• facebook
  • whatsapp
  • telegram

ప్రాచీన భారతదేశ చరిత్ర

నవీన శిలాయుగంలో ఆదిమానవుడి వ్యవసాయం!


భారత ఉపఖండంలో వేల ఏళ్ల క్రితమే నగరీకరణకు నాంది పలికిన సింధు లోయ నాగరికత కాలం నుంచి స్వర్ణయుగంగా విరాజిల్లిన గుప్తుల పాలనా కాలం వరకు ప్రాచీన భారతదేశ చరిత్రగా పరిగణించవచ్చు. ఆ మధ్యలో ఆవిర్భవించిన మహాజనపదాలు, నంద, మౌర్య, శుంగ, శాతవాహన, గుప్త సామ్రాజ్యాలు, వాటి పాలకుల విశేషాలన్నీ చరిత్ర అధ్యయనంలో అత్యంత ఆసక్తికర అంశాలే. సింధు నాగరికతలో వర్థిల్లిన మాతృస్వామ్యం, వేదకాలంలో జరిగిన సాహితీ వికాసం, ఆర్యుల సంస్కృతి భరత జాతికి నేర్పిన కట్టుబాట్లు తదితర పరిణామాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రాచీన భారతీయ పాలకులు, పాలక వంశాల వారీగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలను వివరంగా తెలుసుకోవాలి. 


1. మౌర్యుల రాజధాని ఏది?

1) పాటలీపుత్రం     2) విదిశ     3) రాజగృహం     4) మధుర


2. కిందివాటిలో మౌర్యచరిత్రకు ఆధారమైన గ్రంథాలు?

1) ఇండికా      2) అర్థశాస్త్రం    3) ముద్రారాక్షసం   4) పైవన్నీ


3. అశోకుడి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి?

1) సంస్కృతం       2) పాళీ       3) ప్రాకృతం     4) తమిళం


4.  కిందివాటిలో సరికానిది?

1) మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు  

2) చంద్రగుప్త మౌర్యుడి ప్రధాని కౌటిల్యుడు

3) చంద్రగుప్త మౌర్యుడి అనంతరం అశోకుడు   రాజయ్యాడు

4) అశోకుడు బౌద్ధ ధర్మాన్ని అనుసరించాడు


5. మౌర్య సామ్రాజ్యాన్ని సందర్శించిన మొదటి గ్రీకు రాయబారి?

1) మెగస్తనీస్‌        2) హీలియోడోరస్‌    3) ఫాహియాన్‌      4) డెమస్తనీస్‌


6.హర్యంక వంశస్థాపకుడు ఎవరు?

1) బింబిసారుడు       2) అజాతశత్రువు   3) బిందుసారుడు     4) చంద్రగుప్త మౌర్యుడు


7.వాయవ్యం నుంచి కళింగ వరకు దండయాత్రలు చేసిన నందవంశ రాజు?

1) ధననందుడు  2) మహాపద్మనందుడు   3) సముద్రగుప్త    4) పుష్యమిత్ర శుంగుడు


8. శాతవాహనుల రాజధాని ప్రాంతం ఏది?

1) ధాన్యకటకం   2) పాటలీపుత్రం   3) మధుర   4) కంచి


9. శాతవాహన రాజుల్లో అత్యంత గొప్పవాడు?

1) మొదటి శాతకర్ణి   2) గౌతమీపుత్ర శాతకర్ణి   3) యజ్ఞశ్రీ శాతకర్ణి   4) వాశిష్ఠీపుత్ర పులోమావి


10. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు?

1) శ్రీముఖుడు      2) శ్రీగుప్తుడు    3) పులోమావి      4) యజ్ఞశ్రీ


11.ఇక్ష్వాకుల రాజధాని ప్రాంతం ఏది?

1) నాగార్జునకొండ     2) విజయపురి    3) పాటలీపుత్రం     4) ధాన్యకటకం


12. కిందివాటిలో సముద్రగుప్తుడి బిరుదు ఏది?

1) త్రిసముద్రతోయ పీతవాహన     2)ఆగమనిలయ 

3) కవిరాజు     4) సకలోత్తర పథేశ్వర


13. ఆదిమానవుడు నిప్పును కనుక్కున్న యుగం?

1) నవీన శిలాయుగం   2) మధ్య శిలాయుగం   3) ప్రాచీన శిలాయుగం     4) ఏదీకాదు


14. ఆదిమానవుడు నిప్పును దేని కోసం ఉపయోగించాడు?

1) ఆహారాన్ని వండుకుని తినడం కోసం

2) గుహలో వెలుతురు, వేడిని నింపడానికి 

3) జంతువుల నుంచి రక్షణకు

4) పైవన్నీ


15. ఆదిమానవుడు వ్యవసాయం ప్రారంభించిన కాలం?

1) నవీన శిలాయుగం     2) మధ్య శిలాయుగం 

3) ప్రాచీన శిలాయుగం     4) ప్రాచీన, మధ్య శిలాయుగం


16. బెలూమ్‌ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి?

1) కర్నూలు     2) అనంతపురం  3) నెల్లూరు    4) ఆదిలాబాద్‌


17. భారత ఉపఖండంలో ఎముకలతో చేసిన      పనిముట్లు లభించిన ప్రదేశం?

1) ముచ్చట్ల చింతమానుగలి    2) చింతకుంట   3) కామకూరు     4) బనగానపల్లె


18. గుప్తుల కాలం నాటి నవరత్నాల్లో అగ్రగణ్యుడు?    

1) అమరసింహుడు    2) కాళిదాసు     3) శంఖుడు    4) వరాహమిహిరుడు


19. ‘చరకసంహిత’ అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని     రచించింది?

1) శుశ్రుతుడు     2) వరాహమిహిరుడు     3) ధన్వంతరి     4) చరకుడు


20. దక్షిణ భారతదేశంలోని కంచి వరకు విజయాలు సాధించిన గుప్త రాజు ఎవరు?

1) మొదటి చంద్రగుప్తుడు    2)సముద్రగుప్తుడు     

3)కుమారగుప్తుడు    4)రెండో చంద్రగుప్తుడు


21. భారతదేశంలో వర్ధిల్లిన మొదటి నాగరికత?

1) సింధు నాగరికత  2)ఆర్య నాగరికత

3)మెసపటోమియా నాగరికత    4)వేద నాగరికత


22. సింధు ప్రజలు పూజించిన స్త్రీ దైవం?

1) అమ్మతల్లి     2)పశుపతి  3)ఇసీస్‌     4)పై అందరూ


23. కిందివాటిలో సింధు నాగరికతకు సంబంధించి సరికానిది?

1) సింధు నాగరికత పట్టణ ప్రణాళిక కలిగి ఉంది

2)మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది

3)సింధు ప్రజల ముఖ్యవృత్తి పశుపోషణ

4)సింధు ప్రజలు పత్తిని పండించారు


24. వేదాల్లో మొదట వేదం?

1) రుగ్వేదం     2)యజుర్వేదం  3)సామవేదం     4)అధర్వణ వేదం


25. ఆర్యులు మొదటగా స్థిరపడిన ప్రదేశం?

1) వాయవ్య భారతదేశం   2)తూర్పు భారతదేశం  

3)దక్షిణ భారతదేశం     4)పశ్చిమ భారతదేశం


26. దక్షిణభారత దేశంలోని ఏకైక షోడశ మహాజపదం?

1) అంగ   2)వజ్జి    3)మగధ  4)అస్మక


27. కిందివాటిలో సరికానిది?

1) అశోకుడు కళింగ యుద్ధానంతరం ధర్మ ప్రచారం చేశాడు.

2)కళింగ యుద్ధం గురించి 13వ శిలాశాసనం  తెలుపుతుంది.

3)అశోకుడు భారతదేశ చరిత్రలో శిలాశాసనాలు వేసిన మొదటి రాజు.

4)అశోకుడు బింబిసారుడి మనవడు.


28. ‘కంచు నాట్యగత్తె విగ్రహం’ లభించిన సింధు  నాగరికత ప్రాంతం?

1) మొహంజోదారో     2)చాన్హుదారో   3)కాలీభంగన్‌     4)లోథాల్‌


29. చైనా నాగరికత ఏ నది ఒడ్డున ఏర్పడింది?

1) బ్రహ్మపుత్ర     2)నైలు  3)హొయాంగ్‌ హో     4)యూప్రటీస్‌


30. ఈజిప్ట్‌ నాగరికత లిపి?

1) ఫిక్టోగ్రఫీ     2)మాండరిన్‌    3)హోరియోగ్లైఫిక్‌     4)క్యూనిఫామ్‌


31. ‘జన’ అనేది ఏ భాషా పదం?

1) తెలుగు     2)సంస్కృతం   3)ప్రాకృతం     4)అర్థమాగధి


32. ఆర్యులు వ్యవసాయంలో ప్రగతి సాధించడానికి కారణం?

1) షోడశ మహాజనపదాలు ఏర్పడటం

2)పశుపోషణ ఎక్కువగా చేయడం

3)నదుల వెంట స్థిరపడటం

4)ఇనుమును విస్తృతంగా ఉపయోగించడం


33. యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం?

1) అస్మక      2)కురు     3)పాంచాల      4)మగధ


34. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం?

1) వజ్జి       2)మల్ల     3)సూరసేన      4)అస్మక


35. ఉపనిషత్తు అంటే అర్థమేంటి? 

1) ఎక్కువ జ్ఞానాన్ని పొందడం    2)గురువులకు నమస్కరించడం

3)చేరువగా కూర్చోవడం    4)ఎక్కువ మహిమగల గ్రంథాలు


36. గృహపతి అంటే అర్థమేంటి?

1) వ్యాపారస్థులు   2)చేతివృత్తులను అవలంభించేవారు     

3)రాజుగారి సేవకులు    4)వ్యవసాయం చేసే భూయజమానులు


37. ‘పెయింటెడ్‌ గ్రేవేర్‌’ కుండలు ఏ కాలంలో ప్రసిద్ధి చెందాయి?

1) సింధు నాగరికత కాలం   2)షోడశ మహాజనపద కాలం 

3)ప్రాచీన శిలాయుగం    4)మధ్య భారతకాలం


38. అలెగ్జాండర్‌ భారతదేశం మీద దండయాత్ర చేసిన కాలంలో మగధ పాలకులు ఎవరు?

1) మౌర్యులు     2)నందులు     3)శుంగులు     4)శాతవాహనులు


39. ‘నాలుగు సింహాల చిహ్నం’ మీద కనిపించే ‘సత్యమేవ జయతే’ అనే పదం ఏ ఉపనిషత్తులోనిది?

1) ముండక ఉపనిషత్తు    2)మాండ్యుక ఉపనిషత్తు 

3)బృహదారణ్యకోపనిషత్తు    4)చాందోగ్య ఉపనిషత్తు


40. కిందివాటిలో ‘శృతులు’ అని వేటిని పిలుస్తారు?

1) ఇతిహాసాలు     2)ఉపనిషత్తులు    3)వేదాలు     4)గ్రీకు రచనలు


41. కిందివాటిని జతపరచండి.

ఎ) బింబిసారుడు       1) హర్యంక వంశం

బి) అశోకుడు             2)మౌర్య వంశం

సి) సముద్రగుప్తుడు    3)గుప్త వంశం

డి) హర్షవర్థనుడు        4)పుష్యభూతి వంశం

1) ఎ-1, బి-2, సి-3, cc-4    2)ఎ-1, బి-2, సి-4, డి-3

3)ఎ-4, బి-2, సి-3, డి-1      4)ఎ-4, బి-3, సి-2, డి-1


42. గుప్తరాజుల్లో గొప్ప యుద్ధవీరుడు?

1) సముద్రగుప్తుడు     2) రెండో చంద్రగుప్తుడు 

3) కుమార గుప్తుడు     4) స్కంధ గుప్తుడు


43. కిందివారిలో భారతదేశ మొదటి శస్త్రచికిత్స  నిపుణుడు ఎవరు?

1) చరకుడు     2) సుశ్రుతుడు     3) ధన్వంతరి     4) వరరుచి


44. అస్మక రాజధాని?

1) పాటలీపుత్రం     2) బోధన్‌     3) చంపా నగరం     4) తక్షశిల


45. భారత సంగీతానికి మూలమైన గ్రంథం ఏది?

1) రుగ్వేదం     2) యజుర్వేదం  3) సామవేదం   4) అధర్వణ వేదం 



సమాధానాలు:

1-1; 2-4; 3-3; 4-3; 5-1; 6-1; 7-2; 8-1; 9-2; 10-1; 11-2; 12-3; 13-2; 14-4; 15-1; 16-1; 17-1; 18-2; 19-4; 20-2; 21-1; 22-1; 23-3; 24-1; 25-1; 26-4; 27-4; 28-1; 29-3; 30-3; 31-2; 32-4; 33-2; 34-4; 35-3; 36-4; 37-2; 38-2; 39-1; 40-3; 41-1; 42-1; 43-2; 44-2; 45-3.


కాకులూరు వెంకటేశ్వర్లు

Posted Date : 05-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌