• facebook
  • whatsapp
  • telegram

ఘాతాలు - ఘాతాంకాలు

వేగవంతమైన వృద్ధికి కచ్చితమైన వ్యక్తీకరణ!

    a + a + a + ........ + n సార్లు = n.a


    a × a × a × ........ n సార్లు = an


    an ను a యొక్క nవ ఘాతం అని చదువుతాం.


    an లో aను ఆధారం (భూమి), nను ఘాతాంకం అంటారు.


    ఘాతాంకాలు పెద్ద సంఖ్యలను సరళమైన రీతిలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి.


నోట్‌: ఘాతాంకాన్ని సాధారణంగా భూమి యొక్క కుడి ఎగువ మూలలో రాస్తారు. భూమితో పోల్చినప్పుడు పరిమాణం తక్కువగా ఉంటుంది.

ఒక సంఖ్య యొక్క ఘాతాంకం ‘1’ తగ్గితే ఆ సంఖ్య విలువ 10వ భాగం తగ్గుతుంది.


ఘాతాంక న్యాయాలు  

సర్వ సమీకరణం: సమీకరణంలోని చర రాశుల బదులుగా ఏ విలువను ప్రతిక్షేపిస్తే సత్యమవుతుందో దాన్ని సర్వ సమీకరణం అంటారు.


సర్వ సమీకరణాలు
1) (a + b)2 = a2 + 2ab + b2

2) (a − b)2 = a2 − 2ab + b2

3) (a + b)2 + (a − b)2 = 2(a2 + b2)

4) (a + b)2 − (a − b)2 = 4ab

5) (a − b)2 − (a + b)2 = −4ab

6) (a + b)(a − b) = a2 − b2

7) (a + b + c)2 = a2 + b2 + c2 + 2(ab + bc + ca)

8) (a + b)3 = a3 + b3 + 3ab(a + b)

9) a3 + b3 = (a + b)3 − 3ab(a + b) = (a + b)(a2 − ab + b2)

10) (a − b)3 = a3 − b3 − 3ab(a − b)

11) a3 − b3 = (a − b)3 + 3ab(a − b) = (a − b) (a2 + ab + b2)

12) (a + b + c)(a2 + b2 + c2 − ab − bc − ca) = a3 + b3 + c3 − 3abc

i) a + b + c = 0 అయితే a3 + b3 + c3 − 3abc = 0

a3 + b3 + c3 = 3abc

ii) a3 + b3 + c3 = 3abc అయితే a + b + c = 0 లేదా a = b = c అవుతుంది.

13) (x + a)(x + b) = x2 + x(a + b) + ab

14) (ax + b)(cx + d) = acx2 + x(ad + bc) + bd

15) (x + a)(x + b)(x + c) = x3 + (a + b + c)x2 + (ab + bc + ca)x + abc



మాదిరి ప్రశ్నలు

1.     m2 − mn + 4m − 4n ను కారణాంకాలుగా విభజించండి.

1) (m + 4)(m − n)     2) (m − 4)(m − n)

3) (m + n)(m + 4)     4) (m + n)(m − 4)


2.     a4 − 1296 యొక్క ఒక కారణాంకం

1) a − 14    2) a2 + 6    3) a + 8    4) a − 6


3.     (−10)3 + 73 + 33 = ?

1) 630    2) −630    3) −530   4) 530


4.     x − y = 9, xy = 5 అయితే x3 − y3 = ?


1) 764 2) 864 3) 746 4) 846


1) 18 2) 9 3) 1 4) 0
 


1) 27 2) 22 3) 18 4) 14


7.      కిందివాటిలో ఏది సరైంది? 

1) (−2)4 > (−3)4      2) (−2)5< (−3)5

3) 23 > 32               4) −24 > −34


8.     (10000 − 1000) × 100 = ?

1) 1    2) 0    3) 100    4) 1000


9.     27−4 ను 3 భూమిగా ఉండే ఘాత రూపంలో తెలపండి.

1) 38    2) 3−8   3) 3−12    4) 312


10.  216 + 216 + 216 + 216 = ?

1) 216   2) 217   3) 218    4) 220


11. 5x = 1000 అయితే 5x−2 విలువ ఎంత?

1) 4000    2) 400   3) 40   4) 4


1) 46    2) 48     3) 424    4) 420


13. 4−3 ను ఏ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 64 అవుతుంది?

1) 43    2) 44    3) 46    4) 48


14. 2x+4 − 2x+2 = 3 అయితే x విలువ ఎంత?

1) 1 2) −2 3) 2 4) −1


16. ax = b, by = c, cz = a అయితే xyz = ?

1) 0 2) 1 3) 2 4) 3


1) −36   2) 36   3) 26   4) −26


1) 1 2) 2 3) 128 4) 132


19. ఒక పుస్తకాల కట్టలో 20 mm మందం ఉన్న 5 పుస్తకాలు, 0.016 mm మందం ఉన్న 5 పేపర్లు ఉన్నాయి. అయితే పుస్తకాల కట్ట మొత్తం మందం ఎంత?

1) 1.08 × 102 mm 2) 1.008 × 102 mm

3) 1.0008 × 102 mm 4) 1.00008 × 102 mm


20. 0.0000529 యొక్క ప్రామాణిక రూపం?

1) 0.529 × 10−6     2) 5.29 × 10−6

3) 5.29 × 10−5       4) 5.29 × 10−7



22. లబ్ధం 10-1 అవడానికి 5-1 ను ఏ సంఖ్యతో గుణించాలి? 

1) 22  2) 2  3) 2−2    4) 2−1


23. భాగఫలం 5-1 అవడానికి (-25)-1 ను ఏ సంఖ్యతో భాగించాలి?


24. ax(y−z). ay(z−x).az(x−y) ను సూక్ష్మీకరించండి. 

1) 0 2) 1 3) 2 4) 3


25. ఒక వృక్ష కణ పరిమాణం 0.00001275 మీ. ను ప్రామాణిక రూపంలో రాయండి.

1) 1275 × 10−8      2) 127.5 × 10−7
3) 12.75 × 10−6    4) 1.275 × 10−5


26. భూమి ద్రవ్యరాశి 5.97 × 1024 కి.గ్రా., చంద్రుడి ద్రవ్యరాశి 7.35 × 1022 కి.గ్రా. అయితే వాటి ద్రవ్యరాశుల మొత్తం ఎంత?

1) 60.435 × 1024 కి.గ్రా.    2) 60.435 × 1022 కి.గ్రా.  

3) 6.0435 × 1024 కి.గ్రా.    4) 6.0435 × 1022 కి.గ్రా. 


27. 602 000 000 000 0000 ను ప్రామాణిక రూపంలో రాయండి.

1)  602 × 1013    2)  60.2 × 1014

3)  6.02 × 1015    4)  6.02 × 1011


28. 583 − 243 − 343 = ?

1) −141984 2) −149184

3) 149184 4) 141984


29. కిందివాటిలో (a − b) కి సమానమైంది ఏది?


30. 4(a + b)2 - 9(a - b)2 యొక్క కారణాంకాలు?

1) (5a − b)(5b + a) 2) (5a + b)(5b − a)

3) (5a + b)(5b + a) 4) (5a − b)(5b − a)


1) 5 2) 8 3) 25 4) 10


32. a = 0, b = −8, c = 2 అయితే 4a2 + 5abc - 7b2  విలువ ఎంత?

1) −632 2) −448 3) 136 4) 128



34. కిందివాటిలో 1 కి సమానమైంది ఏది?

1) 50 + 60 + 70     2) 50 × 60 × 70

3) (60 − 50) + 70     4) (70 − 60) × (70 × 60)


35. కిందివాటిలో సరికానిది ఏది?



37. కిందివాటిని జతపరచండి.

 

1) ఎ-2, బి-1, సి-4, డి-3    2) ఎ-5, బి-1, సి-4, డి-3 

3) ఎ-5, బి-4, సి-1, డి-3     4) ఎ-2, బి-3, సి-1, డి-4 


1) 4      2) 9      3) 10     4) 3




సమాధానాలు

1-1; 2-4; 3-2; 4-2; 5-4; 6-3; 7-4; 8-2; 9-3; 10-3; 11-3; 12-2; 13-3; 14-2; 15-1; 16-2; 17-1; 18-2; 19-3; 20-3; 21-2; 22-4; 23-3; 24-2; 25-4; 26-3; 27-3; 28-4; 29-3; 30-4; 31-1; 32-2; 33-2; 34-2; 35-1; 36-4; 37-1; 38-1.


రచయిత: సి.మధు 

Posted Date : 24-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌