• facebook
  • whatsapp
  • telegram

వర్ధమాన భారతదేశం - విద్యావిధానం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. విద్యాపరంగా అసమానతలకు కారణం కానిది?
జ: పాఠశాలలో ఈ - లెర్నింగ్‌ ద్వారా బోధించకపోవడం

 

2. లింగ వివక్షతను రాజ్యం ప్రదర్శించకూడదని రాజ్యాంగంలోని ఏ ప్రకరణం పేర్కొంటుంది?
జ: 15(1)

 

3. స్త్రీ విద్యను పెంపొందించాలనే సిఫారసులో భాగంగా లైంగిక విద్యను బోధించాలని సూచించిన కమిటీ?
జ: హన్స్‌ మెహతా కమిటీ (1962)

 

4. జాతీయ సార్వత్రిక పాఠశాలను ఎప్పుడు స్థాపించారు?
జ: 1989

 

5. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ విద్య కోసం చేపట్టిన కార్యక్రమాలు?
  1) ఈసీఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం   2) మదర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయడం
  3) అక్షర సంక్రాంతి, బడిబాట, మళ్లీ బడికి లాంటి కార్యక్రమాలు  4) అన్నీ
జ: 4 (అన్నీ)

6. జనాభా విద్య కోసం భాషలు, సామాజిక శాస్త్రాలు, గణితం, విజ్ఞాన శాస్త్రం లాంటి విషయాలను బోధిస్తున్నప్పుడు సందర్భానుసారంగా బోధించడం అనేది ఏ ఉపగమం?
జ: సమైక్య ఉపగమం

 

7. కిందివాటిలో జనాభా పెరుగుదలకు కారణం కానిది?
1) మూఢనమ్మకాలు  2) బాల్య వివాహాలు
3) గర్భ నిరోధక విధానాలను పాటించడం  4) కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించకపోవడం
జ: 3 (గర్భ నిరోధక విధానాలను పాటించడం)

8. కిందివాటిలో జనాభా ఫలితం కానిది?
1) ఉపాధిరత                            2) కమతాల విఘటన
3) ఉద్యోగ అవకాశాలు పెరగడం      4) ఉపాధిరత, ఉద్యోగ అవకాశాలు పెరగడం
జ: 3 (ఉద్యోగ అవకాశాలు పెరగడం)

 

9. అర్థశాస్త్రాన్ని సంక్షేమ శాస్త్రంగా నిర్వచించింది?
జ: అమర్త్యసేన్‌

10. కిందివాటిని జతపరచండి.

i)  ఫ్యాక్టరీల చట్టం A) 1929
ii) వరకట్న నిషేధ చట్టం B) 1989
iii) బాల్య వివాహాల నిరోధక చట్టం C) 1961
iv) స్త్రీల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం D) 1948

 జ: i-D, ii-C, iii-A, iv-B
 

11. సమ్మిళిత విద్య నమూనాల్లో భాగంగా ‘యూనివర్సలైజేషన్‌’ సూత్రం ఆధారంగా పనిచేసే నమూనా?
జ: డ్యూయల్‌ టీచింగ్‌ నమూనా

 

12. కిందివాటిలో భిన్నమైన సామర్థ్యాలున్న బాలల విద్యకు సంబంధించనిది?
1) సమ్మిళిత విద్య            2) వికలాంగులకు సమైక్య విద్య
3) ప్రత్యేక విద్య                 4) సృజనాత్మక విద్య
జ: 4 (సృజనాత్మక విద్య)

 

13. సమ్మిళిత విద్యలో వ్యూహాత్మక బోధనలో భాగంగా విద్యార్థులకు అందించే పొగడ్త, చిరునవ్వు, అభినందన, కౌగిలింత అనేవి ఏ పునర్బలనాలు?
జ: సాంఘిక పునర్బలనం

 

14. మన రాష్ట్రంలో ప్రాథమిక తరగతులకు మధ్యాహ్న భోజన పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?
జ: 2003, జనవరి

 

15. మనదేశంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం?
జ: తమిళనాడు

 

16. చదవడం, చదివింది గ్రహించడంలో లోపం ఉంటే దాన్ని ఏమంటారు?
జ: డిస్‌లెక్సియా

 

17. ‘ఆల్బినిజం’ అంటే?
జ: ఒక రంగు కనిపించకపోవడం

 

18. VAKT పద్ధతి ద్వారా సరిచేయ గల వైకల్యం?
జ: అభ్యసన వైకల్యం

 

19. కిందివాటిని జతపరచండి.

i) మెల్లకన్ను A) కాటరాక్ట్‌
ii) కంటి మసక B) తనలోతాను
iii) ఆటిజం C) కండరాలు బిగుసుకుపోవడం
iv) అసమ్యత D) స్ట్రాబిస్‌మస్

జ: i-D, ii-A, iii-B, iv-C
 

20. ప్రజ్ఞాలబ్ధి స్థాయి 50 − 70 మధ్య ఉండేవారు ఏవిధమైన మానసిక వైకల్యాన్ని కలిగి ఉంటారు?
జ: తక్కువ మానసిక వైకల్యం

 

21. కౌమర దశకు చెందినవారి సమస్యలను పరిష్కరించే జ్ఞానంతో పాటు, కిషోర బాలికల్లో ప్రత్యుత్పత్తి లైంగిక విద్యకు సంబంధించిన పథకం/పథకాలు
జ: Adolescene Education Programme, Adolescent Reproductive Sexual Health

 

22. కిందివాటిలో భిన్నమైన సామర్థ్యాలు కలిగిన పిల్లలకు ఉపకరించనిది?
1) విభిన్న ఆలోచనా విద్య     2) సమ్మిళిత విద్య    3) ప్రత్యేక విద్య     4) సమైక్య విద్య
జ: 1 (విభిన్న ఆలోచనా విద్య)

 

23. ఏ తరహా సమ్మిళిత విద్యా నమూనాలో ఉపాధ్యాయుడొక్కడే సాధారణ విద్యార్థులకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధిస్తాడు?
జ: డ్యూయల్‌ టీచింగ్‌ నమూనా

 

24. కొంత మంది పిల్లలు ఇతరులతో కలవకుండా ఉండటాన్ని ‘ఆటిజమ్‌’ అంటారు. ఈ పదం ‘ఆటోస్‌’ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది?
జ: గ్రీకు

 

25. యునెస్కో, యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో కౌమర దశ బాలబాలికలకు మూడు రంగాల్లో సూచించిన జీవన నైపుణ్యాలు
జ: 10
 

26. ‘ఎమైనో ఆసిడ్‌ ఫినైల్‌ అలెనిన్‌’ ఎంజైమ్‌ లోపం వల్ల కలిగే మానసిక లోపం?
జ: ఫినైల్‌ క్విటో న్యూరియా

 

27. సాధారణంగా పిల్లల్లో శాబ్దిక పఠనం లేదా నిశ్శబ్ద పఠనం ద్వారా సమస్యలు ఎదురవడమనేది ఏ రకమైన అభ్యసనా వైకల్యం?
జ: డిస్‌లెక్సియా

 

28. పిల్లల్లో రంగులను గుర్తించలేని అందత్వాన్ని ఏమంటారు? (దీన్ని ప్రాథమిక తరగతుల్లో గమనించవవచ్చు)
జ: ఆల్బినిజం

 

29. పిల్లల్లో ఎన్ని డెసిబుల్స్‌ శబ్ద తీవ్రతను వినలేనివారిని బధిరులుగా భావించాలి?
జ: 60, అంతకంటే ఎక్కువ

 

30. ‘డిస్‌ఫేసియా’ అంటే
జ: పిల్లలు తమ భావాలను స్నేహితులతో వ్యక్తపరచలేకపోవడం.

 

31. సాధారణ దృష్టి క్షేత్రం ఎంత?
జ: 180°

 

32. ‘పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్)’ ఎక్కడ ఉంది?
జ: న్యూదిల్లీ

 

33. పిల్లలకు పర్యావరణం గురించి బోధించడం అనేది ఏ లక్ష్యసాధనకు చెందింది?
1) పిల్లల్లో పర్యావరణం పట్ల మంచి వైఖరిని పెంపొందించడం. 
2) పర్యావరణం గురించి అవగాహన
3) పిల్లల్లో పర్యావరణం పట్ల మంచి వైఖరిని పెంపొందించడం, పర్యావరణం గురించి అవగాహన
4) ఏదీకాదు
జ: 3 (పిల్లల్లో పర్యావరణం పట్ల మంచి వైఖరిని పెంపొందించడం, పర్యావరణం గురించి అవగాహన)

 

34. 'VAKT' బోధనా విధానంలో A దేన్ని తెలియజేస్తుంది?
జ: వినికిడి

 

35. మానవుడి జీవితంలో విద్య అతిముఖ్యమైన, విలువైన మూలధనం అని పేర్కొన్నవారు?
జ: మార్షల్‌

 

36. ‘ఎలిమెంటరీ స్థాయి బాలికా విద్యాకార్యక్రమం’ అని దేన్ని పేర్కొంటారు?
జ: NPEGEL

 

37. విద్యార్థులు ఉపాధ్యాయుడు బోధించే సమయంలో 86కు బదులుగా తమ పుస్తకంలో 68 అని రాసుకున్నారు. దీన్ని ఏ విధమైన వైకల్యంగా చెప్పవచ్చు?
జ: డిస్‌కాల్కులియా

 

38. ‘అభ్యసనా వైకల్యం’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
జ: సామ్యూల్‌ కిర్క్‌

 

39. ‘జాతీయ జనాభా విధానం - 2000’ లక్ష్యం?
1) మాతాశిశు ఆరోగ్య సేవల విస్తరణ     2) మాతాశిశు మరణాల రేటు తగ్గించడం
3) చిన్నకుటుంబ ప్రోత్సాహం                4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

40. కిందివాటిలో జీవన నైపుణ్యానికి చెందిన అంశం?
1) సృజనాత్మక ఆలోచన              2) వ్యక్తిగత అవగాహన
3) సమస్యా పరిష్కారం                 4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

41. విద్య, ఆరోగ్యం, సంపద గురించి ప్రపంచదేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడటాన్ని ఏమంటారు?
జ: ప్రపంచీకరణ

 

42. బాలికల్లో గుణాత్మక విద్యను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికల మధ్య వివక్షతను తగ్గించడం లాంటి లక్ష్యాలు గల పథకం
జ: KGBV

43. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడానికి 2015 - 16 విద్యా సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించిన పథకం?
జ: రాష్ట్రీయ ఆవిష్కార్‌ అభియాన్‌

 

44. ‘రాష్ట్రీయ ఆవిష్కార్‌ అభియాన్‌’ పథకం ఏ వయసు కలిగిన పిల్లల్లో సైన్స్, టెక్నాలజీ, గణితంకు సంబంధించిన అంశాలను పెంచడానికి నిర్దేశించింది?
జ: 6 - 18 సంవత్సరాలు

 

45. ‘రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌’ అనేది
జ: కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి పథకం

 

46. చలన వైకల్యానికి సంబంధించి ఏ పక్షవాతంలో కండరాలు బిగుసుకుపోవడం వల్ల అవయవాలను కదల్చలేరు?
జ: అథమ్యత

 

47. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 దేన్ని తెలియజేస్తుంది?
జ: చట్టం ముందు అందరూ సమానులే

Posted Date : 27-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు