• facebook
  • whatsapp
  • telegram

యూపీలో పంచదార.. బెంగాల్‌లో జనపనార!

పరిశ్రమలు

దేశ ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముడిసరకులతో ఉత్పాదక, వినియోగ వస్తువులను తయారుచేస్తూ, ఉపాధి కల్పనతో పాటు వేగవంతమైన వృద్ధికి చోదకాలుగా పనిచేస్తాయి. స్వాతంత్య్రానంతరం మొదట ప్రభుత్వ పరంగా, ఆ తర్వాత ప్రైవేటు వ్యవస్థల్లో బలమైన పునాదులు పడటంతో పారిశ్రామికంగా చెప్పుకోదగిన ప్రగతి సాధ్యమైంది. భారతదేశంలో పరిశ్రమల ప్రస్థానం, కీలకమైన ఇనుము-ఉక్కు పరిశ్రమల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. మౌలిక, ఉత్పాదక, వినియోగ రంగాలవారీగా తొలుత ఏర్పాటైన పరిశ్రమలు, వాటి స్థానాలు, ప్రత్యేకతలు, పంచవర్ష ప్రణాళికల కాలంలో స్థాపించిన ప్రధాన పరిశ్రమలు, అందుకు సహకరించిన దేశాలను గుర్తుంచుకోవాలి. వివిధ పరిశ్రమలు కేందీకృతమైన ప్రాంతాలు, ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ప్రధాన పరిశ్రమలు, పనితీరు ఆధారంగా వాటికి కల్పించే హోదాల గురించి తెలుసుకోవాలి.


1.    మనదేశంలోని మొదటి టెక్స్‌టైల్‌ మిల్లు ఎప్పుడు స్థాపించారు?

1) 1818  2) 1819  3) 1918   4) 1899


2.     గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఏ నదీ తీరాన ఉంది?

1) మహానది     2) సబర్మతి  

3) నర్మద      4) తపతి


3.     ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా’గా ఏ నగరాన్ని పిలుస్తారు?

1) సూరత్‌     2) ముంబయి 

3) కాన్పూర్‌     4) అహ్మదాబాద్‌


4.     ‘టెక్సియర్‌’ అనేది ఏ భాషా పదం?

1) లాటిన్‌       2) గ్రీకు   

3) ఫ్రెంచ్‌       4) అరబిక్‌


5.     టిస్కో కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1904   2) 1919  3) 1907   4) 1905


6.     ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఆసియా’గా ఏ నగరాన్ని పిలుస్తారు?

1) ఢాకా     2) కొలంబో 

3) కోయంబత్తూర్‌     4) ఒసాకా


7.     జనపనార మిల్లులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) ఝార్ఖండ్‌     2) బిహార్‌ 

3) ఒడిశా     4) పశ్చిమ బెంగాల్‌


8.     'National Institute of Fashion Technology' ఏ నగరంలో ఉంది?

1) ముంబయి     2) చెన్నై 

3) హైదరాబాదు     4) ఢిల్లీ


9.     కిందివాటిలో 'City of Weaver'  అని  దేన్ని పిలుస్తారు?

1) అమృత్‌సర్‌     2) పానిపట్‌ 

3) కాన్పూర్‌     4) పట్నా


10. కింది ఏ దేశాన్ని ‘బంగారు ఉన్ని దేశం’ అంటారు?

1) ఇండొనేసియా     2) భారతదేశం 

3) ఆస్ట్రేలియా     4) అమెరికా


11. కిందివాటిలో ‘బరువును కోల్పోయే పరిశ్రమ’ అని దేనిని పిలుస్తారు?

1) పట్టు      2) ఉన్ని  

3) నూలు      4) పంచదార


12. భారతదేశంలో మొదటి ఉన్ని పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1881  2) 1876   3) 1914   4)1886


13. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నిని సేకరించే తెగ?

1) గుజ్జర్‌     2) బెకర్‌వాల్స్‌ 

3) గద్దీలు     4) గోండులు


14. ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

1) బెంగళూరు     2) చెన్నై 

3) తిరువనంతపురం     4) కోయంబత్తూర్‌


15. కిందివాటిలో ‘బరువుని కోల్పోని పరిశ్రమ’ అని దేన్ని పిలుస్తారు?

1) నూలు      2) పట్టు  

3) ఉన్ని      4) పైవన్నీ


16. 'Golden Fiber of India' గా ఏ పరిశ్రమను పిలుస్తారు?    

1) ఉన్ని      2) పట్టు  

3) జనపనార      4) నూలు


17. భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?    

1) 1876  2) 1855  3) 1859   4) 1891


18. మొదటి పట్టు పరిశ్రమను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?    

1) కర్ణాటక     2) పశ్చిమ బెంగాల్‌ 

3) తమిళనాడు     4) బిహార్‌


19. Sugar bowl of India' గా భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

1) బిహార్‌     2) గుజరాత్‌ 

3) మధ్యప్రదేశ్‌     4) ఉత్తర్‌ప్రదేశ్‌


20. కేంద్ర తోళ్ల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?

1) చెన్నై      2) ముంబయి  

3) కాన్పూర్‌       4) దిల్లీ


21. భారతదేశంలో పంచదార మిల్లును మొదట ఏ రాష్ట్రంలో స్థాపించారు?

1) బిహార్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) తమిళనాడు     4) పశ్చిమ బెంగాల్‌ 


22. ‘హవానా ఆఫ్‌ ఇండియా’గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

1) తమిళనాడు     2) కర్ణాటక 

3) ఆంధ్రప్రదేశ్‌     4) మహారాష్ట్ర


23. భారతదేశంలో మొదటి కాగితపు పరిశ్రమను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?

1) బాలిగంజ్‌     2) సేరంపుర్‌  

3) చెన్నై     4) బెంగళూరు


24. అగ్గిపుల్లలకు సంబంధించి మొదటి పరిశ్రమను అహ్మదాబాద్‌లో ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1941  2) 1931  3) 1921  4) 1911


25. కిందివాటిలో 3వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసిన ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని గుర్తించండి.

1) బిలాయి      2) రూర్కెలా  

3) బొకారో     4) దుర్గాపుర్‌


26. భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

1) తమిళనాడు      2) పశ్చిమ బెంగాల్‌    

3) ఝార్ఖండ్‌      4) మహారాష్ట్ర


27. భారతదేశంలో అతిపురాతన ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?

1) టిస్కో      2) బిలాయి 

3) దుర్గాపుర్‌      4) రూర్కెలా


28. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది తీరాన ఉంది?

1) సువర్ణరేఖ       2) బ్రాహ్మణి  

3) మహానది      4) దామోదర్‌


29. బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు?

1) రష్యా  2) జపాన్‌ 3) జర్మనీ 4) అమెరికా


30. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో, ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) ఒడిశా - 1959    2) ఛత్తీస్‌గఢ్‌ - 1957  

3) ఝార్ఖండ్‌ - 1957  4) పశ్చిమ బెంగాల్‌ - 1959


31. దుర్గాపుర్‌ ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు?

1) అమెరికా      2) రష్యా  

3) బ్రిటన్‌      4) జర్మనీ


32. దుర్గాపుర్‌ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది?

1) సువర్ణరేఖ      2) దామోదర నది    

3) మహానది     4) బ్రాహ్మణి నది


33. భారతదేశంలోని అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏది?

1) దుర్గాపుర్‌ 2) టిస్కో 3) బొకారో 4) బిలాయి


34. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు?

1) 3వ    2) 4వ     3) 6వ     4) 7వ 


35. కింది ఏ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో స్థాపించారు?

1) బిలాయి  2) రూర్కెలా     3) దుర్గాపుర్‌  

4) విజయనగర్‌ ఇనుము ఉక్కు కర్మాగారం


36. 'Steel Authority of India Limited' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) కోల్‌కతా 2) న్యూఢిల్లీ 3) చెన్నై 4) హైదరాబాద్‌


37. భారతదేశంలో మొదటి సిమెంటు కర్మాగారం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1901  2) 1904  3) 1907  4) 1914


38. ‘హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌’ను ఎప్పుడు స్థాపించారు?

1) 1964  2) 1954  3) 1974  4) 1984


39. రైల్వే పరిశ్రమకు సంబంధించిన వీల్‌ అండ్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ ఏ ప్రాంతంలో ఉంది?

1) పాటియాలా - పంజాబ్‌       2) ఎలహంక - కర్ణాటక 

3) రాయ్‌బరేలి - ఉత్తర్‌ప్రదేశ్‌      4) కపుర్తల - పంజాబ్‌


40. భారతదేశంలో మొదటి నౌకా నిర్మాణ పరిశ్రమ ఏది?

1) కొచ్చి షిప్‌యార్డ్‌  2) హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ 

3) గోవా షిప్‌యార్డ్‌  4) మజగావ్‌డాక్‌యార్డ్‌ 


41. ఏ సంవత్సరం నుంచి కంపెనీలకు మహారత్న హోదాను ప్రకటిస్తున్నారు?    

1) 2009  2) 2007  3) 1997  4) 1999


42. హిందుస్థాన్‌ మెషిన్‌టూల్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు? 

1) 1964  2) 1953  3) 1949  4) 1973


43. ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు?

1) 1991  2) 1971  3) 1961  4) 1981


44. కిందివాటిలో నవరత్న హోదా పొందని కంపెనీ ఏది? 

1) భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌    2) ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌

3) హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ 4) హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌


45. ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది?

1) వారణాసి - ఉత్తర్‌ప్రదేశ్‌     2) పెరంబదూర్‌ - తమిళనాడు

3) కపుర్తల - పంజాబ్‌     4) పాటియాలా - పంజాబ్‌


46. అల్యూమినియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1947  2) 1957  3) 1937  4) 1977


47. హిందుస్థాన్‌ యాంటీబయోటిక్స్‌ లిమిటెడ్‌ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?

1) మధ్యప్రదేశ్‌ - భోపాల్‌      2) మహారాష్ట్ర - పింప్రి 

3) కర్ణాటక - బెంగళూరు      4) తమిళనాడు - చెన్నై


48. భారతదేశంలో కంపెనీలకు నవరత్న హోదాను ఏ సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు?

1) 1997  2) 1999  3) 1973  4) 1957


49. కిందివాటిలో మహారత్న హోదా పొందని సంస్థను గుర్తించండి.

1) కోల్‌ ఇండియా లిమిటెడ్‌     2) గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 

3) స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌     4) భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌


50. కిందివాటిలో దేనిని సన్‌రైజ్‌ పరిశ్రమ అని కూడా అంటారు?

1) ఇనుము - ఉక్కు పరిశ్రమ     2) సమాచార - సాంకేతిక పరిశ్రమ 

3) వస్త్ర పరిశ్రమ       4) ఏదీకాదు



సమాధానాలు

1-1; 2-2; 3-4; 4-1; 5-3; 6-4; 7-4; 8-3; 9-2; 10-3; 11-4; 12-2; 13-3; 14-4; 15-4; 16-3; 17-2; 18-2; 19-4; 20-1; 21-2; 22-3; 23-2; 24-3; 25-3; 26-1; 27-1; 28-2; 29-1;  30-1; 31-3; 32-2; 33-3; 34-2; 35-4; 36-2; 37-2; 38-1;  39-2; 40-2; 41-1; 42-2; 43-3; 44-4; 45-2; 46-3; 47-2; 48-1; 49-4; 50-2. 


 

రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌