• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

1. పర్యావరణంలో ఉన్న ఆవరణాల సంఖ్య ఎంత?
జ: 4
 

2. పర్యావరణంలో ఉండేది
A) వాతావరణం     B) జలావరణం     C) శిలావరణం, జీవావరణం       D) అన్నీ
జ: D (అన్నీ)
 

3. భూమిని ఆవరించి ఉన్న గాలిపొర
జ: వాతావరణం
 

4. వాతావరణంలో ప్రధానంగా ఉండే ఖండాల సంఖ్య ఎంత?
జ: 4
 

5. కిందివాటిని జతపరచండి. 

విభాగం విస్తరించిన ఎత్తు (కి.మీ.)
1) ట్రోపో ఆవరణం a) 50 - 85
2) స్ట్రాటో ఆవరణం b) 85 - 500
3) మీసో ఆవరణం c) 0 - 11
4) థర్మో ఆవరణం d) 11 - 50

 జ: 1-c, 2-d, 3-a, 4-b
 

6. వాతావరణంలోని ట్రోపో ఆవరణ విభాగంలో ఉండే ఉష్ణోగ్రతల అవధి సుమారుగా
జ: 15°C నుంచి 56°C
 

7. కిందివాటిని జతపరచండి.

విభాగం ఉష్ణోగ్రత (°C)
1) మీసో ఆవరణం a) 15°C నుంచి 56°C
2) ట్రోపో ఆవరణం b) -56°C నుంచి -2°C
3) థర్మో ఆవరణం c) -2°C నుంచి -92°C
4) స్ట్రాటో ఆవరణం d) -92°C నుంచి 1200°C

జ: 1-c, 2-a, 3-d, 4-b
 

8. వాతావరణంలోని ట్రోపో ఆవరణ విభాగంలో ఉండే ముఖ్యమైన రసాయన పదార్థాలు ఏవి?
జ: N2, O2, H2O, CO2
 

9. వాతావరణంలోని థర్మో ఆవరణ విభాగంలో ఉండే ముఖ్యమైన రసాయన పదార్థాలు ఏవి?
జ: O2+, O+, NO+
 

10. వాతావరణంలోని ఏ భాగంలో ఓజోన్ పొర ఉంటుంది?
: స్ట్రాటో ఆవరణం
 

11. మానవ కార్యకలాపాల కారణంగా, సహజ సమృద్ధి కంటే అధిక పరిమాణాల్లో ప్రకృతిలోకి ప్రవేశించి జీవరాశులు, మానవులపై దుష్ప్రభావాన్ని ప్రదర్శించే ప్రక్రియను ఏమంటారు?
జ: కాలుష్యం
 

12. కాలుష్యం ద్వారా దుష్ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని ఏమంటారు?
జ: గ్రాహకం
 

13. చాలాకాలం నిలిచి ఉండే కాలుష్యాన్ని తనలో ఉంచుకుని దాంతో అన్యోన్య చర్య జరిపే మాధ్యమాన్ని ఏమంటారు?
జ: సింక్
 

14. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌కు సింక్‌లుగా ఉండేవి?
జ: మహాసముద్రాలు
 

15. ఆరోగ్యవంతుడైన పారిశ్రామిక కార్మికుడు 8 గంటల పనికాలంలో వాతావరణంలోని విష స్వభావ కాలుష్యానికి గురైనప్పటికీ, తాను ఎటువంటి హానికర ప్రభావానికి గురికాకుండా ఉండేందుకు ఆమోదించిన విష కాలుష్య కనిష్ఠ పరిమాణాన్ని ఏమంటారు?
జ: TLV
 

16. కలుషిత నీటిలో కరిగి ఉన్న కర్బన రసాయన పదార్థాలను ఆక్సీకరణం చెందించేందుకు అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని ఏమంటారు?
జ: COD
 

17. నీటిలో ఉండే కొన్ని ప్రత్యేక సూక్ష్మజీవులు 20°C వద్ద అయిదు రోజుల కాలవ్యవధిలో ఉపయోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని ఏమంటారు?
జ: BOD

18. శుద్ధ నీటి BOD విలువ
జ: 5 ppm
 

19. BOD ని వ్యక్తపరిచేందుకు అవసరమయ్యే కాలవ్యవధి.
జ: 5 రోజులు
 

20. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: జూన్ 5
 

21. 1984లో భోపాల్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది?
జ: మిథైల్ ఐసోసైనేట్
 

22. పాదరస కాలుష్యం వల్ల కలిగే వ్యాధి
జ: మినిమాటా
 

23. గాలి అధిక పరిమాణంలో ఉండి నీటిఆవిరి, మేఘాల్లో ఉన్న సంక్షోబిత కణమయ మండలాన్ని ఏమంటారు?
జ: ట్రోపో ఆవరణం
 

24. కిందివాటిలో వాయుస్థితి గాలి కాలుష్యాలు ఏవి?
A) సల్ఫర్, నైట్రోజన్, కార్బన్‌ల ఆక్సైడ్‌లు     B) హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రో కార్బన్‌లు
C) ఓజోన్, ఆక్సీకరణులు                              D) అన్నీ
జ: D (అన్నీ)
 

25. కిందివాటిలో కణస్థితి కాలుష్యాలు ఏవి?
A) దుమ్ము, పొగమంచు          B) ధూమాలు, పొగ      C) స్మాగ్       D) అన్నీ
జ: D (అన్నీ)
 

26. మానవుల్లో ఉబ్బసం, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లోని వాయుగోళాల వాపు వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వాయువు
జ: SO2
 

27. రవాణా వాహనాల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద శిలాజ ఇంధనాలు మండించినప్పుడు ఏర్పడే వాయువులు ఏవి?
జ: NO, NO2
 

28. అధిక పరిమాణాల్లో ఉండే ఏ వాయువు మొక్కల ఆకులను పాడుచేసి, కిరణజన్య సంయోగక్రియ రేటును తగ్గిస్తుంది?
జ: NO2
 

29. కిందివాటిలో కార్సినోజెనిక్ పదార్థాలు
A) కార్బన్ ఆక్సైడ్‌లు    B) హైడ్రో కార్బన్‌లు     C) ఫ్లోరో కార్బన్‌లు     D) నైట్రోజన్ ఆక్సైడ్‌లు
జ: B (హైడ్రో కార్బన్‌లు)
 

30. మొక్కలు వాడిపోవడం, కణజాలాలు విచ్ఛిన్నం కావడం, ఆకులు, పువ్వులు, చిగుళ్లు రాలిపోవడం ద్వారా మొక్కలకు హాని కలగజేసేది?
జ: హైడ్రో కార్బన్‌లు
 

31. వాహనాల్లో శిలాజ ఇంధనాలు అసంపూర్ణ దహన చర్యకు గురైనప్పుడు వెలువడే వాయువు ఏది?
జ: CO
 

32. మానవశరీరంలో అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్‌ను చేరవేసే ప్రక్రియను అడ్డుకునే వాయువు ఏది?
జ: CO
 

33. వాతావరణంలో CO2 ఘనపరిమాణ శాతం ఎంత?
జ: 0.03%
 

34. శిలాజ ఇంధనాలను మండించడం, శ్వాసక్రియ, మోలాసిస్ కిణ్వన ప్రక్రియ, సున్నపురాయి విఘటనం చెందించడం లాంటి ప్రక్రియలో వెలువడే వాయువు ఏది?
జ: CO2
 

35. అద్దకపు రంగు తయారీ, ఎరువుల పరిశ్రమల్లో నుంచి వెలువడే కాలుష్య కారకం ఏది?
జ: అమ్మోనియా
 

36. బ్లాస్టు ఫర్నేస్, రసాయన లోహ ప్లేటింగ్ నుంచి వెలువడే కాలుష్య కారకం ఏది?
జ: హైడ్రోజన్ సయనైడ్
 

37. కిందివాటిలో హరితగృహ వాయువులు ఏవి?
A) నైట్రస్ ఆక్సైడ్, నీటిఆవిరి    B) ఓజోన్, మీథేన్    C) CO2, CFC      D) అన్నీ
జ: D (అన్నీ)
 

38. కుళ్లిన పదార్థాలు, చెత్తకుప్పలు, పెంటపోగులు, వరిపొలాల నుంచి వెలువడే హరితగృహ వాయువు ఏది?
జ: మీథేన్
 

39. ద్రవీకరణాలు, ఫోమ్‌ల నుంచి వెలువడే హరితవాయువు ఏది?
జ: CFC 12
 

40. వాతావరణంలో మీథేన్ జీవితకాలం ఎంత?
జ: 12 - 15 సంవత్సరాలు
 

41. వాతావరణంలో CFC జీవితకాలం ఎంత?
జ: 102 సంవత్సరాలు
 

42. హరితగృహ ప్రభావాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: జోసెఫ్ ఫోరియర్
 

43. కిందివాటిలో హరితగృహ వాయువు కానిది ఏది?
A) CO2          B) N2O         C) O3           D) N2
జ: D (N2)
 

44. హరితగృహ ప్రభావాన్ని తగ్గించే చర్య ఏది?
A) చెట్లను, అడవులను పెంచడం      
B) నీటిని, విద్యుత్‌ను, శిలాజ ఇంధనాలను పొదుపుగా వాడుకోవడం
C) పంట పొలాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టకుండా, వాటిని కంపోస్ట్‌గా మార్చి వాడుకోవడం
D) అన్నీ సరైనవే
జ: D (అన్నీ సరైనవే)
 

45. వాతావరణంలో హరితగృహ వాయువులు CO2, CH4, NO, O3, H2O ల శాతం
జ: 1%
 

46. ప్రకృతిలో సహజంగా ఉండని హరితగృహ వాయువు ఏది?
జ: పర్‌ఫ్లోరో మీథేన్
 

47. పారిశ్రామికీకరణ ప్రారంభమైన 150 సంవత్సరాల్లో వాతావరణంలో CO2 సాంద్రత ఎంత శాతం పెరిగింది?
జ: 31%
 

48. నేలబొగ్గు కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే CO2 శాతం ఎంత?
జ: 35%
 

49. గ్రీన్‌హౌస్ వాయువుల జాబితాలోకి కొత్తగా చేరిన వాయువు ఏది?
జ: పర్‌ఫ్లోరో మీథేన్, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్
 

50. ఆమ్లవర్షపు నీటి pH విలువ
జ: 1.5 - 5.0
 

51. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువులు
A) SO2, SO3        B) CO2          C) NO, NO2           D) అన్నీ
జ: D (అన్నీ)
 

52. ఆమ్ల వర్షాలు ఎన్ని రకాలు?
జ: 2
 

53. ఆమ్ల వర్షాల కారణంగా చెరువులు, సరస్సుల్లోని నీటి pH విలువ
జ: తగ్గుతుంది
 

54. వాతావరణంలో సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్‌లను విడుదల చేసే భిన్న రకాల మానవ కార్యకలాపాల అనుజనితమే
జ: ఆమ్ల వర్షం
 

55. ఆమ్ల వర్షాల వల్ల సరస్సుల్లో ఆమ్లత్వం పెరిగినప్పుడు ఆమ్లాలు సరస్సులోని రేగడి మట్టితో రసాయనిక చర్య జరిపి విడుదల చేసే అయాన్‌లు ఏవి?
జ: Al+3
 

56. సాల్మాన్, ట్రవుట్ చేప జాతులు పూర్తిగా కనుమరుగై పోవడానికి కారణం
జ: ఆమ్ల వర్షాలు
 

57. ఆకులపై ఉన్న పత్రహరితం నశించి తెల్లగా మారి కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగకుండా పంట దిగుబడి తగ్గిపోవడానికి కారణం?
జ: జల కాలుష్యం
 

58. ఆగ్రాలోని తాజ్‌మహల్ కట్టడం ఆమ్ల వర్షాల వల్ల వన్నె కోల్పోవడానికి కారణమయ్యే వాయువు ఏది?
జ: SO2
 

59. మానవుల్లో చర్మక్యాన్సర్ వ్యాధికి కారణమయ్యేవి?
జ: UV - కిరణాలు
 

60. ఓజోన్ పొర తరిగిపోవడానికి ముఖ్య కారణం?
జ: CFC
 

61. ఒక CFC అణువు ఎన్ని O3 అణువులను నాశనం చేస్తుంది?
జ: 1,00,000      
 

62. ఓజోన్‌కి పడిన రంధ్రాన్ని శాస్త్రవేత్తలు అంటార్కిటికా ప్రాంతంలో ఎప్పుడు గుర్తించారు?
జ: 1986
 

63. కంటి శుక్లాలు, చర్మం వడిలిపోవడం, చర్మంపై బొబ్బలు ఏర్పడటం వంటి సమస్యలకు కారణం?
జ: ఓజోన్ పొర తగ్గడం
 

64. పిచికారీ ద్రవాల్లోని కణాలు, గాలిలోని బాష్పాలు ద్రవీకరణం చెందడం ద్వారా ఏర్పడేవి?
జ: మిస్ట్‌లు
 

65. ఉత్పతనం, స్వేదనం, బాష్పీభవనం, ఇతర రసాయన ప్రక్రియల్లోని బాష్పాల ద్వారా ఏర్పడేవి?
జ: ధూమాలు
 

66. ప్రపంచంలోని చాలా పట్టణాల్లో ఏ రకమైన గాలి కాలుష్యం కనిపిస్తుంది?
జ: స్మాగ్
 

67. కాంతి రసాయన స్మాగ్‌లో సాధారణంగా ఉండే అనుఘటకాలు ఏవి?
A) ఓజోన్, ఫార్మాల్డిహైడ్             B) నైట్రిక్ ఆక్సైడ్, ఎక్రోలిన్  
C) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్‌లు, ఫార్మాల్డిహైడ్      D) అన్నీ
జ: D (అన్నీ)
 

68. కిందివాటిలో శక్తివంతమైన కంటి ప్రకోపాలు ఏవి?
A) ఓజోన్, PAN     B) ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్‌లు     C) ఎక్రోలిన్, ఫార్మాల్డిహైడ్     D) అన్నీ
జ: A (ఓజోన్, PAN)
 

69. ముక్కు, గొంతులను ప్రకోపానికి గురి చేసేవి ఏవి?
జ: ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్‌లు
 

70. రబ్బరు బీటలు ఏర్పడేందుకు, లోహాలు, రాళ్లు, నిర్మాణ వస్తువుల ఉపరితలాల క్షీణతకు కారణం?
జ: కాంతి రసాయన స్మాగ్
 

71. సాధారణంగా నీటికి ఉన్న మంచి లక్షణాలకు భంగం వాటిల్లడాన్ని ఏమంటారు?
జ: నీటి కాలుష్యం
 

72. చీడ, క్రిమి సంహారకాలు, రసాయన వ్యర్థ పదార్థాల్లోని ఏ పదార్థం ద్వారా ప్రధానంగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది?
జ: ఆర్సెనిక్
 

73. థర్మల్, న్యూక్లియర్ శక్తి ఉత్పత్తి కేంద్రాలు; రోదసి పరిశ్రమల నుంచి వెలువడే ఏ విష పదార్థం జల కాలుష్యానికి కారణం అవుతుంది?
జ: బెరీలియం
 

74. లెడ్ విష ప్రభావం మానవ శరీరంపై ఏ విధంగా ఉంటుంది?
జ: రక్తక్షీణత; మూత్రపిండాలు, నాడీమండల క్షీణత
 

75. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం ఎంతకంటే తక్కువగా ఉంటే చేపల పెరుగుదలను నిరోధించవచ్చు?
జ: 6 ppm
 

76. గరిష్ఠ స్థాయిలో కాలుష్యాన్ని ప్రదర్శించే నీటి BOD విలువ ఎంత?
జ: 17 ppm లేదా అంతకంటే ఎక్కువ
 

77. కిందివాటిలో కార్సినోజెనిక్ పదార్థం ఏది?
A) డిటర్జెంట్‌లు       B) ఎరువులు        C) CFC       D) PCB
జ: D (PCB)
 

78. కిందివాటిలో నీటికాలుష్య లక్షణం ఏది?
A) తాగే నీటి రుచి పాడవడం                           
B) నీటిలో కలుపు మొక్కలు పెరగడం
C) సాగరం, నదుల, సరస్సుల తీరాలు ఘాటైన దుర్వాసనను వెదజల్లడం
D) అన్నీ సరైనవే
జ: D (అన్నీ సరైనవే)
 

79. తాగేనీటిలో ఉండే లోహ కాలుష్య అత్యధిక అవధి
జ: 0.005 మిల్లీ.గ్రా/ఘ.మీ.
 

80. తాగేనీటిలో ఉండే Fe అత్యధిక అవధి (ppm లలో)
జ: 0.2
 

81. తాగేనీటిలో ఉండే Cu అత్యధిక అవధి (ppm లలో)
జ: 3.0
 

82. తాగేనీటిలో ఫ్లోరైడ్ అయాన్ గాఢత ఎంత ఉండే విధంగా ద్రావణీయ ఫ్లోరైడ్‌ను నీటికి కలుపుతారు?
జ: 1 ppm
 

83. తాగే నీటిలో ఎంత పరిమాణంలో ఉండే ఫ్లోరైడ్ అయాన్ ఎముకలకు, దంతాలకు హాని కలిగిస్తుంది?
జ: 10 ppm కంటే ఎక్కువ
 

84. తాగేనీటిలో లెడ్ గాఢత గరిష్ఠంగా ఎంత ఉండాలి (ppb లలో)
జ: 50
 

85. కలుపు మొక్కల నాశకాల తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏవి?
జ: NaClO3, Na3AsO3
 

86. పర్యావరణ క్షీణతను తగ్గించడం లేదా కాలుష్యాన్ని కనిష్ఠ స్థాయిలో ఉంచడం అనే వాటి ఆధారంగా రూపొందించిన పదార్థ ఉత్పత్తి ప్రక్రియలను ఏమంటారు?
జ: హరిత రసాయన శాస్త్రం
 

87. వస్త్రాల నిర్జల శుద్ధిక్రియలో ఉపయోగించే పదార్థం ఏది?
జ: కార్బన్ డై ఆక్సైడ్, డిటర్జెంట్ల మిశ్రమం
 

88. కాగితాలను వివర్ణం చేసేందుకు ఉపయోగించే పదార్థం ఏది?
జ: H2O2

Posted Date : 10-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌