• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయోద్యమం


‘మితవాదం అంటే భిక్షం అడుక్కోవడమే!’


బ్రిటిష్‌ వలస పాలకుల దోపిడీ ధోరణులు, వివక్షాపూరిత విధానాలకు భారతీయులంతా బాధితులయ్యారు. ఆ అసంతృప్తి పెరిగి ఉద్యమంగా మారింది. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనతో అది మరింత తీవ్రమై స్వాతంత్రోద్యమంగా రూపుదిద్దుకుంది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన మితవాద, అతివాద, గాంధేయవాద ఉద్యమాలు జాతిని చైతన్యవంతం చేశాయి. బెంగాల్‌ విభజన, జలియన్‌వాలా బాగ్‌ వంటి ఘటనలు ఉద్యమాన్ని మలుపులు తిప్పాయి. గాంధీజీ నాయకత్వంలో జరిగిన శాంతియుత పోరాటాలతో దేశమంతా ఏకతాటిపై నిలిచి ఆంగ్లేయులను తరిమికొట్టింది. ఈ నేపథ్యంలో జాతీయోద్యమ పరిణామాలు, జాతీయ నాయకుల కృషి గురించి అభ్యర్థులకు అవగాహన ఉండాలి. ఆవిర్భావం నుంచి స్వరాజ్యం సాధించే వరకు కాంగ్రెస్‌ పోషించిన పాత్రను సమగ్రంగా తెలుసుకోవాలి.


1. లండన్‌లో ‘ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌’ సంస్థను స్థాపించిన జాతీయ నాయకుడు ఎవరు?

1) సురేంద్రనాథ్‌ బెనర్జీ  2) దాదాభాయ్‌ నౌరోజీ   3) ఫిరోజ్‌షా మెహతా  4) ఆనంద్‌ మోహన్‌ బోస్‌


2. భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?

1) బొంబాయి 2) కలకత్తా 3) మద్రాస్‌ 4) పాట్నా


3. భారత జాతీయ కాంగ్రెస్‌ తొలికాలం నాటి లక్ష్యాల్లో లేని అంశం?

1) ప్రజల్లో జాతీయభావాన్ని కలిగించి వారిని సమైక్యపరచడం.   

2) ఉమ్మడి రాజకీయ వేదికను ఏర్పరిచి అందరి భాగస్వామ్యాన్ని కోరడం.

3) భారతీయలకు అవసరమైన రీతిలో హిందూ మతాన్ని సంస్కరించి సహకరించడం.

4) భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు, పని విధానాన్ని ప్రోత్సహించడం.


4. 1886లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య?

1) 436    2) 78   3) 516    4) 468


5. కిందివాటిలో మితవాద దశను గుర్తించండి.

1) 1905-1920   2) 1920-1947  3) 1885-1905   4) 1905-1930


6. కింది ఏ సమావేశంలో కాంగ్రెస్‌ అతివాద, మితవాదులుగా చీలింది?

1) కలకత్తా    2) సూరత్‌   3) బొంబాయి   4) మద్రాస్‌


7. 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తరఫున పాల్గొనని దేశం?

1) ఫ్రాన్స్‌   2) రష్యా   3) 1, 2   4) జర్మనీ


8. కిందివాటిలో మితవాదుల లక్ష్యం కానిది ఏది?

1) విధానసభల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడం

2) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను భారత్‌లో కూడా నిర్వహించేలా చేయడం.

3) జాతి వివక్షను తొలగించే ప్రయత్నం చేయడం.

4) భారతదేశాన్ని సంపూర్ణ ఆహార ఉత్పత్తుల ఎగుమతి దేశంగా మార్చడం.


9. భారతదేశంలో స్వదేశీ ఉద్యమానికి ప్రధాన కారణం?

1) బెంగాల్‌ విభజన   2) బ్రిటిష్‌ జాతివివక్ష   3) ప్రాంతీయ భాషాపత్రికల నిషేధ చట్టం 4) ఇల్‌బర్ట్‌ బిల్లు


10. INC మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య?

1) 72    2) 78    3) 430   4) 256


11. బెంగాల్‌ను విభజించిన గవర్నర్‌ జనరల్‌?

1) లార్డ్‌ కానింగ్‌     2) లార్డ్‌ లిన్‌లిత్‌గో  3) లార్డ్‌ కర్జన్‌  4) లార్డ్‌ హార్డింజ్‌-2


12. INCలోని అతివాద, మితవాద అనే రెండు వర్గాలు ఏ సంవత్సరంలో ఐక్యమయ్యాయి?

1) 1907   2) 1916  3) 1920  4) 1924


13. బాలగంగాధర్‌ తిలక్‌ ఎవరితో కలిసి హోంరూల్‌ ఉద్యమం ప్రారంభించారు?

1) సరోజినీ నాయుడు   2) మహాత్మాగాంధీ  3) లాలాలజపతి రాయ్‌  4) అనిబిసెంట్‌ 


14. బెంగాల్‌ విభజన ఏ రోజు జరిగింది?

1) 1905, అక్టోబరు 16      2) 1903, జులై 19   3) 1905, ఆగస్టు 16  4) 1903, జూన్‌ 30


15. ‘కృష్ణా పత్రిక’ ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైంది?

1) మచిలీపట్నం   2) విశాఖపట్నం  3) విజయవాడ   4) శ్రీకాకుళం


16. కిందివాటిలో బెంగాల్‌ విభజన రోజు జరిగిన సంఘటనలు?    

1) కలకత్తాలో హర్తాళ్‌ ప్రకటన    2) విషాద దినంగా పాటించడం   3) గంగానదిలో స్నానం ఆచరించడం  4) పైవన్నీ


17. తిలక్‌ జైలు నుంచి విడుదలైన సంవత్సరం?

1) 1920  2) 1908 3) 1926 4) 1915


18. ‘స్వరాజ్యం నాజన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను’ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి?

1) లాలాలజపతి రాయ్‌      2) బాలగంగాధర్‌ తిలక్‌  3) మహాత్మా గాంధీ  4) సుభాష్‌ చంద్రబోస్‌


19. ఎవరి విధానాలను అతివాదులు ‘భిక్షం అడుక్కోవడం’ అని విమర్శించారు?

1) మితవాదులు  2) గాంధేయవాదులు  3) విప్లవవాదులు  4) కమ్యూనిస్టులు


20. ‘కృష్ణా పత్రిక’ స్థాపించిన సంవత్సరం?

1) 1905  2) 1902  3) 1916  4) 1920


21. బెంగాల్‌ విభజన రోజున బహిరంగ సభలను నిర్వహించి అక్కడ ప్రసంగించిన జాతీయ నాయకులు ఎవరు?

1) సురేంద్రనాథ్‌ బెనర్జీ  2) ఆనంద్‌మోహన్‌ బోస్‌  3) 1, 2  4) సుభాష్‌ చంద్రబోస్‌


22. జాతీయవాదుల ప్రకారం బెంగాల్‌ విభజనకు ప్రధాన కారణం?

1) జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడం    2) పరిపాలనా సౌలభ్యం   3) పరిపాలనలో సంక్షేమాన్ని తీసుకురావడం  4) పైవన్నీ


23. భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి సమావేశానికి అధ్యక్షులు?

1) దాదాభాయ్‌ నౌరోజీ      2) సురేంద్రనాథ్‌ బెనర్జీ  3) డబ్ల్యూ.సి.బెనర్జీ     4) ఆనంద్‌మోహన్‌ బోస్‌


24. స్వదేశీ ఉద్యమం లక్ష్యం కానిది?

1) విదేశీ వస్త్ర బహిష్కరణ  2) స్వదేశీ కళాశాలల స్థాపన  3) ప్రభుత్వ పనిలో సహకరించడం  4) స్వదేశీ పరిశ్రమల స్థాపన


25. స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్‌ కెమికల్‌ స్టోర్‌ను స్థాపించింది?

1) రవీంద్రనాధ్‌ ఠాగూర్‌  2) ఆనంద్‌ మోహన్‌ బోస్‌  3) ప్రఫుల్ల చంద్రరే   4) బాలగంగాధర్‌ తిలక్‌


26. కింది ఏ ఉద్యమం భారతదేశ వస్త్ర పరిశ్రమకు ఊపునిచ్చింది?

1) హోంరూల్‌ ఉద్యమం 2) స్వదేశీ ఉద్యమం  3) క్విట్‌ ఇండియా ఉద్యమం  4) ఏదీకాదు


27. ముట్నూరి కృష్ణారావుతో సంబంధం ఉన్న ప్రముఖ పత్రిక?

1) వందేమాతరం  2) కేసరి  3) కృష్ణ  4) గోల్కొండ


28. ఏ సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చారు?

1) 1915   2) 1917  3) 1920  4) 1918


29. కిందివాటిలో రౌలత్‌ చట్టం కిందకు రానిది?

1) ఉగ్రవాదుల్ని అణచివేయడానికి చేశారు.  2) భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం.

3) పోలీసులకు మితిమీరిన అధికారాలు ఇచ్చారు.  4) దీన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రవేశపెట్టారు


30. కిందివాటిలో ఏ రోజును గాంధీజీ ప్రార్థన గౌరవ భంగ దినంగా పాటించాలని సూచించారు?

1) 1915, మార్చి 22    2) 1919, ఏప్రిల్‌ 13  3) 1919, ఏప్రిల్‌ 6      4) 1920, ఆగస్టు 1


31. హిందూ మహాసభ ఏర్పాటైన సంవత్సరం?

1) 1925  2) 1916  3) 1917  4) 1918


32. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఏ సంఘటనకు నిరసనగా‘ నైట్‌హుడ్‌’ బిరుదును పరిత్యజించారు?

1) జలియన్‌వాలాబాగ్‌ సంఘటన  2) రౌలత్‌ చట్టం 3) సహాయ నిరాకరణ ఉద్యమం   4) క్విట్‌ ఇండియా ఉద్యమం


33. ఏ INC సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు?

1) మద్రాస్‌       2) కలకత్తా  3) నాగ్‌పుర్‌     4) బొంబాయి 


34. హోంరూల్‌ ఉద్యమ ప్రధాన లక్ష్యం?

1) రౌలత్‌ చట్టాన్ని రద్దు చేయడం  2) బెంగాల్‌ విభజనను వ్యతిరేకించడం  3) స్వయం పరిపాలన సాధించడం  4) బ్రిటష్‌ చట్టాలను గౌరవించడం


35. ‘గాంధీజీ స్వరాజ్యం వస్తోంది’ అనే నినాదాన్ని ప్రజలు ఏ ఉద్యమ సమయంలో వాడారు?  

1) చంపారన్‌ ఉద్యమం  2) సహాయ నిరాకరణ ఉద్యమం  3) క్విట్‌ ఇండియా ఉద్యమం  4) స్వదేశీ ఉద్యమం


36. 1923లో జరగాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేసి చట్టసభల్లో ప్రవేశించాలని అభిప్రాయపడిన నాయకులు?

1) చిత్తరంజన్‌ దాస్‌  2) మోతీలాల్‌ నెహ్రూ   3) 1, 2  4) రాజగోపాలాచారి


37. ఏ సంవత్సరంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారు?

1) 1906   2) 1918  3) 1908  4) 1909


38. కింది సంస్థలను దానితో సంబంధం ఉన్న వ్యక్తులతో జతపరచండి.

1) భారత జాతీయ కాంగ్రెస్‌ ఎ) ఆగాఖాన్‌
2) ముస్లింలీగ్‌ బి) ఎ.ఒ.హ్యూమ్‌
3) హిందూ మహాసభ సి) కేశవ్‌ బలరామ్‌ హెగ్డేవార్‌
4) రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ డి) మదన్‌ మోహన్‌ మాలవ్య

1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి   2) 1-బి, 2-ఎ 3-సి, 4-డి   3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి   4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి


39. 1906లో ముస్లింలీగ్‌ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?

1) కలకత్తా 2) చిట్టగాంగ్‌ 3) బొంబాయి 4) ఢాకా


40. ‘జలియన్‌ వాలాబాగ్‌ సంఘటన’ దీని కారణంగా జరిగింది?

1) రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకించడం  2) ఖలీఫా పదవీ పునరుద్ధరణ  3) సైమన్‌ కమిషన్‌ భారత్‌ పర్యటన   4) పైవన్నీ


41. జలియన్‌ వాలాబాగ్‌ సంఘటన జరిగిన సంవత్సరం?

1) 1919, ఏప్రిల్‌ 6  2) 1919, ఏప్రిల్‌ 13  3) 1919, మార్చి 30  4) 1919, జులై 20


42. 1917-18 సంవత్సరాల మధ్య గాంధీజీ చేసిన ఉద్యమాలను ఏ విధంగా పిలుస్తారు?

1) ప్రాంతీయ/స్థానిక ఉద్యమాలు   2) జాతీయ ఉద్యమాలు  3) అంతర్జాతీయ ఉద్యమాలు    4) ఏదీకాదు


43. వందేమాతరం అనే గేయాన్ని ఏ గ్రంథం నుంచి గ్రహించారు?

1) లైఫ్‌ డివైన్‌  2) ప్రబుద్ధ భారత్‌   3) ఆనంద్‌మఠ్‌   4) గీతాంజలి


44. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ?

1) సరోజినీ నాయుడు  2) అనిబిసెంట్‌   3) దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ 4) శారదా దేవి


45. కాంగ్రెస్‌లో పాల్గొన్న మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌ ప్రతినిధి?

1) అనిబిసెంట్‌  2) కాదంబిని గంగూలి   3) సరోజినీ నాయుడు  4) మార్గరేట్‌ నోబెల్‌



సమాధానాలు: 1-2; 2-1; 3-3; 4-1; 5-3; 6-2; 7-4; 8-4; 9-1; 10-1; 11-3; 12-2; 13-4; 14-1; 15-1; 16-4; 17-4; 18-2; 19-1; 20-2; 21-3; 22-1; 23-3; 24-3; 25-3; 26-2; 27-3; 28-1; 29-4; 30-3; 31-1; 32-1; 33-3; 34-3; 35-2; 36-3; 37-4; 38-1; 39-4; 40-1; 41-2; 42-1; 43-3; 44-2.; 45-2.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు
 

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.