• facebook
  • whatsapp
  • telegram

జీవ నిర్జీవాలకు వైరస్‌లే వారధులు!

సూక్ష్మ జీవశాస్త్రం

కాచి చల్లార్చి చల్ల వేస్తే పాలు ఉదయానికి పెరుగుగా మారుతుంది. చనిపోయిన మొక్కలు, జంతువులు కొన్నాళ్లకు కుళ్లి భూమిలో కలిసిపోతాయి. అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారానే వ్యాపిస్తుంటాయి. ఈ ప్రక్రియలన్నింటికీ కారణం సూక్ష్మజీవులు. అవి సాధారణంగా కంటికి కనిపించవు. కానీ ప్రకృతిలోని ఆహార గొలుసును క్రమబద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్, కార్బన్, నత్రజని, సల్ఫర్‌ తదితర మూలకాల పునఃచక్రీయతలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రొటోజోవాల అధ్యయనమే సూక్ష్మ జీవశాస్త్రం. మొక్కలు, మనుషులు, ఇతర జంతువులు, పంటలకు వ్యాధులు కలిగించే ఈ జీవులే యాంటీబయాటిక్స్, టీకాల ఉత్పత్తిలోనూ కీలకంగా ఉన్నాయి. వాటి వల్ల ఉపయోగాలు, కలిగే వ్యాధులు,  ఔషధాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలు, సంబంధిత విజ్ఞాన ఆవిష్కరణల గురించి అభ్యర్థులు సమగ్రంగా  తెలుసుకోవాలి.


1.    మొదటి సంయుక్త సూక్ష్మదర్శినిని ఎవరు తయారుచేశారు?

1) జకారస్‌ జాన్సన్‌      2) లిన్నేయస్‌  

3) నాల్, రస్కీ      4) లీవెన్‌ హుక్‌


2.     కింది వాక్యాలను గమనించి సరైనదాన్ని ఎన్నుకోండి.    

ఎ) 1678లో కనుక్కున్న సూక్ష్మజీవులను యానిమల్‌ క్యూల్స్‌ అంటారు.

బి) యానిమల్‌ క్యూల్స్‌కు బ్యాక్టీరియా అని పేరు పెట్టారు.

సి) ఒకే కటకం ఉండే సూక్ష్మదర్శినిని జకారస్‌ జాన్సన్‌ కనుక్కున్నాడు.

డి) స్పైరులీనా, ఈడోగోనియం, సెరాటియం అనేవి శైవలాలు.

1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, సి    

3) సి, డి         4) ఎ, బి, డి


3.     కిందివాటిలో భిన్నమైంది?

1) సైక్లాప్స్‌       2) స్పైరోగైరా    

3) డాఫ్నియా        4) కనురెప్ప క్రిమి


4.     కింది వాక్యాన్ని గమనించి సరైనదాన్ని ఎన్నుకోండి?

ఎ) ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా థియోమార్గరీటా నమీబియాన్సిస్‌.

బి) దీని పొడవు 0.75 మి.మీ.

సి) దీన్ని 1999లో హైడ్‌.ఎన్‌.షుల్జ్‌ కనుక్కున్నారు.

డి) ఈ బ్యాక్టీరియాను కంటితో చూడలేం.

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి     

3) ఎ, సి        4) ఎ, బి, సి


5.     సజీవులకు, నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేసేవి?

1) శైవలాలు      2) వైరస్‌లు  

3) శిలీంధ్రాలు      4) ప్రొటోజోవా జీవులు


6.     కిందివాటిలో సూక్ష్మజీవ ప్రపంచంలో లేనివి?

1) శైవలాలు       2) శిలీంధ్రాలు   

3) వైరస్‌లు       4) ప్రొటోజోవా


7.     ప్రొటోజోవా జీవుల వర్ధనంలో ఎండుగడ్డిని నీటిలో ఎన్ని రోజులు నానబెట్టాలి?

1) ఒక రోజు       2) 3 రోజులు   

3) 5 రోజులు      4) వారం


8. ఒక ఎకరం భూమి పైపొరలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య...

1) ఒక క్వింటాల్‌       2) ఒక టన్ను  

3) అర టన్ను      4) పావు టన్ను


9.     కిణ్వన ప్రక్రియలో పులియబెట్టిన పిండి పరిమాణం పెరగడానికి అవసరమయ్యే వాయువు?

1) CO2 2) CO 3) N2 4) O2


10. కిందివాటిలో కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కానివేవి?

ఎ) ఎసిటిక్‌ ఆమ్లం       బి) బీర్, వైన్‌   

సి) టార్టారిక్‌ ఆమ్లం     డి) ఆక్సాలిక్‌ ఆమ్లం

1) ఎ, సి   2) బి, సి   3) సి, డి   4) ఎ, డి 


11. కిందివాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ) సెప్టిసీమియాను సూక్ష్మజీవి నాశకాల ద్వారా నివారించొచ్చు.

బి) సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా వాతావరణంలోని మొత్తం ప్రాణవాయువు లభిస్తుంది.

సి) బ్యాక్టీరియా అభిరంజనం కోసం క్రిస్టల్‌ వైలెట్‌ను ఉపయోగిస్తారు.

డి) పోలియో, స్వైన్‌ఫ్లూ అనేవి వైరస్‌ వ్యాధులు.

1) ఎ, బి       2) సి, డి   

3) ఎ, బి, డి         4) ఎ, సి, డి


12. కిందివాటిలో ప్రొటోజోవా వ్యాధి కానిది?     

1) టైఫాయిడ్‌       2) మలేరియా   

3) అమీబియాసిస్‌       4) ఏదీకాదు


13. టెట్రాసైక్లిన్‌ను కనుగొన్న వ్యక్తి?    

1) జోనస్‌ సాక్‌       2) ఎల్లాప్రగడ సుబ్బారావు  

3) ఆల్బర్ట్‌ సాబిన్‌     4) అందరూ


14. ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’ అనేది దేని నినాదం?    

1) ఆంథ్రాక్స్‌       2) రేబిస్‌   

3) ఎయిడ్స్‌       4) పోలియో


15. 9వ తరగతి చదువుతున్న వెంకట్‌ క్షయ రోగిని గమనించి, అతడికి కింది వాటిలో దేన్ని వాడమని సూచిస్తాడు?

1) ఆరియోమైసిన్‌      2) టెట్రాసైక్లిన్‌  

3) మోనోసెప్‌      4) 1, 2


16. కిందివారిలో పెన్సిలిన్‌ను కనుక్కున్నందుకు నోబెల్‌ పొందనివారు?

1) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌     2) హూవర్డ్‌ ప్లోరీ

3) ఎర్నెస్ట్‌ హెకెల్‌      4) ఎర్నెస్ట్‌ బి.చైన్‌


17. కిందివాటిని జతపరచండి. 

1) పోలియో (ఎ) వాక్సీనియా
2) పెన్సిలిన్‌ (బి) జోనస్‌ సాక్‌
3) పోలియో చుక్కలు (సి) బైజరింక్‌
4) వైరస్‌కు పేరు పెట్టింది (డి) 1929
   (ఇ) 1957
  (ఎఫ్‌) ఐవనోవిస్కి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ     2) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి    

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఇ   4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎఫ్‌


18. ప్రపంచంలో మొదటి అద్భుత ఔషధం?

1) పెన్సిలిన్‌     2) అమికాసిన్‌ 

3) సిప్లాక్స్‌     4) ఎరిత్రోమైసిన్‌


19. మశూచికి వాక్సిన్‌ను కనుక్కున్నది?

1) లూయీపాశ్చర్‌     2) రోనాల్డ్‌ రాస్‌ 

3) ఎడ్వర్డ్‌ జెన్నర్‌    4) జోనస్‌ సాక్‌


20. వాక్సిన్‌ అనే ఆంగ్లపదం ఏ భాష నుంచి వచ్చింది?

1) లాటిన్‌  2) గ్రీకు  3) జర్మన్‌  4) అరబిక్‌


21. కిందివాటిలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేవి?

1) నాస్టాక్‌     2) అనబీనా 

3) రైజోబియం     4) పైవన్నీ


22. కిందివాటిలో బయో పెస్టిసైడ్‌కు ఉదాహరణ? 

1) బీటీ పత్తి     2) బీటీ వంగ 

3) బీటీ టమాట     4) 1, 2


23. మలేరియా దేనివల్ల సంభవిస్తుంది?

1) ప్లాస్మోడియం వైవాక్స్‌     2) కొరినే బ్యాక్టీరియం డిఫ్తీరియా 

3) సాల్మోనెల్లా టైఫై     4) విబ్రియో కలరా


24. కిందివాటిలో ట్రిపుల్‌ యాంటీజెన్‌- 

1) డి.టి.పి. 2) డి.పి.టి. 3) డి.డి.టి. 4) డి.ఎ.పి.


25. ఎం.ఎం.ఆర్‌. టీకాను ఏ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు?

1) తట్టు  2) గవద బిళ్లలు  3) డెంగీ 4) 1, 2  


26. డి.పి.టి. ఏ వ్యాధికి పనిచేయదు?

1) డిఫ్తీరియా        2) కోరింత దగ్గు   

3) గవద బిళ్లలు        4) ధనుర్వాతం


27. కిందివాటిలో ఏ వ్యాధి జంతువులు, మానవులకు సోకుతుంది?

1) ఆంథ్రాక్స్‌        2) బొట్యులినమ్‌    

3) టెటనస్‌        4) కలరా


28. వేడిచేయడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు చనిపోతాయని తెలిపింది? 

1) లూయీ పాశ్చర్‌        2) రోనాల్డ్‌ రాస్‌

3) లాజ్జారో స్పాల్లాజని      4) జోనస్‌ సాక్‌


29. దోమలు ఫైలేరియాతో పాటు మలేరియాను కూడా వ్యాప్తి చేస్తాయని కనుక్కున్నది ఎవరు?

1) ప్యాట్రిక్‌ మాన్‌సన్‌       2) రోనాల్డ్‌ రాస్‌ 

3) ఫ్లెమింగ్‌             4) లూయీ పాశ్చర్‌


30. ప్రపంచ మలేరియా దినోత్సవం? 

1) ఆగస్టు 18        2) ఆగస్టు 19     

3) ఆగస్టు 20         4) ఆగస్టు 16


31. పక్షుల్లో మలేరియాపై పరిశోధన చేసిన వ్యక్తి?

1) లూయీ పాశ్చర్‌        2) రోనాల్డ్‌ రాస్‌ 

3) ప్యాట్రిక్‌ మాన్‌సన్‌       4) మహ్మద్‌ బక్స్‌


32. కిందివాటిలో లూయీ పాశ్చర్‌కు సంబంధం లేనిది?

1) గట్టేషన్‌            2) జెర్మ్‌ థియరీ  

3) పాశ్చరైజేషన్‌         4) ఆంథ్రాక్స్‌ వాక్సిన్‌


33. ‘వాట్‌ పాశ్చరైజేషన్‌’లో పాలను ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు?

1) 72°C     2) 70°C     3) 63°C    4) 10°C


34. సెర్కోస్పోరా అరాకిడికోలా ఏ వ్యాధిని కలిగిస్తుంది?

1) వేరుశనగలో టిక్కా తెగులు     2) చెరకు ఎర్రకుళ్లు తెగులు

3) మొజాయిక్‌ వ్యాధి    4) వరిలో కాటుక తెగులు


35. కిందివాటిలో కోళ్లకు కలగని వ్యాధి...

1) ఫౌల్‌ పాక్స్‌         2) బర్డ్‌ ఫ్లూ      

3) కాక్సిడయాసిస్‌        4) రేబిస్‌


36. కిందివాటిలో వరిలో కాటుక తెగులును కల్గించేది ఏది?

1) జాంథోమోనస్‌ సిట్రీ     2) స్పెసిలోథికా సొర్గై 

3) సెర్కోస్పోరా           4) పైవన్నీ


37. బీసీజీని ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు?

1) మశూచి      2) పోలియో  

3) క్షయ      4) మలేరియా


38. లెగ్యుమినేసి, రైజోబియం బ్యాక్టీరియా మధ్య జరిగే ప్రక్రియ?

1) సహజీవనం          2) సహ భోజకత్వం 

3) పరాన్నజీవనం         4) పూతికాహార భక్షణ


39. ప్రమాదవశాత్తు సముద్రంలో ఏర్పడిన నూనె తెట్టును తొలగించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా?

1) అజటో బ్యాక్టీరియా      2) బ్యాక్టీరియం పుటిడే

3) విబ్రియో             4) 1, 3


40. కిందివాటిలో సూక్ష్మజీవుల నుంచి ఆహార పదార్థాలు చెడిపోకుండా చేసే అత్యుత్తమ పద్ధతి?

1) ఆహార పదార్థాలను అనేకసార్లు వేడి చేయడం

2) రసాయనాలు వాడటం

3) ఆహార పదార్థాల్లో నీటిశాతం దాదాపు తగ్గించడం

4) గాలి తగలకుండా నిల్వ చేయడం


41. కిందివాటిలో అతిపెద్ద వైరస్‌?

1) వాక్సీనియా     2) టీఎమ్‌వీ 

3) రిట్రో వైరస్‌     4) ఆల్ఫా వైరస్‌


42. కిందివాటిలో రేబిస్‌ కారణమైన వైరస్‌? 

1) ప్లావి వైరస్‌     2) ఆల్ఫా వైరస్‌ 

3) రాబ్డో వైరస్‌     4) వారిసెల్లా వైరస్‌


43. కిందివాటిలో రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌?

1) కొవాగ్జిన్‌    2) స్పుత్నిక్‌ వి 

3) కొవీషీల్డ్‌    4) జైకోవ్‌ - డీ


44. ‘జర్మ్‌ థియరీ ఆఫ్‌ డిసీసెస్‌’’ ను ప్రతిపాదించినది?

1) లూయీ పాశ్చర్‌     2) లీవెన్‌హుక్‌ 

3) రోనాల్డ్‌రాస్‌     4) రాబర్ట్‌కోచ్‌


45. బ్యాక్టీరియాలను తినే బ్యాక్టీరియా-

1) థియో మార్గరీటా     2) డెల్లో విబ్రియా 

3) పాశ్చరెల్లా     4) 1, 2


46. టైఫాయిడ్‌ నిర్ధారణ పరీక్ష - 

1) మాంటాక్స్‌  2) టెట్వాక్‌  3) ట్యాబ్‌ 4) వైడల్‌


47. మలేరియా వ్యాధి నివారణకు వాడే ఆల్కలాయిడ్‌-

1) క్వినైన్‌  2) క్లోరోక్విన్‌  3) రిసర్పిన్‌  4) 1, 2


48. సిట్రిక్‌ ఆమ్లం తయారీలో ఉపయోగించే శిలీంధ్రం? 

1) ఆస్పరిజిల్లస్‌ నైట్రస్‌ 2) అసిటో బాక్టర్‌ 3) మ్యూకార్‌ 4) న్యూరోస్పోరా


49. బ్యాక్టీరియా పితామహుడు- 

1) రాబర్ట్‌ కోచ్‌ 2) ఎహ్రెన్‌ బర్గ్‌ 3) లూయీపాశ్చర్‌ 4) టాటం


50. ప్రపంచంలోనే మొదటిసారి మనదేశం పూర్తిగా నిర్మూలించిన వ్యాధి...

1) యాస్‌   2) ఎయిడ్స్‌    3) పోలియో   4) మశూచి


సమాధానాలు

1-1; 2-4; 3-2; 4-3; 5-2; 6-3; 7-2; 8-3; 9-1; 10-3; 11-4; 12-1; 13-2; 14-4; 15-4; 16-3; 17-2; 18-1; 19-3; 20-1; 21-4; 22-4; 23-1; 24-2; 25-4; 26-3; 27-1; 28-3; 29-1; 30-3; 31-4; 32-1; 33-3; 34-1; 35-4; 36-2; 37-3; 38-1; 39-2; 40-3; 41-1; 42-3; 43-2; 44-4; 45-2; 46-4; 47-4. 48-1, 49-3, 50-1. 

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం
 

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌