• facebook
  • whatsapp
  • telegram

నీటిపారుదల ప్రాజెక్టులు

పెరియార్‌పై ఇడుక్కి.. జీలంపై తుల్‌బుల్‌!

 వ్యవసాయ ఆధారిత భారతదేశంలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉపరితల నీటి వనరులు, భూగర్భజలాల లభ్యత ఒకే విధంగా లేని ప్రాంతాల్లో ఆ లోటును తీర్చడంతో పాటు వ్యవసాయం స్థిరంగా, ప్రగతి పథంలో సాగడానికి ప్రాజెక్టులు కీలకంగా సాయపడుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఇంజినీరింగ్‌ నిర్మాణాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. తాగు, సాగు నీటిని, జలవిద్యుత్తును అందిస్తూ ఆధునిక దేవాలయాలుగా పేరు పొందిన ప్రధాన ప్రాజెక్టులు, వాటిని కట్టిన ప్రాంతాలు, విశేషాలు, ముఖ్యమైన కాలువలతో పాటు అంతర్రాష్ట్ర వివాదాలున్న ఆనకట్టల గురించి తెలుసుకోవాలి.



1.  భారీ నీటిపారుదల ప్రాజెక్టులు సాధారణంగా ఎంత ఆయకట్టు ప్రాంతం కలిగి ఉంటాయి? 

ఎ) 5000 హెక్టార్ల కంటే ఎక్కువ     

బి) 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ 

సి) 2000 హెక్టార్ల కంటే ఎక్కువ    

డి) 15,000 హెక్టార్ల కంటే ఎక్కువ 



2. భారతదేశంలో తెహ్రీ డ్యామ్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

ఎ) ఉత్తర్‌ప్రదేశ్‌   బి) ఉత్తరాఖండ్‌   

సి) బిహార్‌    డి) పశ్చిమ బెంగాల్‌

3.   భారతదేశంలో చంబల్‌ లోయ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు? 

ఎ) రాజస్థాన్, మధ్యప్రదేశ్‌    బి) రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌  

సి) ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌   డి) రాజస్థాన్, హరియాణా



4.   దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

ఎ) 1949   బి) 1948   సి) 1950    డి) 1951 



5.  ముళ్లపెరియార్‌ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు? 

ఎ) తమిళనాడు, కర్ణాటక     బి) కర్ణాటక, కేరళ 

సి) తమిళనాడు, కేరళ    డి) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ 



6.  రాంగంగా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? 

ఎ) ఉత్తర్‌ప్రదేశ్‌        బి) ఉత్తరాఖండ్‌      

 సి) బిహార్‌         డి)  హిమాచల్‌ప్రదేశ్‌ 



7.   బాబ్లీ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు? 

ఎ) తెలంగాణ, కర్ణాటక       

బి) తెలంగాణ, మహారాష్ట్ర 

సి) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌   

డి) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ 



8. ఇడుక్కి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?

ఎ) కావేరి       బి) పెరియార్‌    

సి) నర్మద         డి) తపతి 


9. భారతదేశంలో రెండో ఎత్తయిన ప్రాజెక్టు ఏది? 

ఎ) నాగార్జున సాగర్‌        బి) సర్దార్‌ సరోవర్‌ 

సి) భాక్రానంగల్‌           డి) హీరాకుడ్‌ 



10. మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు సాధారణంగా ఎంత ఆయకట్టు ప్రాంతం కలిగి ఉంటాయి?

ఎ) 2000 నుంచి 5000 హెక్టార్లు       బి) 5000 నుంచి 10,000 హెక్టార్లు

సి) 2000 నుంచి 10,000 హెక్టార్లు     డి) 7000 నుంచి 10,000 హెక్టార్లు 



11. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

ఎ) మహారాష్ట్ర      బి) గుజరాత్‌   

సి) మధ్యప్రదేశ్‌      డి) రాజస్థాన్‌



12. భారతదేశంలో ఎత్తయిన నీటిపారుదల ప్రాజెక్టు ఏది?

ఎ) రాంగంగ        బి) భాక్రానంగల్‌  

సి) తెహ్రీ డ్యామ్‌      డి) గండక్‌


13. కిసాన్‌ గంగ ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు?    

ఎ) ఇండియా, పాకిస్థాన్‌      బి) ఇండియా, చైనా

సి) ఇండియా, బంగ్లాదేశ్‌    డి) ఇండియా, భూటాన్‌


14. ఉకాయి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?

ఎ) నర్మద      బి) తపతి  

సి) మహి      డి) సబర్మతి



15. ‘తిపాయిముఖ్‌’ ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు?

ఎ) ఇండియా, చైనా      బి) ఇండియా, పాకిస్థాన్‌

సి) ఇండియా, బంగ్లాదేశ్‌   డి) ఇండియా, నేపాల్‌ 



16. దుల్‌హస్తీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) జీలం      బి) చినాబ్‌   

సి) రావి       డి) బియాస్‌ 



17. మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు?

ఎ) ఆంధ్రప్రదేశ్, ఒడిశా       బి) ఒడిశా, తెలంగాణ

సి) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  డి) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 


18. మాతాటిల్లా ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు?

ఎ) ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌    

బి) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 

సి) మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌     

డి) ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌ 



19. మెట్టూరు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

ఎ) కర్ణాటక    బి) తమిళనాడు    

సి) కేరళ    డి) ఆంధ్రప్రదేశ్‌ 



20. గోవింద వల్లభ్‌ పంత్‌ సాగర్‌ కృత్రిమ సరస్సు ఏ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏర్పడింది? 

ఎ) ఫరక్కా       బి) రిహంద్‌   

సి) గండక్‌        డి) భాక్రానంగల్‌



21. కిందివాటిలో చంబల్‌ నదీ లోయ ప్రాజెక్టుకు సంబంధించింది?

ఎ) గాంధీసాగర్‌       బి) రాణాప్రతాప్‌ సాగర్‌ 

సి) జవహర్‌ సాగర్‌     డి) ఇందిరా సాగర్‌


22. నాథ్‌పా జాక్రీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) చినాబ్‌       బి) బియాస్‌   

సి) సట్లెజ్‌      డి) రావి


23. సింధూ నది జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?

ఎ) 1960  బి) 1950  సి) 1970  డి) 1980



24. ఫరక్కా ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?

ఎ) గోదావరి      బి) యమున 

సి) సింధూ     డి) గంగా 



25. నర్మదా లోయ ప్రాజెక్టులో అతిపెద్ద ప్రాజెక్టు ఏది?

ఎ) సర్దార్‌ సరోవర్‌     బి) ఓంకారేశ్వర్‌ 

సి) మహేశ్వర్‌     డి) ఇందిరాసాగర్‌



26. నారాయణపుర్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) కృష్ణా      బి) గోదావరి  

సి) నర్మదా      డి) తపతి


27. ‘చిప్కో’ ఉద్యమం ఏ రాష్ట్రంలో చేపట్టారు?

ఎ) ఉత్తర్‌ప్రదేశ్‌     బి) కేరళ 

సి) తమిళనాడు     డి) ఉత్తరాఖండ్‌


28. ఊరి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) జీలం  బి) రావి  సి) చినాబ్‌  డి) బియాస్‌



29. భగ్లీహర్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) జీలం      బి) చినాబ్‌  

సి) రావి      డి) బియాస్‌


30. ఇందిరాగాంధీ కాలువ ఏ ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది?

ఎ) ఫరక్కా      బి) గండక్‌  

సి) హరికే      డి) థెయిన్‌



31. థెయిన్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) చినాబ్‌  బి) రావి  సి) జీలం  డి) బియాస్‌



32. కింది ఏ ప్రాజెక్టులోని నీటిని నేపాల్, ఇండియాలు పంచుకుంటున్నాయి?

ఎ) రాంగంగా     బి) కోసి 

సి) హీరాకుడ్‌     డి) భాక్రానంగల్‌


33. కబిని ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

ఎ) కేరళ     బి) కర్ణాటక 

సి) తమిళనాడు   డి) మహారాష్ట్ర


34. జవహర్‌ సాగర్‌ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?

ఎ) బెట్వా      బి) సోన్‌   

సి) చంబల్‌    డి) కెన్‌



35. కృష్ణరాజసాగర్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) గోదావరి       బి) కృష్ణా  

సి) కావేరి      డి) పాలర్‌



36. ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?

ఎ) మార్చి 20     బి) మార్చి 21 

సి) మార్చి 23     డి) మార్చి 22



37. పోంగ్‌ డ్యామ్‌ ఏ నదిపై నిర్మిచారు?

ఎ) రావి   బి) బియాస్‌   సి) జీలం   డి) కోసి


38. తెలుగు గంగ కాలువ ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించింది?

ఎ) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 

బి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 

సి) కర్ణాటక, తమిళనాడు 

డి) తెలంగాణ, కర్ణాటక



39. తెహ్రీ డ్యామ్‌ ఎత్తు ఎంత?

ఎ) 268 మీ.   బి) 250 మీ.

సి) 270 మీ.   డి) 261 మీ.


40. భాక్రానంగల్‌ ప్రాజెక్టు నిర్మాణం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?

ఎ) 4వ    బి) 3వ     సి) 2వ    డి) 1వ 



41. ఇచ్చినవాటిలో అతి పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట ఏది?    

ఎ) భాక్రానంగల్‌     బి) హీరాకుడ్‌ 

సి) రాంగంగా     డి) తెహ్రీ



42. గోబింద్‌సాగర్‌ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?

ఎ) పంజాబ్‌     బి) హరియాణా 

సి) హిమాచల్‌ప్రదేశ్‌     డి) ఉత్తరాఖండ్‌



43. గోబింద్‌సాగర్‌ సరస్సు ఏ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏర్పడింది?

ఎ) రాంగంగా     బి) గండక్‌ 

సి) తెహ్రీ     డి) భాక్రానంగల్‌



44. భాక్రానంగల్‌ ప్రాజెక్టు మొత్తం ఎత్తు ఎంత?

ఎ) 250 మీ.     బి) 261 మీ. 

సి) 226 మీ.     డి) 270 మీ.



45. చిప్కో ఉద్యమం నాయకుడు ఎవరు?

ఎ) సుందర్‌లాల్‌ బహుగుణ    బి) మేధాపాట్కర్‌ 

సి) నమత్రా పాట్కర్‌    డి) అరుంధతీ రాయ్‌



46. బిష్ణోయి ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?

ఎ) కర్ణాటక     బి) తమిళనాడు    

సి) కేరళ     డి) పశ్చిమ బెంగాల్‌



47. ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమ నాయకులు ఎవరు?

ఎ) మేధా పాట్కర్‌    బి) సుందర్‌లాల్‌ బహుగుణ     

సి) సుందర్‌లాల్‌ పట్వా   డి) అరుంధతీ రాయ్‌



48. భారతదేశంలో అతి పొడవైన పంట కాలువ ఏది?

ఎ) జవహర్‌ కాలువ    బి) ఇందిరాగాంధీ కాలువ 

సి) బకింగ్‌ హామ్‌ కాలువ    డి) లాల్‌బహదూర్‌ శాస్త్రి కాలువ



49. భగ్లీహర్‌ ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య  వివాదాస్పదమైంది?

ఎ) ఇండియా-నేపాల్‌     బి) ఇండియా-చైనా 

సి) ఇండియా-పాకిస్థాన్‌     డి) ఇండియా-బంగ్లాదేశ్‌



50. తుల్‌బుల్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

ఎ) జీలం      బి) చీనాబ్‌  

సి) రావి      డి) బియాస్‌


సమాధానాలు
1-బి; 2-బి; 3-ఎ; 4-బి; 5-సి; 6-బి; 7-బి; 8-బి; 9-సి; 10-సి; 11-బి; 12-సి; 13-ఎ; 14-బి; 15-సి; 16-బి; 17-ఎ; 18-ఎ; 19-బి; 20-బి; 21-డి; 22-సి; 23-ఎ; 24-డి; 25-ఎ; 26-ఎ; 27-డి;  28-ఎ; 29-బి; 30-సి; 31-బి; 32-బి; 33-బి; 34-సి; 35-సి;  36-డి; 37-బి; 38-బి; 39-డి; 40-డి; 41-బి; 42-సి 43-డి;  44-సి; 45-ఎ; 46-సి; 47-ఎ; 48-బి; 49-సి; 50-ఎ.


 

రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 25-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.