• facebook
  • whatsapp
  • telegram

విజింజింలో మొదటి అలల శక్తి కేంద్రం!

శక్తి వనరులు

మనిషి రోజువారీ కార్యకలాపాల నుంచి దేశ ప్రగతి వరకు ప్రతిపనికీ శక్తి వనరులైన విద్యుత్తు, ఇంధనాలు కావాలి. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలకు ఇవి అత్యంత అవసరం. అందుకే వాటి ఉత్పత్తి వీలైనంత ఎక్కువగా జరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా సంప్రదాయ, సంప్రదాయేతర పద్ధతుల్లో విద్యుదుత్పత్తి కేంద్రాలు వేగంగా విస్తరిస్తున్నాయి. థర్మల్, జల, అణు విద్యుత్తుతో పాటు చమురుశుద్ధి కేంద్రాల్లో ప్రధానమైనవి, ప్రత్యేకమైనవి, సామర్థ్యపరంగా పెద్దవి ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రాల వారీగా అభ్యర్థులు తెలుసుకోవాలి. సౌర, వాయు, సముద్ర అలలు, భూతాప ఆధారితంగా విద్యుదుత్పత్తి విధానాలతో పాటు వీటి ఉత్పత్తి, నియంత్రణ, సమన్వయం కోసం ఏర్పాటైన జాతీయ సంస్థలు, వాటి విధులు, ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాలపై తగిన అవగాహనతో ఉండాలి.

1.    యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?    

1) రాంచి     2) జాదుగూడ 

3) కోల్‌కతా      4) చెన్నై


2.     భారతదేశంలో మొదటి న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ ఏది?

1) నరోరా 2) కైగా 3) కల్పకం  4) తారాపుర్‌


3.     కాక్రపారా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) రాజస్థాన్‌     2) గుజరాత్‌ 

3) మధ్యప్రదేశ్‌     4) మహారాష్ట్ర


4. భారతదేశంలో మొదటి న్యూక్లియర్‌ రియాక్టర్‌ ఏది?

1) కామిని  2) అప్సర  3) నరోరా  4) కైగా


5. కైగా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌     2) కర్ణాటక 

3) కేరళ     4) తమిళనాడు


6. భారతదేశంలో మొదటి అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?

1) 1970  2) 1950  3) 1969  4) 1959


7.     ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1969  2) 1971  3) 1957  4) 1956


8.     నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ)ను ఎప్పుడు ప్రారంభించారు?

1) 1974  2) 1964  3) 1975  4) 1981


9. సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఎంత?

1) 500 మె.వా. 2) 700 మె.వా. 

3) 200 మె.వా. 4) 1000 మె.వా. కంటే ఎక్కువ


10. కహల్‌గావ్‌ సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?    

1) ఉత్తర్‌ప్రదేశ్‌     2) మధ్యప్రదేశ్‌ 

3) రాజస్థాన్‌     4) బిహార్‌


11. ముంద్రా ఆల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌     2) మధ్యప్రదేశ్‌ 

3) మహారాష్ట్ర     4) ఉత్తర్‌ప్రదేశ్‌


12. ఆల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్ట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?    

1) 2000 మె.వా.     2) 3000 మె.వా. 

3) 4000 మె.వా.     4) 1000 మె.వా.


13. విజ్జేశ్వరం సహజ వాయు ఆధారిత విద్యుత్తు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?

1) పశ్చిమ గోదావరి        2) తూర్పు గోదావరి  

3) విశాఖపట్నం      4) విజయనగరం


14. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి సహజవాయు ఆధారిత విద్యుత్తు కేంద్రం ఏది?

1) జేగూరుపాడు      2) ఊంచాహర్‌      

3) విజ్జేశ్వరం       4) కవాస్‌


15. ససన్‌ ఆల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌        2) మహారాష్ట్ర    

3) కర్ణాటక      4) మధ్యప్రదేశ్‌


16. తాల్చేరు సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఒడిశా        2) గుజరాత్‌   

3) కర్ణాటక       4) కేరళ


17. విజ్జేశ్వరం సహజవాయు విద్యుత్తు కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    

1) 1960      2) 1970      3) 1980       4) 1990


18. ఏ అణు విద్యుత్తు కేంద్రం ద్వారా ఢిల్లీ నగరానికి విద్యుత్తు సరఫరా జరుగుతుంది?

1) నరోరా        2) కాక్రపారా     

3) రావత్‌భట       4) తారాపుర్‌


19. ‘కామిని’ అణు రియాక్టర్‌ ఏ అణు విద్యుత్తు కేంద్రంలో ఉంది?

1) కాక్రపారా 2) కైగా  3) కల్పకం   4) నరోరా


20. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్తు కేంద్రం ఏది?

1) తారాపుర్‌  2) రావత్‌భట 3) కల్పకం 4) నరోరా


21. ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఎక్కడ ఉంది?

1) ముంబయి        2) కోల్‌కతా    

3) చెన్నై        4) హైదరాబాద్‌


22. భారతదేశంలో మొదటి జల విద్యుత్తు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) శివసముద్రం         2) నాథ్‌పా ఝాక్రీ   

3) తెహ్రీ       4) భాక్రానంగల్‌


23. అణువిద్యుత్తు కర్మాగారంలో భారజలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు?

1) శీతలకారిణి         2) క్షయకారిణి      

3) మితకారిణి         4) ఆక్సీకరణి


24. కాక్రపారా అణువిద్యుత్తు కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1995     2) 1991      3) 1973       4) 1993


25. భారతదేశంలో మొదటి భూతాప విద్యుత్తు కేంద్రం ఏది?

1) పూగా లోయ - లద్దాఖ్‌ 2) తాతాపాని - ఒడిశా

3) తపోవన్‌ - ఉత్తరాఖండ్‌    4) మణికరణ్‌ - హిమాచల్‌ప్రదేశ్‌


26. భారతదేశంలో మొదటి పవన విద్యుత్తు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? 

1) విజింజిం - కేరళ   2) మాండవి - గుజరాత్‌

3) సతారా - మహారాష్ట్ర 4) కోట - రాజస్థాన్‌


27. భారతదేశంలో మొదటి అలల శక్తి కేంద్రం ఏది?

1) సతారా - మహారాష్ట్ర  2) మాండవి - గుజరాత్‌

3) విజింజిం - కేరళ   4) ముప్పాండళ్‌ - తమిళనాడు


28. మనదేశంలో మొదటి తరంగ విద్యుత్తు కేంద్రం ఎక్కడ ఉంది?

1) మాండవి - గుజరాత్‌        2) కాండ్ల - గుజరాత్‌

3) సతారా - మహారాష్ట్ర    4) విజింజిం - కేరళ


29. ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ కన్వర్షన్‌ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?

1) మాండవి - గుజరాత్‌        2) కొచ్చి - కేరళ

3) మణికరణ్‌ - హిమాచల్‌ప్రదేశ్‌    4) ట్యూటికోరిన్‌ - తమిళనాడు


30. కిందివాటిలో సంప్రదాయక శక్తివనరులకు సంబంధించనిది?

1) థర్మల్‌ విద్యుత్తు     2) అణువిద్యుత్తు    

3) జలవిద్యుత్తు      4) ఏదీకాదు


31. భారతదేశంలో మొదటి సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

1) కల్యాణ్‌పుర్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌   2) కోట - రాజస్థాన్‌

3) జబల్‌పుర్‌ - మధ్యప్రదేశ్‌  4) నాగ్‌పుర్‌ - మహారాష్ట్ర


32. కైగా అణువిద్యుత్తు కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 2001   2) 2004    3) 2000 4) 2002


33. ‘యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1967   2) 1970   3) 1969   4) 1975


34. గిర్యా ఆల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌    2) మహారాష్ట్ర    

3) కర్ణాటక    4) కేరళ


35. తాద్రి ఆల్ట్రామెగా పవర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) కర్ణాటక    2) బిహార్‌    

3) గుజరాత్‌    4) ఉత్తర్‌ప్రదేశ్‌


36. కోర్బా సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌      2) గుజరాత్‌  

3) ఛత్తీస్‌గఢ్‌     4) మహారాష్ట్ర


37. భారతదేశంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

1) అస్సాం     2) కేరళ 

3) మహారాష్ట్ర     4) మధ్యప్రదేశ్‌


38. నరోరా అణువిద్యుత్తు కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1991  2) 2000  3) 1984  4) 1969


39. బరౌనీ చమురు శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది?

1) రాజస్థాన్‌      2) మహారాష్ట్ర  

3) బిహార్‌     4) మధ్యప్రదేశ్‌


40. సీపట్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌     2) మహారాష్ట్ర 

3) ఛత్తీస్‌గఢ్‌     4) బిహార్‌


41. దాద్రి గ్యాస్‌ ఆధారిత థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌     2) మధ్యప్రదేశ్‌     

3) రాజస్థాన్‌      4) హరియాణా


42. ఫరక్కా సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) పశ్చిమబెంగాల్‌     2) బిహార్‌ 

3) మధ్యప్రదేశ్‌     4) మహారాష్ట్ర


43. తిలయా ఆల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఝార్ఖండ్‌      2) గుజరాత్‌  

3) ఛత్తీస్‌గఢ్‌      4) బిహార్‌


44. కర్ణాటకలో శివసముద్రం వద్ద జల విద్యుత్తు కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1900  2) 1901   3) 1902  4) 1904


45. నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1975  2) 1985  3) 1995  4) 1965


46. మనదేశంలో అతిచిన్న చమురుశుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?

1) నుయాలీఘర్‌      2) తాటిపాక  

3) కొచ్చి      4) నాగపట్నం


47. హజీరా భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర      2) గుజరాత్‌  

3) మధ్యప్రదేశ్‌      4) రాజస్థాన్‌


48. అణువిద్యుత్తు ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం?

1) కర్ణాటక      2) తమిళనాడు 

3) గుజరాత్‌      4) ఉత్తర్‌ప్రదేశ్‌


49. ప్రపంచంలో అణువిద్యుత్తులో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?

1) రష్యా   2) ఫ్రాన్స్‌   3) ఇటలీ   4) జర్మనీ


50. అధిక సంఖ్యలో అణురియాక్టర్లు ఉన్న రాష్ట్రం ఏది?

1) తమిళనాడు   2) కర్ణాటక  

3) రాజస్థాన్‌    4) ఉత్తర్‌ప్రదేశ్‌



సమాధానాలు

1-2; 2-4; 3-2; 4-2; 5-2; 6-3; 7-4; 8-3; 9-4; 10-4; 11-1; 12-3; 13-1; 14-2; 15-4; 16-1; 17-4; 18-1; 19-3; 20-3; 21-4; 22-1; 23-3; 24-4; 25-4; 26-2; 27-3; 28-2; 29-4; 30-3; 31-1; 32-3;  33-1; 34-2; 35-1; 36-3; 37-1; 38-1; 39-3; 40-3; 41-1; 42-1;  43-1; 44-3; 45-1; 46-2; 47-2; 48-2; 49-2; 50-3.


రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌