• facebook
  • whatsapp
  • telegram

ఫ్రెంచ్‌విప్లవం - 1789

‘స్వేచ్ఛగా పుట్టిన మనిషి అన్నిచోట్ల సంకెళ్లతో ఉన్నాడు’
 


ప్రజాస్వామ్యం, జాతీయత తదితర భావనలకు ఆ విప్లవం పునాదులు వేసింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసింది. సామాజిక వర్గ విభజనలను వ్యతిరేకించింది. మత స్వేచ్ఛ, పౌరహక్కులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఫ్రాన్స్‌లో రాచరిక పాలనను పడగొట్టి, మొదటి రిపబ్లిక్‌అవతరణకు దోహదం చేసి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఫ్రెంచి విప్లవం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అది రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలపై చూపిన శాశ్వత ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. 


1. ‘టైత్‌’ అంటే?

1) రాజులు ప్రజల నుంచి వసూలు చేసే పన్ను

2) భూస్వాములు రైతుల నుంచి వసూలు చేసే పన్ను

3) మతాధికారులు క్రైస్తవుల నుంచి వసూలు చేసే పన్ను

4) రాణులు సేవకులకు ఇచ్చే జీతాలు
 


2. ఫ్రెంచ్‌విప్లవం ఎవరి కాలంలో జరిగింది?    

1) లూయీ-13     2) లూయీ-14 

3) లూయీ-15    4) లూయీ-16


3. 16వ లూయీ భార్య మేరి అంతూనెట్‌ఏ దేశ  రాజకుమార్తె?

1) ప్రష్యా     2) రష్యా    3) ఆస్ట్రియా    4) ఫ్రాన్స్‌


4. కిందివారిలో ఫ్రాన్స్‌దేశ మూడో వర్గం సభ్యులు?

1) న్యాయవాదులు     2) ఉపాధ్యాయులు 

3)  వడ్డీ వ్యాపారులు   4) పైఅందరూ


 

5. ‘స్పిరిట్‌ఆఫ్‌లాస్‌’ గ్రంథ రచయిత?

1) రూసో    2) మాంటెస్క్యూ    3)  ఓల్టేర్‌     4) డిడిరో


6. మాంటెస్క్యూ ప్రకారం ఏ దేశ అధికార వర్గం అత్యున్నతమైంది?

1)  రష్యా   2)  ఆస్ట్రియా   3) ఇంగ్లండ్‌    4) ఇటలీ


7. ‘స్వేచ్ఛగా పుట్టిన మానవుడు అన్ని చోట్ల సంకెళ్లతో బంధీగా ఉన్నాడు’ అని ఎవరు అన్నారు?

1) మాంటెస్క్యూ     2) డిడిరో     3) రూసో     4) ఓల్టేర్‌


8. ‘సోషల్‌కాంట్రాక్ట్‌’ గ్రంథ రచయిత?    

1) రూసో   2) ఆడంస్మిత్‌    3) మాంటెస్క్యూ   4) కార్ల్‌మార్క్స్‌


9. కిందివారిలో ఫ్రాన్స్‌ప్రభుత్వ ఆదాయ, వ్యయాల నివేదికను ప్రచురించిన ఆర్థిక సలహాదారు?

1) టర్గట్‌     2)  నెక్కర్‌     3) కలోని    4) చార్లెస్‌


10. ఫ్రాన్స్‌లో 1789లో జరిగిన ఎస్టేట్‌జనరల్‌  సమావేశం ఎన్నేళ్ల తర్వాత జరిగింది?

1) 100    2)  200    3) 175    4) 185


11. టెన్నిస్‌కోర్టు శపథం ఎప్పుడు జరిగింది?

1) 1789, ఆగస్టు 20       2)  1789, జూన్‌2    

3) 1789, ఆగస్టు 2        4) 1789, జూన్‌20


12. ‘మేము ఇక్కడి నుంచి కదలివెళ్లి పోవడం జరగదని మీ చక్రవర్తికి చెప్పండి. కావాలంటే తుపాకులతో వచ్చి మమ్మల్ని చంపి ఖాళీ చేయించండి.’ అని టెన్సిస్‌కోర్టు నుంచి ప్రకటించిన వ్యక్తి?

1) సాల్విన్‌బెయిలీ       2) మిరాబు    

3) రాబిస్పియర్‌           4) డాంటన్‌


13. ప్యారిస్‌నగరంలో మున్సిపల్‌నగర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నగర పరిపాలన మేయర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?

1) సాల్విన్‌బెయిలీ     2) రాబిస్పియర్‌     3) డాంటన్‌     4) మిరాబు


14. ఫ్రెంచ్‌విప్లవ సమయంలో విప్లవవాదులు రూపొందించిన కొత్త జెండా ఏ రంగులతో ఉంది?    

1) ఎరుపు, నలుపు, తెలుపు       2) ఎరుపు, నలుపు, ఆకుపచ్చ    

3) తెలుపు, ఆకుపచ్చ, కాషాయం    4) ఎరుపు, తెలుపు, నీలం


15. ఫ్రాన్స్‌నూతన అసెంబ్లీ మానవ హక్కుల     ప్రకటనపై ఏ దేశ ప్రభావం ఉంది?    

1) అమెరికా     2)  రష్యా    3) చైనా   4) జర్మనీ



16. ఫ్రాన్స్‌లో మానవ హక్కుల ప్రకటన రూపొందించినవారు?    

1) సాల్విన్‌బెయిలీ        2) లఫాయట్‌     3) రాబిస్పియర్‌      4) డాంటన్‌


17. ఫ్రాన్స్‌మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచిన అంశం?

1) మానవులంతా సమానం

2) ప్రజలే ప్రభుత్వ అధికారాన్ని నిర్ణయిస్తారు

3) వాక్‌స్వాతంత్రం కల్పిస్తారు

4) పైవన్నీ


18. జాకోబియన్‌క్లబ్‌ప్రధాన నాయకుడు?

1) రాబిస్పియర్‌      2) జాక్వెన్‌పియర్‌బ్రిస్సోట్‌       

3) డాంటన్‌       4)  ప్లూటార్క్‌


19. ‘ప్యారిస్‌మహిళల ఆకలియాత్ర’ ఎప్పుడు     జరిగింది?    

1) 1789, మే 5     2) 1789, అక్టోబరు 5   3) 1789, సెప్టెంబరు 2    4) 1789, ఆగస్టు 4


 

20. కోర్డిలియర్‌క్లబ్‌ప్రథమ నాయకుడు ఎవరు?

1) రాబిస్పియర్‌     2) మేరీలాండ్‌      3) డాంటన్‌      4) బోనెట్‌రఫ్‌


21. ఫ్రాన్స్‌లో భీతావహ పాలన జరిగిన సంవత్సరం?

1)  1793 - 94      2) 1793 - 95    3) 1794 - 98      4) 1789 - 95


 

22. ఫ్రాన్స్‌లో 1792 - 95 మధ్య జరిగిన పాలనను ఏమని పిలుస్తారు?    

1) ప్రథమ రాజ్యాంగ పరిపాలన    2) డైరక్టరేట్‌పరిపాలన    

3) రాజ్యాంగసభ పరిపాలన    4) కన్వెన్షన్‌పరిపాలన


23. గిలిటన్‌అంటే?

1) ఫ్రాన్స్‌చక్రవర్తి భవనం     2) రాణి బిరుదు    

3) మరణదండన యంత్రం   4) ప్రభు వర్గ భవనాల సముదాయం


24. కిందివాటిలో కన్వెన్షన్‌విజయం ఏది?

1) తూనికలు, కొలతల్లో మెట్రిక్‌విధానం ప్రవేశపెట్టడం

2) న్యాయస్మృతిలో అంశాల మార్పులు చేర్పులు చేయడం

3) నిర్బంధ జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం

4) పైవన్నీ


 

25. ఫ్రాన్స్‌భాషలో ‘కూప్‌డియట్‌’ అంటే?

1) ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడం

2) ప్రభుత్వం కరెన్సీ విలువను మార్పు చేయడం

3) రాజు మరణ శాసనం

4)  ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో పడిపోవడం


26. నెపోలియన్‌1797లో ఆస్ట్రియాను ఓడించి ఏ సంధి చేసుకున్నాడు?

1) వియన్నా సంధి    2) కాంపో ఫోర్నియా సంధి   

3) ఈజిప్ట్‌సంధి     4) ఎక్సిలా చాపెల్‌సంధి


27. ఫ్రాన్స్‌లో మొదటి కాన్సల్‌గా ఎవరిని ప్రకటించారు?

1) నెపోలియన్‌      2) కౌంట్‌డి.అర్టోస్‌ 

3) లూసిన్‌బోనాపార్టీ    4) రాబిస్పియర్‌


28. ఫ్రాన్స్‌నెల అయిన ‘బ్రూమైర్‌’ ఇంగ్లిష్‌క్యాలెండర్‌ప్రకారం ఏ నెలతో సమానం?

1)  జనవరి     2) ఫిబ్రవరి    3) ఆగస్టు   4) నవంబరు


 

29. నెపోలియన్‌ఏ సంవత్సరంలో తనను తాను ఫ్రాన్స్‌చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు?

1) 1800     2) 1802    3) 1804   4) 1806


30. ‘నా తర్వాత ప్రళయమే’ అన్న ఫ్రాన్స్‌చక్రవర్తి?

1) 14వ లూయీ    2) 15వ లూయీ    3) 13వ లూయీ    4) 16వ లూయీ


 

31. ఫ్రాన్స్‌సమాజంలో పన్నులు చెల్లించే వర్గం?    

1) మొదటి వర్గం     2) రెండో వర్గం   

3) మూడో వర్గం       4) నాలుగో వర్గం


 

32. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ఏ దేశం నుంచి ప్రపంచం గ్రహించింది?

1) బ్రిటన్‌     2) అమెరికా    3) ఫ్రాన్స్‌     4) జర్మనీ


 

33. ఫ్రాన్స్‌లో భీతావహ పాలనకు కారకుడు ఎవరు?

1) డాంటన్‌   2) రాబిస్పియర్‌    3) బెయిలీ    4) చార్లెస్‌


 

34. బాస్టిల్‌కోట ముట్టడికి కారణం?

1) మేరీ అంతూనెట్‌భారీ విందు ఏర్పాటు చేయడం

2) ఫ్రాన్స్‌పై ప్రష్యా దాడి చేయడం

3) 16వ లూయీ ప్యారిస్‌ప్రజల మీద కాల్పులు జరపడం

4) ఆంతూవానెట్‌ఆస్ట్రియా నుంచి ఆయుధాలు తెప్పించిందనే వార్త


 

35. సంగీతం, వేట మీద ఎక్కువ ఆసక్తి ఉన్న ఫ్రాన్స్‌చక్రవర్తి?

1) 16వ లూయీ      2) 15వ లూయీ  

3) 14వ లూయీ      4) 13వ లూయీ


36. ఫ్రాన్స్‌సమాజంలో ఉన్న అసమానతలను,  అంతరాలను ప్రశ్నలు, సమాధానాల ద్వారా తెలియజేసిన ఫ్రాన్స్‌తత్వవేత్త?

1) అబెసాయిస్‌    2) రాబిస్పియర్‌     3) థామస్‌పెయిన్‌     4) థామస్‌వైఫర్‌సన్‌


37. కింది ఏ ఫ్రాన్స్‌మేధావి సమాజంలోని ప్రభు   వర్గాన్ని తన వ్యంగ్య రచనలతో విమర్శించాడు?

1) మాంటెస్క్యూ   2) డిడిరో     3) రూసో    4) ఓల్టేర్‌


38. 16వ లూయీకి సంబంధించి కిందివాటిలో    సరికానిది?

1) ఈయన కాలంలో ఫ్రెంచ్‌విప్లవం వచ్చింది.

2) ఈయన భార్య ఆస్ట్రియా రాజకుమార్తె మేరీ అంతూనెట్‌.

3) ఈయన 1793, జనవరిలో గిలిటెన్‌ద్వారా హత్యకు గురయ్యారు. 

4) ఈయన ఫ్రెంచ్‌విప్లవం బలపడటానికి ఏమాత్రం కారకుడు కాదు.


39. ‘ఓ విప్లవమా! నీ పేరిట ఎన్ని నేరాలు’ అని  భీతావహ పాలన కాలంలో అన్న వ్యక్తి ఎవరు?

1) రాబిస్పియర్‌      2)16వ లూయీ    3) మేడం రోలాండ్‌    4) మిరాబు


40. ఫ్రాన్స్‌మొదటి రాజ్యాంగం ఫ్రాన్స్‌దేశాన్ని ఎన్ని డిపార్టుమెంట్‌లుగా విభజించింది?

1) 20        2) 50     3) 83        4) 88 


 

41. ఫ్రాన్స్‌లో సెప్టెంబరు హత్యలు ఎవరి       నాయకత్వంలో జరిగాయి?

1) రాబిస్పియర్‌     2) నెపోలియన్‌బోనా పార్టీ   3) డాంటన్‌    4) మరాట్‌


42. జకోబియన్‌క్లబ్‌అనేది?

1) ఇదొక అతివాద సంఘం    2) ఇదొక మితవాద సంఘం

3) ఇదొక పాఠశాల పేరు      4) ఇదొక పత్రిక పేరు


 

43. కిందివాటిలో ఫ్రెంచ్‌విప్లవ బైబిల్‌గా చెప్పదగిన గ్రంథం?

1) సోషల్‌కాంట్రాక్ట్‌     2) ది సెకండ్‌ట్రీటీస్‌ఆఫ్‌గవర్నమెంట్‌

3) ది స్పింట్‌ఆఫ్‌లాస్‌    4) రైట్స్‌ఆఫ్‌ది మ్యాన్‌


44. కిందివాటిలో ఫ్రెంచ్‌విప్లవానికి కారణం?

1) మూడో ఎస్టేట్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం

2) ఆర్థిక పరిస్థితులు దిగజారడం

3) ప్రభు వర్గం, మతాధికారుల మితిమీరిన అధికారం

4) పైవన్నీ


45. నెపోలియన్‌కు అత్యంత ఇష్టమైన అశ్వం?

1) చేతక్‌    2) మారెన్‌గో   3) చార్లెస్‌   4) పైవన్నీ


 

46. కిందివారిలో ఒకరికి ఫ్రెంచ్‌విప్లవంతో సంబంధం లేదు?

1) లఫాయట్‌    2) రాబిస్పియర్‌  

3) థామస్‌జెఫర్‌సన్‌     4) డాంటన్‌


 

సమాధానాలు

1-3; 2-4; 3-3; 4-4; 5-2; 6-3; 7-3; 8-1; 9-2; 10-3; 11-4; 12-2; 13-1; 14-4; 15-1; 16-2; 17-4; 18-1; 19-2; 20-3; 21-1; 22-4; 23-3; 24-4; 25-1; 26-2; 27-1; 28-4; 29-3; 30-2; 31-3; 32-3; 33-2; 34-4; 35-4; 36-1; 37-4; 38-4; 39-3; 40-3; 41-4; 42-1; 43-1; 44-4; 45-2; 46-3.



రచయిత:

కాకులూరి వెంకటేశ్వరులు 

Posted Date : 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌