• facebook
  • whatsapp
  • telegram

ఆలోచనల ఆకృతి.. భావ ప్రసార సంస్కృతి!

భాష నిర్వచనాలు - ప్రయోజనాలు, లక్షణాలు

మనిషి తన ఆలోచనలను మరొకరికి చెప్పడానికి, ఇతరుల భావాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే మాధ్యమమే భాష. ఇది లిఖితంగా, సంజ్ఞలు, సంకేతాల రూపంలోనూ ఉన్నప్పటికీ ఎక్కువగా మాట్లాడే విధానంలోనే ప్రాచుర్యం పొందింది.  లిపి, భాషా సూత్రాలు, వ్యాకరణం, సాహిత్యం భాషకు ప్రధానం. మానవ భాషకు ఉన్న రకరకాల నిర్వచనాలు, వాటిని అందించిన వారిపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. భాష ప్రధాన లక్షణాలు, ప్రయోజనాలు,  ప్రసిద్ధ గ్రంథాలతో పాటు మానవేతర జీవుల్లో జరిగే భాషా ప్రసార నియమాల గురించి  పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.


1. ‘వ్యక్తి మేధస్సు నుంచి ప్రసరించే కాంతి.. భాష’ అన్నది ఎవరు?

1) బెంజిమెన్‌ వార్ఫ్‌       2) విట్నీ  

3) మాడ్సన్‌      4) స్టూవర్ట్‌ మిల్‌


2. 'Man is man because of speech' అన్నది ఎవరు?

1) షేక్స్‌స్పియర్‌      2) డెస్‌క్రేట్‌  

3) స్టర్ట్‌వర్ట్‌      4) హాకెట్‌


3. ‘బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష’ అన్నదెవరు?

1) ఇజ్లర్‌      2) హెగెల్‌  

3) రిచర్డ్‌ - ఓగ్డెన్‌      4) చామ్‌స్కీ


4. ‘ఆలోచనల ఆకృతి.. భాష’ అన్నది ఎవరు?

1) చామ్‌స్కీ      2) ఎమ్మన్‌ బాక్‌  

3) హెగెల్‌      4) జాన్సన్‌


5. ‘సైద్ధాంతికతకు సంబంధించిన కళ భాష. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే’ అన్నది ఎవరు?

1) చామ్‌స్కీ      2) సఫైర్‌  

3) హెగెల్‌      4) సైమన్‌ పాటర్‌


6. ‘మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక, ఉద్దీపన ప్రయోజనాలను అందించేదే భాష’ అని చెప్పింది-

1) ఎమ్మన్‌ బాక్‌      2) రిచర్డ్‌ - ఓగ్డేన్‌

3) హెగెల్‌       4) చామ్‌స్కీ


7. ‘భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే, భాషను మాట్లాడగల మానవేతర ప్రాణిలేదు’ అని ఎవరన్నారు?

1) పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం    2) ఎడ్వర్డ్‌ సఫైర్‌     

3) ఎరిక్‌ మాడ్సన్‌         4) జి.వి.సుబ్రహ్మణ్యం


8. ‘భాష అనేది ఒక రథం లాంటిది. రథం అందరినీ మోయాలి’ అని పేర్కొన్నదెవరు? 

1) ప్రొఫెసర్‌ విట్నీ        2) జాన్‌ స్టువర్ట్‌ మిల్‌

3) రామ్‌ మనోహర్‌ లోహియా 4) ఎరిక్‌ మాడ్సన్‌


9. ‘ప్రకృతి ప్రత్యాయ పద నిరూపణమే భాష’ అన్నది ఎవరు?

1) మాఘడు      2) నిఘంటుకారులు

3) వ్యాకరణకారులు      4) ఎరిక్‌ మాడ్సన్‌


10. ‘యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజ భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతీ పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష’ అని చెప్పిందెవరు?

1) స్టర్ట్‌వర్ట్‌       2) ఎఫ్‌.డి.సాసర్‌  

3) హెగెల్‌      4) ఇజ్లర్‌


11. ‘మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష’ అన్నదెవరు?    

1) రామచంద్ర వర్మ      2) రామచంద్ర శుక్ల

3) చామ్‌స్కీ      4) స్టర్ట్‌వర్ట్‌


12. ‘భావాలను వ్యక్తీకరించే సంకేతాల వ్యవస్థ భాష’ అన్నది?

1) ఎఫ్‌.డి.సాసర్‌      2) సఫైర్‌

3) సైమన్‌పాటర్‌      4) చామ్‌స్కీ


13. ‘భాష అంటే అనంతమైన వాక్యాల సముదాయం’ అన్నది ఎవరు?

1) హెగెల్‌      2) ఇజ్లర్‌  

3) జాన్సన్‌      4) ఎమ్మన్‌ బ్యాక్‌


14. ‘ద కోర్స్‌ ఇన్‌ మోడరన్‌ లింగ్విస్టిక్స్‌’ గ్రంథ రచయిత-

1) హ్యుగ్‌  2) హాకెట్‌  3) సఫైర్‌  4) స్టర్ట్‌వర్ట్‌


15. ‘లాంగ్వేజ్‌ ఇన్‌ ది మోడరన్‌ వరల్డ్‌’ అనే గ్రంథం రాసింది ఎవరు?    

1) బెంజిమన్‌ వార్ఫ్‌      2) సఫైర్‌    

3) సైమన్‌ పాటర్‌      4) ఇజ్లర్‌


16. 1962లో ‘ది సైన్స్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌’ అనే గ్రంథం రాసింది ఎవరు?

1) హ్యూగ్స్‌      2) సఫైర్‌  

3) ఎఫ్‌.డి.సాసర్‌      4) విట్నీ


17. ‘ఇంట్రడక్షన్‌ టు ట్రాన్స్‌ఫర్మేషన్‌ గ్రామర్‌’ గ్రంథ రచయిత-

1) ఎమ్‌.ఎన్‌.బాక్‌      2) రిచర్డ్‌ - ఓగ్డెన్‌

3) ఇజ్లర్‌      4) హెగెల్‌


18. ‘మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం భాష’ అని తెలిపింది ఎవరు?

1) మానవ శాస్త్రజ్ఞుడు      2) మనస్తత్వ శాస్త్రజ్ఞుడు

3) వేదాంతి       4) భాషోపాధ్యాయుడు


19. ‘ఉపదేశం ఇవ్వడానికి ఉపయోగించే సాధనం భాష’ అని నిర్వచించింది?

1) మత ప్రచారకుడు       2) వేదాంతి    

3) చరిత్రకారుడు       4) సామాన్య మానవుడు


20. ‘మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం భాష’ అన్నది?

1) సాంకేతిక శాస్త్రజ్ఞుడు      2) సామాజిక శాస్త్రజ్ఞుడు    

3) భాషా శాస్త్రజ్ఞుడు       4) చరిత్రకారుడు


21. ‘భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం’ అని ఎవరన్నారు?

1) ఎస్‌.కె.వర్మ, ఎన్‌.కృష్ణస్వామి   2) హ్యూగ్స్‌  

3) హెగెల్‌             4) చామ్‌స్కీ


22. భాష లక్షణాల్లో ముఖ్యం కానిది గుర్తించండి.

1) యాదృచ్ఛికం, సామాజికం          2) అర్థవంతం కాదు, వ్యవస్థీకృతం కాదు

3) సమర్థవంతంగా     4) ఉత్పాదకం, మానవుల సొంతం


23. వార్తా ప్రసారంలో ప్రేరణ - ప్రతిక్రియ లేకపోతే వార్తా వ్యాపారంలో ఈ మానవ భాష లక్షణం ఉన్నట్లు?

1) ఉత్పాదక శక్తి           2) నిర్మాణ ద్వైవిధ్యం

3) శబ్దార్థ సంబంధ కృత్రిమత  4) ప్రత్యేకత


24. ధ్వనులు పదంగా, పదాలు వాక్యంగా ఏర్పడటం అనే రెండు రకాల నిర్మాణం అన్న భాషా లక్షణం ఏది?

1) ప్రత్యేకత         2) ఉత్పాదక శక్తి  

3) శబ్దార్థ సంబంధ కృత్రిమత  4) నిర్మాణ ద్వైవిధ్యం


25. చిన్న పిల్లలు (శిశువులు) చిన్న వాక్యాల నిర్మాణాన్ని అనుసరించి, ఎప్పుడూ వినని కొత్త వాక్యాలను నిర్మించడం?

1) నిర్మాణ ద్వైవిధ్యం        2) ఉత్పాదక శక్తి    

3) శబ్దార్థ సంబంధ కృత్రిమత  4) ప్రత్యేకత


26. భాష ఒకరి నుంచి మరొకరికి, ఒక తరం నుంచి మరొక తరానికి ప్రసరించడాన్ని ఏమంటారు?

1) ప్రత్యేకత      2) ఉత్పాదక శక్తి

3) సాంస్కృతిక ప్రసరణ     4) పైవన్నీ


27. ‘వడ్డించేస్తున్నాను రండి’ అని గృహిణి చేసే ధ్వనులకు మనం వంటింట్లోకి వెళ్లడానికి సహజ సంబంధం ఎలాంటి మానవ భాషా లక్షణం?

1) నిర్మాణ ద్వైవిధ్యం  2) ఉత్పాదక శక్తి 

3) ప్రత్యేకత        4) శబ్దార్థ సంబంధ కృత్రిమత


28. మానవులు వర్తమాన సంఘటనలే కాకుండా భూత- భవిష్యత్‌ సంఘటనల గురించి కూడా మాట్లాడటం ఏ విధమైన మానవ భాషా లక్షణం?

1) ప్రేరణ దూరత     2) వక్తృశ్రోత విపరిణామం    

3) సాంస్కృతిక ప్రసరణం 4) పైవన్నీ


29. ఆవు ఎన్ని రకాల ధ్వనులు చేయగలదు?

1) 30     2) 10     3) 8     4) 5


30. నక్క ఎన్ని రకాల ధ్వనులు చేయగలుగుతుంది?

1) 30కి పైగా      2) 20కి పైగా        

3) 10కి పైగా      4) 60కి పైగా


31. ‘భాష ఒక సమాజ ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం’ అన్నది ఎవరు?

1) ఇజ్లర్‌      2) ప్రొఫెసర్‌ విట్నీ  

3) సఫైర్‌      4) స్టర్ట్‌వర్ట్‌


32. వ్యక్తిగత ప్రయోజనాల్లో లేనిది గుర్తించండి.

1) జీవనోపాధి       2) దైనందిన వ్యవహారాలు    

3) సృజనాత్మకత     4) జ్ఞాన సముపార్జన


33. సాంకేతిక, ఉద్దీపన ప్రయోజనాలను రిచర్డ్‌ - ఓగ్దెన్‌ ఏ విధమైన ప్రయోజనాలుగా తెలిపారు?

1) సాంకేతిక ఆర్థిక ప్రయోజనం      2) వ్యక్తిగత ప్రయోజనం

3) సామాజిక ప్రయోజనం      4) పైవేవీకావు


34. సాంకేతిక ప్రయోజనాల్లో సరికానిది గుర్తించండి.

1) సుఖ జీవనం      2) విదేశాల్లో మనుగడ

3) స్థాన సంబంధం       4) రసానుభూతి


35. భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడే ప్రయోజనం ఏది?

1) సాంకేతిక     2) ఉద్దీపన  

3) వ్యక్తి- అభివ్యక్తి      4) సామాజిక


36. మానవుల్లో సారస్వతాది కళల ద్వారా సదావేశాలు, హృదయ స్పందనలను సమకూర్చే ప్రయోజనం?

1) సాంకేతిక      2) సామాజిక  

3) ఉద్దీపన      4) పైవన్నీ


37. భాష సమాజంలోని వివిధ వ్యక్తుల మధ్య భావ వినిమయాన్ని ఏర్పరచే లక్షణం?

1) వైయుక్తిక      2) సామాజిక  

3) సాంకేతిక      4) పైవన్నీ


38. ‘ప్రారంభంలో భాష వాగ్రూపంలో ఉండేది’ అని తెలియజేసే లక్షణం?

1) సామాజిక     2) వైయుక్తికం  

3) మౌఖికం      4) లేఖనం


39. భాష వైవిధ్యభరితం అని తెలియజేసే లక్షణం ఏది?

1) అర్థ్ధవంతం     2) భావ ప్రసార మాధ్యమం

3) విభిన్నత్వం     4) సాంకేతిక


40. భాషకు ధ్వని సంకేతాలు, రేఖాచిత్రా స్వరూపాలు ఉండటం అని తెలిపే లక్షణం?

1) సాంకేతికం      2) భావ ప్రసార మాధ్యమం    

3) మౌఖికం       4) విభిన్నత్వం


41. భాషా సామాజిక ప్రయోజనాల్లో సరికానిది గుర్తించండి.

1) విద్యావ్యాప్తి         2) సాహిత్య అభివృద్ధి

3) పరిశోధనలు, ఆవిష్కరణలు      4) మూర్తిమత్వ వికాసం


42. ఉద్దీపన  ప్రయోజనాలను అల్ప, అధిక ప్రయోజనాలుగా విడదీసింది ఎవరు?

1) రిచర్డ్‌ - ఓగ్డెన్‌           2) హెన్రీ వెండ్‌

3) ఎస్‌.కె.వర్మ, ఎన్‌.కృష్ణస్వామి  4) స్టర్ట్‌వర్ట్‌


43. రసాయనిక సంకేతం ఉన్న జీవులు ఏవి?

1) ఆవులు 2) నక్కలు  3) తేనెటీగ  4) చీమలు


44. మానవేతర ప్రాణుల్లో స్పర్శ సంకేతం ఉన్న జీవులు ఏవి?

1) ఆవులు 2) గద్దలు 3) నక్కలు 4) తేనెటీగలు


45. శిశువు పెద్దలను అనుకరించి భాష నేర్చుకోవడం ఏ లక్షణం?

1) సాంస్కృతిక ప్రయోజనం         2) సామాజిక ప్రయోజనం

3) వ్యక్తిగత ప్రయోజనం      4) ఏదీకాదు


46. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు?    

1) ఉపసర్గలు            2) అవ్యయాలు   

3) విభక్తి ప్రత్యయాలు      4) ధాతువులు


47. ‘చెరువు నీరు’ విగ్రహ వాక్యం రాయండి.

1) చెరువు వెలుపలి నీరు   2) చెరువు యొక్క నీరు

3) చెరువు నందు నీరు      4) చెరువు కొరకు నీరు


48.    ‘చిన్న పిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి’ ఇందలి విభక్తి ప్రత్యయం ఏమిటి? 

1) గా    2) తో   3) పెద్ద   4) మెలగాలి


49. రెండు లేదా అంతకంటే ఎక్కువ సమ ప్రాధాన్యం ఉన్న నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు?

1) బహుపద ద్వంద్వ సమాసం      2) బహువ్రీహి సమాసం

3) రూపక సమాసం       4) ద్విగు సమాసం


 


సమాధానాలు

1-4; 2-1; 3-1; 4-4; 5-3; 6-2; 7-1; 8-3; 9-3; 10-1; 11-1; 12-1; 13-4; 14-2; 15-3; 16-1; 17-1; 18-1; 19-1; 20-2; 21-4; 22-2; 23-4; 24-4; 25-2; 26-3; 27-3; 28-1; 29-2; 30-1; 31-3; 32-2; 33-2; 34-4; 35-2; 36-3; 37-2; 38-3; 39-3; 40-1; 41-4; 42-2; 43-4; 44-4; 45-1; 46-3; 47-3; 48-2; 49-1.


రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 04-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌