• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం, రసాయన బంధం

సమంగా ఇచ్చి.. సమష్టిగా పంచుకొని!

అన్ని పదార్థాలు పరమాణు నిర్మాణాలే. అయితే అవి నిర్దిష్ట ఆకృతిని, స్వభావాన్ని సంతరించుకోడానికి వాటిలోని రసాయన బంధాలు ప్రధాన కారణంగా నిలుస్తాయి. పరమాణువులకు ప్రత్యేక సంఖ్య, ద్రవ్యరాశి తోపాటు వాటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రోటాన్లు మూలకాలను నిర్ణయిస్తాయి. ఎలక్ట్రాన్లు ఆ మూలక రసాయన లక్షణాలతోపాటు ఇతర మూలకాలతో కలిసి అవి ఏర్పరిచే బంధాలను నిర్దేశిస్తాయి. వీటికి సంబంధించి అనేక పరమాణు నమూనాలను, నియమాలను శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. ఈ అంశాలన్నింటిపై పోటీపరీక్షల అభ్యర్థులు కనీస అవగాహన ఏర్పరచుకోవాలి. 


1.    విద్యుత్‌ విశ్లేషణ ప్రయోగాలు చేసినప్పుడు పరమాణువులు రుణావేశాన్ని పొందుతాయని కనుక్కున్న శాస్త్రవేత్త?

1) జె.జె.థామ్సన్‌      2) గోల్డ్‌స్టెయిన్‌  

3) మైకేల్‌ ఫారడే      3) జేమ్స్‌ చాడ్విక్‌

2.     న్యూట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్తను గుర్తించండి.

1) జె.జె.స్టోని      2) జేమ్స్‌ చాడ్విక్‌  

3) గోల్డ్‌స్టెయిన్‌      4) జె.జె.థామన్స్‌

3.     ప్రోటాన్‌కు ఉండే ఆవేశం? 

1) ధనావేశం     2) రుణావేశం  

3) తటస్థం      4) శూన్యం

4. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) జోసెఫ్‌ ప్రాస్ట్‌      2) లెవోఇజర్‌  

3) కావెండిష్‌      4) హెన్నింగ్‌ బ్రాడ్‌

5.     స్థిరానుపాత నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు?

1) లెవోఇజర్‌      2) రాబర్ట్‌ బాయిల్‌  

3) కావెండిష్‌      4) జోసెఫ్‌ ప్రాస్ట్‌

6.     పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్‌ల సంఖ్యను ఏమాంటారు?

1) పరమాణు సంఖ్య      2) పరమాణు ద్రవ్యరాశి 

3) amu       4) అణుద్రవ్యరాశి

7.     ఒక మూలక పరమాణు సంఖ్య 35, దాని ద్రవ్యరాశి సంఖ్య 80 అయితే న్యూట్రాన్‌ల సంఖ్య?

1) 40     2) 45    3) 50     4) 55

8.     ‘పుచ్చకాయ నమూనా’ అని పిలిచే పరమాణు నమూనాను గుర్తించండి.

1) థామ్సన్‌ పరమాణు నమూనా

2) రూథర్‌ఫర్డ్‌ పరమాణు నమూనా

3) బోర్‌ పరమాణు నమూనా

4) ష్రోడింగర్‌ పరమాణు నమూనా

9.    ఆల్ఫా కిరణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణువులో చాలాభాగం ఖాళీగా ఉందని తెలిపిన శాస్త్రవేత్త?

1) బోర్‌         2) సోమర్‌ఫెల్డ్‌   

3) రూథర్‌ఫర్డ్‌       4) ష్రోడింగర్‌

10. ‘గ్రహమండల నమూనా’గా పిలిచే పరమాణు నమూనా?    

1) బోర్‌ పరమాణు నమూనా    2) రూథర్‌ఫర్డ్‌ పరమాణు నమూనా

3) సోమర్‌ఫెల్డ్‌ పరమాణు నమూనా      4) క్వాంటం పరమాణు నమూనా

11. ‘ఎలక్ట్రాన్‌లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నంతసేపు శక్తిని కోల్పోవు. అవి తిరిగే కక్ష్యలు స్థిరకక్ష్యలు.’ అని తెలిపిన శాస్త్రవేత్త?

1) నీల్స్‌బోర్‌      2) రూథర్‌ఫర్డ్‌  

3) సోమర్‌ఫెల్డ్‌      4) ష్రోడింగర్‌

12. పరమాణు నమూనాలో దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త?

1) రూథర్‌ఫర్డ్‌      2) సోమర్‌ఫెల్డ్‌ 

3) ష్రోడింగర్‌      4) నీల్స్‌బోర్‌

13.    ఎలక్ట్రాన్‌కు కణ, తరంగ స్వభావం ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త?

1) ష్రోడింగర్‌       2) మాక్స్‌ప్లాంక్‌  

3) డీ-బోగ్ల్రీ      4) నీల్స్‌బోర్‌

14. s - ఆర్బిటాల్‌లో నిండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య 2 అయితే d -  ఆర్బిటాల్‌లో నిండే ఎలక్ట్రాన్‌ల సంఖ్య ఎంత?

1) 6          2) 10         3) 14          4) 8

15. ఒక కర్పరంలోని మొత్తం ఎలక్ట్రాన్‌ల సంఖ్యను గుర్తించే సూత్రం?

1) 2n    2) n2     3) 2n2    4) 4n

16. s ఆర్బిటాల్‌ గోళాకారంలో ఉంటుంది. మరి p ఆర్బిటాల్‌ ఉండే ఆకారం?

1) డబుల్‌ డంబెల్‌      2) డంబెల్‌ 

3) ఆకారం లేదు      4) గోళాకారం

17. ప్రధాన క్వాంటం సంఖ్యను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

1) ష్రోడింగర్‌      2) నీల్స్‌బోర్‌  

3) రూథర్‌ఫర్డ్‌      4) సోమర్‌ఫెల్డ్‌ 

18. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) నీల్స్‌ బోర్‌       2) రూథర్‌ఫర్డ్‌   

3) సోమర్‌ఫెల్డ్‌      4) ష్రోడింగర్‌

19. ప్రమాణ అక్షాల పరంగా ఆర్బిటాల్‌ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని తెలిపే క్వాంటం సంఖ్య?

1) ప్రధాన క్వాంటం సంఖ్య      2) స్పిన్‌ క్వాంటం సంఖ్య

3) ఎజిముతల్‌ క్వాంటం సంఖ్య      4) అయస్కాంత క్వాంటం సంఖ్య

20. అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) సోమర్‌ఫెల్డ్‌      2) నీల్స్‌బోర్‌  

3) లాండే      4) ఉలెన్‌బెక్, గౌడ్‌స్మిత్‌

21. ఒక ఆర్బిటాల్‌లోని రెండు ఎలక్ట్రాన్‌లు వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండే క్వాంటం సంఖ్య?

1) ప్రధాన క్వాంటం సంఖ్య      2) స్పిన్‌ క్వాంటం సంఖ్య

3) ఎజిముతల్‌ క్వాంటం సంఖ్య      4) అయస్కాంత క్వాంటం సంఖ్య

22. భూస్థాయిలో ఉన్న పరమాణులోని ఆర్బిటాళ్లను వాటి శక్తులు పెరిగే క్రమంలో ఎలక్ట్రాన్‌లతో భర్తీ చేయాలని తెలిపే నియమం?

1) ఆఫ్‌ బౌ నియమం      2) పౌలీవర్జన నియమం

3) హుండ్‌ నియమం  4) క్వాంటం యాంత్రిక నియమం

23. ఒకే పరమాణువుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్‌లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవని తెలిపే నియమం?

1) హుండ్‌ నియమం      2) పౌలీవర్జన నియమం

3) ఆఫ్‌ బౌ నియమం      4) క్వాంటం యాంత్రిక నియమం

24. స్పిన్‌ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) నీల్స్‌బోర్‌       2) సోమర్‌ ఫెల్డ్‌  

3) లాండే      4) ఉలెన్‌బెక్, గౌడ్‌స్మిత్‌

25. సమాన శక్తి ఉండే అన్ని ఖాళీ ఆర్బిటాళ్లు ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ ఆక్రమించిన తర్వాతనే జత కూడతాయని తెలిపే నియమం?

1) హుండ్‌      2) పౌలీవర్జన

3) ఆఫ్‌ బౌ       4) క్వాంటం యాంత్రిక 

26. హైడ్రోజన్‌ పరమాణు వర్ణపటాన్ని వివరించే పరమాణు నమూనా?    

1) రూథర్‌ఫర్డ్‌      2) సోమర్‌ఫెల్డ్‌  

3) నీల్స్‌బోర్‌      4) డీబ్రోగ్లీ 


27. ఎలక్ట్రాన్‌కు ద్రవ్యవేగంతోపాటు తరంగ దైర్ఘ్యం కూడా ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త?

1) ష్రోడింగర్‌      2) సోమర్‌ఫెల్డ్‌  

3) డీబ్రోగ్లీ      4) నీల్స్‌బోర్‌

28. న్యూక్లియాన్లు అంటే?

1) ప్రోటాన్‌లు, ఎలక్ట్రాన్‌లు   2) ఎలక్ట్రాన్‌లు, న్యూట్రాన్‌లు

3) ప్రోటాన్‌లు మాత్రమే  4) ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు

29. 14C6 లో ద్రవ్యరాశి సంఖ్యను గుర్తించండి.

1) 6      2) 14     3) 20     4) 8

30. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే ఐసోటోపులను గుర్తించండి.

1) కోబాల్ట్‌       2) అయోడిన్‌  

3) యురేనియం      4) కార్బన్‌

31. సామాన్య గాయిటర్‌ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఐసోటోపు?

1) యురేనియం      2) కార్బన్‌  

3) కోబాల్ట్‌      4) అయోడిన్‌

32. అత్యధిక ఐసోటోపులను ప్రదర్శించే జడ వాయు మూలకం?

1) నియాన్‌  2) గ్జినాన్‌  3) క్రిప్టాన్‌  4) ఆర్గాన్‌

33. ఒక ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత శాతం?

1) 80 శాతం      2) 65 శాతం  

3) 95 శాతం      4) 75 శాతం

34. కిందివాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి.

1) 1s < 2s < 2p < 3s 2) 1s < 2s < 3s < 2p

3) 1s < 3s < 2s < 2p 4) 2p < 2s < 1s < 3s

35. శిలాజాల వయసును గుర్తించే ఐసోటోపులను కనుక్కోండి.

1) కోబాల్ట్‌      2) అయోడిన్‌  

3) కార్బన్‌      4) యురేనియం

36. అయానిక బంధాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తను గుర్తించండి.

1) జి.ఎన్‌.లూయిస్‌      2) కోసిల్‌  

3) పావెల్‌      4) లైనస్‌ పౌలింగ్‌

37. వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

1) గెలెస్పి      2) లూయీస్‌  

3) హైట్లర్, లండన్‌      4) సిడ్జివిక్, పావెల్‌

38. CO2, BeCl2 అణువుల్లో బంధ కోణాన్ని గుర్తించండి.    

1) 109°28'      2) 107°48'      3) 104°31'      4) 180°

39. అమ్మోనియా అణువు (NH3) ఆకృతి?

1) రేఖీయం      2) చతుర్ముఖీయం  

3) ట్రైగోనల్‌ పిరమిడ్‌      4) ఆక్టాహెడ్రల్‌

40. PCl5 అణువు సంకరీకరణాన్ని గుర్తించండి.

1) sp3d 2) sp3 3) sp2 4) sp3d2

41. కిందివాటిలో డేటీవ్‌ బంధం/దాత-స్వీకర్త బంధంగా పిలిచే సంయోజనీయ బంధం?

1) అయానిక బంధం  2) సమన్వయ సంయోజనీయ బంధం

3) వేలన్సీ బంధ సిద్ధాంతం   4) VSEPRT సిద్ధాంతం

42. సోడియంక్లోరైడ్‌ (NaCl) సయన్వయ సంఖ్యను గుర్తించండి.

1) 8      2) 10     3) 6      4) 12

43. రెండు పరమాణువులు ఎలక్ట్రాన్‌లను సమంగా ఇచ్చి తిరిగి సమష్టిగా పంచుకునే బంధం?

1) అయానిక బంధం  2) సంయోజనీయ బంధం

3) సమన్వయ సంయోజనీయ బంధం   4) వేలన్సీ బంధ సిద్ధాంతం

44. లోహ, అలోహ పరమాణువు మధ్య ఏర్పడే బంధం?

1) VSEPRT సిద్ధాంతం 2) వేలన్సీ బంధ సిద్ధాంతం  

3) అయానిక బంధం    4) సంయోజనీయ బందం

45. CH4 అణువు ఆకృతిని గుర్తించండి.

1) రేఖీయం      2) చతుర్ముఖీయం  

3) సమతల త్రిభుజం      4) ఆక్టాహెడ్రల్‌

46. నీటి అణువు బంధకోణం ఎంత?

1) 109°28'    2) 107°48'    3) 120°    4) 104°31'

47. BF3 అణువు సంకరీకరణాన్ని గుర్తించండి.

1) sp         2) sp2        3) sp3      4) sp3d

48. IIA గ్రూపు మూలకాల ఆక్సీకరణ స్థితిని గుర్తించండి.

1) +-3        2) -2        3) +2      4) +4

49. VA గ్రూపు మూలకాల సంయోజకతలను గుర్తించండి.

1) 3      2) 4     3) 2      4) 1

50. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

1) నీల్స్‌బోర్‌    2) సోమర్‌ఫెల్డ్‌  

3) రూథర్‌ఫర్డ్‌   4) ష్రోడింగర్‌


సమాధానాలు

1-3; 2-2; 3-1; 4-2; 5-4; 6-1; 7-2; 8-1; 9-3; 10-2; 11-1; 12-2; 13-3; 14-2; 15-3; 16-2; 17-2; 18-3; 19-4; 20-3; 21-2; 22-1; 23-2; 24-4; 25-1; 26-3; 27-3; 28-4; 29-2; 30-1; 31-4; 32-2; 33-3; 34-1; 35-3; 36-2; 37-3; 38-4; 39-3; 40-1; 41-2; 42-3; 43-2; 44-3; 45-2; 46-4; 47-2; 48-3; 49-1; 50-4.  

Posted Date : 19-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌