీవమ్‌ 


40. వరి నుంచి ఏ దేశంలో సాకీ అనే మత్తు పదార్థాన్ని తయారుచేస్తారు? 

1) జపాన్‌     2) ఇండియా 

3) చైనా     4) మెక్సికో 


41. గ్రేట్‌ మిల్లెట్‌ అని దేనికి పేరు? 

1) సజ్జలు     2) రాగులు 

3) జొన్నలు     4) కొర్రలు


42. అతిపురాతన చిరుధాన్యాల పంట?

1) సజ్జలు     2) రాగులు 

3) జొన్నలు     4) కొర్రలు 


43. చిరుధాన్యాల్లో నిల్వ ఆహార పదార్థం-

1) సుక్రోజ్‌     2) మాల్టోజ్‌ 

3) రిబ్యులోజ్‌     4) రైబోజ్‌ 


44. అపరాలను ఎక్కువగా పండిస్తున్న దేశం? 

1) చైనా     2) జపాన్‌ 

3) అమెరికా     4) ఇండియా 


45. కిందివాటిలో కొబ్బరి నీళ్లు దేని రూపాంతరం? 

1) సంయుక్తబీజం     2) సంయోగబీజం     

3) అంకురచ్ఛదం     4) పైవన్నీ 


46. కిందివాటిలో ఐరాస శతాబ్ది వృక్షంగా ఏ మొక్కను గుర్తించింది? 

1) కొబ్బరి   2) మర్రి    3) రావి   4) వేప 


47. సిసాల్‌ హెంప్‌ అని దేనికి పేరు? 

1) పత్తి    2) కిత్తనార  3) కొబ్బరి      4) అరటి


48. బ్రూసిస్‌ అనే ఆల్కలాయిడ్‌ ఏ మొక్క నుంచి వస్తుంది?

1) నక్స్‌వామిక     2) వింకారోజియా 

3) పుంగామియా     4) ప్లాక్స్‌ గ్లవ్‌ 


49. ఒక టన్ను పేపర్‌ తయారీకి అవసరమయ్యే     వృక్షాల సంఖ్య? 

1) 5     2) 7     3) 10     4) 17


50. తన జీవిత కాలంలో ఒకేసారి పుష్పించే మొక్క?

1) వెదురు     2) సుబాబుల్‌ 

3) పైనస్‌     4) 1, 2


51. కిందివాటిలో స్వల్ప రాత్రి కాలపు పంట?

1) జొన్న   2) పత్తి   3) గోధుమ   4) వరి


52. కిందివాటిలో తటస్థ పంటకు ఉదాహరణ?

1) జొన్న    2) సోయాబీన్స్‌ 

3) చిక్కుడు    4) 2, 3


53. ప్రపంచంలో అధిక విస్తీర్ణంలో వరిని పండిస్తున్న ఏకైక దేశం?

1) ఇండియా 2) జపాన్‌     3) పాకిస్థాన్‌ 4) చైనా


54. ఒక రైతు విత్తనాల కోసం దుకాణంలో ఏ రంగు లేబుల్‌ ఉండే సంచిని ఎన్నుకుంటాడు?

1) గులాబీ      2) తెలుపు  

3) నీలం       4) బంగారు


సమాధానాలు

1-3; 2-2; 3-4; 4-1; 5-3; 6-1; 7-2; 8-3; 9-3; 10-1; 11-1; 12-4; 13-3; 14-2; 15-4; 16-1; 17-3; 18-1; 19-2; 20-3; 21-1; 22-3; 23-1; 24-3; 25-2; 26-3; 27-1; 28-3; 29-2; 30-4; 31-1; 32-3; 33-2; 34-1; 35-2; 36-4; 37-1; 38-3; 39-4; 40-1; 41-3; 42-1; 43-2; 44-4; 45-3; 46-4; 47-2; 48-1; 49-4; 50-4; 51-3; 52-4; 53-1; 54-3.



రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 

Posted Date : 11-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌