• facebook
  • whatsapp
  • telegram

ఉత్పాతనంలో రాళ్లను కోసే మంచు! 

భూమి - సహజ ఆవరణాలు - శిలావరణం

 

భూ అంతర్గత, బహిర్గత బలాల ప్రభావాలతో ఏర్పడిన రకరకాల భూస్వరూపాలు ప్రకృతి సహజ ఆవరణాల్లో భాగాలుగా ఉంటాయి. ముఖ్యంగా భూ ఉపరితలం నుంచి కొంత లోతు వరకు విస్తరించి ఘనస్థితిలో ఉన్న బాహ్యపొరను శిలావరణం అంటారు. పర్వతాలు, పీఠభూములు తదితరాలు దీని కిందకే వస్తాయి. ఆహారం, శక్తి వనరులను, ఆవాసాలను అందించడంలో ఈ ఆవరణం కీలకపాత్ర పోషిస్తుంది.  సహజ ఆవరణ వ్యవస్థ ఏర్పాటు, కాలానుగుణంగా గాలి, నీటి ప్రవాహాల కారణంగా కలిగే మార్పుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి భూస్వరూపాలు ఉన్నాయి, వాటి విశేషాలు, ప్రత్యేకతలపై అవగాహన పెంచుకోవాలి.


1. టెక్టానిక్స్‌ అనేది ఏ భాషా పదం?

1) లాటిన్‌  2) గ్రీకు   3) అరబిక్‌   4) ఫ్రెంచ్‌


2. కిందివాటిలో మొదటి శ్రేణి భూస్వరూపాలను గుర్తించండి.

1) ఖండాలు      2) మహాసముద్రాలు   

3) 1, 2        4) పీఠభూములు


3. నార్కొండం అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

1) మహారాష్ట్ర    2) లక్షదీవులు  

3) అస్సాం      4) అండమాన్, నికోబార్‌ దీవులు


4. ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో ఎన్నోవంతు పసిఫిక్‌ మహాసముద్రం అంచున ఉన్నాయి?

1) 3/4వ వంతు      2) 2/4వ వంతు  

3) 1/4వ వంతు      4) ఏదీకాదు


5. U ఆకారపు లోయలు కిందివాటిలో దేనివల్ల ఏర్పడతాయి?

1) నదులు     2) హిమానీనదాలు 

3) వరదలు      4) పవనాలు


6. ప్రపంచంలో అతి ఎత్తయిన జలపాతం ఏ దేశంలో ఉంది?

1) చిలీ     2) పెరూ 

3) వెనుజువెలా     4) అర్జెంటైనా 


7. ‘ఆక్స్‌ బౌ సరస్సులు’ కిందివాటిలో ఏ ప్రవాహం వల్ల ఏర్పడతాయి?

1) నదీ ప్రవాహం     2) హిమానీనద ప్రవాహం  

3) వరద           4) అగ్నిపర్వతాలు


8. హిమానీనదం ఏ ప్రక్రియ వల్ల రాళ్లను కోతకు గురిచేస్తుంది?

1) అవక్షేపణం     2) ఉత్పాతనం  

3) క్రమక్షయం      4) శిలాశైథిల్యం


9. ‘బైసన్‌ గార్జ్‌’ ఏ నదిపై ఉంది?

1) గంగా  2) కృష్ణా   3) గోదావరి  4) పెన్నా 


10. కిందివాటిలో సుందర్‌బన్‌ డెల్టా గురించి సరికానిది-

1) ఆసియాలో రెండో అతి పెద్ద డెల్టా.

2) గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడింది.

3) ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా.

4) గంగా, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడింది.


11. పుట్టగొడుగు రాయి కింది ఏ ప్రభావం వల్ల ఏర్పడుతుంది?

1) నదులు     2) అలలు  

3) గాలి     4) హిమానీనదం


12. కిందివాటిలో ఎన్నో వంతు భూభాగం ఎడారులతో నిండి ఉంటుంది?

1) 2/5వ  2) 3/5వ  3) 1/5వ  4) 4/5వ


13. దివి కొండ కిందివాటిలో దేని ప్రభావం వల్ల ఏర్పడుతుంది?

1) గాలి  2) నది  3) అలలు 4) హిమానీనదం  


14. ‘లితో’ ఏ భాషా పదం?

1) ఫ్రెంచ్‌  2) గ్రీకు  3) అరబిక్‌   4) లాటిన్‌


15. కిందివాటిలో రెండో శ్రేణి భూస్వరూపాలను గుర్తించండి.

1) పర్వతాలు       2) మైదానాలు   

3) పీఠభూములు       4) పైవన్నీ


16. టెక్టాన్‌ అంటే అర్థం ఏమిటి?

1) వడ్రంగి       2) భవన నిర్మాణదారు

3) వ్యవసాయదారుడు     4) 1, 2


17. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం?

1) ఫుజియామా     2) మాయన్‌  

3) స్ట్రాంబోలి       4) కిలిమంజారో


18. కిందివాటిలో ఏ అగ్నిపర్వతాన్ని మధ్యధరా సముద్రపు దీపస్తంభం అంటారు?

1) స్ట్రాంబోలి       2) కిలిమంజారో  

3) కోటోపాక్సీ       4) బారెన్‌


19. అగ్నిపర్వతం నుంచి వచ్చే లావాలో కొంతభాగం పైకి రాకుండా కింది పొరల్లో చల్లబడి శిలలుగా గట్టి పడతాయి. వీటిని ఏమంటారు?

1) మూడోశ్రేణి భూస్వరూపాలు       2) అంతర్గమ భూస్వరూపాలు

3) బహిర్గమ భూస్వరూపాలు      4) రెండోశ్రేణి భూస్వరూపాలు


20. గాలి, నీరు వల్ల రూపొందే భూస్వరూపాలను కిందివాటిలో ఏ భూస్వరూపాలుగా పిలుస్తారు?

1) రెండో శ్రేణి భూస్వరూపాలు      2) మూడో శ్రేణి భూస్వరూపాలు

3) అంతర్గమ భూస్వరూపాలు  4) బహిర్గమ భూస్వరూపాలు


21. కిందివాటిలో ‘V’ ఆకారపు లోయలు వేటివల్ల సంభవిస్తాయి?

1) హిమానీనదాలు     2) నదులు 

3) వరదలు     4) పైవన్నీ


22. గ్రాండ్‌ కాన్యాన్‌ అగాధదరి పొడవు ఎంత?

1) 566 కి.మీ.     2) 477 కి.మీ. 

3) 577 కి.మీ.     4) 466 కి.మీ.


23. ఇండస్‌ గార్జ్‌ ఏ దేశంలో ఏర్పడింది?

1) పాకిస్థాన్‌     2) టిబెట్‌ 

3) ఇండియా     4) చైనా 


24. ప్రపంచంలో రెండో అతి ఎత్తయిన జలపాతం ఏది? 

1) ఏంజెల్‌     2) టుగెలా     

3) కుంచికల్‌     4) ట్రెస్‌ హెర్మానాస్


25. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఏంజెల్‌ జలపాతం ఎత్తు ఎంత? 

1) 989 మీ.     2) 879 మీ. 

3) 979 మీ.     4) 978 మీ.


26. మొరైన్లు వేటి ప్రభావం వల్ల ఏర్పడతాయి?

1) నదులు     2) హిమానీనదాలు 

3) అలలు     4) గాలులు 


27. కిందివాటిలో అలల ప్రభావం వల్ల ఏర్పడనివి?  1) పేర్పుడు స్తంభాలు     2) పుట్టగొడుగు శిలలు 

3) సముద్ర తోరణాలు     4) సముద్ర భృగువుల


28. ‘లోయస్‌ మైదానాలు’ కిందివాటిలో వేటి ప్రభావం వల్ల ఏర్పడతాయి? 

1) గాలి      2) అలలు 

3) నదులు     4) హిమానీనదాలు


29. కిందివాటిలో లోయస్‌ నేలలకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి.

1) చక్కటి ఒండ్రునేలలు.

2) సున్నం చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి.

3) ఈ నేలలో నీరు ఎక్కువగా ఇంకిపోతుంది.

4) ఎరుపు రంగులో ఉంటాయి.


30. కిందివాటిలో దక్షిణ భారతదేశపు ధాన్యాగారాలు?

1) కృష్ణా - గోదావరి డెల్టాలు         2) కావేరి డెల్టా 

3) మహానది డెల్టా     4) ఏదీకాదు 


31. ప్రపంచంలో రెండో ఎత్తయిన జలపాతం ఏ దేశంలో ఉంది?

1) మెక్సికో     2) దక్షిణాఫ్రికా 

3) అమెరికా     4) చిలీ


32. భారతదేశంలో ఎత్తయిన జలపాతం ఏది? 

1) కుంచికల్‌     2) ఒరేహిపాని 

3) దూద్‌సాగర్‌     4) జోగ్‌ 


33. గ్రాండ్‌ కాన్యాన్‌ అగాధదరి లోతు ఎంత?

1) 2.6 కి.మీ.     2) 1.6 కి.మీ. 

3) 1.2 కి.మీ     4) 2.2 కి.మీ. 


34. కిందివాటిలో లావా పీఠభూమిని గుర్తించండి. 

1) లద్దాఖ్‌ పీఠభూమి     2) దక్కన్‌ పీఠభూమి

3) మేఘాలయ పీఠభూమి 4) టిబెట్‌ పీఠభూమి 


35. వికోషీకరణ ప్రక్రియ అంటే ఏమిటి?

1) నదులు ఇసుక రేణువులను మేటవేయడం 

2) హిమానీనదాలు రాళ్లను మేటవేయడం 

3) శిలాశైథిల్యం, క్రమక్షయం, రేణువుల రవాణా మేట వేయడం.

4) వరదలు, ప్రవాహవేగం వల్ల బురద మేట వేయడం.


36. కిందివాటిలో మూడో తరగతి భూస్వరూపాలను గుర్తించండి.

1) నదీలోయలు     2) గార్జ్‌లు 

3) గుహలు     4) పైవన్నీ


37. ‘మౌంట్‌ పీలి’ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?

1) ఇటలీ     2) జపాన్‌ 

3) వెస్ట్‌ ఇండీస్‌     4) టాంజానియా


38. భారతదేశంలో ఎత్తయిన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది?

1) తమిళనాడు     2) కర్ణాటక 

3) మహారాష్ట్ర     4) ఒడిశా


39. భూమిలో మొత్తం ఎన్ని పెద్ద భూఫలకలు ఉన్నాయి? 

1) 6     2) 4     3) 5     4) 7 


40. కిందివాటిలో చిన్న భూఫలకను గుర్తించండి.

1) ఇండో-ఆస్ట్రేలియా ఫలక     2) అరేబియా ఫలక 

3) దక్షిణ అమెరికా ఫలక               4) పసిఫిక్‌ ఫలక 


41. భూమి ఘనపరిమాణంలో భూపటలం మాత్రమే ఎంత శాతం ఉంటుంది?
1) 1%   2) 4%   3) 10%   4) 3% 


42. భూమి ఘనపరిమాణంలో భూకేంద్రమండలం మాత్రమే ఎంతశాతం ఉంటుంది? 

1) 75%  2) 83%  3) 71%  4) 63%


43. భూకేంద్రమండలం ఎన్ని కి.మీ. మేర విస్తరించి ఉంటుంది?

1) 2900 కి.మీ. నుంచి 6000 కి.మీ. వరకు 

2) 2100 కి.మీ. నుంచి 6000 కి.మీ. వరకు 

3) 2900 కి.మీ. నుంచి 6376 కి.మీ. వరకు

4) 2800 కి.మీ. నుంచి 6000 కి.మీ. వరకు 


44. కిందివాటిలో సియాల్‌ పొర అంటే?

1) బాహ్యపటలం     2) అంతరపటలం 

3) బాహ్యప్రావారం     4) అంతరప్రావారం


45. ఆల్ఫ్రెడ్‌ వెజినర్‌ అనే భూ భౌతికశాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవారు?

1) ఇటలీ   2) రష్యా  3) బెల్జియం  4) జర్మనీ


46. కిందివాటిలో ‘పాంజియా’ అంటే ఏమిటి? 

1) మొత్తం జలభాగం     2) మొత్తం భూభాగం

3) మొత్తం పీఠభూమి భాగం     4) మొత్తం అంటార్కిటికా భాగం 


47. కిందివాటిలో ‘పాంథాల్సా’ అంటే-

1) మొత్తం ఆర్కిటిక్‌ భాగం 2) మొత్తం భూభాగం 

3) మొత్తం జలభాగం     4) మొత్తం అంటార్కిటికా భాగం


48. కిందివాటిలో సరికానిది గుర్తించండి. 

1) హ్యూడర్‌ - గ్రీకు పదం     2) అట్మాస్‌ - గ్రీకు పదం 

3) లితో - ఫ్రెంచ్‌ పదం   4) బయోస్‌ - గ్రీకు పదం 


49. స్ట్రాంబోలి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? 

1) జపాన్‌   2) ఈక్వెడార్‌ 

3) సిసిలీ    4) టాంజానియా 


50. గ్రాండ్‌ కాన్యాన్‌ ఏ దేశంలో ఉంది?

1) అమెరికా  2) ఇంగ్లండ్‌  

3) ఫ్రాన్స్‌   4) చిలీ



సమాధానాలు

1-2; 2-3; 3-4; 4-1; 5-2; 6-3; 7-1; 8-2; 9-3; 10-1; 11-3; 12-3; 13-1; 14-2; 15-4; 16-4; 17-3; 18-1; 19-2; 20-2; 21-2; 22-4; 23-3; 24-2; 25-3; 26-2; 27-2; 28-1; 29-4; 30-1; 31-2; 32-1; 33-2; 34-2; 35-3; 36-4; 37-3; 38-2; 39-4; 40-2; 41-1; 42-2; 43-3; 44-1; 45-4; 46-2; 47-3; 48-3; 49-3; 50-1.


రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 07-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌