• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం  పరిమాణం - ఉనికి

ఆ రాష్ట్రం వృక్ష శాస్త్రవేత్తలకు స్వర్గం!


ప్రపంచంలోని పెద్ద దేశాల్లో భారత్‌ ఒకటి. దక్షిణాసియాలో వ్యూహాత్మక స్థానంలో విస్తరించి ఉంది. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు వైవిధ్యభరితమైన వాతావరణాన్ని, వ్యవసాయ విధానాలను, పర్యావరణ పరిస్థితులను కలిగి ఉంది. ఈ భౌగోళిక విశిష్టతలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రత్యేకతలు, తీరప్రాంతాల విశేషాలనూ తెలుసుకోవాలి. 

1. కిందివాటిలో మూడు దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలను గుర్తించండి.

1) సిక్కిం, త్రిపుర, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌

2) సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, లద్దాఖ్, పశ్చిమ బెంగాల్‌

3) పశ్చిమ బెంగాల్, మిజోరాం, ఉత్తరాఖండ్, లద్దాఖ్‌

4) సిక్కిం, అస్సాం, లద్దాఖ్, పశ్చిమ బెంగాల్‌


2. కిందివాటిలో పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దు ఉన్న దేశాలు?

ఎ) చైనా బి) భూటాన్‌  సి) బంగ్లాదేశ్‌  డి) నేపాల్‌

1) ఎ, బి, సి     2) బి, సి, డి 

3) సి, డి, ఎ     4) డి, ఎ, బి


3. కింది ఏ రాష్ట్రాన్ని పులి రాష్ట్రంగా పిలుస్తారు?

1) మహారాష్ట్ర      2) ఉత్తరాఖండ్‌  

3) మధ్యప్రదేశ్‌      4) కర్ణాటక


4. కింది ఏ రాష్ట్రాన్ని వృక్ష శాస్త్రవేత్తల స్వర్గమని పిలుస్తారు?    

1) సిక్కిం      2) మణిపుర్‌  

3) కేరళ      4) హిమాచల్‌ ప్రదేశ్‌


5. అరుణాచల్‌ ప్రదేశ్‌తో సరిహద్దు ఉన్న దేశాలు?

ఎ) చైనా      బి) భూటాన్‌  

సి) మయన్మార్‌     డి) నేపాల్‌

1) ఎ, బి, సి     2) బి, సి, డి 

3) సి, ఎ, డి      4) డి, బి, ఎ


6.    కింది వాటిలో మయన్మార్‌తో సరిహద్దు లేని రాష్ట్రం?

1) మిజోరాం       2) నాగాలాండ్‌  

3) త్రిపుర      4) మణిపుర్‌


7. మాతాబంగా నది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది?

ఎ) బంగ్లాదేశ్‌     బి) భారతదేశం  

సి) నేపాల్‌     డి) భూటాన్‌

1) ఎ, బి 2) బి, సి 3) సి, డి  4) డి, ఎ


8. భారతదేశ విభజన కోసం రాడ్‌క్లిఫ్‌ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు?

1) 1947, జులై 3       2) 1947, ఆగస్టు 3    

3) 1947, జూన్‌ 3        4) 1947, మే 3


9. ప్రస్తుతం చైనా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది?

1) 4     2) 5     3) 3     4) 6


10. కిందివాటిలో చైనాతో సరిహద్దు లేని రాష్ట్రం?

1) హిమాచల్‌ ప్రదేశ్‌       2) ఉత్తరాఖండ్‌  

3) సిక్కిం       4) పశ్చిమ బెంగాల్‌


11. భారతదేశ మొత్తం భూభాగ పరిమాణంలో ఈశాన్య భారతదేశం ఎంత శాతం కలిగి ఉంది?

1) 9.97% 2) 7.97% 3) 11.97% 4) 6.97%


12. ఈశాన్య భారతదేశంలోని మొత్తం రాష్ట్రాలు ఎన్ని కి.మీ.ల అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి?

1) 6100 కి.మీ.     2) 6484 కి.మీ. 

3) 5484 కి.మీ.     4) 7484 కి.మీ.


13. భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దులో భాగంగా బంగ్లాదేశ్‌తో త్రిపుర ఎన్ని కి.మీ.ల పొడవు కలిగి ఉంది?

1) 318 కి.మీ.     2) 856 కి.మీ. 

3) 443 కి.మీ.     4) 263 కి.మీ.


14. కింది ఏ రాష్ట్రంలో హెన్రీ దీవి ఉంది?

1) ఒడిశా 2) కర్ణాటక 3) మహారాష్ట్ర 4) పశ్చిమ బెంగాల్‌


15. కిందిలోవాటిలో సరికాని జత?

ఎ) దివర్‌ దీవి - గోవా    బి) బచ్ఛర్‌ దీవి - మహారాష్ట్ర

సి) ఎలిఫెంటా దీవి - కర్ణాటక    డి) శ్రీరంగం దీవి - కేరళ

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


16. లక్షదీవుల్లోని అతిపెద్ద నగరం ఏది?

1) మినికాయ్‌  2) చట్‌లట్‌  3) ఆండ్రాట్‌ 4) బిత్ర


17. లక్షదీవుల్లోని ఏ ప్రాంతంలో మహుల్‌ భాష  మాట్లాడతారు?

1) కవరత్తి 2) మినికాయ్‌  3) బిత్ర  4) ఆండ్రాట్‌


18. కింది ఏ రాష్ట్రాలతో మధ్యప్రదేశ్‌ సరిహద్దు పంచుకోదు?

1) ఉత్తర్‌ప్రదేశ్‌     2) ఛత్తీస్‌గఢ్‌ 

3) ఝార్ఖండ్‌     4) రాజస్థాన్‌


19. బంగ్లాదేశ్‌తో అస్సాం ఎన్ని కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది?

1) 283 కి.మీ.     2) 263 కి.మీ. 

3) 483 కి.మీ.     4) 387 కి.మీ.


20. మయన్మార్‌ దేశం అరుణాచల్‌ప్రదేశ్‌తో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది?

1) 520 కి.మీ.     2) 398 కి.మీ. 

3) 215 కి.మీ.     4) 510 కి.మీ.


21. ఈశాన్య భారతదేశంతో నేపాల్‌ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది?

1) 108 కి.మీ.     2) 99 కి.మీ.

3) 510 కి.మీ.     4) 470 కి.మీ.


22. ఈశాన్య భారతదేశపు రాష్ట్రాల్లో రెండో అతి తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రం?

1) మిజోరాం     2) అస్సాం 

3) నాగాలాండ్‌     4) సిక్కిం


23. భారతదేశం, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న సర్‌క్రీక్‌ సరాసరి ఎన్ని కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది?

1) 96 కి.మీ.    2) 86 కి.మీ.    

3) 66 కి.మీ.    4) 76 కి.మీ.


24. కిందివాటిలో అస్సాంతో సరిహద్దు లేని రాష్ట్రం?

1) పశ్చిమ బెంగాల్‌    2) సిక్కిం    

3) నాగాలాండ్‌    4) మేఘాలయ


25. భారతదేశం, మయన్మార్‌ మధ్య సరిహద్దులోని రక్షణ దళం?

1) బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌     2) సశస్త్ర సీమాబల్‌

3) అస్సాం రైఫిల్స్‌    4) ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌


26. కిందివాటిలో ‘బాన్‌గంగా’ అని దేన్ని పిలుస్తారు?

1) కోరిక్రీక్‌    2) పీర్‌ సనాయి క్రీక్‌

3) సర్‌క్రీక్‌    4) కచ్‌క్రీక్‌


27. భారతదేశం, చైనాల మధ్య భద్రతను వహించే రక్షణ దళం?

1) అస్సాం రైఫిల్స్‌    2) సశస్త్ర సీమాబల్‌

3) బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌   4) ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌


28. భారతదేశంలో పరిమాణం పరంగా నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) మహారాష్ట్ర    2) మధ్యప్రదేశ్‌

3) ఉత్తర్‌ప్రదేశ్‌    4) కర్ణాటక


29. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలతో చైనా ఎన్ని కిలోమీటర్ల మేర అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది?

1) 1643 కి.మీ.    2) 1880 కి.మీ.

3) 516 కి.మీ.    4) 1346 కి.మీ.


30. మయన్మార్‌తో మన దేశంలోని నాగాలాండ్‌ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది?

1) 398 కి.మీ.    2) 520 కి.మీ.

3) 215 కి.మీ.    4) 430 కి.మీ.


31. భారతదేశంలోని ఈశాన్య భారతదేశపు జనసాంద్రత ఎంత?

1) 173    2) 382    3) 350    4) 119


32. కిందివాటిలో అంతర్జాతీయ భూసరిహద్దులేని రాష్ట్రాలను గుర్తించండి.

ఎ) గుజరాత్‌     బి) హరియాణా 

సి) ఝార్ఖండ్‌     డి) హిమాచల్‌ప్రదేశ్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


33. భారతదేశంలోని మేఘాలయతో బంగ్లాదేశ్‌ ఎన్ని కి.మీ. సరిహద్దు కలిగి ఉంది?

1) 318 కి.మీ.    2) 483 కి.మీ.

3) 443 కి.మీ.    4) 563 కి.మీ.


34. కిందివాటిలో చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దు ఉన్న రాష్ట్రం?

1) జమ్ముకశ్మీర్‌     2) పంజాబ్‌ 

3) లద్దాఖ్‌     4) హిమాచల్‌ప్రదేశ్‌


35. కిందివాటిలో 569.70 కి.మీ.ల తీరరేఖ ఉన్న రాష్ట్రం?

1) కర్ణాటక  2) కేరళ  3) గుజరాత్‌  4) ఒడిశా


36. ప్రస్తుతం ఒడిశా తీరరేఖ పొడవు?

1) 570 కి.మీ.     2) 132 కి.మీ. 

3) 280 కి.మీ.     4) 476.40 కి.మీ.


37. భారతదేశంలో విస్తీర్ణపరంగా రెండో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లక్షద్వీప్‌ 2) పుదుచ్చేరి 3) దిల్లీ 4) చండీగఢ్‌


38. కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రానగర్‌ హవేలి, డామన్‌డయ్యూ విస్తీర్ణం?

1) 114 చదరపు కి.మీ.     2) 479 చదరపు కి.మీ. 

3) 603 చదరపు కి.మీ.     4) 563 చదరపు కి.మీ.


39. బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవులు కోల్‌కతా నుంచి సరాసరి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి?

1) 1355 కి.మీ.     2) 1455 కి.మీ. 

3) 1155 కి.మీ.     4) 1255 కి.మీ.


40. భారతదేశంలోని మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల వైశాల్యం ఎంత?

1) 8249 చ.కి.మీ.    2) 9765 చ.కి.మీ.

3) 1,12,348 చ.కి.మీ.    4) 12,960 చ.కి.మీ.


41. కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీ వైశాల్యంలో ఎన్నో స్థానంలో ఉంది?

1) 4వ  2) 5వ  3) 3వ  4) 6వ 


42. భారతదేశంలో వైశాల్యం పరంగా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) మిజోరాం     2) మణిపుర్‌ 

3) నాగాలాండ్‌     4) మేఘాలయ


43. అండ్‌మాన్‌ నికోబార్‌ దీవులు తమిళనాడులోని చెన్నై నుంచి సరాసరి ఎన్ని కి.మీ.ల దూరంలో ఉన్నాయి?

1) 1350 కి.మీ.     2) 1250 కి.మీ. 

3) 1150 కి.మీ.     4) 1190 కి.మీ.


44. కేరళ నుంచి లక్షదీవులు సరాసరి ఎన్ని కి.మీ.ల దూరంలో ఉన్నాయి?

1) 220 - 440 కి.మీ. 2) 150 - 440 కి.మీ. 

3) 240 - 540 కి.మీ. 4) 350 - 450 కి.మీ.


45. తూర్పుతీరంలో రెండో అతితక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం?

1) పశ్చిమ బెంగాల్‌     2) ఒడిశా 

3) తమిళనాడు     4) ఆంధ్రప్రదేశ్‌


46. కిందివాటిలో కర్ణాటకతో సరిహద్దు పంచుకోని రాష్ట్రం?

1) తెలంగాణ     2) తమిళనాడు 

3) మహారాష్ట్ర     4) ఛత్తీస్‌గఢ్‌


47. కిందివాటిలో రెండు దేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు?

ఎ) ఉత్తరాఖండ్‌  బి) మిజోరాం 

సి) అస్సాం     డి) లద్దాఖ్‌

1) ఎ, బి      2) బి, సి  

3) సి, డి     4) ఎ, బి, సి


సమాధానాలు


1-2; 2-2; 3-3; 4-1; 5-1; 6-3; 7-1; 8-3; 9-1; 10-4; 11-2; 12-3; 13-2; 14-4; 15-3; 16-3; 17-2; 18-3; 19-2; 20-1; 21-2; 22-1; 23-1; 24-2; 25-3; 26-3; 27-4; 28-3; 29-4; 30-3; 31-1; 32-2; 33-3; 34-3; 35-2; 36-4; 37-3; 38-3; 39-4; 40-3; 41-1; 42-3; 43-4; 44-1; 45-2; 46-4; 47-4.

రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 27-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.