• facebook
  • whatsapp
  • telegram

సహజ దృగ్విషయాలు

స్వాభావిక సంఘటనల్లో శాస్త్రీయ నియమాలు!
 


పరిసరాల్లో స్వాభావికంగా సంభవించే సంఘటనలే సహజ దృగ్విషయాలు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడానికి, జీవనప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి అవి ఉపయోగపడతాయి. భూకంపాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, తుపాన్లు తదితరాలను వాటికి కొన్ని ఉదాహరణలుగా చెప్పొచ్చు. భూకంపాలు ఏర్పడే విధానం అర్థమైతే రక్షణ చర్యలు తీసుకోవడం తేలికవుతుంది. ఉరుములు, మెరుపులు ఏర్పడినప్పుడు కలిగే ప్రభావాలను గుర్తించగలిగితే జాగ్రత్తపడటం సాధ్యమవుతుంది. తుపాన్లు వచ్చే తీరును పసిగడితే నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. అందుకే భౌతిక శాస్త్రంలో వీటిని ప్రత్యేక అంశాలుగా అధ్యయనం చేస్తారు. మనిషి ప్రమేయంతో సంబంధం లేకుండా జరిగే ఇలాంటి పరిణామాలపై, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నియమాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 


1.  వస్తువుల రాపిడి వల్ల ఎన్ని రకాల ఆవేశాలను పొందొచ్చు?

1) 1     2) 2      3) 3     4) 4


2.  పిడుగు బారి నుంచి భవనాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం?

1) భూకంపలేఖిని  2) సిస్మోగ్రాఫ్‌ 

3) తటిద్వాహకం 4) ఎలక్ట్రోస్కోప్‌ 


3.  మెరుపుల నుంచి భవనాలను రక్షించడానికి లోహపు కడ్డీని దేనితో తయారు చేస్తారు?

1) అల్యూమినియం 2) జింక్‌ 3) ఐరన్‌ 4) కాపర్‌


4. ఒక వస్తువు ఆవేశపూరితం అయ్యిందా, లేదా అని గుర్తించడానికి ఉపయోగించే పరికరం?

1) ఎలక్ట్రోమీటర్‌   2) ఎలక్ట్రోస్కోప్‌  

3) సిస్మోస్కోప్‌  4) ఛార్జ్‌మీటర్‌ 


5. రెండు వస్తువులు ఒకదాంతో మరొకటి రాపిడి చెందినప్పుడు అవి వేటిని పొందుతాయి?

1) సమానం, సజాతి ఆవేశాలు  

2) సమానం, విజాతి ఆవేశాలు 

3) అసమానం, విజాతి ఆవేశాలు  

4) అసమానం, సజాతి ఆవేశాలు


6. కిందివాటిలో మెరుపులు ఏర్పడటానికి కారణం?

1) విద్యుదావేశం   2) విద్యుత్తు ఉత్సర్గం 

3) ఆవేశాల బదిలీ  4) పైవన్నీ


7. కిందివాటిలో సహజ దృగ్విషయం కానిది?

1) భూకంపాలు 2) ఉరుములు 3) తుపానులు 4) ఎర్తింగ్‌ 


8. ఆవేశపూరిత వస్తువు నుంచి భూమికి ఆవేశాన్ని బదిలీ చేసే ప్రక్రియ?

1) ఆవేశం 2) ఎర్తింగ్‌ 3) బదిలీ 4) భూప్రకంపనాలు


9. పిడుగు పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

1) గొడుగు ఉపయోగించాలి.

2) పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందాలి.

3) తక్కువ ఎత్తున్న చెట్ల కింద ఆశ్రయం పొందాలి.

4) బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలి.


10. భూకంప తరంగాలను నమోదు చేసే పరికరం?

1) సిస్మోగ్రాఫ్  2) రిక్టర్‌ స్కేలు 

3) ఎలక్ట్రోస్కోప్‌  4) తటిద్వాహకం


11. సినిమాహాళ్లు, ఎత్తయిన భవనాలను రక్షించడానికి ఏం ఉపయోగించాలి?

1) టీవీ యాంటెన్నా   2) తటిద్వాహకాలు

3) రూఫ్‌టాప్‌ గార్డెన్లు  4) ఏదీకాదు


12. కిందివాటిలో భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం?

1) రిక్టర్‌ స్కేలు  2) సిస్మోగ్రాఫ్‌  

3) ఫోలిగ్రాఫ్‌  4) ఎలక్ట్రోస్కోప్‌


13. మెరుపు సమయంలో సాధారణంగా గాలి ఏ విధంగా ఉంటుంది?

1) అథమ వాహకం  2) మంచి విద్యుత్తు వాహకం 

3) అల్పవిద్యుత్తు వాహకం  4) తటస్థం


14. భూఅంతర్భాగంలో ఏర్పడిన తరంగాల వల్ల   భూఉపరితలంపై ఉత్పత్తయ్యే తరంగాలు?

1) సెస్మిక్‌ తరంగాలు  2) రేడియో తరంగాలు 

3) రేఖాంశ తరంగాలు  4) మైక్రో తరంగాలు


15. భూకంప కేంద్రం ఎక్కడ ఏర్పడుతుంది?

1) భూమి అంతర్భాగంలో  2) భూమి ఉపరితలంపై 

3) భూమి కేంద్రం వద్ద     4) భూ ప్రావారంలో 


16. భూమి పైపొరను ఏమని పిలుస్తారు?

1) బాహ్య కేంద్రం  2) భూప్రావారం 

3) భూపటలం   4) అంతర కేంద్రం


17. కిందివాటిలో మెరుపు సమయంలో ఏం  జరుగుతుంది?

1) ఆమ్ల వర్షాలు   2) గ్రీన్‌ హౌస్‌ ప్రభావం 

3) ఎర్తింగ్‌  4) నత్రజని స్థిరీకరణ 


18. రాపిడి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుదావేశాలను   ఏమంటారు?

1) విజాతి ఆవేశాలు   2) సజాతి ఆవేశాలు  

3) స్థావర ఆవేశాలు   4) తటస్థ ఆవేశాలు


19. రిక్టర్‌ స్కేలును కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? 

1) చార్లెస్‌ రిక్టర్‌    2) జేమ్స్‌ ఛాడ్విక్‌ 

3) చార్లెస్‌ రెపో   4) చార్లెస్‌ లూయిస్‌ 


20. కిందివాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి.

1) భూకంప తరంగాలను లెక్కించేదాన్ని భూకంప  లేఖిని అంటారు.

2) ఒక వస్తువుపై ఉన్న ఆవేశాన్ని గుర్తించడానికి  ఆకర్షణ ధర్మం ఒకటే సరైంది.

3) తుపాన్ల నుంచి భవనాలను రక్షించడానికి    తటిద్వాహకాన్ని ఉపయోగిస్తారు.

4) భూకంపం సంభవించిన ప్రదేశాన్ని గుర్తించే   పరికరం భూకంప లేఖిని.


21. కిందివాటిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి.    

1) భూకంపాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమయాల్లో సంభవిస్తాయి.

2) భూపటలంలోని పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి.

3) అగ్నిపర్వతాలు పేలడం వల్ల కూడా భూప్రకంపనలు వస్తాయి.

4) మేఘాలు, భూమికి మధ్య విద్యుత్తు ఉత్సర్గ ప్రక్రియ జరగదు.


22. కిందివాటిలో సునామీకి కారణం కానిది? 

1) సముద్రగర్భంలో ఒక పెద్ద విస్ఫోటం ఏర్పడటం

2) సముద్రంలో భూకంపం

3) అగ్నిపర్వత విస్ఫోటం     

4) మెరుపులు ఏర్పడటం


23. ఛార్జ్‌ చేసిన రెండు వస్తువులను ఒకదానికొకటి దగ్గరగా ఉంచినప్పుడు...

1) ఆకర్షించుకోవచ్చు   2) వికర్షించుకోవచ్చు 

3) ఆకర్షణ, వికర్షణ ఉండొచ్చు  4) ఎలాంటి ప్రభావం ఉండదు


24. గాజు కడ్డీని సిల్క్‌ వస్త్రంతో రుద్దినప్పుడు గాజుకడ్డీ ధనావేశం, సిల్క్‌ వస్త్రం రుణావేశం పొందుతాయని తెలిపినవారు?

1) బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌   2) లూగీ గాల్వాని 

3) విలియం గిల్బర్ట్‌   4) అలెగ్జాండర్‌ ఓల్టా


25. విద్యుత్తుకు ధన, రుణ ఆవేశాలుంటాయని తెలిపిన శాస్త్రవేత్త?

1) బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌   2) లూగీ గాల్వాని 

3) విలియం గిల్బర్ట్‌   4) జార్జ్‌ రిక్టర్‌ 


26. స్థిర విద్యుత్తును కనుక్కున్న శాస్త్రవేత్త?

1) విలియం బర్డ్స్‌   2) థేల్స్‌ ఆప్‌ మిలిస్‌ 

3) లూగీ గాల్వాని  4) విలియం గిల్బర్ట్‌


27. భూకంపాలు అత్యధికంగా సంభవించే ప్రాంతాలను ఏమంటారు?

1) సెస్మిక్‌ జోన్స్‌   2) బలహీన ప్రాంతాలు 

3) భూకంప ప్రభావిత ప్రాంతాలు    4) పైవన్నీ


28. భూకంప తీవ్రతను రిక్టర్‌ స్కేలు కంటే అత్యంత కచ్చితంగా నమోదుచేసే పరికరం?

1) సెస్మిక్‌ స్కేలు   2) ఎలక్ట్రోస్కోప్‌ 

3) భ్రామక పరిమాపక స్కేలు  4) భూకంపదర్శిని


29. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.5గా నమోదైన ప్రాంతం?

1) రాజస్థాన్‌   2) భుజ్, కశ్మీర్‌  

3) మధ్యప్రదేశ్‌  4) ఉత్తరాంచల్‌ 


30. భూమిపై భూకంప తీవ్రత 100 కి.మీ. వైశాల్యం మేర ఉంటే దాని రీడింగ్‌ రిక్టర్‌ స్కేలుపై ఎంతగా ఉంటుంది?

1) 3.4 కంటే తక్కువ   2) 3.5 నుంచి 5.4   

3) 5.5 నుంచి 6.0   4) 6.1 నుంచి 6.9


31. చనిపోయిన కప్పకాళ్లకు లోహ ఫలకాలు తగిలించినప్పుడు అది కదులుతుందని, జంతువుల దేహంలో జీవ విద్యుత్తు ఉత్పత్తవుతుందని  భావించిన శాస్త్రవేత్త?

1) లూగీ గాల్వాని   2) అలెగ్జాండర్‌ ఓల్టా 

3) బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌  4) విలియం గిల్బర్ట్‌


32. థామస్‌ ఆల్వా ఎడిసన్‌ మొదటిసారిగా పవర్‌  ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) ఇంగ్లండ్‌   2) అమెరికా   3) రష్యా  4) జపాన్‌ 


33. ప్రపంచంలో మొదటిసారిగా పవర్‌ ప్లాంట్ను ఎక్కడ స్థాపించారు?

1) ఇంగ్లండ్‌   2) అమెరికా  3) చైనా   4) జర్మనీ 


34. వస్తువులను రాపిడి చేసినప్పుడు ఏర్పడే ఆవేశం ఆ వస్తువుల్లో ఎక్కడ ఉంటుంది?

1) చివరి భాగం   2) మధ్య భాగం 

3) లోపలి భాగం   4) ఉపరితలం


35. భూకంప ప్రమాద పటం ప్రకారం హైదరాబాద్‌ ఎన్నో జోన్‌లో ఉంది?

1) 2వ  2) 3వ  4) 1వ  4) 4వ  


36. హిందూ మహాసముద్రంలో భూకంపం (సునామీ) ఎప్పుడు సంభవించింది?

1) 2008   2) 2004   3) 2001  4) 2003


37. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత రెండు రెట్లు అదనంగా పెరిగితే దాని విధ్వంసక శక్తి ఎన్నిరెట్లు పెరుగుతుంది?

1) 500  2) 100  3) 10  4) 1000   


38. 2001లో గుజరాత్‌లోని కచ్‌ తీరం వెంబడి సంభవించిన భూకంపం రిక్టర్‌ స్కేలుపై ఎంతగా నమోదైంది?

1) 6.5    2) 8.0    3) 5.6    4) 7.5


39. భూకంప ప్రమాద పటం ప్రకారం కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలు ఎన్నో జోన్‌లో ఉన్నాయి?

1) 3వ     2) 2వ    3) 1వ    4) 4వ 


40. దుస్తులు శరీరంపై ఉన్న వెంట్రుకలను ఆకర్షించడం; ఆకాశంలో ఉరుములు, మెరుపులు   ఏర్పడటం ఒకే ప్రక్రియ అని తెలిపినవారు?

1) థేల్స్‌ ఆఫ్‌ మిలిస్‌   2) విలియం బర్డ్స్‌  

3) బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌  4) విలియం గిల్బర్ట్‌ 


41. ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సరైంది?

1) టాప్‌ లేని వాహనాల్లో ప్రయాణించకూడదు.

2) చిన్న చెట్ల కింద నిల్చోవాలి. 

3) లైటెనింగ్‌ కండక్టర్‌ ఉండే భవనాల్లో నివసించాలి.

4) పైవన్నీ


42. కిందివాటిలో భూకంపం ఏర్పడటానికి కారణమైన దాన్ని గుర్తించండి.        

1) భూపటలంలో ఫలకలు కదలడం.  

2) గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం.

3) భూకేంద్రంలో విస్ఫోటం ఏర్పడటం.

4) పైవన్నీ


43. కొద్దిపాటి నష్టం వాటిల్లినప్పుడు నాణ్యత లేని  భవనాలు పూర్తిగా దెబ్బతింటే రిక్టర్‌ స్కేలుపై   నమోదయ్యే రీడింగ్‌?

1) 5.5 నుంచి 6.0  2) 3.4 కంటే తక్కువ 

3) 6.1 నుంచి 6.9   4) 7.5 కంటే ఎక్కువ


44. కిందివాటిలో నిత్యం భూకంపాలు సంభవించే ప్రాంతం?

1) ముంబయి  2) దిల్లీ   3) కశ్మీర్‌   4) చెన్నై


45. ప్రకృతి వైపరీత్యాల్లో ఇప్పటివరకు ముందుగా గుర్తించలేనిది?

1) తుపాన్లు   2) ఉరుములు, మెరుపులు ఏర్పడటం 

3) భూకంపం  4) వరదలు


46. కిందివాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. 

ఎ) రెండు వస్తువులను రాపిడి చేసినప్పుడు ఏర్పడే సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి.

బి) రెండు వస్తువులను రాపిడి చేసినప్పుడు ఏర్పడే విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి.

1) ఎ-సత్యం, బి-అసత్యం  2) ఎ-అసత్యం, బి-సత్యం 

3) ఎ, బి లు సత్యాలు  4) ఎ, బి లు అసత్యాలు


సమాధానాలు
 

1-2; 2-3; 3-4; 4-2; 5-2; 6-2; 7-4; 8-2; 9-3; 10-1; 11-2; 12-1; 13-2; 14-1; 15-2; 16-3; 17-4; 18-3; 19-1; 20-1; 21-4; 22-4; 23-3; 24-3; 25-1; 26-2; 27-4; 28-3; 29-2; 30-4; 31-1; 32-2; 33-1; 34-4; 35-1; 36-2; 37-4; 38-4; 39-1; 40-3; 41-4; 42-4; 43-1; 44-3; 45-3; 46-3. 

Posted Date : 21-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌