• facebook
  • whatsapp
  • telegram

ఆమె క్విట్‌ ఇండియా కథానాయిక!

జాతీయోద్యమం - మలి దశ

వలస పాలన నుంచి విముక్తి కోసం సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం గాంధీజీ నాయకత్వంలో మేలిమలుపు తిరిగింది. దేశాన్ని ఒక్కతాటిపై నడిపింది. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలు ప్రజల్లో త్యాగనిరతిని, దేశభక్తిని పెంచాయి. భారతీయుల పోరాటాలకు తోడు రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలు బ్రిటిష్‌ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులను సృష్టించిన ఈ దశను సమగ్రంగా తెలుసుకోవాలి. వివిధ ఉద్యమాలు, తిరుగుబాట్లు నిర్వహించిన నాయకులు, క్రిప్స్‌ రాయబారం, నేతాజీ పోరాటం, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం, పాకిస్థాన్‌ వేర్పాటువాదానికి దారితీసిన పరిస్థితులు, స్వాతంత్య్ర ప్రకటన, దేశీయ సంస్థానాలు విలీనమైన తీరు వంటి ముఖ్యాంశాలను సంవత్సరాలు, తేదీలతో సహా గుర్తుంచుకోవాలి.


1.    శాసన ఉల్లంఘన ఉద్యమ సమయంలో జరిగిన కార్యక్రమాలను గుర్తించండి.

1) ఉప్పు చట్టాలను వ్యతిరేకించడం    2) విదేశీ వస్త్ర బహిష్కరణ

3) మద్యం దుకాణాల వద్ద పికెటింగ్‌    4) పైవన్నీ


2.     ఏ ఐఎన్‌సీ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్‌ తన లక్ష్యమని కాంగ్రెస్‌ ప్రకటించింది?

1) లాహోర్‌ సమావేశం    2) కరాచీ సమావేశం

3) కాకినాడ సమావేశం    4) బెల్గాం సమావేశం


3.     ఏ రోజున గాంధీజీ ఆంగ్లేయుల ఉప్పు చట్టాలను వ్యతిరేకించారు?

1) 1919, మార్చి 30      2) 1922, ఫిబ్రవరి 5

3) 1930, ఏప్రిల్‌ 6       4) 1930, మార్చి 12


4.     భారత ప్రభుత్వ చట్టం-1935ని అనుసరించి ఎన్నికలు జరిగిన సంవత్సరం?

1) 1935  2) 1936  3) 1937  4) 1938


5.     గాంధీజీ ‘డూ ఆర్‌ డై’ అనే నినాదాన్ని ఏ ఉద్యమ సమయంలో ఇచ్చారు?

1) శాసన ఉల్లంఘన ఉద్యమం    2) క్విట్‌ ఇండియా ఉద్యమం

3) సహాయ నిరాకరణ ఉద్యమం    4) చంపారన్‌ ఉద్యమం


6.     కిందివాటిలో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనల్లో లేని దాన్ని గుర్తించండి.

1) కాంగ్రెస్‌ నాయకులు అరెస్టయ్యారు.

2) పోలీస్‌స్టేషన్లు, పోస్టాఫీసులు ధ్వంసమయ్యాయి.

3) ప్రజలు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.

4) చరఖాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు.


7.     ‘చలో దిల్లీ’ అనే నినాదాన్ని ఇచ్చిన జాతీయ నాయకుడు ఎవరు?

1) మహాత్మా గాంధీ    2) సుభాష్‌ చంద్రబోస్‌

3) రాస్‌ బిహారీ ఘోష్‌    4) చంద్రశేఖర్‌ ఆజాద్‌


8.     ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’ను ముస్లింలీగ్‌ ఏ రోజున ప్రకటించింది?

1) 1946, ఆగస్టు 16     2) 1947, ఆగస్టు 14

3) 1945, మార్చి 4    4) 1945, జనవరి 2


9.     ముస్లింలీగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

1) 1905   2) 1906  3) 1907  4) 1908


10. 1937లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ?

1) ముస్లిం లీగ్‌     2) భారత జాతీయ కాంగ్రెస్‌

3) కమ్యూనిస్ట్‌ పార్టీ  4) హిందూ మహాసభ


11. పాకిస్థాన్‌ అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు?

1) రెహమత్‌ అలీ    2) మహ్మద్‌ ఇక్బాల్‌

3) మహ్మద్‌ అలీ జిన్నా     4) షౌకత్‌ అలీ


12. క్రిప్స్‌ కమిషన్‌ భారతదేశానికి రావడానికి ప్రధాన కారణమేంటి?

1) కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ మధ్య రాజీ కుదర్చడానికి    

2) జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి

3) రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారం కోసం

4) భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి


13. క్రిప్స్‌ కమిషన్‌ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది?

1) 1942  2) 1943  3) 1940  4) 1944


14. ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమ సమయంలో ‘క్విట్‌ ఇండియా కథానాయిక’ అని ఎవరిని పిలిచారు?

1) సరోజినీ నాయుడు     2) కాదంబిని గంగూలీ

3) అనిబిసెంట్‌           4) అరుణా అసఫ్‌ అలీ


15. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఏ భారతీయ పార్టీ బ్రిటన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది?

1) కాంగ్రెస్‌ పార్టీ        2) హిందూ మహాసభ

3) ముస్లింలీగ్‌          4) కమ్యూనిస్ట్‌ పార్టీ


16. కిందివారిలో భారత జాతీయ సైన్యం నాయకుడిని గుర్తించండి.

1) మహాత్మా గాంధీ         2) చంద్రశేఖర్‌ ఆజాద్‌

3) సుభాష్‌ చంద్రబోస్‌      4) ఎం.ఎన్‌.రాయ్‌


17. రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు జరిగిన సంవత్సరం?

1) 1945, జనవరి 30     2) 1946, ఫిబ్రవరి 16

3) 1947, ఆగస్టు 15    4) 1946, అక్టోబరు 20


18. రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు నాయకుడు ఎవరు?

1) ఎం.ఎస్‌.ఖాన్‌          2) ఆర్‌.ఎస్‌.దత్‌

3) ఎం.ఎన్‌.రాయ్‌        4) మహ్మద్‌ అలీ జిన్నా


19. 1946లో భారతదేశానికి వచ్చిన మంత్రివర్గ రాయబారంలో లేని వ్యక్తిని గుర్తించండి.

1) క్లెమెంట్‌ అట్లీ          2) స్టాఫర్డ్‌ క్రిప్స్‌ 

3) అలెగ్జాండర్‌           4) పెథిక్‌ లారెన్స్‌


20. భారతదేశానికి చివరి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌/వైస్రాయ్‌ ఎవరు?

1) మౌంట్‌ బాటన్‌     2) వేవెల్‌ 

3) కర్జన్‌     4) వెల్లింగ్టన్‌


21. దర్శన్‌ ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు?    

1) సరోజినీ నాయుడు       2) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

3) అరుణా అసఫ్‌ అలీ       4) అనిబిసెంట్‌


22. కిందివారిలో ‘సరిహద్దు గాంధీ’ అని ఎవరిని పిలుస్తారు?

1) మహ్మద్‌ అలీ జిన్నా          2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌        4) షౌకత్‌ అలీ


23. భారత స్వాతంత్య్ర పోరాటంలో చివరి ప్రతిఘటనగా దేన్ని చెప్పవచ్చు?

1) క్విట్‌ ఇండియా ఉద్యమం     2) శాసన ఉల్లంఘన ఉద్యమం

3) కోహిమా యుద్ధం 4) రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు


24. కింది ఐ.ఎన్‌.సి. సమావేశాలను, అవి జరిగిన నగరాలతో జతపరచండి.

1) లాహోర్‌ సమావేశం ఎ) 1907
2) మద్రాస్‌ సమావేశం బి) 1916
3) సూరత్‌ సమావేశం సి) 1929
4) లఖ్‌నవూ సమావేశం డి) 1927

1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి     2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి


25. కిందివారిలో పాకిస్థాన్‌ భావాన్ని బలపరిచినవారు?

1) మహ్మద్‌ ఇక్బాల్‌    2) రెహమత్‌ అలీ

3) మహ్మద్‌ అలీ జిన్నా     4) పైవారందరూ


26. కింది చరిత్రాత్మక సంఘటనలను వరుసక్రమంలో అమర్చండి.

ఎ) క్రిప్స్‌ కమిషన్‌   బి) కేబినెట్‌ మిషన్‌ ప్లాన్‌

సి) క్విట్‌ ఇండియా  డి) రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు    

1) ఎ, బి, సి, డి        2) బి, డి, సి, ఎ  

3) ఎ, సి, బి, డి        4) డి, ఎ, సి, బి


27. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ప్రదేశం?

1) మద్రాసు 2) కలకత్తా 3) బొంబాయి 4) పాట్నా


28. ‘ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌’ స్థాపించినవారు?

1) సుభాష్‌ చంద్రబోస్‌      2) మోహన్‌ సింగ్‌

3) అజిత్‌ సింగ్‌           4) చంద్రశేఖర్‌ ఆజాద్‌


29. 1939లో కాంగ్రెస్‌ప్రభుత్వానికి రాజీనామా చేయడాన్ని మహ్మద్‌అలీ జిన్నా ఏ విధంగా పేర్కొన్నాడు?

1) శోక దినం        2) విమోచన దినం   

3) జాతీయ దినం        4) గౌరవభంగ దినం


30. 1929 లాహోర్‌ ఐఎన్‌సీ సమావేశానికి అధ్యక్షుడు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ        2) మోతీలాల్‌ నెహ్రూ

3) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌       4) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌


31. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

1) క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ పాల్గొంది.

2) శాసన ఉల్లంఘన ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు.

3) గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు.

4) క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీని అరెస్ట్‌ చేశారు.


32. 1945లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించింది?

1) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌    2) మహ్మద్‌ అలీ

3) వల్లభాయ్‌ పటేల్‌     4) మోతీలాల్‌ నెహ్రూ


33. రాయల్‌ ఇండియన్‌ నేవీ నిర్వహించిన సమ్మెలో ఎన్ని నౌకలు పాల్గొన్నాయి?

1) 70    2) 75     3) 76     4) 78


34. కింది ఏ జాతీయ నాయకుడు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా జపాన్‌ సహాయం కోరారు?

1) మహాత్మా గాంధీ         2) సుభాష్‌ చంద్రబోస్‌

3) జవహర్‌లాల్‌ నెహ్రూ    4) బాలగంగాధర్‌ తిలక్‌


35. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ను ఎప్పుడు స్థాపించారు?

1) 1920  2) 1925  3) 1930  4) 1935


36. 1937లో జరిగిన ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎన్నికయ్యారు?

1) 11     2) 12      3) 8     4) 6


37. ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’కు ప్రధాన కారణం?

1) క్రిప్స్‌ రాయబారం విఫలమవడం.

2) మౌంట్‌ బాటన్‌ ప్రణాళికలో పాకిస్థాన్‌ ప్రతిపాదన లేకపోవడం.

3) గాంధీ-జిన్నా చర్చలు ఫలించకపోవడం.

4) కేబినెట్‌ మిషన్‌ పాకిస్థాన్‌ వాదనను తోసిపుచ్చడం.


38. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఏ సంస్థలో సభ్యుడు?

1) ముస్లిం లీగ్‌      2) భారత జాతీయ కాంగ్రెస్‌

3) కమ్యూనిస్ట్‌ పార్టీ   4) హిందూ మహాసభ


39. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో బ్రిటిష్‌ వైస్రాయ్‌ ఎవరు?

1) మౌంట్‌ బాటన్‌     2) వేవెల్‌ 

3) వెల్లింగ్టన్‌     4) లార్డ్‌ మింటో


40. భారతదేశంలో సంస్థానాల విలీన బాధ్యతను ఎవరు తీసుకున్నారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ          2) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

3) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌       4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


41. 1947, ఆగస్టు 15 నాటికి భారతదేశంలో విలీనమవని సంస్థానాలేవి?

1) కశ్మీర్‌     2) జునాగఢ్‌ 

3) హైదరాబాద్‌     4) పైవన్నీ


42. గాంధీజీ హత్య జరిగిన సంవత్సరం?    

1) 1948, అక్టోబరు 2    2) 1947, అక్టోబరు 2

3) 1948, జనవరి 30     4) 1947, జనవరి 30


43. గాంధీజీ అధ్యక్షత వహించిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశం ఏది?

1) లాహోర్‌ సమావేశం     2) కరాచీ సమావేశం

3) బెల్గాం సమావేశం      4) కలకత్తా సమావేశం


44. నవోఖలీ అనే ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉంది?

1) బెంగాల్‌      2) ఒడిశా      

3) ఉత్తర్‌ప్రదేశ్‌    4) ఆంధ్రప్రదేశ్‌



సమాధానాలు

1-4; 2-1; 3-3; 4-3; 5-2; 6-4; 7-2; 8-1; 9-2; 10-2; 11-1; 12-3; 13-1; 14-4; 15-4; 16-3; 17-2; 18-1; 19-1; 20-1; 21-1; 22-3; 23-4; 24-1; 25-4; 26-4; 27-3; 28-1; 29-2; 30-1; 31-3; 32-1; 33-4; 34-2; 35-2; 36-3; 37-4; 38-4; 39-1; 40-2; 41-4; 42-3; 43-3; 44-1.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 
 

Posted Date : 01-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.