• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిమాణం - ఉనికి 

 సిక్కిం సరిహద్దుల్లో మూడు దేశాలు!

ప్రపంచ చిత్రపటంలో చూడగానే గుర్తించగలిగే అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. విశాల భూభాగం, మూడువైపుల్లో సుదీర్ఘ సముద్ర తీరం, భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంలో ఉండటంతో పాటు జనాభా పరంగా తొలి స్థానంలో, వైశాల్యంలో ఏడో స్థానంలో ఉపఖండం వర్ధిల్లుతోంది. దేశ భౌగోళిక, రాజకీయ స్వరూపాలపై పరీక్షార్థులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. మొత్తం దేశంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఉనికి, విస్తీర్ణం, అంతర్జాతీయ సరిహద్దులు, వివిధ దేశాలతో ఉన్న సారూప్యతలను, పోలికలను గణాంకాల సహితంగా తెలుసుకోవాలి


1. భారతదేశం వైశాల్యం ప్రపంచ భూభాగంలో ఎంత శాతం ఉంటుంది?

1) 2.6   2) 2.4    3) 2.1   4) 2.8


2. భారతదేశంలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు, గుజరాత్‌కు మధ్య సరాసరి ఎన్ని రేఖాంశాలు ఉంటాయి?

1) 25  2)  28   3)  30   4) 35


3. భారతదేశంలో విస్తీర్ణపరంగా మూడో పెద్ద రాష్ట్రం ఏది?

1) మధ్యప్రదేశ్‌   2)  మహారాష్ట్ర 

 3)  ఉత్తర్‌ప్రదేశ్‌    4) రాజస్థాన్‌


4. జమ్ము - కశ్మీర్, లద్దాఖ్‌ ఏ తేదీన కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి?

1) సెప్టెంబరు 31, 2019 

2)  అక్టోబరు 31, 2019 

 3)  నవంబరు 31, 2019 

 4) డిసెంబరు 31, 2019


5. కింది ఏ రాష్ట్రాన్ని ‘కామరూప’ అని కూడా అంటారు?

1) అరుణాచల్‌ప్రదేశ్‌    2)  నాగాలాండ్‌ 

 3)  మణిపుర్‌   4) అస్సాం


6. భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడినది ఏది?

1) ఉత్తరాఖండ్‌     2) ఛత్తీస్‌గఢ్‌ 

 3)  ఝార్ఖండ్‌     4) తెలంగాణ


7. విస్తీర్ణపరంగా ప్రపంచంలో భారతదేశం కన్నా ముందు ఉన్న దేశం ఏది?

1) బ్రెజిల్‌   2)  ఆస్ట్రేలియా 

 3)  చైనా   4) అమెరికా


8. విస్తీర్ణపరంగా ప్రపంచంలో భారతదేశం తరువాత ఉన్న దేశం ఏది?

1) అర్జెంటీనా   2)  ఆస్ట్రేలియా 

 3)  బ్రెజిల్‌    4) అమెరికా


9. విస్తీర్ణపరంగా రెండో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌   2)  అండమాన్, నికోబార్‌ దీవులు 

 3)  జమ్ము - కశ్మీర్‌   4) చండీగఢ్‌


10. దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలను ఏ తేదీన ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా కలిపారు?

1) 2020, జనవరి 26 

2)  2019, జనవరి 26 

 3)  2021, జనవరి 26 

 4) 2020, నవంబరు 26


11. మూడువైపులా ఒకే రాష్ట్రంతో, మరొకవైపు మరో దేశంతో సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది?

1) అస్సాం   2)  నాగాలాండ్‌ 

 3)  సిక్కిం  4) మేఘాలయ


12. భారతదేశంలో ఎన్ని భూపరివేష్టిత రాష్ట్రాలుఉన్నాయి?

1) 4   2)  5    3)  6    4) 7


13. భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల్లో చిన్నది?

1) తెలంగాణ    2)  ఛత్తీస్‌గఢ్‌ 

 3)  ఝార్ఖండ్‌    4) హరియాణా


14. దేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు తీర రేఖ ఉంది?

1) 3    2)  4   3)  5   4) 2

15. ఏ రాష్ట్రం మూడువైపులా మూడు దేశాలతో, మరో వైపు భారతదేశపు ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది?

1) మేఘాలయ    2)  త్రిపుర 

 3)  సిక్కిం     4) ఉత్తరాఖండ్‌


16. దేశంలోని ఎన్ని రాష్ట్రాలకు అంతర్జాతీయ భూ   సరిహద్దు ఇతర దేశాలతో ఉంది?

1) 18   2)  17   3)  16   4) 15


17. దేశంలోని ఎన్ని రాష్ట్రాలకు తీర రేఖతో పాటు అంతర్జాతీయ భూసరిహద్దు ఉంది?

1) 2    2)  3    3)  4    4) 5


18. మన దేశంలో అతి పొడవైన అంతర్జాతీయ భూసరిహద్దు ఉన్న రాష్ట్రం?

1) రాజస్థాన్‌     2)  ఉత్తర్‌ప్రదేశ్‌ 

 3)  పశ్చిమ బెంగాల్‌    4) బిహార్‌


19. కిందివాటిలో భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌    2)  పుదుచ్చేరి   3)  చండీగఢ్‌   4) జమ్ము-కశ్మీర్‌


20. భారత్‌తో, చైనాకు ఉన్న భూ సరిహద్దు దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు?

1) 3900 కి.మీ.     2)  4200 కి.మీ.   

 3)  3488 కి.మీ.     4) 4300 కి.మీ.


21. భారత్, భూటాన్‌ మధ్య అంతర్జాతీయ      భూసరిహద్దు సరాసరి ఎన్ని కిలోమీటర్లు?

1) 599 కి.మీ.   2)  799 కి.మీ.  

 3)  699 కి.మీ.    4) 499 కి.మీ.


22. కింది ఏ రాష్ట్రానికి/ కేంద్రపాలిత ప్రాంతానికి    అత్యధిక తీర రేఖ ఉంది?

1) గుజరాత్‌      

2)  ఆంధ్రప్రదేశ్‌  

 3) అండమాన్, నికోబార్‌ దీవులు  

 4) మహారాష్ట్ర


23. గుజరాత్‌ తీర రేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు?

1) 1014 కి.మీ.      2)  1214 కి.మీ.  

 3)  996 కి.మీ.   4)1114 కి.మీ.


24. కిందివాటిలో ఏ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు పంచుకోదు?

1) నాగాలాండ్‌    2)  త్రిపుర   

 3)  మిజోరం    4)మణిపుర్‌


25. కిందివాటిలో మూడు దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?

1) సిక్కిం    2)  అరుణాచల్‌ ప్రదేశ్‌   

 3)  పశ్చిమ బెంగాల్‌     4) ఉత్తరాఖండ్‌


26. ప్రస్తుతం భారతదేశ అంతర్జాతీయ భూసరిహద్దు ఎన్ని కిలోమీటర్లు?

1) 13,600 కి.మీ.     2)  15,106 కి.మీ.     

 3)  14,106 కి.మీ.   4) 13,107 కి.మీ.


27. భారత్, నేపాల్‌ మధ్య అంతర్జాతీయ భూసరిహద్దు ఎన్ని కిలోమీటర్లు?

1) 1,941 కి.మీ.    2)  1,643 కి.మీ.     

3)  1,751 కి.మీ.   4) 1,851 కి.మీ.


28. భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న  భూసరిహద్దు ఏది?

1) ఇందిరాకాల్‌    2)  దీపు కనుమ  

 3)  పిగ్మోలియన్‌ పాయింట్‌   4) కిలికిద్వాన్‌ కనుమ


29. కర్కటరేఖ, భారతదేశ ప్రామాణిక రేఖాంశం   కలుసుకునే ప్రాంతం ఏది?

1) జబల్‌పుర్‌      2)  నాగ్‌పుర్‌  

 3)  బైకుంఠపుర్‌    4) రాయ్‌పుర్‌


30. లక్షదీవుల మొత్తం విస్తీర్ణం ఎంత?

1) 34 చ.కి.మీ.    2)  32 చ.కి.మీ.     

 3)  52 చ.కి.మీ.    4) 43 చ.కి.మీ.


31. భారత్‌లోని దీవుల్లో అతిపెద్దది ఏది?

1) ఉత్తర అండమాన్‌   2) దక్షిణ అండమాన్‌  

 3)  మధ్య అండమాన్‌    4) గ్రేట్‌ నికోబార్‌


32. రష్యా భారతదేశం కంటే ఎన్నిరెట్లు పెద్దది?

1) 4    2)  5    3)  3     4) 6


33. విస్తీర్ణపరంగా అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) పుదుచ్చేరి    2)  చండీగఢ్‌     

 3)  లక్షదీవులు   4) లద్దాఖ్‌


34. భూటాన్‌ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలతో    సరిహద్దు పంచుకుంటుంది?

1) 4      2)  5     3)  2      4) 6


35. కిందివాటిలో నేపాల్‌తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది?

1) అస్సాం    2)  సిక్కిం  

 3)  బిహార్‌    4) ఉత్తరాఖండ్‌


36. కిందివాటిలో ఏ రాష్ట్రానికి అత్యధికంగా తీరరేఖ ఉంది?

1) మహారాష్ట్ర      2)  తమిళనాడు  

 3)  పశ్చిమ బెంగాల్‌    4) కేరళ


37. లక్షదీవుల తీరరేఖ పొడవు ఎంత?

1) 106 కి.మీ.    2)  108 కి.మీ.  

 3)  132 కి.మీ.   4) 148 కి.మీ.


38. పాకిస్థాన్‌కు భారత్‌లోని ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది?

1) 4     2)  3     3)  2      4) 5


39. సిక్కింతో సరిహద్దు పంచుకునే ఏకైక రాష్ట్రం?

1) అస్సాం     2)  బిహార్‌  

 3)  పశ్చిమ బెంగాల్‌    4) అరుణాచల్‌ ప్రదేశ్‌


40. అండమాన్‌ నికోబార్‌ దీవుల మొత్తం వైశాల్యం ఎంత? 

1) 8,249 చ.కి.మీ.    2)  6,596 చ.కి.మీ.  

 3)  5,607 చ.కి.మీ.    4) 7,846 చ.కి.మీ.


41. కిందివాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?

1) నాగాలాండ్‌   2)  మిజోరాం   

 3)  త్రిపుర   4) అస్సాం


42. భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు భూపరివేష్టితంగా ఉన్నాయి?

1) 3    2)  2    3)  4   4) 1


43. సాడిల్‌ శిఖరం ఏ నీటిలో ఉంది? 

1) ఉత్తర అండమాన్‌   

2)  మధ్య అండమాన్‌   

 3)  దక్షిణ అండమాన్‌  

 4) గ్రేట్‌ నికోబార్‌


44. బారెన్‌ అగ్నిపర్వతం ఏ దీవిలో ఉంది?

1) గ్రేట్‌ నికోబార్‌      2)  ఉత్తర అండమాన్‌  

 3)  దక్షిణ అండమాన్‌      4) మధ్య అండమాన్‌


45. అండమాన్‌ దీవుల వైశాల్యం ఎంత?

1) 8,249 చ.కి.మీ.    2) 6,596 చ.కి.మీ.    

 3)  7,436 చ.కి.మీ.    4) 6,436 చ.కి.మీ.


46. కిందివాటిలో ఉత్తర్‌ప్రదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?

1) మహారాష్ట్ర     2)  మధ్యప్రదేశ్‌    

 3)  రాజస్థాన్‌    4) ఝార్ఖండ్‌


47. అస్సాం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు        పంచుకుంటుంది?

1) 6    2)  7    3)  8    4) 5


48. కిందివాటిలో ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?

1) ఆంధ్రప్రదేశ్‌    2)  తెలంగాణ   

 3)  ఒడిశా  4) బిహార్‌


49. భారతదేశం విస్తీర్ణంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు ఎన్ని రెట్లు ఎక్కువ?

1) 8  2)  10    3)  12    4) 14


50. ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం ఏది?

1) రష్యా        2) కెనడా  

 3)  అమెరికా    4) చైనా


సమాధానాలు:
 

 1-2; 2-3; 3-2; 4-2; 5-4; 6-3; 7-2; 8-1; 9-3; 10-1; 11-4; 12-2; 13-4; 14-2; 15-3; 16-3; 17-1; 18-3; 19-3; 20-3; 21-3; 22-3; 23-2; 24-2; 25-4; 26-2; 27-3; 28-3; 29-3; 30-2; 31-3; 32-2; 33-3; 34-1; 35-1; 36-2; 37-3; 38-2; 39-3; 40-1; 41-1; 42-2; 43-1; 44-4; 45-2; 46-1; 47-2; 48-4; 49-3; 50-2


రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 04-02-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు