• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రాల్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు

చదువు.. ఆనందించు.. అభివృద్ధి చెందు!

ధారాళంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం, సమయపాలన అలవాటు చేయడం, పోటీ తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ప్రతిభాపాటవాలను సమాజానికి తెలియజేయడం మొదలైన నైపుణ్యాలను, సామర్థ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడానికి అనేక రకాల కార్యక్రమాలను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తుంటాయి. వాటిపై కాబోయే ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. పిల్లలు తమ అవసరాలు, సమస్యలు, సందేహాలను వ్యక్తీకరించడానికి అనుసరించే పద్ధతులను తెలుసుకోవాలి. అందుకు తగిన మూల్యాంకనం, పర్యవేక్షణ విధానాలనూ నేర్చుకోవాలి.  


పిల్లలంతా చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల సాధనకు రూపొందించిందే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం. దీన్ని 2005 - 06లో సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) రూపొందించింది. ఈ కార్యక్రమంలో మూల్యాంకనాన్ని మూడు సార్లు నిర్వహించాలి.

1)  ప్రారంభ స్థాయి నిర్ధారణ - జులై 

2) మధ్యంతర స్థాయి మూల్యాంకనం - నవంబరు  

3) వార్షిక మూల్యాంకనం - మార్చి

పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో మధ్యంతర, వార్షిక మూల్యాంకన పత్రాలను రూపొందించే బాధ్యత రాష్ట్రస్థాయి వారిది. దీన్ని పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షిస్తారు. 

* స్కూల్‌ కాంప్లెక్స్‌ స్థాయి పర్యవేక్షణ అధికారి-ప్రధానోపాధ్యాయుడు (ఎస్‌సీహెచ్‌ఎమ్‌). 

* మండల స్థాయి పర్యవేక్షణ అధికారి- ఎంఈవో.

* డివిజన్‌ పర్యవేక్షణ అధికారి- డిప్యూటీ ఎడ్యుకేషన్‌     ఆఫీసర్‌.

* జిల్లా స్థాయి పర్యవేక్షణ అధికారి డీఈవో, అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్, డైట్‌ స్టాఫ్‌.


పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో పని విభజన: పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుంటే మొదటి ఉపాధ్యాయుడు 1, 2, 3 తరగతులకు; రెండో ఉపాధ్యాయుడు 4, 5 తరగతులకు బోధించాలి. ఒక ఉపాధ్యాయుడు, ఒక వాలంటీర్‌ ఉంటే ఉపాధ్యాయుడు 1, 2, 5 తరగతులకు; వాలంటీర్‌ 3, 4 తరగతులకు బోధించాలి. 

* ప్రారంభ పరీక్షలో గొణగకుండా, ధారాళంగా, తప్పులు లేకుండా చదివితే వారికి ‘ఎ’ గ్రేడ్‌ ఇవ్వాలి. 


వినూత్న కార్యక్రమాలు

బడిబాట:

*   ఇది విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టాల్సిన ప్రత్యేక లేదా వినూత్న కార్యక్రమం. 

* ఈ కార్యక్రమంలో భాగంగా ఆవాస ప్రాంతంలోని 5 నుంచి 14 ఏళ్ల బాలబాలికలను గుర్తించి నమోదు చేస్తారు. 

* బడిబాటలో బాలకార్మికులు, బాలికల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

* విద్యార్థుల హాజరు బాధ్యత పాఠశాలదే.  

వార్షికోత్సవం:

*  విద్యా సంవత్సరం చివర మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించే వినూత్న కార్యక్రమం. 

* ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆ సంవత్సరం సాధించిన ప్రగతిని నివేదిక రూపంలో తెలియజేస్తారు.  

బాలల సంఘాలు:

1) ఆరోగ్య పరిశుభ్రత కమిటీ  

2)  సాంస్కృతిక ప్రచార కమిటీ  

3) గ్రంథాలయ కమిటీ 

4) రివ్యూ కమిటీ 


గోడపత్రిక:

* పరిమిత ప్రదేశంలో అపరిమిత సృజనాత్మకతను పెంపొందించేది గోడపత్రిక. 

* పిల్లలు నేర్చుకున్న, సేకరించిన విషయాలను ప్రదర్శించడానికి; సృజనాత్మకతకు, ఊహలకు సాధిత రూపాలు, రచనాశక్తిని ప్రదర్శించడానికి దోహదపడుతుంది. 

* ప్రతి తరగతిలో దీన్ని నిర్వహించవచ్చు. ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక గోడపత్రిక; 6, 7, 8 తరగతులకు మరొక గోడపత్రికను నిర్వహించాలి. 

* దీని ద్వారా పిల్లల అభిరుచులు, ఆసక్తులను ప్రదర్శించవచ్చు. దీన్ని సమాచార సాంస్కృతిక కమిటీ నిర్వహిస్తుంది.

* ఈ పత్రికలో ప్రతిరోజు పాత వాటిని తొలంగించి కొత్త అంశాలను ప్రదర్శించాలి. 


పాఠశాల తపాలా పెట్టె: పాఠశాలలో పిల్లలకు ఎదురవుతున్న కష్ట నష్టాలు, ఇబ్బందులను స్వేచ్ఛగా వెల్లడించడానికి ఇది దోహదపడుతుంది. వారి ఆలోచనలు,అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 


టీచరు డైరీ: ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా చేసిన వాటిని నమోదు చేసుకోవడానికి దోహదపడుతుంది. దీనివల్ల  ఉపాధ్యాయుడికి తరగతి గది నిర్వహణ సులభమవుతుంది. విద్యార్థుల సామర్థ్యాల ప్రగతి నమోదుకు కూడా ఉపయోగపడుతుంది. 


పిల్లల డైరీ: పిల్లలు మూడో తరగతి నుంచి డైరీ రాయడం మొదలు పెట్టాలి. దీనివల్ల వారిలో సమయపాలనా దృక్పథం అలవడుతుంది. నెలకోసారి పిల్లల డైరీని పర్యవేక్షించాలి.


భాషోత్సవం: ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో నిర్వహిస్తారు. భాషోత్సవంలో వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, క్విజ్, బొమ్మలు గీయడం లాంటి అంశాలు ఉంటాయి. ఇది పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి కలగడానికి దోహదపడుతుంది.


పఠనోత్సవం: దీన్ని నవంబరులో నిర్వహిస్తారు. ఇది వార్తా పత్రికలు, వార పత్రికలు, కథల పుస్తకాలు, పద్యాలు, గేయాలు చదివించే కార్యక్రమం.


భాషామేళ/పాఠశాల మేళ: దీన్ని ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలి. పిల్లలు తయారు చేసిన సామగ్రిని ప్రదర్శనకు పెట్టి తమ విద్యార్థుల ప్రతిభాపాఠవాలు సమాజానికి తెలియచేసే కార్యక్రమం. సహకార భావన, ఆలోచనాశక్తి, కలుపుగోలు ధోరణి, నాయకత్వ లక్షణాలు పెరిగే   కార్యక్రమం.


చిన్నారుల సభ: దీన్ని ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలి. పాఠశాల, ఉపాధ్యాయులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో; అసెంబ్లీని వైవిధ్య భరితంగా నిర్వహించడం లాంటి వాటి గురించి మాట్లాడించే కార్యక్రమం.


మాదిరి ప్రశ్నలు


1.  ప్రభుత్వం పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా ఏ ఏడాదిని ప్రకటించింది?

1)  2002-03   2) 2003-04    

3) 2004-05   4) 2005-06



2.  ‘వాన చినుకులు’ పేరుతో పఠన ప్రారంభ సామగ్రిని పాఠశాలకు అందజేసినవారు?

1) ఎస్సీఈఆర్‌టీ   2) ఎన్‌సీఈఆర్‌టీ  

3)  యునెస్కో   4) ఎస్‌సీఎఫ్‌ - 2011



3. పిల్లల్లో దాగి ఉన్న శక్తులను బయటకు తీసుకు   రావడం కోసం వినూత్న కార్యక్రమాల పేరుతో  పాఠశాలల్లో ప్రవేశపెట్టిన అంశాల్లో ఒకటి?

1) నమూనాలు    2) బొమ్మలు   

3)  గోడపత్రిక    4) చార్టులు



4.   పిల్లలంతా చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల సాధనకు రూపొందించిన కార్యక్రమం? 

1) పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం    

2) జాతీయ విద్యా ప్రణాళికా కార్యక్రమం 

3)  పరస్పర ప్రతిచర్యా కార్యక్రమం     

4) నిరంతర సమగ్ర పఠనాభివృద్ధి 



5. పిల్లల్లో పఠన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ‘చదువు-ఆనందించు-అభివృద్ధి చెందు’ కార్యక్రమాన్ని ఏ విద్యాసంవత్సరంలో ప్రారంభించారు?

1) 2004-05     2) 2005-06     

3)  2006-07   4) 2007-08



6.  పిల్లల ప్రారంభ స్థాయిని గుర్తించడంలో భాగంగా ఉక్తలేఖనానికి ఎన్ని పదాలు చెప్పాలి?

1) 5     2) 10     3)  15     4) 20



7.   తరగతిలోని పిల్లలు 80 శాతం పైన చదవడం, రాయడం చేయగలిగితే వారు పొందే గ్రేడు?

1)  ఎ    2) బి    3)  సి     4) డి



8.  రిషివ్యాలీ విద్యా వనరుల కేంద్రం ‘పెట్టెలోని బడి (స్కూల్‌ ఇన్‌ బాక్స్‌)’ కిట్‌ ద్వారా జరిగే విద్యా    విధానాన్ని పరిశీలించి కర్ణాటకలో దీన్ని ఏ పేరుతో అమలు చేశారు?

1) ఆనంద లహరి    2) గౌతమి  

3)  నలికలి    4) జనకాల



9.  స్నేహబాల కార్డుకు ఎడమ వైపున ఉండేది?

1) లోగో      2) మైలురాయి సంఖ్య  

3)  శీర్షిక     4) కార్డు పేరు



10. ఒకటి, రెండు తరగతులకు కలిపి మొత్తం ఎన్ని స్నేహబాల కార్డులు ఉంటాయి?

1) 148    2) 138   3)  128   4) 27



11. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడు, ఎదురుగా ఉన్న విద్యార్థులు అనే లోగో ఏ అంశాన్ని తెలియజేస్తుంది?

1) పాఠం చెప్పడం  2) వినడం, మాట్లాడటం 

3)  భాషా క్రీడలు   4) ముల్యాంకనం



12. స్వయం అభ్యసన సామగ్రిని దేని కోసం ఏర్పాటు చేశారు? 

1) పాఠ్యపుస్తకం   2) స్వీయ అధ్యయనం   

3)  గ్రంథాలయం  4) బోధనానుకరణం



13. గోడ పత్రిక ఉద్దేశం?

1) ఉపాధ్యాయులు ప్రణాళిక బద్దంగా చేసిన వాటిని నమోదు చేసుకోవడం.  

2) ఉపాధ్యాయులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వ్యక్తం చేయడం.

3)  పిల్లలు నేర్చుకున్న, సేకరించిన విషయాలు  ప్రదర్శించడం.

4) వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ లాంటి వాటిని  తరగతి వారీగా నిర్వహించడం.



14. కిందివాటిలో స్నేహబాల కార్డుల్లో ఒకటో తరగతికి చెందని కార్డు? 

1) మూల్యాంకనం కార్డు      

2) చదువు, ఆనందించే కార్డు   

3)  వినడం, మాట్లాడటం కార్డు   

4) పదజాలభివృద్ధి కార్డు



15. స్నేహబాల కార్డులను రూపొందించినవారు? 

1) ఎస్‌సీఎఫ్‌-2011       2) ఎన్‌సీఈఆర్‌టీ   

3) ఎన్‌సీఎఫ్‌-2005       4) ఆర్‌టీఈ-2009



16. భాషాభివృద్ధి కార్యక్రమం అమల్లో పిల్లల హాజరు బాధ్యత ఎవరిది?

1) తల్లిదండ్రులు     2) పాఠశాల   

3)  ప్రభుత్వం     4) సమాజం 



17. ఒకటో తరగతికి మొత్తం మైలురాళ్లు ఎన్ని?

1) 18    2) 22    3)  23   4) 28



18. స్నేహబాల కార్డుల్లో ప్రతి మైలురాయి చివర  ఉండాల్సింది? 

1) పాఠం వినడం - మాట్లాడటం అనే కార్డు   

2) పదజాలాభివృద్ధి కార్డు   

3)  మూల్యాంకనం కార్డు  

4) పాఠం గురించి మాట్లాడే కార్డు



19. భాషా మేళాలు పాఠశాలల్లో నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనం?

1) పాఠశాల కార్యక్రమాలు తల్లిదండ్రులకు వివరించడం  

2) విద్యార్థుల్లో భాషాభివృద్ధి జరగడం    

3)  పాఠశాల కీర్తి ప్రతిష్ఠలు పెంచడం    

4) ఉపాధ్యాయుల నైపుణ్య పరీక్షణం 



20. పాఠశాలలు పఠన ప్రారంభ సమగ్రంగా ఉపయోగించుకోవాల్సింది?

1) వాన చినుకులు కథా పుస్తకం   

2) తేనె చినుకులు కథా పుస్తకం   

3)  పాల బుడగలు కథా వాచకం   

4) తొలకరి చిరుజల్లులు కథా వాచకం



21. భాషోత్సవం కార్యక్రమాన్ని ఏ నెలలో నిర్వహించాలి?

1) జులై     2) ఆగస్టు  3)  నవంబరు  4) ఫిబ్రవరి



22. చిన్నారుల సభను ప్రతి పాఠశాలలో ఏడాదికి ఎన్నిసార్లు నిర్వహించాలి?

1) 2     2) 3    3)  4    4) ఒకసారి



23. ఏ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో స్నేహబాల కార్డులను వినియోగిస్తున్నారు?

1) 2005-06    2) 2006-07  

3)  2008-09    4) 2010-11



24. విద్యార్థుల్లోని సృజనాత్మక, కల్పనాత్మక, అన్వేషణాత్మక నైపుణ్యాలను దేని ద్వారా పదునుపెట్టొచ్చు?

1) బడిబాట     2) వార్షికోత్సవం  

3)  బాలల మేళా     4) పాఠశాల తపాల పెట్టె



25. విద్యార్థుల్లో సమయ పాలనా దృక్పథాన్ని పెంపొందించేది?

1) టీచర్‌ డైరీ     2) పిల్లల డైరీ   

3)  గోడ పత్రిక    4) పఠనోత్సవం



26. చెన్నై కార్పొరేషన్‌ స్నేహబాల కార్డులను ఏ పేరుతో అమలు చేసింది?

1) కృష్ణవేణి        2) నలికలి   

3)  యాక్టివిటీ బేస్డ్‌ కార్డ్స్‌ (ఏబీసీ)   4) ఎక్స్‌ వై జెడ్‌



27. పిల్లలు తమ అవసరాలు, సమస్యలు, సందేహాలు, ప్రశ్నలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఆవిష్కరించిన వినూత్న కార్యక్రమ నిర్వహణ?

1) పిల్లల డైరీ      2) గోడ పత్రిక   

3)  తరగతి గ్రంథాలయం  4) పాఠశాల తపాలా పెట్టె

సమాధానాలు


1-4, 2-2, 3-3, 4-1, 5-3, 6-4, 7-1, 8-3, 9-1, 10-4, 11-1, 12-2, 13-3, 14-4, 15-3, 16-2, 17-4, 18-3, 19-2, 20-1, 21-2, 22-1, 23-4,  24-3, 25-2, 26-3, 27-4.

 


రచయిత: సూరె శ్రీనివాసులు

Posted Date : 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌