• facebook
  • whatsapp
  • telegram

మౌర్య యుగం

అశోకుడి ధర్మం అందరికీ ఆమోదనీయం!

ప్రాచీన కాలంలో భారత ఉపఖండంలో అత్యంత విశాలమైన భూభాగాన్ని మౌర్యులు పాలించారు. దేశంలో తొలిసారిగా కేంద్రీకృత అధికారాన్ని నెలకొల్పి, రాజకీయ, సాంస్కృతిక ఐక్యతను సాధించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి, సమర్థ పాలనా వ్యవస్థను నెలకొల్పారు. వీరి కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు వర్ధిల్లాయి. భారతీయ మొదటి చారిత్రక వంశంగా ప్రసిద్ధి చెందిన మౌర్య  వంశంలోని  పాలకులు, వారి పరిపాలన, సైనిక విధానాలు, పన్నుల తీరు, న్యాయ సూత్రాలు, మత పరిస్థితుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. భారతీయ చక్రవర్తుల్లో గొప్పవాడైన అశోకుడి ప్రత్యేకతలు, ఆచరించిన ధర్మ మార్గం, బౌద్ధమత వ్యాప్తిలో అతడి పాత్ర, వేయించిన శాసనాలు, స్తూపాలు, అవి ఉన్న ప్రదేశాలు, వివరిస్తున్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 

1.    దేవానాంప్రియ, ప్రియదర్శి అనే బిరుదులున్న మౌర్య వంశరాజు ఎవరు?

1) అశోకుడు    2) చంద్రగుప్త మౌర్యుడు

3) దశరథుడు    4) బిందుసారుడు


2.    భారతదేశంలోని తొలి కృత్రిమ గుహాలయాలు ఏ మతానికి చెందినవి?

1) బౌద్ధ మతం    2) జైన మతం

3) అజీవక మతం    4) హిందూ మతం


3.     అశోకుడి పేరుతో ఉన్న మొదటి శాసనం ఎక్కడ లభించింది?

1) ఎర్రగుడి శాసనం    2) అలహాబాదు శాసనం

3) రుమిందై శాసనం    4) మస్కి శాసనం


4.     అశోకుడి శాసనాలు లభించిన ‘ఎర్రగుడి’, ‘రాజుల మందగిరి’ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) ఆంధ్రప్రదేశ్‌    2) కర్ణాటక

3) తెలంగాణ    4) ఒడిశా


5.     చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెళగొళలో ‘సల్లేఖన’ వ్రతాన్ని ఆచరించాడని తెలియజేస్తున్న గ్రంథం ఏది?

1) కల్పసూత్ర    2) కథాసరిత్సాగరం

3) అర్థ శాస్త్రం    4) పరిశిష్ఠ పర్వాన్‌


6.     మౌర్యుల పన్నుల వ్యవస్థ గురించి సమాచారం    ఇస్తున్న శాసనం ఎక్కడ లభించింది?

1) మస్కి    2) ఎర్రగుడి

3) అలహాబాదు    4) రుమిందై


7.     కింది మౌర్య చక్రవర్తుల్లో ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించిన రాజు?    

1) చంద్రగుప్త మౌర్యుడు    2) బిందుసారుడు

3) అశోకుడు    4) సంప్రతి


8.     కిందివారిలో ‘రజ్జుక’ కంటే పైస్థాయి ఉద్యోగి ఎవరు?

1) యుక్త    2) గ్రామిక 

3) ప్రాదేశిక    4) లేఖక


9.     కింది మౌర్య మంత్రి పరిషత్‌కు సంబంధించి సరికానిది?

1) మౌర్యులు అన్ని వర్గాల/వర్ణాల వారిని మంత్రులుగా నియమించారు.

2) మంత్రి పరిషత్‌ ఎన్నిక రాజే స్వయంగా నిర్వహించారు.

3) ప్రథమ, ద్వితీయ స్థాయుల్లో మంత్రి వ్యవస్థ ఉండేది.

4) మంత్రులకు జీతం ధనరూపంలో ఉండేది.


10. ‘ఇండియన్‌ మాకీయవెల్లి’ అని ఎవరిని పిలుస్తారు?

1) పాణిని    2) కౌటిల్యుడు

3) పతంజలి    4) వరరుచి


11. ‘‘రక్తసిక్తమైన మానవ చరిత్రలో అశోకుడి కాలం విరామ సమయం’’ అని అన్న చరిత్రకారుడు?

1) మజుందార్‌       2) రోమిలాథాపర్‌   

3) వేల్స్‌       4) ఆర్‌.ఎస్‌.శర్మ


12. అశోకుడి శాసనాలు ఏ లిపుల్లో లిఖించి ఉన్నాయి? 

1) ప్రాకృతం, ఖరోష్ఠి, బ్రహ్మి, గ్రీక్‌       2) ప్రాకృతం, పాళి, ఖరోష్ఠి   

3) బ్రహ్మి, ఖరోష్ఠి, గ్రీక్, అరబిక్‌       4) ప్రాకృతం, గ్రీక్, అరబిక్‌


13. కింది ఏ మౌర్య చక్రవర్తి కాలంలో తక్షశిలలో తిరుగుబాటు వచ్చింది?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) బిందుసారుడు   

3) దశరథుడు       4) అశోకుడు


14. తన శాసనాల ద్వారా ప్రజలతో నేరుగా సంభాషించిన మొదటి భారతీయ చక్రవర్తి ఎవరు?

1) గౌతమీపుత్ర శాతకర్ణి      2) ఖారవేలుడు   

3) అశోకుడు       4) చంద్రగుప్త మౌర్యుడు


15. మౌర్యుల వెండి నాణేన్ని ఏమని పిలిచేవారు?

1) నిష్క      2) కాకిని   

3) ఫణ       4) శతమాన


16. శాసనాల్లో మాత్రమే కనిపించే అశోకుడి కుమారుడు ఎవరు?

1) తివర       2) జులుక   

3) రాహులుడు       4) కునాలుడు


17. కౌటిల్యుడి సప్తాంగాల్లో లేనిది?

1) స్వామి      2) అమాత్య  

3) తటాక      4) దండ


18. కిందివాటిలో ఏది అశోకుడి దమ్మకు సంబంధించిన లక్షణం?

1) జంతువుల బలిపై నిషేధం.

2) పనివారి పట్ల యజమానులు; ఖైదీల పట్ల ప్రభుత్వ అధికారులు కాఠిన్యం చూపకూడదు.

3) ప్రజలంతా పూర్తిగా అహింసను పాటించాలి.    4) పైవన్నీ


19. ‘ఇండికా’ గ్రంథ రచయిత ఎవరు?

1) మెగస్తనీస్‌       2) స్ట్రాబో   

3) ప్లీని       4) ప్లూటార్క్‌


20. మౌర్యుల కాలంలోని ‘ఒవర్‌సీర్స్‌’ ఎవరు?

1) గూఢచారులు       2) ప్రభుత్వ ఉద్యోగులు

3) రాజకుమారులు       4) పన్ను వసూళ్ల అధికారి


21. మౌర్యుల కాలంలో క్రిమినల్‌ న్యాయస్థానం ఏది?

1) ధర్మస్తీయ       2) కంఠక శోధన   

3) ద్రోణముఖ       4) పతివేదన


22. మౌర్యుల కాలంలో అధ్యక్షుడు లేని ఏకైక శాఖ?

1) గనుల శాఖ       2) అటవీ శాఖ   

3) వ్యవసాయ శాఖ       4) మత్స్య శాఖ


23. అంధుడైన అశోకుడి కుమారుడు ఎవరు?

1) కునాలుడు       2) జులుక   

3) మహేంద్రుడు       4) తివరుడు


24. మౌర్యుల కాలంలో సహాయక మంత్రులను ఏమని పిలిచేవారు? 

1) మంత్రి     2) అమాత్య  

3) తీర్థులు      4) అధ్యక్షులు


25. కింది అంశాల్లో అశోకుడి శిలాశాసనాలకు సంబంధించి సరికానిది?

1) భారత్‌లో మొదటి శిలాశాసనాలు అశోకుడివి.

2) అశోకుడి శిలాశాసనాలు బౌద్ధమత వ్యాప్తిని ఉద్దేశించినవి.

3) అశోకుడి ద్విభాష శాసనం కాందహార్‌లో ఉంది.

4) అశోకుడి శిలాశాసనాలు అహింసను బోధించాయి.


26. మౌర్యుల్లో చివరి పాలకుడు?

1) పుష్యమిత్రుడు       2) కునాలుడు       

3) భాగభద్రుడు       4) బృహద్రుదుడు


27. కిందివాటిలో మౌర్యుల పాలనకు సంబంధించి సరికానిది ఏది?

1) మౌర్యుల కాలంలో పటిష్ట గూఢచారి వ్యవస్థ ఉండేది.

2) గూఢచారుల్లో అగ్రవర్ణాలకు మాత్రమే అవకాశం ఉండేది.

3) మౌర్యుల కాలంలో వేశ్యలు గూఢచారులుగా ఉండేవారు.

4) గూఢచారులను ‘పతివేదకులు’ అని పిలిచేవారు.


28. కిందివాటిలో ‘జులుక’ రాజకుమారుడి గురించి పేర్కొన్న ఆధారం ఏది?

1) ముద్రారాక్షసం       2) రాజతరంగిణి  

3) అశోకుడి శాసనాలు          4) కౌటిల్యుడి అర్థ శాస్త్రం


29. అశోకుడి స్తంభ శాసనాలపై ఉన్న జంతువులను, వాటి ప్రదేశాలతో జతపరచండి.

ఎ) రుమిందై           1) చక్రం

బి) రాంపూర్వ          2) సింహం

సి) పాటలీపుత్రం        3) వృషభం

డి) లేరియనందన్‌ఘర్‌    4) గుర్రం

1) ఎ-4, బి-3, సి-1, డి-2       2) ఎ-4, బి-2, సి-3, డి-1    

3) ఎ-1, బి-2, సి-3, డి-4   4) ఎ-4, బి-3, సి-2, డి-1


30. మౌర్యుల కాలం నాటి ఏనుగు శిల్పం ఏ ప్రాంతంలో ప్రసిద్ధి?

1) దిదార్‌గంజ్‌       2) థౌలి   

3) మధుర       4) తక్షశిల


31. అశోకుడి శాసనాల్లో చెప్పిన కేరళ పుత్రులెవరు?

1) పాండ్యులు       2) చేరులు   

3) చోళులు       4) శాతవాహనులు


32. కింది వాటిలో సరైంది గుర్తించండి.

1) ‘ముద్రారాక్షసం’ మౌర్య సామ్రాజ్య అంతం గురించి తెలియజేస్తుంది.

2) ‘హర్ష చరిత్ర’ మౌర్య సామ్రాజ్య ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది.

3) పురాణాలు మౌర్యుల వంశావళిని తెలియజేస్తాయి.

4) కల్హణుడి ‘రాజతరంగిణి‘ మౌర్యుల పాలన గురించి తెలియజేస్తుంది


33. కిందివాటిలో అశోకుడి శాసనం లభించని ప్రాంతం?

1) ఎర్రగుడి       2) రాజుల మందగిరి   

3) మస్కి       4) యలమంచలి


34. అశోకుడి ధర్మ విధానానికి సంబంధించి సరికానిది?

1) అశోకుడి ధమ్మ సర్వజనులకు ఆమోద యోగ్యం.

2) అశోకుడి ధమ్మ ప్రవర్తనా నియమావళిని సూచిస్తుంది.

3) ధర్మప్రచారానికి అశోకుడు ఉద్యోగులను నియమించాడు.

4) అశోక ధమ్మ మత ప్రచారాన్ని సూచిస్తుంది.


35. అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం?

1) క్రీ.పూ.261       2) క్రీ.పూ.260   

3) క్రీ.పూ.280       4) క్రీ.పూ.272


36. మౌర్యుల న్యాయపాలనా అంశాలను పరిశీలించి, సరికాని జతను గుర్తించండి. 

ఎ) అర్థ శాస్త్రం ప్రకారం సమాన నేరానికి సమాన శిక్ష ప్రతిఒక్కరికి సమానంగా ఉండాలి.

బి) అశోకుడి శాసనాలు న్యాయ విధానాన్ని ప్రస్తావించవు.

సి) అత్యున్నత న్యాయాధికారి రాజు.

డి) మౌర్యులు కఠిన శిక్షలను అమలు చేశారు.

1) ఎ, బి  2) ఎ, బి, సి     3) ఎ, సి  4) సి, డి


37. భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం ఏది?

1) ఎరాన్‌ శాసనం       2) హాతీగుంఫా శాసనం

3) జునాగఢ్‌ శాసనం      4) అలహాబాదు శాసనం


38. దీపవంశం, మహావంశం అనేవి..

1) జైనమత గ్రంథాలు       2) బౌద్ధమత గ్రంథాలు

3) హిందూమత గ్రంథాలు     4) ఇస్లాంమత గ్రంథాలు


39. అశోకుడి శాసనాల మీద కనిపించే భాష?

1) ప్రాకృతం  2) గ్రీక్‌  3) అరబిక్‌   4) పైవన్నీ


40. ధర్మ మహామాత్రుల గురించి తెలిపే అశోకుడి పెద్దరాతి శాసనం?

1) మొదటి ప్రధాన శిలాశాసనం       2) మూడో ప్రధాన శిలాశాసనం

3) నాలుగో ప్రధాన శిలాశాసనం       4) అయిదో ప్రధాన శిలాశాసనం



సమాధానాలు


1-1; 2-3; 3-4; 4-1; 5-4; 6-4; 7-1; 8-3; 9-1; 10-2; 11-3; 12-3; 13-2; 14-3; 15-3; 16-2; 17-3; 18-4; 19-1; 20-1; 21-2; 22-4; 23-1; 24-3; 25-2; 26-4; 27-2; 28-2; 29-1; 30-2; 31-2; 32-3; 33-4; 34-4; 35-1; 36-1; 37-3; 38-2; 39-4; 40-4.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

Posted Date : 18-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.