• facebook
  • whatsapp
  • telegram

గణిత బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు 

మాదిరి ప్ర‌శ్న‌లు
 

1. మూడో తరగతి చదువుతున్న సాయి అనే విద్యార్థికి 348, 297, 685, 276 అనే సంఖ్యలు ఇచ్చినప్పుడు వీటిలో 685 పెద్ద సంఖ్య అని సమాధానమిచ్చాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన

 

2. అయిదో తరగతి చదివే రోహిత్ అనే విద్యార్థిని ఆ తరగతి గణిత ఉపాధ్యాయుడు ప్రధాన సంఖ్య అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని సరిగ్గా సమాధానమిచ్చాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: జ్ఞానం

 

3. ఎనిమిదో తరగతి చదివే గణేష్ అనే విద్యార్థి వివిధ సమాంతర చతుర్భుజాల ఆసన్న కోణాల మొత్తాన్ని కనుక్కుంటూ ఉంటే వాటి మొత్తం ప్రతిసారి 180° వస్తుందని తెలుసుకున్నాడు. దీని ద్వారా ఆ విద్యార్థి ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల మొత్తం 180°కి సమానం అవుతుందని సాధారణీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: వినియోగం

4. మోహన్ అనే గణిత ఉపాధ్యాయుడు అయిదో తరగతి చదివే సంజన అనే విద్యార్థినిని తరగతి గదిలోని నల్లబల్ల పొడవు ఎంతో చెప్పమన్నాడు. ఆ విద్యార్థిని స్కేలును ఎన్నుకుంది. అయితే ఆ విద్యార్థిని సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: నైపుణ్యం

 

5. ఏడో తరగతి చదివే సౌమ్య అనే విద్యార్థిని జ్యామితీయ పరికరాల పెట్టెలోని వృత్తలేఖిని సహాయంతో వృత్తం, చాపరేఖను, ఒక రేఖాఖండాన్ని, లంబ సమద్విఖండన రేఖను ఇచ్చిన కోణానికి, కోణ సమద్విఖండన రేఖను గీస్తే ఆ విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించినట్లు?
జ: నైపుణ్యం

 

6. సాయికృష్ణ అనే విద్యార్థి C = 2πr సూత్రాన్ని ఒక వృత్త పరిధి దాని వ్యాసార్ధానికి 2π రెట్లు ఉంటుంది అనే శాబ్ధిక ప్రవచనంగా అనువదిస్తే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన

 

7. సవరించిన జ్ఞానాత్మక రంగంలో అత్యున్నతస్థాయి లక్ష్యం ఏమిటి?
జ: సృష్టించడం (లేదా) ఉత్పత్తి చేయడం.

 

8. ఒక విద్యార్థిని ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 40°, 50°, 60°, అవుతాయా? అని ప్రశ్నిస్తే ఆ విద్యార్థి ఆ కోణాల మొత్తం 180° కావు కాబట్టి అవి ఒక త్రిభుజంలోని మూడు కోణాలను సూచించవు అని సమాధానమిచ్చాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన

9. (a + b) = a + 2ab + b అంటే రెండు రాశుల మొత్తం మీది వర్గం, ఆ రాశుల మొత్తానికి వాటి లబ్ధం యొక్క రెట్టింపును కలిపితే వచ్చే దానికి సమానం అని ఒక విద్యార్థి అనువదించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన

 

10. విద్యార్థి x - 4x + 4 = 0 అనే వర్గసమీకరణంలో ఒక మూలం (2) అని సరిచూసినట్లయితే అది ఏ లక్ష్యానికి చెందుతుంది?
జ: అవగాహన

 

11. కిందివాటిలో వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది?
i) విశ్లేషణ చేయడం              ii) పరస్పర సంబంధాలను స్థాపించడం
iii) ఫలితాలను తెలపడం       iv) ఫలితాలను అంచనా వేయడం
జ: i, ii, iii

 

12. పదో తరగతి చదివే విద్యార్థి 3x + 2y + 5 = 0, 2x - 5y = 0, 4x + 7y + 6 = 0, x + 2y + 5 = 0, x - 3y = 0 అనే సమీకరణాలను మూలబిందువు ద్వారా వెళ్లే సమీకరణాలు, మూలబిందువు ద్వారా వెళ్లని సమీకరణాలుగా వర్గీకరిస్తే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన

 

13. పదో తరగతి చదివే గాయత్రి అనే విద్యార్థి పైథాగరస్ సిద్ధాంతం ప్రవచనం చెప్పమంటే ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని సమాధానమిచ్చింది. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: జ్ఞానం

 

14. సంజన అనే మూడో తరగతి విద్యార్థి 14, 8, 9, 3, 6, 10, 15, 17, 24 అనే సంఖ్యలను బేసి సంఖ్యలు, సరి సంఖ్యలుగా వర్గీకరించింది. అయితే ఆ విద్యార్థిని సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన

 

15. దిగువ పేర్కొన్న వాటిలో ఉన్నతస్థాయిలోని గణిత బోధనా ఉద్దేశం ఏది?
1) విద్యార్థుల్లో తర్క వివేచనాశక్తిని, విశ్లేషణాశక్తిని పెంపొందించడం
2) గణితశాస్త్ర బోధన ద్వారా రసానుభూతి, సౌందర్యానుభూతి, తృప్తి, జ్ఞానానుభూతిని కలగజేయడం
3) గణిత నైపుణ్యాలను, దృక్పథాలను నిత్యజీవితంలో వినియోగించే విధంగా చూడటం.
4) పైవన్నీ సరైనవే
జ: 4 (పైవన్నీ సరైనవే)

 

16. కింది వారిలో బోధన లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలు పాటించాలని చెప్పిన విద్యావేత్త ఎవరు?
1) ఫ్రాస్ట్        2) బేకన్        3) బ్రాడ్‌ఫోర్డ్        4) లాక్
జ: 1 (ఫ్రాస్ట్)

 

17. ఎనిమిదో తరగతి చదివే సౌమ్యశ్రీ అనే విద్యార్థిని (a + b) సూత్రం అడిగితే a + 3ab + 3ab + b అని సమాధానం ఇచ్చింది. అయితే ఆ విద్యార్థిని సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: జ్ఞానం

 

18. ఒక సమస్యను విశ్లేషించడం (Analyses a Problem) అనేది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణను సూచిస్తుంది?
జ: వినియోగం

 

19. కిందివాటిలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది?
i) ఫలితాలను అంచనా వేయడం       ii) ఫలితాలను సరిచూడటం       iii) ఫలితాలను తెలపడం
జ: i, ii

 

20. విద్యార్థి సమలంబ చతుర్భుజానికి, సమాంతర చతుర్భుజానికి మధ్య ఉన్న తేడాలను తెలిపాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన       

 

21. సమస్య సాధనకు సరైన సూత్రాన్ని లేదా సరైన పద్థతిని ఎంపిక చేయడం (Selects appropriate formula (or) Method to solve problem) ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను సూచిస్తుంది?
జ: వినియోగం

Posted Date : 09-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌