• facebook
  • whatsapp
  • telegram

లోహాలు - అలోహాలు

పాము విషంలో.. లోతైన బోరులో అదే లోహం!


మానవ జీవితం మొత్తం లోహాలు, అలోహాలమయమే. వంట చేసే పాత్రలు, తినే తిండి, ధరించే ఆభరణాలు, వాడే వస్తువులూ అన్నీ వాటితోనే తయారవుతాయి. గొడ్డలి గట్టిగా ఉన్నా, దంతాలు పుష్టిగా మారినా, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినా, కాన్సర్‌ చికిత్సకైనా లోహమో, అలోహమో ఉండాల్సిందే. పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధిలో కీలకంగా మారిన ఈ లోహ, అలోహాల గురించి పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఇందులో ప్రధానమైన  మూలకాల స్వభావాలు, లభ్యమయ్యే తీరు, తయారయ్యే పద్ధతులు, మిశ్రమాలతో చేసే    వస్తువులు, నీరు, ఆక్సిజన్‌తో జరిపే చర్యలు, వాటి ఉపయోగాలు, అనర్థాల గురించి తెలుసుకోవాలి.


1. లోహాలు మెరవడానికి కారణాన్ని గుర్తించండి.

1) తెల్లని పూత పూయడం

2) వాటిలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లు కాంతిని పరావర్తనం చేయడం    

3) వెండి పూత పూయడం  4) మెర్క్యూరీ పూత పూయడం


2. లోహాలకు ఉండే లక్షణాలు-

1) పలుచని రేకులుగా మార్చగలం.

2) లోహ ఆక్సైడ్‌లు నీటితో క్షారాలను ఇస్తాయి.

3) అయానిక సమ్మేళనాలను ఇస్తాయి.    4) పైవన్నీ

3.    లోహాలు మంచి విద్యుత్తు వాహకాలుగా ఉండటానికి కారణమేంటి?

1) తీగలుగా సాగదీయడం వల్ల 

2) రేకులుగా మార్చడం వల్ల 

3) మెరుపును కలిగి ఉండటం వల్ల 

4) వీటిలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లు ఉండటం వల్ల


4.    లోహాలు తుప్పు పట్టకుండా జింక్‌ లాంటి లోహాలతో పూత పూసే ప్రక్రియ?

1) గాల్వనైజేషన్‌     2) విద్యుత్తు విశ్లేషణం  

3) ఎలక్ట్రాలసిస్‌     4) విద్యుదీకరణ


5.     అయస్కాంతీకరణం చెందలేని లోహాన్ని గుర్తించండి.

1) కోబాల్ట్‌      2) జింక్‌ 

3) ఇనుము      4) గెడలోనియం


6.   ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే లోహాం-

1) రాగి  2) వెండి  3) బంగారం  4) ఇనుము


7.     బంగారు ఆభరణాల్లో కాపర్‌ను కలపడానికి కారణం?

1) నాణ్యత పెంచడానికి      2) గట్టితనం కోసం 

3) మెరుపు పెంచడానికి     4) సన్నని తీగలుగా మార్చడానికి


8.     ఇనుము తుప్పు పట్టినప్పుడు ఏర్పరిచే సమ్మేళనం?

1) ఫెర్రిక్‌ ఆక్సైడ్‌     2) ఫెర్రిక్‌ సల్ఫేట్‌

3) ఫెర్రస్‌ ఆక్సైడ్‌     4) ఫెర్రస్‌ సల్ఫేట్‌


9.     గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహాన్ని గుర్తించండి.

1) లిథిÅయం     2) ఆస్మియం 

3) మెర్క్యూరీ     4) సీజియం


10. విద్యుత్తు పరికరాల్లో సాధారణంగా వాడే లోహం?

1) లిథియం  2) ఇనుము  3) వెండి   4) రాగి


11. హిమోగ్లోబిన్‌లో ఉండే లోహాన్ని గుర్తించండి.    

1) కోబాల్ట్‌  2) ఐరన్‌ 3) సోడియం  4) క్యాల్షియం


12. విటమిన్‌ B12లో ఉండే లోహాం-

1) కోబాల్ట్‌      2) పొటాషియం  

3) సోడియం     4) మెగ్నీషియం


13. వండర్‌ మెటల్‌గా ఏ లోహాన్ని పిలుస్తారు?

1) బంగారం      2) వెండి  

3) టైటానియం      4) అల్యూమినియం


14. ప్రస్తుతం ఆభరణాల తయారీలో బంగారం, వెండితో పాటు ఏ లోహాన్ని వాడుతున్నారు?

1) టైటానియం      2) ఇనుము  

3) స్టీల్‌     4) పొటాషియం 


15. తేలికగా, గట్టితనంతో ఉండి చవకగా లభించడం వల్ల విమానాల తయారీలో వాడే లోహం?

1) సోడియం      2) పొటాషియం 

3) టైటానియం     4) అల్యూమినియం


16. శరీరంలో ఏ లోహాం లోపిస్తే రక్తహీనత (ఎనీమియా) ఏర్పడుతుంది?

1) పొటాషియం     2) ఐరన్‌  

3) మెగ్నీషియం     4) జింక్‌


17. రేడియోధార్మికత నుంచి రక్షించే లోహాన్ని గుర్తించండి.

1) కోబాల్ట్‌  2) ఐరన్‌   3) టంగ్‌స్టన్‌   4) లెడ్‌ 


18. విద్యుత్తు బల్బుల్లో వాడే ఫిలమెంట్‌ను ఏ లోహంతో తయారు చేస్తారు?

1) టంగ్‌స్టన్‌      2) ఐరన్‌ 

3) ఆస్మియం      4) సీజియం


19. గొడ్డలి, కొడవలి లాంటి పనిముట్లు చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే చల్లారుస్తారు. తగిన మోతాదులో నీటిలో ముంచడం వల్ల గట్టితనం వస్తుంది. ఈ ప్రక్రియ పేరు?

1) అన్నీలింగ్‌     2) సోల్డరింగ్‌ 

3) టెంపరింగ్‌     4) ప్లాస్టరింగ్‌


20. వేడి లోహాన్ని నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియను ఏమంటారు?

1) టెంపరింగ్‌       2) అన్నీలింగ్‌  

3) సోల్డరింగ్‌     4) ప్లాస్టరింగ్‌ 


21. మొక్కల పత్రహరితంలో ఉండే లోహాం-

1) మెగ్నీషియం      2) ఐరన్‌ 

3) ఆస్మియం      4) సీజియం


22. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక లోహం?

1) సోడియం - 23    2) యురేనియం - 235 

3) సిల్వర్‌ - 107    4) కోబాల్ట్‌ - 60


23. ఎముకలు, దంతాల పుష్టికి పాల నుంచి అవసరమయ్యే లోహ అయాన్‌?

1) పొటాషియం       2) సోడియం 

3) క్యాల్షియం     4) మెగ్నీషియం


24. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు కారణమైన క్యాల్షియం సమ్మేళనం ఏది?

1) క్యాల్షియం క్లోరైడ్‌     2) క్యాల్షియం కార్బొనేట్‌ 

3) క్యాల్షియం ఆక్సలేట్‌    4) క్యాల్షియం ఆక్సైడ్‌


25. ముత్యాల్లో ఉండే రసాయన సమ్మేళనాన్ని గుర్తించండి.

1) క్యాల్షియం క్లోరైడ్‌      2) క్యాల్షియం కార్బొనేట్‌

3) క్యాల్షియం ఆక్సలేట్‌     4) క్యాల్షియం ఆక్సైడ్‌


26. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన లోహాం ఏది?

1) క్యాల్షియం      2) సోడియం   

3) పొటాషియం     4) మెగ్నీషియం 


27. కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం?

1) సోడియం      2) క్యాల్షియం  

3) పొటాషియం      4) మెగ్నీషియం


28. అధిక రక్తపోటు ఉన్నవారి ఆహారంలో ఏ లోహ అయాన్‌ తక్కువ ఉండాలి?

1) క్యాల్షియం      2) సోడియం  

3) మెగ్నీషియం     4) క్లోరిన్‌


29. ఫొటో క్రోమిక్‌ కళ్లద్దాల్లో వాడే లోహాన్ని గుర్తించండి.

1) ఐరన్‌     2) సిల్వర్‌ 

3) టైటానియం      4) పొటాషియం


30. కృత్రిమ వర్షాల కోసం సాధారణ ఉప్పుతో పాటు వాడే రసాయనిక పదార్థం?

1) సిల్వర్‌ బ్రోమైడ్‌     2) సిల్వర్‌ నైట్రేట్‌ 

3) సిల్వర్‌ క్లోరైడ్‌     4) సిల్వర్‌ అయోడైడ్‌


31. ఎన్నికల సమయంలో చేతివేలిపై గుర్తు వేయడానికి వాడే సిరాలో ఉండే రసాయన సమ్మేళనం?

1) సిల్వర్‌ నైట్రేట్‌       2) ఫెర్రిక్‌ ఆక్సైడ్‌   

3) కాపర్‌ సల్ఫేట్‌       4) కార్బన్‌


32. బాక్సైట్‌ ఖనిజం నుంచి వెలికి తీసిన లోహాన్ని గుర్తించండి.

1) వెండి       2) మెర్క్యూరీ   

3) జింక్‌       4) అల్యూమినియం


33. ఇస్త్రీ పెట్టెలోని కాయిల్‌లో వాడే మిశ్రమ లోహం?

1) బ్రాంజ్‌        2) బ్రాస్‌   

3) నిక్రోమ్‌       4) గన్‌మెటల్‌


34. కేరళ తీరంలో ఉండే మోనోజైట్‌ ఇసుక నుంచి లభించే లోహం?

1) యురేనియం       2) థోరియం    

3) ప్లంబం       4) కాపర్‌


35. కిందివాటిలో అత్యంత కఠినమైన లోహాం-

1) ఐరన్‌   2) స్టీల్‌  3) కాపర్‌   4) టంగ్‌స్టన్‌


36. కిందివాటిలో అర్ధ లోహాన్ని గుర్తించండి.

1) ఆస్మియం  2) ప్లంబం  3) టిన్‌  4) సిలికాన్‌


37. కాంతి విద్యుత్తు ఘటాల్లో ఉపయోగించే లోహం ఏది?

1) క్యాల్షియం        2) సీజియం    

3) అల్యూమినియం        4) ఐరన్‌


38. నూనెలు హైడ్రోజనీకరణం చేసి కొవ్వులుగా తయారు చేసే ప్రక్రియలో ఉత్ప్రేరకంగా వాడే లోహం?

1) ఇనుము  2) కాపర్‌  3) నికెల్‌  4) కోబాల్ట్‌


39. కంచు మిశ్రమ లోహంలోని అనుఘటక లోహాలు?

1) టిన్, కాపర్‌        2) కాపర్, జింక్‌

3) టిన్, ఐరన్‌       4) ఐరన్, క్రోమియం


40. ఇత్తడి మిశ్రమ లోహంలోని అనుఘటక లోహాలు?

1) కాపర్, టిన్‌        2) కాపర్, జింక్‌     

3) కాపర్, సిల్వర్‌        4) కాపర్, నికెల్‌


41. టిన్, లెడ్, యాంటీమోనియాల మిశ్రమ లోహం?

1) గన్‌మెటల్‌        2) సోల్డర్‌ మెటల్‌   

3) టైప్‌ మెటల్‌        4) నిక్రోమ్‌


42. కిందివాటిలో ఫెర్రస్‌ ఆలామ్‌ (ఇనుముతో కూడిన మిశ్రమ లోహం)?

1) ఇత్తడి        2) జర్మన్‌ సిల్వర్‌   

3) స్టీల్‌        4) కంచు


43. జర్మన్‌ సిల్వర్‌ మిశ్రమ లోహంలో లేనిది గుర్తించండి.

1) సిల్వర్‌   2) కాపర్‌   3) నికెల్‌   4) జింక్‌


44. ‘మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా’ అని దేన్ని పిలుస్తారు?

1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌        2) మెగ్నీషియం సల్ఫేట్‌

3) మెగ్నీషియం క్లోరైడ్‌        4) పొటాషియం కార్బొనేట్‌


45. లోతుగా తవ్విన బోరుబావుల నీటి ద్వారా వచ్చే విషపూరిత లోహం?

1) ఆర్సినిక్‌       2) యాంటీమోనియా    

3) క్రోమియం       4) లెడ్‌


46. మానసిక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే సమ్మేళనం?

1) సోడియం కార్బొనేట్‌        2) సోడియం బై కార్బొనేట్‌   

3) లిథియం కార్బొనేట్‌        4) పొటాషియం కార్బొనేట్‌


47. పాము కాటు వేసినప్పుడు మానవ శరీరంలోకి విడుదలయ్యే లోహం?

1) జింక్‌   2) లెడ్‌    3) నికెల్‌    4) ఆర్సినిక్‌


48. అత్యంత తేలికైన లోహాన్ని గుర్తించండి.

1) సీజియం      2) లిథియం    

3) పొటాషియం        4) టిన్‌


49. మినిమాటా వ్యాధికి కారణమైన లోహం?

1) లెడ్‌       2) జింక్‌    

3) టిన్‌       4) మెర్క్యూరీ


50. ఆహార పదార్థాల నిల్వకు వాడే ఇనుము డబ్బాలకు లోపలి వైపు ఏ లోహంతో పూత పూస్తారు?

1) లెడ్‌        2) టిన్‌    

3) జింక్‌       4) నికెల్‌



సమాధానాలు

1-2; 2-4; 3-4; 4-1; 5-2; 6-3; 7-2; 8-1; 9-3; 10-4; 11-2; 12-1; 13-3; 14-1; 15-4; 16-2; 17-4; 18-1; 19-3; 20-2; 21-1; 22-4; 23-3; 24-3; 25-2; 26-1; 27-2; 28-2; 29-2; 30-4; 31-1; 32-4; 33-3; 34-2; 35-4; 36-4; 37-2; 38-3; 39-1; 40-2; 41-2; 42-3; 43-1; 44-1; 45-1; 46-3; 47-4; 48-2; 49-4; 50-2.


రచయిత: చంటి రాజుపాలెం 
 

Posted Date : 20-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌