• facebook
  • whatsapp
  • telegram

సహజ దృగ్విష‌యాలు

1. కాంతి రుజుమార్గ ప్రసరణానికి అనువర్తనం ఏది?
జ: గ్రహణాలు ఏర్పడటం
 

2. కాంతి సరళరేఖా మార్గ ప్రసరణపై ఆధారపడి నిజప్రతిబింబాన్ని ఏర్పరిచేది?
జ: పిన్‌హోల్‌ కెమెరా
 

3. కిందివాటిలో కాంతి అధమ పరావర్తకం కానిది?
1) పాలిథిన్‌ కవర్‌      2) చెక్క      3) మనిషి      4) గోడ
జ: 1 (పాలిథిన్‌ కవర్‌)
 

4. రెండు సమతల దర్పణాల మధ్య కోణం 60º అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత?
జ: 5
 

5. సోలార్‌ కుక్కర్ల తయారీలో ఉపయోగించే దర్పణం?
జ: పుటాకార దర్పణం
 

6. కాంతి కిరణాలు ఎల్లప్పుడూ తక్కువ దూరం ప్రయాణించే మార్గాన్ని ఎంచుకుంటాయని తెలిపింది?
జ: ఫెర్మాట్‌
 

7. సమతల దర్పణం ఆవర్తనం విలువ?
జ: M = 1
 

8. కాంతికి ఉండే ఏ ధర్మం ఆధారంగా నీడ గడియారం పనిచేస్తుంది?
జ: సరళరేఖా ప్రయాణం
 

9. సూర్యుడి కాంతి సముద్ర ఉపరితలంపై పతనమై ఎంత లోతు ప్రయాణిస్తుంది?
జ: 262 అడుగులు
 

10. యుద్ధాల్లో సైనికులు ఉపయోగించే పరికరం?
జ: పెరిస్కోప్‌
 

11. ఒక పరావర్తన తలంలో పరావర్తన కిరణానికి, లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు?
జ: పరావర్తన కోణం
 

12. ఒక సమతలంపై పతన కోణం 60° అయితే పరావర్తన కోణం ఎంత?
జ: 60°
 

13. రెండు దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
జ: అనంతం
 

14. ఒక వ్యక్తి సమతల దర్పణానికి 20 మీ. దూరంలో ఉన్నాడు. అయితే అతడి ప్రతిబింబానికి, దర్పణానికి మధ్య దూరం ఎంత?
జ: 25 మీ.
 

15. కాంతి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
జ: ఆప్టిక్స్‌
 

16. ఆగ్రా కోటపై ఏ దర్పణాన్ని ఏర్పాటు చేశారు?
జ: కుంభాకార దర్పణం
 

17. కిందివాటిలో ‘నీడ’ వస్తువు యొక్క ఏ లక్షణాన్ని తెలుపుతుంది?
జ: ఆకారం
 

18. విద్యుత్‌ రసాయన ఫలితం ఆధారంగా పనిచేసే పరికరాన్ని గుర్తించండి.
జ: విద్యుత్‌ ఘటం
 

19. విద్యుదావేశానికి SI ప్రమాణం?
జ: కులూంబ్‌
 

20. టార్చిలైట్‌లో బ్యాటరీలను ఏ పద్ధతిలో అనుసంధానం చేస్తారు?
జ: శ్రేణి పద్ధతి
 

21. వలయంలో బ్యాటరీ, స్విచ్‌ అమర్చిన తీరును గుర్తించండి.
     1) ఘట ధన ధ్రువం  తీగ స్విచ్‌  తీగ  బల్బ్‌  తీగ  రుణ ధ్రువం
     2) ధన ధ్రువం  తీగ  బల్బ్‌  స్విచ్‌  తీగ  రుణ ధ్రువం 
     3) ధన ధ్రువం  బల్బ్‌  స్విచ్‌  తీగ  రుణ ధ్రువం
     4) బల్బ్‌  తీగ  రుణ ధ్రువం  తీగ  స్విచ్‌
జ: 1 (ఘట ధన ధ్రువం  తీగ  స్విచ్‌  తీగ బల్బ్‌  తీగ  రుణ ధ్రువం)

22. కిందివాటిలో విద్యుత్‌ ఉష్ణ ఫలితం ఆధారంగా పనిచేయని పరికరం ఏది?
     1) ఎలక్ట్రిక్‌ కుక్కర్‌      2) ఎలక్ట్రిక్‌ హీటర్‌     3) విద్యుత్‌ టీ కెటిల్‌      4) విద్యుత్‌ బ్యాటరీ
జ: 4 (విద్యుత్‌ బ్యాటరీ)
 

23. ఒక ఇంట్లో 100 W బల్బులు నాలుగు, 60 W బల్బులు ఆరు, 40 W బల్బులు ఆరు ఉన్నాయి. ప్రతిరోజు అన్ని బల్బులనూ రెండు గంటల చొప్పున వెలిగిస్తారు. అయితే నెలకి ఎన్ని యూనిట్ల విద్యుత్‌ ఖర్చు అవుతుంది?
జ: 60 U
 

24. ట్రాన్స్‌ఫార్మర్‌ను కనుక్కున్నది?
జ: మైఖేల్‌ ఫారడే
 

25. కాంపాక్ట్‌ ఫ్లోరోసెంట్‌ బల్బుల్లో కొద్ది మొత్తంలో దేన్ని నింపుతారు?
జ: పాదరసం
 

26. విద్యుత్‌ వలయాన్ని మూసివేయడానికి ఉపయోగపడేది?
జ: స్విచ్‌
 

27. విద్యుత్‌ వలయంలో రక్షణ పరికరం ఏది?
జ: ఫ్యూజ్‌
 

28. కిందివాటిలో కాంతి జనకంగా ఉపయోగపడేది?
1) క్యాసెట్‌ ప్లేయర్‌      2) మిక్సర్‌      3) కుక్కర్‌      4) టేబుల్‌ ల్యాంప్‌
జ: 4 (టేబుల్‌ ల్యాంప్‌)
 

29. విద్యుత్‌ క్షేత్రానికి, అయస్కాంత క్షేత్రానికి మధ్య సంబంధాన్ని తెలిపింది.
జ: ఆయిర్‌స్టెడ్‌30. కిందివాటిని జతపరచండి.

జ: A-III, B-II, C-IV, D-I
 

31. మన ఇళ్లలో, పాఠశాలల్లో ఏ తరహా విద్యుత్‌ వినియోగిస్తారు?
జ: ఏకాంతర విద్యుత్‌
 

32. 4 V, 6 V బ్యాటరీలను సమాంతర పద్ధతిలో అనుసంధానం చేస్తే ఫలిత విద్యుత్‌ చాలక బలం?
: 6 V
 

33. టార్చిలైట్‌ ఘటంలో విద్యుత్‌ విశ్లేష్యంగా ఉపయోగించేది?
జ: అమ్మోనియం క్లోరైడ్‌34. కిందివాటిని జతపరచండి.

జ: A-IV, B-I, C-II, D-III
 

35. ఉష్ణశక్తి ప్రసారం ఏ విధంగా ఉంటుంది?
జ: వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు
 

36. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే మూలకం?
జ: పాదరసం
 

37. మానవుడి సాధారణ శరీర ఉష్ణోగ్రత?
1) - 98.4°F          2) 37°C          3) 310°K           4) అన్నీ
: 4 (అన్నీ)
 

38. ప్రపంచంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత
జ: -89°C
 

39. ప్రపంచంలో మొదటి థర్మామీటరును తయారుచేసిన వారు ఎవరు?
జ: గెలీలియో
 

40. కిందివాటిలో పాదరసం ప్రత్యేక ధర్మం కానిది?
1) పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది            2) గాజు పాత్రకు అంటుకోదు
3) అతి తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయగలదు     4) మంచి ఉష్ణవాహకం
జ: 3 (అతి తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయగలదు)
 

41. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో శక్తి మార్పు ఎలా ఉంటుంది?
జ: ఉష్ణశక్తి - విద్యుత్‌శక్తిగా
 

42. ఒక పదార్థం వెచ్చదనం లేదా చల్లదనాన్ని ఎలా పిలుస్తారు?
జ: ఉష్ణోగ్రత
 

43. అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
జ: పైరోమీటర్‌
 

44. ఏ ఉష్ణోగ్రతామానాన్ని రుణ విలువల్లో చెప్పలేం?
జ: కెల్విన్‌ మానం
 

45. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్‌ మానం, ఫారన్‌హీట్‌ మానం సమానంగా ఉంటాయి?
జ: -40
 

46. కిందివాటిలో ఏ పదార్థాల వ్యాకోచం అధికంగా ఉంటుంది?
1) ఘన పదార్థాలు      2) వాయు పదార్థాలు      3) ద్రవ పదార్థాలు      4) చెప్పలేం
జ: 2 (వాయు పదార్థాలు)
 

47. ఒక వస్తువు పరావర్తన తలంపై 60° కోణంతో పతనమైతే పరావర్తన తలంతో ఎంత కోణం చేస్తుంది?
జ: 30°
 

48. నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద అధిక సాంద్రత ఉంటుంది?
1) 4°C          2) 277°K          3) 39.2°K         4) అన్నీ
జ: 4 (అన్నీ)
 

49. ఒక దర్పణంపై వ్యక్తి ప్రతిబింబం తలకిందులుగా, పెద్దదిగా కనిపిస్తే ఆ దర్పణం
జ: పుటాకారం
 

50. కిందివాటిలో ఉష్ణోగ్రతను పెంచడానికి అందించాల్సిన ఉష్ణం ఏది?
1) విశిష్టోష్ణం          2) గుప్తోష్ణం         3) సమతాస్థితి ఉష్ణం          4) విశిష్ట గుప్తోష్ణం
జ: 1 (విశిష్టోష్ణం)
 

51. కిందివాటిలో కాంతి లక్షణం కానిది?
1) పరావర్తనం         2) వక్రీభవనం        3) సంపూర్ణాంతర పరావర్తనం         4) తీవ్రత
జ: 4 (తీవ్రత)
 

52. సమతల దర్పణం యొక్క ఆవర్థనం విలువ?
జ: M = 1
 

53. టెలిస్కోప్‌లలో ఉపయోగించే దర్పణం?
జ: పుటాకారం
 

54. కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా పనిచేయని అనువర్తనం ఏది?
జ: సోలార్‌ కుక్కర్‌
 

55. కిందివాటిలో నీడలు ఏ ధర్మం ఆధారంగా ఏర్పడతాయి?
1) సరళరేఖా ప్రయాణం      2) సంపూర్ణాంతర పరావర్తనం     3) వక్రీభవనం   4) వివర్తనం
జ: 1 (సరళరేఖా ప్రయాణం)
 

56. కిందివాటిలో కాంతి నిరోధక పదార్థం ఏది?
1) నూనెలో అద్దిన కాగితం      2) పాలిథిన్‌ కవర్‌     3) ఇటుకరాయి      4) ట్రేసింగ్‌ పేపర్‌
జ: 3 (ఇటుకరాయి)
 

57. కాంతి వేగం ఏ పదార్థాల్లో అధికంగా ఉంటుంది?
జ: వాయు పదార్థాలు
 

Posted Date : 12-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు