• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు

మాదిరి ప్ర‌శ్న‌లు


1. ''సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం" అని నిర్వచించినవారు
జ: బేకన్

 

2. ''ప్రకృతి శక్తులకు సంబంధించిన అవగాహనకు గణితశాస్త్ర జ్ఞానాన్ని అపారంగా వినియోగిస్తున్నారు". ఈ వాక్యం గణిత బోధన విలువల్లో దేన్ని సూచిస్తుంది?
జ: ప్రయోజన విలువ

 

3. గణితశాస్త్ర పఠనం ద్వారా సాయి అనే విద్యార్థిలో వేగం, కచ్చితత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సమయపాలన, సమస్యా విశ్లేషణ అనే లక్షణాలు అలవడ్డాయి. ఆ  విద్యార్థిలో పెంపొందిన విలువ ఏది?
జ: క్రమశిక్షణ విలువ

 

4. కిందివాటిలో గణిత ప్రయోజన విలువను సూచించే వాక్యాన్ని గుర్తించండి.
(i) కూలీ తనకు రావాల్సిన కూలీని లెక్కకట్టడం.
(ii) వడ్రంగి ఇల్లు నిర్మించడానికి కావాల్సిన కలపను లెక్కించడం.
(iii) వ్యాపారి వస్తువులను అమ్మడం, కొనడం ద్వారా వచ్చే లాభనష్టాలను లెక్కించడం.
(iv) గృహిణి ఇంటి బడ్జెట్ తయారు చేయడం.

1) i, ii, iii            2) i, iii, iv             3) ii, iii, iv          4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

5. 8వ తరగతి చదువుతున్న రోహిత్ అనే విద్యార్థిని (a + b)2 కు సూత్రం చెప్పమంటే... జ్ఞప్తికి తెచ్చుకుని
a2 + 2ab + b2 అని తెలిపాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టీకరణను సూచిస్తుంది?
జ: జ్ఞానం

 

6. సౌమ్య అనే విద్యార్థిని 72ను 99తో గుణిస్తే వచ్చే విలువ 7200 కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టీకరణను సూచిస్తుంది?
జ: అవగాహన

 

7. కిందివాటిలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది?
i) విద్యార్థి దత్త సమస్యను విశ్లేషణ చేస్తాడు.
ii) విద్యార్థి నూతన దత్తాంశాలను ప్రతిపాదిస్తాడు.
iii) విద్యార్థి పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు.
iv) విద్యార్థి సరైన పట్టికను ఎంపిక చేసుకుంటాడు.
జ: i, ii, iii

 

8. 7వ తరగతిలోని విద్యార్థులందరినీ వృత్తం, దీర్ఘచతురస్రం, చతురస్రాలను గీయమంటే ఒక విద్యార్థి అందరికంటే వేగంగా, శుభ్రంగా, కచ్చితంగా గీశాడు. అతడిలో నెరవేరిన లక్ష్యం
జ: నైపుణ్యం

 

9. కిందివాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏది?
1) వైఖరి            2) వినియోగం          3) నైపుణ్యం             4) అభిరుచి
జ: 2 (వినియోగం)

 

10. ఒక విద్యార్థి గణిత పరికరాల పెట్టెలోని వృత్తలేఖిని సహాయంతో ఒక రేఖాఖండానికి లంబసమద్విఖండన రేఖ, ఒక వృత్తం, ఒక కోణానికి కోణ సమద్విఖండన రేఖ గీశాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది?
జ: నైపుణ్యం

 

11. కిందివాటిలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది?
1) విద్యార్థి గణిత సంబంధాలను పోల్చుతాడు.
2) విద్యార్థి ఫలితాలను సరిచూస్తాడు.
3) విద్యార్థి దత్త సమస్యను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎంపిక చేస్తాడు.
4) విద్యార్థి వివిధ సందర్భాల్లో గణిత ఉపకరణాన్ని గుర్తిస్తాడు.
జ: 3 (విద్యార్థి దత్త సమస్యను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎంపిక చేస్తాడు.)

 

12. 10వ తరగతి చదివే విద్యార్థి (4, 0), (-3, 0), (0, 3), (0, -5), (6, 0), (0, 7)లను X, Y అక్షాలకు చెందిన బిందువులుగా వర్గీకరించాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది?
జ: అవగాహన

 

13. కిందివాటిలో నైపుణ్యానికి చెందిన స్పష్టీకరణ ఏది?
1) పటాలను, రేఖాచిత్రాలను గీయడం.            2) పట్టికలను చదవడం, గణనలు చేయడం.
3) సరైన పట్టికను ఎంపిక చేయడం.             4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

14. 'విద్యార్థి ఇచ్చిన లిఖిత గణనలను మనోగణన సాయంతో వేగంగా, కచ్చితంగా చేయడం' అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను సూచిస్తుంది?
జ: నైపుణ్యం

 

15. 'విద్యార్థి సమస్య సాధనకు సరైన సూత్రాన్ని ఎంపిక చేశాడు'. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను సూచిస్తుంది?
జ: వినియోగం

Posted Date : 09-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు