• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంతత్వం

1. పరారుణ కిరణాలను కింది ఏ పదార్థం శోషించుకుంటుంది?
ఎ) సోడాగాజు         బి) రాక్‌సాల్ట్              సి) ప్లింట్‌గాజు          డి) బోహిమియన్ గాజు
జ‌: ఎ (సోడాగాజు)
 

2. పరారుణ కిరణాలు కింది ఏ పదార్థం ద్వారా ప్రయాణిస్తాయి?
ఎ) ప్లింట్‌గాజు       బి) రాక్‌సాల్ట్            సి) సోడాగాజు      డి) క్రౌన్‌గాజు
జ‌: బి (రాక్‌సాల్ట్)
 

3. విద్యుదయస్కాంత తరంగాలన్నీ ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జ‌: తిర్యక్ తరంగ
 

4. శూన్యంలో కాంతివేగం
జ‌: 3 × 108 మీ./సెకన్
 

5. కాంతి వేగానికి సమీకరణం
జ‌: C = υλ
 

6. థర్మోఫైల్‌ను దేని అన్వేషణకు ఉపయోగిస్తారు?
జ‌: పరారుణ కిరణాలు
 

7. పరారుణ కిరణాలు దేనిలో ఉపయోగిస్తారు?
జ‌: శారీరక చికిత్స (మర్థన), చీకటిలో ఫొటోలను తీయడానికి
 

8. దట్టమైన పొగమంచులో ఫొటోలను తీయడానికి ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
జ‌: పరారుణ కిరణాలు
 

9. శారీరక మర్థనాలకు ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
జ‌: IR -పరారుణ కిరణాలు
 

10. టెలిమెట్రిలో ఉపయోగపడే తరంగాలు
జ‌: మైక్రో తరంగాలు
 

11. రాడార్‌లో ఉపయోగించే విద్యుదయస్కాంత వికిరణాలు
జ‌: మైక్రో తరంగాలు
 

12. అతినీలలోహిత కిరణాలను సూర్యుడి నుంచి భూమిని చేరకుండా కాపాడేది
జ‌: ఓజోన్ పొర
 

13. ఏ కిరణాలు శరీరంపై ఎక్కువ కాలం పడితే చర్మ క్యాన్సర్ వస్తుంది?
జ‌: అతినీలలోహిత కిరణాలు
 

14. వైద్యరంగంలో X - కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేసే పద్ధతిని ఏమంటారు?
జ‌: రేడియోగ్రఫీ
 

15. రోగ నిర్ధారణకు ఉపయోగించే కిరణాలు
జ‌: మృదు X - కిరణాలు
 

16. 1 అంటే?
జ‌: 10-1 సెం.మీ.

17. X - కిరణాలను కనుక్కున్నది
జ‌: రాంట్‌జన్
 

18. దృగ్గోచర వర్ణపటం యొక్క తరంగదైర్ఘ్యాల అవధి
జ‌: 0.4 μm - 0.7 μm
 

19. అత్యల్ప తరంగదైర్ఘ్యం ఉన్న విద్యుదయస్కాంత వికిరణాలు
జ‌: γ - కిరణాలు
 

20. కిందివాటిని జతపరచండి.

 విద్యుదయస్కాంత తరంగాలు    ఉత్పత్తి జనకం
1) మైక్రో తరంగాలు A) పదార్థంలోని అణువుల భ్రమణ లేదా కంపన చలనాల స్థితుల్లో మార్పులు జరగడం వల్ల ఇవి ఉద్గారం అవుతాయి.
2) X − కిరణాలు B) పరమాణువులోని ఉత్తేజ వేలన్సీ ఎలక్ట్రాన్లు తిరిగి వాటి మామూలు స్థానానికి పడిపోవడం వల్ల ఉత్పత్తి అవుతాయి.
3) పరారుణ తరంగాలు C) 109 నుంచి 1011 హెర్ట్జ్ మధ్య కంపిస్తున్న విద్యుదయస్కాంత డోలకాల నుంచి ఉత్పత్తి అవుతాయి.
4) దృగ్గోచర వర్ణపటం D) ఎలక్ట్రాన్‌లను, రుణ త్వరణానికి గురిచేయడం వల్ల ఉత్పత్తి చేయవచ్చు.

జ‌: 1-C, 2-D, 3-A, 4-B
 

21. కిందివాటిని జతపరచండి.
విద్యుదయస్కాంత తరంగాలు        తరంగ అవధి
1) పరారుణ వర్ణపటం                 A) ఒక మీ. నుంచి 100 కి.మీ.
2) రేడియో తరంగాలు                B) 0.4 μm నుంచి 1 nm
3) అతినీలలోహిత వికిరణాలు     C) 0.0001 nm నుంచి 0.1nm
4) γ - కిరణాలు                      D) 0.7 μm నుంచి 100 μm
జ‌: 1-D, 2-A, 3-B, 4-C

22. X - కిరణాల తరంగదైర్ఘ్య అవధి
జ‌: 0.01  నుంచి 100 

23. అతినీలలోహిత కిరణాలను కనుక్కున్నది?
జ‌: రిట్టర్
 

24. పరారుణ కిరణాలను కనుక్కున్నది?
జ‌: హర్షల్
 

25. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రకటించింది?
జ‌: మాక్స్‌వెల్
 

26. విద్యుత్, అయస్కాంతత్వం అనేవి పరస్పర సంబంధం గల అంశాలని 1820లో ప్రయోగ పూర్వకంగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: ఆయిర్‌స్టెడ్
 

27. ఆయిర్‌స్టెడ్ ప్రయోగ నిర్వహణకు కావాల్సిన పరికరాలు
ఎ) రాగితీగ         బి) దిక్సూచి      సి) బ్యాటరీ, స్విచ్         డి) అన్నీ
జ‌: డి (అన్నీ)
 

28. విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ఫలితాలను కనుక్కున్న శాస్త్రవేత్త?
జ‌: ఆయిర్‌స్టెడ్
 

29. వాహకంలో ప్రవహించే విద్యుత్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రదిశను తెలుసుకోవడానికి ఉపయోగపడేది
 ఎ) ఆంపియర్ ఈత నిబంధన     బి) ఆంపియర్ కుడిచేతి నిబంధన
 సి) మాక్స్‌వెల్ కార్క్ - స్క్రూ నిబంధన     డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

30. మాక్స్‌వెల్ కార్క్ - స్క్రూ నిబంధన వేటి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది?
జ‌: విద్యుత్ ప్రవాహదిశ, అయస్కాంత క్షేత్రదిశ
 

31. ఆంపియర్ కుడిచేతి నిబంధనలో బొటనవేలు దిశ దేన్ని సూచిస్తుంది?
జ‌: విద్యుత్ చలనదిశ
 

32. పొడవైన తీగ వద్ద ఉండే అయస్కాంత క్షేత్రాన్ని వివరించే అంశం
జ‌: తీగ కేంద్రంగా ఉండే ఏకకేంద్ర వృత్తాలు గల అయస్కాంత క్షేత్రం
 

33. విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో అయస్కాంత క్షేత్ర తీవ్రత విలువ దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) విద్యుత్ ప్రవాహం
బి) వాహక పొడవులో కొంత భాగం
సి) చిన్న పొడవు యొక్క మధ్య బిందువును ఇచ్చిన బిందువుకు గీసిన స్పర్శరేఖను, చిన్నపొడవుకు బిందువుకు మధ్య దూరానికి గల కోణం
డి) అన్నీ
జ‌: డి (అన్నీ)
 

34. విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకానికి దగ్గరగా ఉన్న ఏదైనా బిందువు వద్ద గల అయస్కాంత ప్రేరణ (B), వాహకం నుంచి ఆ బిందువుకు ఉన్న దూరం (r) కు మధ్య ఉండే సంబంధం
జ‌: 

35. విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకానికి దగ్గరగా ఉన్న ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ (B), విద్యుత్ ప్రవాహానికి (i) ఎలా ఉంటుంది?
జ‌: అనులోమానుపాతంలో
 

36. తిన్నని విద్యుత్ ప్రవాహ వాహకం వల్ల అయస్కాంత ప్రేరణ (B)
జ‌: 

37. 'l' పొడవు కలిగి 'i' విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాన్ని'B' ప్రేరణ గల అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంచినప్పుడు దానిపై పనిచేసే బలం
జ‌: ilB

38. ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధనలో విద్యుత్ ప్రవాహాన్ని సూచించేది
జ‌: మధ్యవేలు
 

39. ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధనలో వాహకంపై బలదిశను సూచించేది
జ‌: బొటనవేలు
 

40. ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధనలో అయస్కాంత క్షేత్రదిశలను సూచించేది
జ‌: చూపుడువేలు
 

41. ఒక తిన్నని పొడవైన తీగ ద్వారా 20  విద్యుత్ ప్రవహిస్తుంది. దీని నుంచి 0.1 మీటర్ దూరంలో ఏర్పడే అయస్కాంత క్షేత్రప్రేరణ విలువ
జ‌: 4 × 10-5 వెబర్/మీ.2

42. ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తున్న తిన్నని వాహకం నుంచి ఒక మీటర్ దూరంలో అయస్కాంత క్షేత్రప్రేరణ విలువ
జ‌: 2 × 10-7 వెబర్/మీ.2
 

43. అయస్కాంత బలరేఖలు
జ‌: ఊహాత్మకమైనవి, రెండు ధృవాలను కలిపేవి
 

44. అయస్కాంత బలరేఖలు
జ‌: సంవృతాలు
 

45. సోలినాయిడ్ అనేది ఏ ఆకారపు తీగచుట్ట?
జ‌: వలయాకార
 

46. సోలినాయిడ్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తే అది దేనిలా పనిచేస్తుంది?
జ‌: దండాయస్కాంతం
 

47. సోలినాయిడ్ బయట అయస్కాంత బలరేఖల దిశ
జ‌: ఉత్తరం నుంచి దక్షిణం
 

48. సోలినాయిడ్ లోపలివైపు అయస్కాంత బలరేఖల దిశ
జ‌: దక్షిణం నుంచి ఉత్తరం
 

49. సోలినాయిడ్ లోపల అయస్కాంత బలరేఖలు
జ‌: అక్షం వెంబడి ఉంటాయి. ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
 

50. విద్యుత్ ప్రవహిస్తున్న సోలినాయిడ్‌లో మెత్తని ఇనుమును ప్రవేశపెట్టారు. అయితే సోలినాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం
జ‌: పెరుగుతుంది
 

51. విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన రేఖీయ సోలినాయిడ్‌లో అయస్కాంత క్షేత్రం
జ‌: అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటుంది.
 

52. ప్రమాణ పొడవులో సోలినాయిడ్‌లో గల తీగచుట్ల సంఖ్యను రెట్టింపు చేస్తే ఆ సోలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వం
జ‌: నాలుగు రెట్లవుతుంది
 

53. అయస్కాంత బలరేఖలు
జ‌: ఊహాజనితమైనవి
 

54. ఒక ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం F =
జ‌: qvB
 

55. కదిలే ఆవేశానికి, అయస్కాంత క్షేత్రానికి మధ్య కోణం  ఉన్నట్లయితే ఆ ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలాన్ని కింది ఏ సమీకరణంతో సూచిస్తారు?
ఎ) F = qvB sin                         బి) F = qvB cos
సి) F = qvB tan                        డి) F = qvB cot
జ‌: ఎ (F = qvB sin )

56. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఒక ఆవేశం కదిలితే θ విలువ
జ‌: 0
 

57. F, I, L, B ల మధ్య సంబంధం
జ‌: F = ILB
 

58. అయస్కాంత క్షేత్ర దిశకు, విద్యుత్ ప్రవాహ దిశకు మధ్యకోణం θ అయినప్పుడు విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం
జ‌: F = ILB sin 

59. విద్యుదయస్కాంత ప్రేరణ దృగ్విషయాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త?
జ‌: ఫారడే
 

60. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం గణితరూపం
జ‌: 

61. కిందివాటిలో సరికానిది
ఎ) φ = BA cos     బి)      సి) ε = Blv       డి) φ = qvB sin
జ‌: ఎ (φ = qvB sin

)

62. విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం
జ‌: విద్యుత్ మోటారు
 

63. మెత్తని ఇనుపకోర్‌పై చుట్టిన దీర్ఘచతురస్రాకారపు తీగచుట్ట
జ‌: ఆర్మేచర్
 

64. విద్యుత్ ప్రవహించే తీగచుట్ట ఏ విధంగా పనిచేస్తుంది?
జ‌: అయస్కాంతం
 

65. విద్యుత్ ప్రవహించే తీగచుట్ట వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశ ఏ విధంగా ఉంటుంది?
జ‌: తీగచుట్ట తలానికి లంబంగా
 

66. సవ్యదిశలో విద్యుత్ ప్రవాహం ఉన్న తీగచుట్ట ఏ ధృవంగా పనిచేస్తుంది?
జ‌: దక్షిణ ధృవం
 

67. అపసవ్యదిశలో విద్యుత్ ప్రవాహం ఉన్న తీగచుట్ట ఏ ధృవంగా పనిచేస్తుంది?
జ‌: ఉత్తర ధృవం
 

68. శక్తి జనకం కాకుండా విద్యుత్ మోటారులో ఉండే ప్రధాన భాగం 
ఎ) కమ్యుటేటర్       బి) ఆర్మేచర్       సి) శాశ్వత అయస్కాంతం         డి) అన్నీ
జ‌: డి (అన్నీ)
 

69. విద్యుత్ ప్రవాహ దిశను మార్చేది
జ‌: కమ్యుటేటర్
 

70. విద్యుత్ మోటారులో ఆర్మేచర్ ఉపయోగం
జ‌: విద్యుత్ ప్రవాహ దిశను మారుస్తుంది.
 

71. విద్యుత్ మోటారు వేగం దేనిపై ఆధారపడుతుంది?
ఎ) తీగచుట్టలోని చుట్ల సంఖ్య           బి) తీగచుట్ట వైశాల్యం
సి) విద్యుత్ ప్రవాహం                      డి) అన్నీ
జ‌: డి (అన్నీ)
 

72. మోటారు వేగం ప్రమాణాలు
జ‌: r.p.m.
 

73. కిందివాటిలో దేన్ని పెంచి మోటారు వేగాన్ని పెంచవచ్చు?
ఎ) తీగచుట్ట వైశాల్యం                   బి) అయస్కాంత క్షేత్ర తీవ్రత
సి) విద్యుత్ ప్రవాహం                   డి) అన్నీ
జ‌: డి (అన్నీ)
 

74. గృహ వినియోగానికి వాడే మోటారు
జ‌: AC మోటారు
 

75. AC మోటారులో అవసరం లేనిది
జ‌: కమ్యుటేటర్
 

76. మోటారు వేగం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది?
జ‌: తీగచుట్టపై బలయుగ్మ భ్రామకానికి
 

77. కిందివాటిలో వాణిజ్య విద్యుత్ మోటారులో ఉపయోగించనిది
ఎ) మెత్తని ఇనుపకోర్ చుట్టూ చుట్టిన తీగచుట్ట
బి) ఆర్మేచర్‌ను తిప్పడానికి ఉపయోగించే విద్యుదయస్కాంతం
సి) విద్యుత్ ప్రవహించే తీగచుట్టలో అధిక సంఖ్యలో ఉండే వాహక తీగచుట్లు
డి) ఆర్మేచర్‌ను తిప్పడానికి ఉపయోగించే శాశ్వత అయస్కాంతం
జ‌: బి(ఆర్మేచర్‌ను తిప్పడానికి ఉపయోగించే శాశ్వత అయస్కాంతం)
 

78. విద్యుత్ మోటారు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
జ‌: విద్యుత్ ప్రవాహం ఉన్న తీగచుట్ట అయస్కాంత క్షేత్రంలో బలయుగ్మ భ్రామకానికి లోనవుతుంది.
 

79. డైనమో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
జ‌: విద్యుదయస్కాంత ప్రేరణ
 

80. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం
జ‌: డైనమో
 

81. తీగచుట్టలో అయస్కాంత అభివాహం మారుతున్నప్పుడు ఏర్పడేది
జ‌: e.m.f., విద్యుత్ ప్రవాహం
 

82. ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను ఏ సూత్రం తెలియజేస్తుంది?
జ‌: లెంజ్ నియమం
 

83. తీగచుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుందని తెలిపే నియమం
జ‌: లెంజ్ నియమం
 

84. AC, DC జనరేటర్‌ల మధ్య భేదం
జ‌: AC జనరేటర్‌లో స్లిప్‌రింగులు, DC జనరేటర్‌లో కమ్యుటేటర్‌లు ఉంటాయి.
 

85. AC జనరేటర్‌లో విద్యుత్ ప్రవాహదిశను మార్చేవి
జ‌: స్లిప్‌రింగులు
 

86. డైనమో యొక్క ఆర్మేచర్ భ్రమణ వేగాన్ని పెంచితే జనరేటర్ ఏర్పరిచే e.m.f.
జ‌: పెరుగుతుంది
 

87. డైనమోలో ఆర్మేచర్ తీగచుట్ట తలం అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా ఉన్నప్పుడు ప్రేరిత e.m.f. పరిమాణం
జ‌: గరిష్ఠం
 

88. డైనమోలోని ఆర్మేచర్ తీగచుట్ట తలం అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉన్నప్పుడు ప్రేరిత e.m.f. పరిమాణం
జ‌: శూన్యం
 

89. డైనమోలో e.m.f. ఏర్పరిచేది
జ‌: ఏకాంతర ప్రవాహం
 

90. AC డైనమోలో ఏర్పడేది
జ‌: ఏకాంతర విద్యుత్
 

91. ట్రాన్స్‌ఫార్మర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
జ‌: అన్యోన్య ప్రేరణ
 

92. ట్రాన్స్‌ఫార్మర్ దేనిపై ఆధారపడి పనిచేస్తుంది?
జ‌: ఏకాంతర ప్రవాహం
 

93. ట్రాన్స్‌ఫార్మర్ (విద్యుత్ నియంత్రిక)
జ‌: AC వోల్టేజిని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది.
 

94. AC వోల్టేజిని పెంచడానికి ఉపయోగపడే సాధనం
జ‌: స్టెప్ అప్ విద్యుత్ నియంత్రిక (ట్రాన్స్‌ఫార్మర్)
 

95. స్టెప్ - అప్ ట్రాన్స్‌ఫార్మర్‌లో
జ‌: గౌణ వేష్టనంలో చుట్ల సంఖ్య ప్రధాన వేష్టనంలోని చుట్ల సంఖ్య కంటే ఎక్కువ.
 

96. గౌణ వేష్టనంలో చుట్ల సంఖ్య, ప్రధాన వేష్టనంలోని చుట్ల సంఖ్య కంటే తక్కువగా ఉండే ట్రాన్స్‌ఫార్మర్
జ‌: స్టెప్ - డౌన్ ట్రాన్స్‌ఫార్మర్
 

97. విద్యుత్ దుర్వ్యయాలు లేని (విద్యుత్ నియంత్రిక) ట్రాన్స్‌ఫార్మర్
జ‌: ఆదర్శ ట్రాన్స్‌ఫార్మర్
 

98. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏ గుర్తుతో సూచిస్తారు?
జ‌: 

99. స్టెప్ - డౌన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దేనికి ఉపయోగిస్తారు?
జ‌: వోల్టేజిని తగ్గించడానికి
 

100. ట్రాన్స్‌ఫార్మర్ యొక్క ప్రాథమిక, గౌణ వేష్టనంలోని విద్యుత్ వోల్టేజిలు, ప్రవాహాల చుట్ల సంఖ్యల మధ్య ఉండే సంబంధం
జ‌: 

101. ట్రాన్స్‌ఫార్మర్‌లో శక్తి దుర్వ్యయాన్ని తగ్గించేది
జ‌: కోర్
 

102. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉపయోగించే కోర్‌ను స్తరితం చేయడానికి కారణం
జ‌: ఆవర్తిత ప్రవాహాలను తగ్గించడానికి
 

103. ట్రాన్స్‌ఫార్మర్ దక్షతను తెలియజేసేది
జ‌: 

104. భారతదేశంలో ఉపయోగించే AC వోల్టేజి పౌనఃపున్యం (హెర్ట్జ్‌లలో)
జ‌: 50
 

105. భారతదేశంలో గృహ వినియోగం కోసం సప్లయ్ చేసే వోల్టేజి (వోల్టుల్లో)
జ‌: 220
 

106. విద్యుత్ సామర్థ్యం ఏ వోల్టేజి వద్ద ప్రసారం అవుతుంది?
జ‌: 200 కిలో వోల్టులు, 132 కిలో వోల్టులు
 

107. విద్యుత్ సామర్థ్యాన్ని సరఫరా కేంద్రం నుంచి ఫీడర్ కేంద్రాలకు ఏ వోల్టేజిలో సరఫరా చేస్తారు? (కిలో వోల్టుల్లో)
జ‌: 33
 

108. విద్యుత్ సామర్థ్య ప్రసారాన్ని ఎక్కువ వోల్టేజి, తక్కువ విద్యుత్ ప్రవాహాలతో జరుపుతారు. దీనికి కారణం
జ‌: శక్తి నష్టాలను తగ్గించడానికి
 

109. విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై పనిచేసే పరికరం
ఎ) ఇండక్షన్ స్టవ్          బి) టేప్‌రికార్డర్             సి) ATM కార్డు            డి) అన్నీ
జ‌: డి ( అన్నీ)
 

110. కిందివాటిని జతపరచండి.
1) విద్యుత్ జనరేటర్ AC            a) విద్యుదయస్కాంత ప్రేరణ
2) సోలినాయిడ్                     b) రెండు స్లిప్ రింగులు
3) విద్యుత్ మోటారు                c) రెండు అర్ధ వలయాలు
4) విద్యుత్ జనరేటర్ DC            d) మెత్తటి ఇనుపకోర్
   జ‌: 1-b, 2-d, 3-a, 4-c

111. కిందివాటిని జతపరచండి.
1) ఇనుపకోర్                                 a) ట్రాన్స్‌ఫార్మర్
2) AC ఓల్టేజిని పెంచడం లేదా తగ్గించడం       b) విద్యుత్ మోటారు
3) యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడం       c) విద్యుత్ సామర్థ్య దుర్వ్యయాలను తగ్గించడం
4) విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చడం       d) డైనమో
జ‌: 1-c, 2-a, 3-d, 4-b

112. కిందివాటిని జతపరచండి.
1) మాక్స్‌వెల్ కార్కు స్క్రూ నియమం       a) ఇండక్షన్ స్టవ్
2) ఆంపియర్ కుడిచేతి నియమం           b) బలం దిశ
3) ఫ్లెమింగ్ ఎడమచేతి నియమం           c) అయస్కాంత బలరేఖల దిశ
4) విద్యుదయస్కాంత ప్రేరణ నియమం     d) అయస్కాంత క్షేత్ర దిశ
జ‌: 1-d, 2-c, 3-b, 4-a

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌