• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిమాణం - ఉనికి

నికోబార్‌ దీవుల్లో ‘పిలో మిలో’!


ఉత్తరాన హిమాలయాలు, మిగతా మూడువైపుల్లో సముద్రం ఆవరించిన విశిష్టమైన ద్వీపకల్పం భారతదేశం. ఏడు దేశాలతో భూసరిహద్దును పంచుకుంటోంది. వైవిధ్యభరిత ప్రధాన భూభాగంతో పాటు వందల సంఖ్యలో దీవులున్నాయి. పరిపాలనా విభాగాలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యవహరిస్తున్నాయి. దేశ అంతర్జాతీయ సరిహద్దులు, రాష్ట్రాల భౌగోళిక పరిధులు, విస్తీర్ణం తదితరాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, ప్రాంతీయ వైవిధ్యత, ప్రత్యేకతలను తెలుసుకోవాలి.
 


1. కింది ఏ రాష్ట్రానికి అంతర్జాతీయంగా మూడు దేశాలతో సరిహద్దు లేదు?

1) సిక్కిం      2) అరుణాచల్‌ప్రదేశ్‌   

3) పశ్చిమ బెంగాల్‌       4) అస్సాం


2. మొత్తం భూమి ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం ఎంత శాతం ఆక్రమించి ఉంది?

1) 0.45%       2) 0.57%   

3) 0.67%       4) 0.41%


3. భారతదేశం విస్తీర్ణంలో పాకిస్థాన్‌ కంటే ఎన్ని రెట్లు పెద్దది?

1) 4     2) 3     3) 6     4) 10


4. కిందివాటిలో ఏ దేశం భారతదేశ భూభాగంతో పరివేష్టితమై ఉంది?

1) భూటాన్‌       2) బంగ్లాదేశ్‌   

3) నేపాల్‌       4) చైనా


5. కిందివాటిలో మినీ టిబెట్‌గా పిలిచే ప్రాంతం?

1) సిక్కిం       2) అరుణాచల్‌ ప్రదేశ్‌  

3) లద్దాఖ్‌       4) అస్సాం


6. కర్ణాటక, మహారాష్ట్రలకు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది?

1) 8     2) 6     3) 7     4) 5


7. కిందివాటిలో ఏ రాష్ట్రం 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోదు?

1) హరియాణా       2) మధ్యప్రదేశ్‌   

3) ఆంధ్రప్రదేశ్‌      4) ఛత్తీస్‌గఢ్‌


8. నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజెన్సీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

1) అస్సాం      2) అరుణాచల్‌ ప్రదేశ్‌   

3) మేఘాలయ       4) సిక్కిం


9. భూటాన్‌తో అతిపొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం?

1) అరుణాచల్‌ప్రదేశ్‌       2) సిక్కిం  

3) అస్సాం       4) పశ్చిమబెంగాల్‌


10.. కిందివాటిలో ‘ల్యాండ్‌ ఆఫ్‌ జెమ్స్‌’ అని పిలిచే రాష్ట్రం?

1) నాగాలాండ్‌       2) మణిపుర్‌   

3) మేఘాలయ       4) సిక్కిం


11. నార్కొండం అగ్నిపర్వతం కింది ఏ దీవిలో ఉంది?

1) ఉత్తర అండమాన్‌       2) దక్షిణ అండమాన్‌   

3) మధ్య అండమాన్‌       4) గ్రేట్‌ నికోబార్‌


12. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అతి చిన్న దీవి ఏది?

1) ఉత్తర అండమాన్‌       2) రాస్‌ దీవి (నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ దీవి)  

3) లిటిల్‌ నికోబార్‌       4) గ్రేట్‌ నికోబార్‌


13. భారతదేశం వాణిజ్యపరమైన అధికార పరిధి తీరం నుంచి ఎన్ని నాటికల్‌ మైళ్ల వరకు ఉంటుంది?

1) 200    2) 150   3) 250    4) 300


14. వైశాల్యపరంగా చివరి నుంచి 2వ స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?

1) చండీగఢ్‌       2) పుదుచ్చేరి   

3) ఢిల్లీ      4) లద్దాఖ్‌


15. తూర్పుతీరంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం?

1) ఒడిశా       2) ఆంధ్రప్రదేశ్‌  

3) తమిళనాడు       4) పశ్చిమ బెంగాల్‌


16. ప్రధాన భూభాగంతో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తీర రేఖ ఉంది?

1) 9        2) 10       3) 11      4) 12


17. కిందివాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం?

1) అస్సాం         2) పశ్చిమ బెంగాల్‌    

3) త్రిపుర       4) మణిపుర్‌


18. అస్సాంకు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది?

1) 7        2) 8       3) 6         4) 5


19. కిందివాటిలో ఏ నగరాన్ని ‘సిటీ ఆఫ్‌ ర్యాలీస్‌’గా పిలుస్తారు?

1) ముంబయి         2) కోల్‌కతా     

3) చెన్నై        4) న్యూఢిల్లీ


20. కిందివాటిలో బంగ్లాదేశ్‌తో అతితక్కువ సరిహద్దు పంచుకొనే రాష్ట్రం?

1) మేఘాలయ        2) అస్సాం     

3) త్రిపుర          4) మిజోరాం


21. పశ్చిమ తీరంలో 2వ అత్యధిక తీర రేఖ ఉన్న రాష్ట్రం ఏది?

1) మహారాష్ట్ర          2) కర్ణాటక    

3) కేరళ          4) గుజరాత్‌


22. కేరళ తీర రేఖ పొడవు ఎన్ని కి.మీ.?

1) 565.70 కి.మీ.           2) 569.70 కి.మీ.  

3) 596.70 కి.మీ.          4) 540.70 కి.మీ.


23. భారతదేశపు మొత్తం తీర రేఖ పొడవు ఎన్ని కి.మీ.?

1) 7416.6 కి.మీ.           2) 7456.6 కి.మీ.   

3) 7516.6 కి.మీ.          4) 7501.6 కి.మీ.


24. పశ్చిమ బెంగాల్‌కు బంగ్లాదేశ్‌తో ఎన్ని కి.మీ.లు సరిహద్దు ఉంది?

1) 2516.6 కి.మీ.           2) 2216.7 కి.మీ.      

3) 2110.6 కి.మీ.           4) 3102.7 కి.మీ.


25. భారత్, మయన్నార్‌ మధ్య ఉండే సరిహద్దు భద్రతా దళం ఏది?

1) అస్సాం రైఫిల్స్‌ (AR)        

2) బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSR)   

3) సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF)     

4) ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ITBP)


26. భారతదేశం మాల్దీవుల కంటే విస్తీర్ణంలో సరాసరి ఎన్ని రెట్లు పెద్దది?

1) 8000    2) 10000    3) 11000    4) 9000


27. నికోబార్‌ దీవుల్లో చిన్న దీవిని గుర్తించండి.

1) కార్‌ నికోబార్‌    2) గ్రేట్‌ నికోబార్‌   

3) పిలో మిలో           4) లిటిల్‌ నికోబార్‌


28. స్కాట్‌లాండ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

1) నాగాలాండ్‌    2) మణిపుర్‌             3) మేఘాలయ          4) అస్సాం


29.. కిందివాటిలో నికోబార్‌ దీవుల్లో ఎత్తయిన శిఖరం ఏది?

1) సాడిల్‌              2) థుల్లియార్‌      

3) హారీయట్‌         4) అనైముడి


30. సూటి టెర్న్‌ అనేది ఏ కేంద్రపాలిత ప్రాంతపు పక్షి?

1) అండమాన్‌ నికోబార్‌       2) చండీగఢ్‌   

3) లక్షద్వీప్‌         4) పుదుచ్చేరి


31. 8° ఛానెల్‌ కిందివాటిలో ఏ దీవి ద్వారా పోతుంది?

1) ఆమీన్‌      2) కన్ననూర్‌   

3) మినికాయ్‌       4) చిత్రాదీవి


32. కిందివాటిలో ఏ దీవులను ‘ది విండో ఆఫ్‌ ఫ్రెంచ్‌ కల్చర్‌’గా పిలుస్తారు?

1) చండీగఢ్‌       2) ఢిల్లీ   

3) పుదుచ్చేరి       4) లక్షద్వీప్‌


33. భారతదేశపు తూర్పు-పశ్చిమ కొనల మధ్య దూరం ఎంత?

1) 2093 కి.మీ.      2) 2339 కి.మీ.   

3) 2833 కి.మీ.      4) 2933 కి.మీ.


34. ‘సర్‌క్రీక్‌’ అనేది కింది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అయింది?

1) ఇండియా - పాకిస్థాన్‌ 2) ఇండియా - బంగ్లాదేశ్‌

3) ఇండియా - మయన్మార్‌   4) ఇండియా - ఇండొనేసియా


35. నేపాల్‌ ఎన్ని భారత రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది?

1) 4      2) 5      3) 6      4) 3


36. ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని?

1) 1      2) 2      3) 3      4) 4


37. మన దేశంలో విస్తీర్ణపరంగా 4వ పెద్ద రాష్ట్రం ఏది?

1) మహారాష్ట్ర       2) మధ్యప్రదేశ్‌   

3) కర్ణాటక       4) ఉత్తర్‌ప్రదేశ్‌


38. విస్తీర్ణపరంగా అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు   2) లద్దాఖ్‌      

3) ఢిల్లీ            4) చండీగఢ్‌


39. విస్తీర్ణపరంగా 3వ చిన్న రాష్ట్రం ఏది?

1) గోవా  2) సిక్కిం  3) త్రిపుర  4) మిజోరాం


40. చోగ్యాల్‌ అని కింది ఏ రాష్ట్రాన్ని పిలిచేవారు?

1) సిక్కిం      2) ఉత్తరాఖండ్‌   

3) అరుణాచల్‌ప్రదేశ్‌       4) అస్సాం


41. మయన్మార్‌తో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది?

1) నాగాలాండ్‌       2) అరుణాచల్‌ ప్రదేశ్‌  

3) మణిపుర్‌      4) మేఘాలయ


42. కిందివాటిలో చైనాతో అధిక సరిహద్దు పంచుకునేది ఏది?

1) లద్దాఖ్‌       2) ఉత్తరాఖండ్‌   

3) అరుణాచల్‌ ప్రదేశ్‌       4) సిక్కిం


43.  భారతదేశానికి, పాకిస్థాన్‌కు మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది?

1) 1970, జూన్‌ 4      2) 1971, జులై 2

3) 1972, జులై 2       4) 1974, జులై 2


44. కిందివాటిలో భారత్‌ - చైనా సరిహద్దు రేఖను గుర్తించండి.

1) ఇంటర్నేషనల్‌ బోర్డర్‌ లైన్‌   2) లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ 

3) లైన్‌ ఆఫ్‌ ఆక్చువల్‌ కంట్రోల్‌   4) ఆక్చువల్‌ గ్రౌండ్‌ పొజిషనింగ్‌ లైన్‌ 


45. న్యూమూర్‌ దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమయ్యాయి?

1) ఇండియా  మయన్మార్‌    2) ఇండియా  శ్రీలంక

3) ఇండియా  పాకిస్థాన్‌    4) ఇండియా  బంగ్లాదేశ్‌


46. సుగౌలీ ఒప్పందం (1816) ఏ రెండు దేశాల మధ్య జరిగింది?

1) ఇండియా  నేపాల్‌  2) ఇండియా  భూటాన్‌   

3) ఇండియా  బంగ్లాదేశ్‌       4) ఇండియా  పాకిస్థాన్‌


47. యాండభు ఒప్పందం కింది ఏ రెండు దేశాల మధ్య జరిగింది?

1) భూటాన్‌  ఇండియా       2) నేపాల్‌  ఇండియా   

3) ఇండియా  మయన్మార్‌      4) ఇండియా  శ్రీలంక


48. ‘సిటీ ఆఫ్‌ రోజెస్‌’ అని కింది ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

1) చండీగఢ్‌       2) జైపుర్‌   

3) లద్దాఖ్‌       4) లఖ్‌నవూ


49. కిందివాటిలో పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దు లేని రాష్ట్రాన్ని గుర్తించండి.

1) ఒడిశా       2) ఝార్ఖండ్‌  

3) అస్సాం       4) ఛత్తీస్‌గఢ్‌


50. కింది ఏ ప్రాంతాన్ని ‘మినీ జపాన్‌’ అంటారు?

1) చెన్నై      2) శివకాశీ  

3) కొచ్చి      4) లఖ్‌నవూ                         


 

సమాధానాలు

1-4, 2-2, 3-1, 4-2, 5-3, 6-2, 7-4, 8-2, 9-3, 10-2, 11-1, 12-2, 13-1, 14-1, 15-4, 16-3, 17-4, 18-1, 19-4, 20-2, 21-1, 22-2, 23-3, 24-2, 25-1, 26-3, 27-3, 28-3, 29-2, 30-3, 31-3, 32-3, 33-4, 34-1, 35-2, 36-2, 37-4, 38-2, 39-3, 40-1, 41-2, 42-1, 43-3, 44-3, 45-4, 46-1, 47-3, 48-1, 49-4, 50-2.


 రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 15-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌