• facebook
  • whatsapp
  • telegram

నీటిపారుదల ప్రాజెక్టులు

నీటి వనరుల్లో అరవైశాతం కుంటలే!


 జలజల పారే నీళ్లకు నిలకడ నేర్పి, బీడు భూములను తడిపి దేశాన్ని అన్నపూర్ణగా మార్చిన ఆధునిక దేవాలయాలు నీటి ప్రాజెక్టులు. సాగు భూమిని స్థిరీకరించి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అండగా నిలిచిన అధునాతన కట్టడాలు. అందుకే వాటిని స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు ప్రాధాన్య అంశాలుగా గుర్తించి నిర్మించాయి. రాష్ట్రాల వారీగా ప్రధాన నదులపై నిర్మించిన ముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రత్యేకతలు, వాటితో సంబంధం ఉన్న ఉద్యమాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. సాగునీటి వనరుల రకాలు, దేశవ్యాప్తంగా వాటి విస్తరణ తీరు, రాష్ట్రాల వారీగా నీటి వనరుల వివరాలను తెలుసుకోవాలి.

1. ‘ఆక్సిలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగామ్‌’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 

1) 1976 - 77     2) 1966 - 67   3) 1996 - 97     4) 1987 - 88



2. భాక్రానంగల్‌ ప్రాజెక్టు నిర్మాణం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైంది?     

1) 2వ    2) 3వ     3) 4వ     4) 1వ 



3. ఏ రాష్ట్రంలో భైరవానితిప్ప కాలువ ఉంది?

1) తమిళనాడు     2) ఆంధ్రప్రదేశ్‌    3) కర్ణాటక     4) తెలంగాణ 



4. పాకిస్థాన్‌ ఏ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ బ్యాంకులో ఫిర్యాదు చేసింది? 

1) భగ్లీహార్‌     2) తుల్‌భుల్‌    3) సలాల్‌   4) దుల్‌హస్తీ



5. మైథాన్‌ డ్యామ్‌ ఏ నదీలోయ ప్రాజెక్టులో భాగం? 

1) నర్మదా లోయ   2) చంబల్‌ లోయ   3) దామోదర లోయ   4) ఏదీకాదు



6. తిలైయ డ్యామ్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఝార్ఖండ్‌   2) ఛత్తీస్‌గఢ్‌   3) ఒడిశా   4) పశ్చిమ బెంగాల్‌ 


 

7. ఇందిరా సాగర్‌ డ్యామ్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర  2) మధ్యప్రదేశ్‌   3) రాజస్థాన్‌     4) గుజరాత్‌



8. నర్మదా బచావో ఆందోళన్‌ ఎవరి నాయకత్వంలో జరిగింది?

ఎ) మేధా పాట్కర్‌      బి) బాబా ఆమ్టే 

సి) రాజేంద్ర సింగ్‌     డి) సలీం అలీ

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ



9. గోవింద వల్లభ్‌ పంత్‌ జలాశయం ఏ డ్యామ్‌ నిర్మించడం వల్ల ఏర్పడింది? 

1) భాక్రా డ్యామ్‌  2) నంగల్‌ డ్యామ్‌   3) రిహండ్‌ డ్యామ్‌   4) తెహ్రీ డ్యామ్‌



10. కిందివాటిలో గుజరాత్‌లోని డ్యామ్‌లను గుర్తించండి.    

ఎ) కాక్రపార   బి) కర్జన్‌   సి) మతాతిల్ల   డి) థెయిన్‌

1) ఎ, బి    2) బి, సి    3) సి, డి    4) డి, ఎ



 

11. కుల్సీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? 

1) అరుణాచల్‌ ప్రదేశ్‌  2) అస్సాం   3) గుజరాత్‌   4) మహారాష్ట్ర 


12. కిందివాటిలో పునాస డ్యామ్‌గా దేన్ని పిలుస్తారు? 

1) ఇందిరా సాగర్‌ డ్యామ్‌   2) నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు  

3) సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు   4) కాళేశ్వరం డ్యామ్‌ 



13. నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

1) 1975    2) 1965   3) 1985    4) 1995 



14. రంగిట్‌ డ్యామ్‌ ఏ నదిపై ఉంది?

1) బ్రహ్మపుత్ర   2) మానస్‌   3) తీస్తా    4) సంకోష్‌


15. కిందివాటిని జతపరచండి. 

ప్రాజెక్టు నది
ఎ) కృష్ణరాజసాగర్‌ 1) గోదావరి నది
బి) జయక్వాడ్‌ 2) కావేరి నది
సి) తేనుఘాట్‌ 3) రావి నది
డి) థెయిన్‌  4) దామోదర నది

1) ఎ-1, బి-2, సి-3, డి-4     2) ఎ-2, బి-1, సి-4, డి-3 

3) ఎ-3, బి-4, సి-2, డి-1     4) ఎ-4, బి-3, సి-2, డి-1


 

16. రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌     2) రాజస్థాన్‌   3) మహారాష్ట్ర    4) మధ్యప్రదేశ్‌ 



17. కిషన్‌గంగా ప్రాజెక్టు పరిశీలనకు ఏర్పాటుచేసిన కమిటీ ఏది?

1) స్క్వీబెల్‌   2) స్టోక్స్‌  3) క్యాంబెల్‌    4) రిచ్‌మెన్‌


18. చుటక్‌ జలవిద్యుత్తు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) హిమాచల్‌ ప్రదేశ్‌     2) లద్దాఖ్‌   3) జమ్ము-కశ్మీర్‌     4) ఉత్తరాఖండ్‌ 


 

19. అధిక సరస్సులున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఎన్నో స్థానంలో ఉంది?

1) 2వ    2) 4వ   3)  3వ   4) 1వ



20. మొదటి జలవనరుల గణన ప్రకారం సరస్సులు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?

1) బిహార్‌   2) తమిళనాడు    3) అస్సాం   4) ఒడిశా 



21. జలవనరుల గణన ప్రకారం నీటి సంరక్షణ పథకాలు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం? 

1) గుజరాత్‌   2) ఆంధ్రప్రదేశ్‌   3) మహారాష్ట్ర     4) తెలంగాణ 



22. నీటికుంటలు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌   2) అస్సాం   3) ఆంధ్రప్రదేశ్‌   4) ఝార్ఖండ్‌


 

23. రిజర్వాయర్లు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌   2) ఒడిశా    3) ఝార్ఖండ్‌   4) అస్సాం



24. జలవనరుల నివేదిక ప్రకారం మొత్తం నీటి వనరుల్లో ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి?

1) 40,446    2) 37,678   3) 45,476    4) 38,496



25. మొత్తం జలవనరుల్లో ఎంత శాతం వనరులు మానవ నిర్మితమైనవి?

1) 48%   2) 58%   3) 78%   4) 88% 



26. జలవనరుల నివేదిక ప్రకారం ప్రాంతాల వారీగా చూసినప్పుడు గిరిజనుల ప్రాంతంలో ఎంత శాతం నీటి వనరులున్నాయి?

1) 10.7%    2) 9.6%   3) 7.6%    4) 8.6%



27. జలవనరుల గణన ప్రకారం మొత్తం నీటి వనరుల్లో సహజనీటి వనరుల శాతం? 

1) 22%    2) 33%   3) 44%   4) 55%



28. మొత్తం జలవనరుల్లో వరద ప్రభావిత ప్రాంతాలు ఎంత శాతం ఉన్నాయి?

1) 7.7%    2) 8.8%   3) 4.4%    4) 9.7%



29.  మొత్తం జలవనరుల్లో నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతాలు ఎంత శాతం ఉన్నాయి?

1) 2%   2) 4%   3) 9%    4) 10% 

30. జలవనరుల గణన ప్రకారం మొత్తం నీటి వనరుల్లో అధిక వనరులున్న రాష్ట్రం ఏది?

1) ఒడిశా   2) అరుణాచల్‌ ప్రదేశ్‌   3) అస్సాం   4) పశ్చిమ బెంగాల్‌


 

31. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎన్ని నీటి వనరులున్నాయి?

1) 7,47,480     2) 5,47,400    3) 7,39,000     4) 10,40,000



32. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం నీటివనరుల శాతం ఎంత?

1) 20%    2) 40%   3) 15%    4) 10% 


33. భారతదేశంలో మొత్తం నీటి వనరుల్లో నీటి కుంటలు ఎంత శాతం ఉన్నాయి? 

1) 59.5%   2) 55.5%   3) 45.5%     4) 49.4% 


34. భారతదేశంలోని మొత్తం నీటి వనరుల్లో నీటి కుంటలు ఎన్ని?

1) 14,14,000     2) 14,42,993     3) 14,10,210     4) 14,11,112 



35. భారతదేశంలోని మొత్తం నీటి వనరుల్లో చెరువులు ఎంత శాతం?

1) 14.7%   2) 16.7%    3) 15.7%   4) 17.7%


36. మన దేశంలోని మొత్తం నీటి వనరుల్లో చెరువులు ఎన్ని? 

1) 3,81,805     2) 2,91,981    3) 4,91,981     4) 5,41,401



37. భారతదేశంలోని మొత్తం రిజర్వాయర్ల సంఖ్య ఎంత?

1) 3,92,280     2) 3,10,192    3) 2,92,280     4) 4,92,910 


38. మన దేశంలోని మొత్తం నీటి వనరుల్లో రిజర్వాయర్ల శాతం ఎంత?

1) 12.1%   2) 14.1%   3) 15.1%    4) 17.1% 


 

39. భారతదేశంలో జలవనరుల గణన ప్రకారం రిజర్వాయర్లు అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఏది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌   2) బిహార్‌   3) ఒడిశా  4) ఆంధ్రప్రదేశ్‌



40. ఉత్తర భారతదేశంలో మొత్తం ఎన్ని నీటి వనరులున్నాయి?

1) 3,45,410   2) 2,10,450   3) 2,45,087   4) 4,45,210 



41. మనదేశంలో మొత్తం నీటి వనరుల్లో చెరువులు అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఏది?

1) హిమాచల్‌ ప్రదేశ్‌     2) ఆంధ్రప్రదేశ్‌    3) అస్సాం    4) తమిళనాడు



42. కిందివాటిలో సరికాని జత?

1) బాబ్లీ - గోదావరి నది    2) ఫరక్కా - గంగానది 

3) ఎల్లంపల్లి - కృష్ణానది   4) ప్రియదర్శిని - కృష్ణానది

43. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) ఉకాయ్‌ డ్యామ్‌ - తపతి   2) పులిచింతల - కృష్ణా 

3) ఓంకారేశ్వర్‌ - నర్మదా     4) రంజిత్‌ సాగర్‌ - తపతి



44. బన్‌సాగర్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

1) సోన్‌    2) తపతి   3) బెట్వా    4) నర్మదా



45. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం నీటివనరుల శాతం ఎంత?

1) 10.7%   2) 7.9%   3) 8.9%   4) 6.1% 


 

46. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం నీటివనరులు ఎన్ని?

1) 1,90,777   2) 1,81,837   3) 1,72,492   4) 1,92,492 



47. రిజర్వాయర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో స్థానంలో ఉంది?

1) 1వ    2) 3వ   3) 5వ   4) 2వ



48. ఈశాన్య భారతదేశంలోని అస్సాంలో ఉన్న మొత్తం నీటివనరుల సంఖ్య ఎంత? 

1) 1,72,492     2) 2,92,420    3) 1,82,837     4) 2,82,330 



49. అస్సాంలో మొత్తం నీటివనరుల శాతం ఎంత? 

1) 7.5%    2) 7.1%   3) 7.9%   4) 10.1%


సమాధానాలు

1-3; 2-4; 3-2; 4-1; 5-3; 6-1; 7-2; 8-1; 9-3; 10-1; 11-2; 12-1; 13-1; 14-3; 15-2; 16-1; 17-3; 18-2;  19-3; 20-1; 21-2; 22-1; 23-3; 24-4; 25-3; 26-2;  27-1; 28-2; 29-1; 30-4; 31-1; 32-4; 33-1; 34-2; 35-3; 36-1; 37-3; 38-1; 39-2; 40-3; 41-1; 42-3;  43-4; 44-1; 45-2; 46-1; 47-3; 48-1; 49-2.

 


రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 26-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌