• facebook
  • whatsapp
  • telegram

రోగనిరోధక వ్యవస్థ

అందానికి భయపడితే కల్లోఫోబియా!


వ్యాధుల నుంచి జీవులను రోగనిరోధక వ్యవస్థ రక్షిస్తుంది. అది శరీరంలోకి చొచ్చుకొచ్చే  రకరకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు, వ్యాధికారకాలను గమనించి ప్రతిస్పందిస్తుంది. జీవక్రియలకు హాని చేసే కణాలను ఆరోగ్యకర కణజాలం నుంచి వేరుచేస్తుంది. మానవుడిలో ఉన్న అద్భుతమైన, అత్యంత క్లిష్టమైన ఈ రోగనిరోధక వ్యవస్థపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, వయసుల వారీగా వచ్చే సాధారణ రుగ్మతలు, వాటికి శరీరం స్పందించే తీరు, నివారణకు కనిపెట్టిన ఔషధాలు, సంబంధిత శాస్త్రవేత్తలు, ప్రత్యేక వ్యాధులను గుర్తించే పరీక్షల గురించి ప్రాథమికంగా తెలుసుకోవాలి.
 


1. వ్యాక్సిన్‌ల పితామహుడు?

1) ఎడ్వర్డ్‌ జెన్నర్‌     2) లూయీ పాశ్చర్‌ 

3) విలియం హార్వే     4) 1, 2


2. ఇమ్యునిస్‌ అంటే...

1) మినహాయింపు     2) దీవి 

3) స్వేచ్ఛ     4) 1, 3


3 . కిందివాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ)ప్రథమ రక్షణ రేఖ: హానికర సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించినప్పుడు.. శ్లేష్మ స్తరం, లాలాజలం, కన్నీరు లాంటివి వాటిని ఆపేస్తాయి.

బి) ద్వితీయ రక్షణ రేఖ: వ్యాధిజనక జీవులను భక్షక కణాలు, ప్రతి సూక్ష్మజీవ ప్రొటీన్లు జ్వరం, ఉజ్వలనం లాంటి చర్యల ఫలితంగా నాశనం చేస్తాయి.

సి) తృతీయ రక్షణ రేఖ: లింఫోసైట్లు సూక్ష్మజీవులతో పోరాడి రక్షణ కలిగిస్తాయి.

డి) ప్రథమ, ద్వితీయ రక్షణ రేఖలు విశిష్టత కలిగి ఉంటాయి.

1) ఎ, బి, సి     2) ఎ, బి 

3) ఎ, బి, సి, డి     4) ఎ మాత్రమే


4.  కిందివాటిలో చిన్న లింఫోసైట్లు కానివి-

1) B- కణాలు     2) T - కణాలు 

3) NK - కణాలు     4) పైవన్నీ 


5. జతపరచండి.

జాబితా - 1 జాబితా - 2
 1) మిసెంగియల్‌ కణాలు ఎ)ఊపిరితిత్తులు 
 2) హిస్టియోసైట్లు బి) సైనోవియల్‌ ద్రవం
 3) సైనోవియల్‌ కణాలు సి) మూత్రపిండాలు 
4) డస్ట్‌ కణాలు డి) సంయోజక కణజాలం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     

2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ 

3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ 

4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి


6.  కిందివాటిలో ఫెర్‌ఫోరిన్‌ అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేసేవి-

1) సహజ హంతక కణాలు    2) B - లింఫోసైట్స్‌ 

3) T - లింఫోసైట్స్‌     4) 1, 2


7.  కిందివాటిలో థైమస్‌ గ్రంథిలో పరిణతి చెందే  కణాలేవి?

1) T - కణాలు     2) B - కణాలు 

3) NK- కణాలు     4) శోష కణాలు


8. B - కణాలు ఏ జీవుల్లో బర్సా ఫాబ్రిసియస్‌లో  పరిణతి చెందుతాయి?

1) క్షీరదాలు   2) పక్షులు 

3) సరీసృపాలు   4) ఉభయచరాలు


9.  కిందివాటిలో ప్రతిదేహాలతో సంబంధం లేకుండా ప్రతిచర్యను చూపేవి?

1) B - కణాలు     2) T - కణాలు 

3) NK- కణాలు     4) పైవన్నీ


10. వాదన (ఎ): దీర్ఘకాలంగా జీవించే మానవుడు క్యాన్సర్‌కు గురవుతాడు.    

కారణం (బి): సహజ హంతక కణాల క్రియాశీలత వృద్ధుల్లో తగ్గిపోతుంది.

1) ఎ సత్యం, బి అసత్యం. 

2) ఎ, బి లు రెండూ అసత్యం.

3) ఎ, బి లు రెండూ సత్యం. కానీ ఎ కి, బి సరైన వివరణ కాదు. 

4) ఎ, బి లు రెండూ సత్యం. ఎ కి బి సరైన వివరణ.


11. ఆల్వియోలార్‌ మాక్రోఫేజ్‌లు ఎక్కడ ఉత్పత్తి  అవుతాయి?    

1) ఊపిరితిత్తులు  2) మెదడు 

3) ఎముకలు   4) రక్తం


12. కిందివాటిలో అలర్జీని కలగజేసే కణాలు- 

1) ప్రతిజనక సమర్పక కణాలు 

2) మాస్ట్‌ కణాలు 

3) రక్తఫలకికలు     

4) 2, 3


13. కిందివాటిలో అస్తి మజ్జలో మెగా కారియోసైట్స్‌ నుంచి ఏర్పడేవి?    

1) మాస్ట్‌ కణాలు   2) రక్తఫలకికలు 

3) ప్రతిజనక కణాలు   4) 1, 2 


14. భక్షక కణాలను దేని ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు?

1) కేంద్రక త్వచం   2) జీనోమ్‌ 

3) కేంద్రకం   4) రిక్తిక 


15. కిందివాటిలో బహుకేంద్రక కణం కానిది?

1) న్యూట్రోఫిల్‌   2) మోనోసైట్‌ 

3) బేసోఫిల్‌   4) ఎసినోఫిల్‌


16. కిందివాటిలో బలహీన భక్షక కణాలు ఏవి?

1) బేసోఫిల్స్‌     2) ఎసినోఫిల్స్‌ 

3) న్యూట్రోఫిల్స్‌     4) పైవన్నీ


17. రక్త వడపోత పరికరంగా ఉపయోగపడేది?

1) ప్లీహం     2) లింఫ్‌ గ్రంథి 

3) సైనోవియల్‌     4) 1, 2


18. కింది వాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ) ఇంటర్‌ ల్యూకిన్‌ - రోగనిరోధక కణాలు విస్తృత విభజనలో పాల్గొనడం.

బి) ఇంటర్‌ ఫెరాన్‌లు - ఇవి వైరస్‌ సంక్రమణ కణాలు ఉత్పత్తి చేసే ప్రతి వైరల్‌ ప్రొటీన్లు.

సి) బి - లింఫోసైట్స్‌ నుంచి ప్రతిదేహాలు/     ప్రతిరక్షకాలు ఏర్పడతాయి.

డి) ప్లాస్మాలో, కణత్వచ ఉపరితలంపైన ఉండే   అచేతన ప్రొటీన్లను పరిపూరక ప్రొటీన్లు అంటారు.

1) ఎ, బి     2) ఎ, డి 

3) ఎ, బి, సి, డి     4) ఎ మాత్రమే


19. కిందివాటిలో భౌతిక అవరోధాన్ని గుర్తించండి.

1) చర్మం     2) శ్లేష్మస్తరాలు 

3) రోమాలు     4) 1, 2


20. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ)శరీర ధర్మపరమైన అవరోధం -

ఉదా: జీర్ణాశయంలో స్రవించే హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, లాలాజలం

బి) కణపరమైన అవరోధాలు - ల్యూకోసైట్స్, మోనోసైట్స్‌.

సి) జీవులన్నీ పుట్టుకతో కలిగి ఉండే రోగనిరోధక శక్తిని సహజ లేదా స్వాభావిక రోగనిరోధ]కత అంటారు.

డి) పుట్టిన శిశువుకు, ఆర్జిత రోగ నిరోధకత తల్లి చనుబాల నుంచి లభిస్తుంది.

1) ఎ, బి     2) సి, డి 

3) ఎ, బి, సి     4) ఎ, బి, సి, డి


21. ప్రతిదేహ మూల నిర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు?

1) రోడ్ని పోర్టర్‌     2) ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 

3) లూయీ పాశ్చర్‌     4) రాబర్ట్‌ కోచ్‌


22. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) స్వేచ్ఛా చలనాలను నిరోధించేది - అవరోధం

2) ప్రణాళిక కణ మరణాన్ని అప్సోనైజేషన్‌ అంటారు.

3) కణవిచ్ఛిత్తి - ఫైటోలైసిస్‌

4) లింఫాటిక్‌ కణజాల ముద్దలను టాన్సిల్స్‌ అంటారు.


23. ఎయిడ్స్‌ను కలిగించే వైరస్‌లో జీనోమ్‌కు ఇరు   వైపులా ఉండే ఎంజైమ్‌?

1) రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్టేజ్‌   2) సైటోకైనేజ్‌ 

3) లైసిన్‌     4) ల్యూసిన్‌


24. హెచ్‌ఐవీ మానవ శరీరంలో ప్రవేశించిన వెంటనే ఏ కణాలపై దాడిచేస్తుంది?

1) మాక్రోఫేజ్‌     2) డెండ్రైటిక్‌లు 

3) ఇంటర్‌ఫెరాన్‌     4) 1, 2


25. హెచ్‌ఐవీ వైరస్‌ను గుర్తించే పరీక్ష?

1) వెస్ట్రర్న్‌ బ్లాట్‌   2) పీసీఆర్‌ 

3) చైన్‌ లింక్డ్‌ పరీక్ష   4) 1, 2


26. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ)1952లో జోనస్‌ సాక్‌ పోలియోకు టీకాలు   కనుక్కున్నారు.

బి) 1957లో ఆల్బర్ట్‌ సాబిన్‌ పోలియో చుక్కల మందు కనుక్కున్నారు.

సి) అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు యల్లాప్రగడ సుబ్బారావు

డి) ప్రపంచంలో మొదటి అద్భుత ఔషధం పెన్సిలిన్‌.

1) ఎ, బి 2)  బి, సి, డి 3) ఎ, బి, సి, డి 4) సి 


27. కిణ్వన ప్రక్రియలో వెలువడే వాయువు?    

1) CO2    2) O2   3) NO2   4) H2


28. టెట్రాసైక్లిన్‌ ఏ వ్యాధులను నియంత్రిస్తుంది?

1) టైఫాయిడ్‌  2) క్షయ  3) ప్లేగు  4) పైవన్నీ


29. వ్యాక్సిన్‌ అనే పదం ఏ భాష పదం నుంచి వచ్చింది?

1) ఆంగ్లం   2) లాటిన్‌   3) గ్రీకు   4) జర్మన్‌ 


30. కిందివాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

1) 1796లో ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మశూచికి వ్యాక్సిన్‌  కనుక్కున్నాడు.

2) 1929లో పెన్సిలిన్‌ను కనుక్కున్నది అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌.

3) ప్లాస్మోడియంకు ఆడ క్యూలెక్స్‌ దోమ వాహకం.

4) మలేరియా వ్యాధిపై ప్రయోగాలు చేసింది - రోనార్డ్‌ రాస్‌


31. నీటిని మరిగించడం వల్ల సూక్ష్మజీవులను చంపొచ్చని తెలిపినవారు?

1) లూయీ పాశ్చర్‌     2) రోనాల్డ్‌ రాస్‌     

3) స్పేల్లాంజని     4) కోచ్‌


32. జతపరచండి.

   జాబితా - 1     జాబితా - 2
1) రేబిస్‌ ఎ)జాన్‌ 
2) బీసీజీ బి) లూయీ పాశ్చర్‌ 
3) తట్టు సి) లియోస్‌ కాల్‌మైట్‌
4) పోలియో డి) ఆల్బర్ట్‌ సాబిన్‌

1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి      2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ  

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ     4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 


33. శిశువు పుట్టినప్పుడు మొదటిసారిగా ఇచ్చే వ్యాక్సిన్‌?

1) పోలియో     2) పెంటా వాలెంట్‌ 

3) బీసీజీ     4) పీపీటీ 


34. మొదట బయోటెక్నాలజీ ద్వారా తయారు చేసిన వ్యాక్సిన్‌?

1) రేబిస్‌   2) హెపటైటిస్‌ - బి 

3) బీసీజీ   4) 1, 2 


35. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

1) సూక్ష్మజీవ నాశకాన్ని కనుక్కున్నది - వ్యాక్స్‌మాన్‌ 

2) సూక్ష్మజీవ నాశకాన్ని వాడింది - బేట్స్‌

3) క్లోరోమైసిన్‌ అనేది టైఫాయిడ్‌ను తగ్గిస్తుంది

4) పైవన్నీ


36. అందం అంటే భయపడటాన్ని శాస్త్ర పరిభాషలో ఏమంటారు?

1) కల్లోఫోబియా     2) కొనియొ ఫోబియా 

3) గెట్టో ఫోబియా     4) రూసో ఫోబియా 


37. జాతీయ టీకాల దినోత్సవాన్ని ఎప్పుడు  నిర్వహిస్తారు?

1) మార్చి 15     2) మార్చి 18 

3) మార్చి 16     4) మే 31 


38. మైక్రోగ్లియల్‌ కణాలుండే ప్రాంతం?

1) కాలేయం  2) మెదడు  3) ఎముక  4) క్లోమం 


39. శరీరంలో సంక్రమణ జరిగిన ప్రాంతంలో ఏర్పడిన చీములో అధిక సంఖ్యలో ఉండే కణాలు?

1) బేసోఫిల్స్‌   2) మోనోసైట్స్‌  

3) ఇసినోఫిల్స్‌  4) న్యూట్రోఫిల్స్‌


40. బాలింత చనుబాలలోని ప్రొటీన్‌?

1) కొలస్ట్రమ్‌   2) ప్రొలాక్టిన్‌ 

3) లాక్టిన్‌   4) జైమోజన్‌ 


సమాధానాలు


1-1, 2-4; 3-3; 4-3; 5-2; 6-1; 7-1; 8-2; 9-3; 10-4; 11-1; 12-4; 13-2; 14-3; 15-2; 16-2; 17-1; 18-3; 19-4; 20-4; 21-1; 22-2; 23-1; 24-4; 25-1; 26-3; 27-1; 28-4; 29-2; 30-3; 31-3; 32-1; 33-3; 34-2; 35-4; 36-1; 37-3; 38-2; 39-4; 40-1.


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 
 


 

Posted Date : 31-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌