• facebook
  • whatsapp
  • telegram

ఆసియా సింహాలకు ఆవాసం గిర్‌!

అడవులు

భూమిపై పర్యావరణ సమతౌల్యతతో పాటు వర్షాలకు ప్రధాన కారణం అడవులు. కాలుష్యాన్ని శోషించుకుంటూ, ఎన్నోరకాల జంతువులు, పక్షి జాతులకు ఆవాసంగా ఉన్న ప్రకృతి వనరులు వనాలు. ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థ పురోగతిలోనూ అవి ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. వైవిధ్యభరిత వాతావరణ పరిస్థితులున్న మన దేశంలో నేలలు, వర్షపాతం ఆధారంగా విస్తరించిన అడవులు, వాటి రకాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రాంతాలవారీగా సహజ, రక్షిత అడవుల సంరక్షణ చట్టాలు, అటవీ వృక్ష జాతుల ఔషధ, వాణిజ్య ప్రయోజనాలతో పాటు పులులు, సింహాలు, ఏనుగులు వంటి ప్రధాన జంతువుల గణాంకాల గురించి తెలుసుకోవాలి.


1.  కింది ఏ అరణ్యాల్లో ఎబోని చెట్లు ఉంటాయి?

1) ఉష్ణమండల ఆకురాల్చు అడవులు 

2) ఉష్ణమండల సతతహరిత అడవులు

3) సమశీతోష్ణ సతతహరిత అడవులు 

4) సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు


2.  కిందివాటిలో శృంగాకారపు అడవుల్లో పెరిగే వృక్షాలను గుర్తించండి.

1) పైన్‌   2) నారింజ   3) ఓక్‌   4) సాల్‌


3.  1750 సంవత్సరానికి ప్రపంచ జనాభా ఎంతకు చేరింది?

1) 100 కోట్లు       2) 50 కోట్లు   

3) 250 కోట్లు       4) 150 కోట్లు


4.  సతతహరిత అడవులు సాధారణంగా ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి?

1) 150 సెం.మీ.       2) 250 సెం.మీ.   

3) 100 సెం.మీ.    4) 200 సెం.మీ. కంటే తక్కువ


5. కిందివాటిలో ఏ అడవుల్లోని కలపకు వాణిజ్య  విలువలు తక్కువగా ఉంటాయి?

1) సతతహరిత అడవులు     2) ఆకురాల్చు అడవులు

3) ముళ్లపొద అడవులు  

4) సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు


6.  భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్న అడవులు ఏవి?

1) సతతహరిత అడవులు     2) ఆకురాల్చు అడవులు

3) ముళ్లపొద అడవులు     4) మడ అడవులు


7. ఆకురాల్చు అడవులు సగటున ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి?

1) 100 సెం.మీ. నుంచి 200 సెం.మీ.  

2) 200 సెం.మీ. నుంచి 250 సెం.మీ

3) 70 సెం.మీ. నుంచి 100 సెం.మీ.   

4) 70 సెం.మీ. నుంచి 200 సెం.మీ.


8. భారతదేశంలో దాదాపుగా ఎన్ని రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి?

1) 10,000    2) 15,000 

3) 20,000    4) 25,000


9.  భారతదేశంలో సుమారు ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి?

1) 15,000     2) 25,000 

3) 80,000     4) 90,000


10. ఉష్ణమండల సతతహరిత అడవుల్లో వృక్షాలు  దాదాపుగా ఎంత ఎత్తు వరకు పెరుగుతాయి?

1) 60 మీటర్లకు పైగా      2) 40 మీటర్లు  

3) 50 మీటర్లు      4) 55 మీటర్లు


11. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ  సంవత్సరంలో అమలైంది?

1) 1952  2) 1972  3) 1982  4) 1978


12. మానస్‌ బయోస్ఫియర్‌ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది?

1) కర్ణాటక     2) అస్సాం 

3) పశ్చిమ బెంగాల్‌     4) నాగాలాండ్‌


13. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని బయోస్ఫియర్‌  రిజర్వులు ఉన్నాయి?

1) 15     2) 16     3) 17     4) 18


14. ఈశాన్య భారతదేశం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక బయోస్ఫియర్‌ రిజర్వు ఏది?

1) దిహంగ్‌ - దిబాంగ్‌     2) డిబ్రూసైకోవా 

3) నోక్రెక్‌     4) మానస్‌


15. సిమ్ల్లిపాల్‌ బయోరిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది?

1) కేరళ 2) కర్ణాటక 3) ఒడిశా 4) తమిళనాడు


16. కింది ఏ బయోస్ఫియర్‌ రిజర్వును ప్రపంచ బయోరిజర్వు నెట్‌వర్క్‌లో చేర్చలేదు?

1) నోక్రెక్‌  2) పన్నా 3) మానస్‌ 4) నందాదేవి


17. నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ డేటాబేస్‌ ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి?

1) 104   2) 106   3) 108   4) 101


18. భారతదేశంలో మొదటి జాతీయ పార్కును ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1935   2) 1946  3) 1936  4) 1956


19. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు ఏది?

1) జిమ్‌కార్బెట్‌     2) హెమిస్‌   

3) కజిరంగా     4) సుందర్‌బన్స్‌


20. ‘వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ ఉన్న రాష్ట్రం?

1) మధ్యప్రదేశ్‌    2) కర్ణాటక

3) తమిళనాడు    4) ఉత్తరాఖండ్‌


21. జాతీయ పార్కులు అధికంగా ఉన్న రాష్ట్రం?

1) మహారాష్ట్ర    2) మధ్యప్రదేశ్‌    

3) తమిళనాడు    4) కేరళ


22. కిందివాటిలో ప్రపంచంలో నీటిపై తేలియాడే జాతీయ పార్కును గుర్తించండి.

1) మౌలింగ్‌    2) కీబుల్‌ లమ్‌జావో

3) నోక్రెక్‌    4) హెమిస్‌


23. భారతదేశంలో దాదాపుగా ఎన్ని రకాల పక్షి జాతులు ఉన్నాయి?

1) 4000  2) 2000  3) 3000  4) 5000


24. భారతదేశంలోని ఆయుర్వేదంలో దాదాపు ఎన్ని రకాల మొక్కల గురించి వివరించారు?

1) 1000  2) 1500  3) 2000  4) 2500


25. ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి ఎన్ని రకాల ఔషధ మొక్కల పేర్లను అంతరించి పోయే   జాబితాలో పేర్కొంది?

1) 452    2) 352    3) 248   4) 543


26. ప్రపంచంలో పులులు, సింహాలు రెండూ ఉన్న ఏకైక దేశం?

1) చైనా  2) అమెరికా 3) భారతదేశం    4) కెన్యా


27. 2021 అటవీ నివేదిక ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం?

1) కర్ణాటక    2) మహారాష్ట్ర    

3) మధ్యప్రదేశ్‌     4) ఉత్తర్‌ప్రదేశ్‌


28. భారతదేశంలో 2021 అటవీ నివేదిక ప్రకారం మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం ఎంత శాతం?

1) 22.42%    2) 24.62%    

3) 26.42%    4) 23.62%


29. భారతదేశంలో 2021 అటవీ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రం?

1) కర్ణాటక    2) మహారాష్ట్ర    

3) హరియాణా    4) ఝార్ఖండ్‌


30. 2021 అటవీ నివేదిక ప్రకారం శాతపరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం?

1) హరియాణా 2) మిజోరాం 3) కేరళ 4) పంజాబ్‌


31. 2019-2021 మధ్య అటవీ విస్తీర్ణం అధికంగా పెంచుకున్న రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్‌    2) తెలంగాణ  

3) అరుణాచల్‌ ప్రదేశ్‌    4) ఒడిశా


32. 2019-2021 మధ్య అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాల్లో మొదటిది?

1) మణిపుర్‌    2) మిజోరాం  

3) అరుణాచల్‌ ప్రదేశ్‌    4) నాగాలాండ్‌


33. 2021 అటవీ నివేదిక ప్రకారం అత్యధిక శాతం అడవి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం?

1) ఢిల్లీ    2) లక్షదీవులు  

3) చండీగఢ్‌     4)  జమ్మూకశ్మీర్‌ 


34. 2021 అటవీ నివేదిక ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం?

1) లద్దాఖ్‌    2) జమ్ము-కశ్మిర్‌   

3) చండీగఢ్‌     4) ఢిల్లీ


35. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) ఆగస్టు 16    2) సెప్టెంబరు 6   

3) ఆగస్టు 6    4)  సెప్టెంబరు 18


36. ఆల్ఫైన్‌ అడవులు దాదాపుగా ఎన్ని మీటర్ల ఎత్తులో పెరుగుతాయి?

1) 2300 మీ.    2) 3300 మీ. 

3) 1000 మీ.    4) 1500 మీ.


37. 2021లో విడుదల చేసిన అటవీ నివేదిక ఎన్నోది?

1) 15    2) 16    3) 17    4) 18 


38. కిందివాటిలో దేన్ని పేదవాడి కలప అంటారు?

1) ఎర్రచందనం    2) వెదురు  

3) గంధం    4) టేకు


39. కిందివాటిలో దేన్ని King of wood అని అంటారు?

1) ఎర్రచందనం    2) వెదురు    

3) టేకు    4) గంధం


40. ముళ్ల అడవులు దాదాపుగా ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి?

1) 100 సెం.మీ.           2) 150 సెం.మీ.

3) 70 సెం.మీ. కంటే తక్కువ    4) 100 సెం.మీ. నుంచి 150 సెం.మీ.


41. కిందివాటిలో ఆల్ఫైన్‌ అడవుల్లో పెరిగే వృక్షాలను గుర్తించండి.

1) సాల్‌    2) జునిపెర్స్‌    

3) బ్రహ్మజెముడు    4) ఎబోని


42. ఏ జాతీయ పార్కులో సింహపు తోక ఉన్న కోతులు ప్రధాన ఆవాసంగా ఉన్నాయి?

1) సైలెంట్‌ వ్యాలీ    2) కజిరంగా    

3) పెరియార్‌    4) బంధీపుర్‌ 


43. కిందివాటిలో ఆసియాటిక్‌ సింహాలకు ఆవాసంగా ఉన్న జాతీయ పార్కును గుర్తించండి.

1) కజిరంగా  2) గిర్‌  3) పెంచ్‌  4) గిండి


44. ప్రపంచ పులుల దినోత్సవం?

1) జూన్‌ 29    2) జులై 29    

3) జులై 19    4) జూన్‌ 19


45. భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్టు టైగర్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1972  2) 1982  3) 1973 4) 1962


46. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది?

1) బంధీపుర్‌      2) పెరియార్‌

3) సుందర్‌బన్స్‌    4) నాగార్జునసాగర్‌ - శ్రీశైలం


47. భారతదేశంలో మొదటి టైగర్‌ రిజర్వు ఏది?

1) బంధీపుర్‌  2) మానస్‌  3) పెంచ్‌  4) పన్నా


48. 2022 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి?

1) 2697  2) 3167  3) 2714  4) 3676


49. 2018 నాటి పులుల నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి?

1) 2967  2) 2697  3) 3617  4) 3167


50. భారతదేశంలో ఏనుగుల సంరక్షణ కోసం ‘ప్రాజెక్టు ఎలిఫెంటా’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1982  2) 1992  3) 1991  4) 1981


51. 2021 అటవీ నివేదిక ప్రకారం వెదురు అధికంగా ఉన్న రాష్ట్రం?

1) మహారాష్ట్ర     2) కర్ణాటక 

3) మధ్యప్రదేశ్‌    4) గుజరాత్‌


52. 2021 అటవీ నివేదికను తయారు చేయడానికి ఉపయోగించిన శాటిలైట్‌ ఏది?

1) ఐఆర్‌ఎస్‌ రిసోర్స్‌ శాట్‌-2    2) ఐఆర్‌ఎస్‌ రిసోర్స్‌ శాట్‌-1

3) ఐఆర్‌ఎస్‌ రిసోర్స్‌ శాట్‌-3     4) ఐఆర్‌ఎస్‌ రిసోర్స్‌ శాట్‌-4


సమాధానాలు


1-2; 2-1; 3-2; 4-2; 5-1; 6-2; 7-4; 8-2; 9-4; 10-1; 11-2; 12-2; 13-4; 14-3; 15-3; 16-3; 17-2; 18-3; 19-2; 20-4; 21-2; 22-2; 23-2; 24-3; 25-2; 26-3; 27-3; 28-2; 29-3; 30-2; 31-1; 32-3; 33-2; 34-2; 35-4; 36-2; 37-3; 38-2; 39-3; 40-3; 41-2; 42-1; 43-2; 44-2; 45-3; 46-4; 47-1; 48-2; 49-1; 50-2; 513; 521.


రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 02-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌