• facebook
  • whatsapp
  • telegram

 కర్బన రసాయనశాస్త్రం

కర్బన రూపాంతరాలు
* ఒకే మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ రూపాలను కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారు.
* భౌతిక రూపాల్లో పరమాణువుల అమరికలో వచ్చే తేడాల వల్ల వేర్వేరు రూపాలుగా ఏర్పడతాయి.
* కర్బనం ముఖ్యంగా రెండు రకాలుగా రూపాంతరతను ప్రదర్శిస్తుంది.
    1. స్ఫటిక రూపాలు
        ఉదా: వజ్రం, గ్రాఫైట్, బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్
    2. అస్ఫటిక రూపాలు
        ఉదా: కోక్, కోల్, నల్లని మసి
* వజ్రంలోని ప్రతి కర్బనం sp3 సంకరీకరణంలో పాల్గొని చతుర్ముఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. త్రిమితీయ నిర్మాణంలో ప్రతి కర్బన పరమాణువు ఇతర నాలుగు కర్బన పరమాణువులతో చతుర్ముఖీయంగా బంధాలను కలిగి ఉంటుంది. అందువల్ల అది అతి గట్టితనాన్ని, అధిక ద్రవీభవన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.
* కాంతి పరావర్తన ధర్మం వల్ల వజ్రం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది.
* వజ్రంలో ఒంటరి ఎలక్ట్రాన్‌లు లేకపోవం వల్ల అది విద్యుత్ నిరోధకంగా పని చేస్తుంది. వజ్రాన్ని గాజును కోయడానికి, సానరాయిగా కూడా ఉపయోగిస్తారు.
* వజ్రం యొక్క సాంద్రత 3.51 గ్రా./సెం.మీ3, వక్రీభవన గుణకం 2.41.
 C - C ల మధ్య దూరం 1.54 pm, బంధకోణం 109º.28'. ఇది ఏ ద్రావణంలోనూ కరగదు.

                 
         
* వజ్రం ఆమ్లాలు, క్షారాలతో చర్య జరపదు.
* వజ్రంలో సంయోజనీయ బంధాలు ఉన్నప్పటికీ అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత, గట్టితనాన్ని కలిగి ఉండటానికి కారణం
C - C ల మధ్య దృఢమైన త్రిమితీయ బంధాలు ఉండటమే.
 

గ్రాఫైట్: దీనిలో ప్రతి కర్బనం sp2 సంకరీకరణంలో పాల్గొని పొరల నిర్మాణంతో ఉంటుంది. ఇది ద్విమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
* గ్రాఫైట్‌కు లోహదృతి, సబ్బు లాంటి స్పర్శ ఉండటం వల్ల అది కందెనగా ఉపయోగపడుతుంది. ఘనస్థితిలో కందెనగా పనిచేసేది గ్రాఫైట్ మాత్రమే. దీన్ని పెన్సిల్ లెడ్‌గా ఉపయోగిస్తారు.
* గ్రాఫైట్‌లో కర్బన పరమాణువులు షట్కోణాకృతిలో వలయాల నిర్మాణాన్ని కలిగి, పొరల మధ్య బలహీనమైన వాండర్‌వాల్స్ బలాలతో కలిపి ఉంటాయి. దీనివల్ల గ్రాఫైట్‌కు జారుడు స్వభావం ఏర్పడి అది కందెనగా పని చేస్తుంది.
* C C ల మధ్య దూరం 1.42 A°, పొరల మధ్య దూరం 3.35 A°, బంధకోణం 120°.
* ప్రతి కర్బన పరమాణువులోని ఒంటరి ఎలక్ట్రాన్ ఆసన్న కర్బనాల మధ్య π బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ π - ఎలక్ట్రాన్‌లు పొర మొత్తం అస్థానీకృతం చెంది, కదులుతూ ఉండటం వల్ల మంచి విద్యుత్ వాహకంగా పని చేస్తుంది.
* బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్ (C60) కూడా స్ఫటిక రూపాంతరాల్లో ఒకటి. ఇది బంతి ఆకృతిలో ఉంటుంది. దీనిలో 20 షట్‌భుజి వలయాలు, 12 పెంటాగోనల్ వలయాలు ఉంటాయి.
* C60 ఫుల్లరిన్‌లో కర్బన పరమాణువులు sp2 సంకరీకరణంలో పాల్గొంటాయి. ప్రతి కర్బనంలో మిగిలిన ఒంటరి ఎలక్ట్రాన్‌లు అణువు అంతా అస్థానీకృతం చెంది, అణువుకు ఎరోమాటిక్ ధర్మాన్ని కలగజేస్తాయి. ఇది 1985 నుంచి ప్రాముఖ్యాన్ని పొందింది.
* C − C ల మధ్య దూరం 143.5 A°, 1.38 A°. దీనిలో హెక్సాగోనాల్ వలయాలు, పెంటాగోనాల్ వలయాలతో సంలీనం చెంది ఉంటాయి. హెక్సాగోనాల్ వలయాలు, హెక్సాగోనాల్ వలయాలతో కూడా సంలీనం చెందుతాయి.
జడవాయు వాతావరణంలో బాష్ప కార్బన్ ఘనీభవించడం వల్ల ఫుల్లరిన్‌లు ఏర్పడతాయి.
* వైద్య రంగంలో ఫుల్లరిన్‌లను అధిక నిరోధక శక్తి గల బ్యాక్టీరియాను, మెలనోమా లాంటి క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధంగా వాడతారు.
* C60ని కనుక్కొని, దాని నిర్మాణం పై పరిశోధన చేసినందుకు 1996లో H.W. క్రోటో, R.E. స్మాలీ శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది.
* గోళాకారంలో ఉన్న ఫుల్లరిన్‌లను బక్కీబాల్స్ అంటారు.

నానోనాళాలు: కర్బనం యొక్క మరో రూపాంతరమే నానోనాళాలు. వీటిని 1991లో సుమియో లీజిమ కనుక్కున్నారు.
* షట్ముఖ వలయాల ద్వారా ఏర్పడిన పొరలు స్తూపాకృతిలో గొట్టాలుగా మారి నానోనాళాలను ఏర్పరుస్తాయి. దీనిలో కూడా గ్రాఫైట్ మాదిరిగా π ఎలక్ట్రాన్‌లు అణువుల అస్థానీకృతం చెంది, మంచి విద్యుత్ వాహకతను కలగజేస్తాయి.
* అతి చిన్నదైన కణంలోనికి ఏవైనా జీవాణువులను ప్రవేశపెట్టడానికి నానోట్యూబ్‌లను ఉపయోగిస్తారు.
 

గ్రాఫిన్: పెన్సిల్‌లో ఉపయోగించే గ్రాఫైట్ నుంచి గ్రాఫిన్‌ను తయారుచేస్తారు. గ్రాఫిన్‌లో 0.3 nm మందం గల తేనెతుట్టెను పోలిన షట్ముఖీయ వలయ నిర్మాణం ఉంటుంది.
* గ్రాఫిన్ రాగి కంటే మంచి విద్యుత్ వాహకం. స్టీల్ కంటే 200 రెట్లు బలమైంది కానీ 6 రెట్లు తేలికైంది. ఇది కాంతికి సంపూర్ణంగా పారదర్శకమైంది.
 

కార్బన్ స్వభావం
* J.J. బెర్జీలియస్ సజీవుల్లో తయారయ్యే సమ్మేళలనాలను సేంద్రియ సమ్మేళనాలని, నిర్జీవ పదార్థాల నుంచి తయారయ్యే వాటిని అకర్బన సమ్మేళనాలని గుర్తించారు.
* 1828లో F. వోలర్ అనే శాస్త్రవేత్త ప్రయోగశాలలో అకార్బనిక లవణమైన అమ్మోనియం సయనేట్‌ను వేడిచేస్తూ, యూరియాను (కర్బన సమ్మేళనం) తయారు చేసి వైటల్ ఫోర్స్ థియరీ (Vital force theory) తప్పని నిరూపించాడు.
NH4CNO     H2N − CO − NH2
అమ్మోనియం సయనేట్             యూరియా

* జీవ సమ్మేళనాలన్నీ కర్బన సమ్మేళనాలే. కార్బన్‌కు ఉన్న కాటనేషన్ సామర్థ్యం, శాఖీయ శృంఖలాలను ఏర్పరిచే శక్తి వల్ల అది అనేక మిలియన్‌ల సంఖ్యల్లో సమ్మేళనాలను ఏర్పర్చగలదు.
 

కార్బన్ యొక్క ఆక్సైడ్‌లు
* కార్బన్ రెండు రకాల ఆక్సైడ్‌లను ఏర్పరుస్తుంది.
1) కార్బన్ మోనాక్సైడ్ (CO)
2) కార్బన్ డై ఆక్సైడ్ (CO2)
* కార్బన్‌ను పరిమిత ఆక్సిజన్‌లో మండించినట్లయితే కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది.
      2 C + O2 2 CO
* వేడిగా ఉన్న కోక్ మీదకు నీటిఆవిరిని పంపితే కార్బన్ మోనాక్సైడ్ తయారవుతుంది.
     C   +   H2O     CO   +   H2
     (ఘ.)   (వా.)                            (వా.)       (వా.)

*  కార్బన్ మోనాక్సైడ్ రంగు, వాసన లేని వాయువు. నీటిలో కరగదు. ఇది బలమైన క్షయకరిణి.
*  :C  O: నిర్మాణంలో C, O కి మధ్య ఒక σ బంధం, రెండు π బంధాలు ఉంటాయి.
*  CO అణువులోని కార్బన్‌పై ఉండే జంట ఎలక్ట్రాన్‌లను వినియోగించుకొని కార్బోనైల్ సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది.
*  CO అధిక విష స్వభావం గల వాయువు.
*  కార్బన్‌ను అధిక ఆక్సిజన్‌లో మండించగా కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది.
    C   +   O2    CO2
   (ఘ.)    (వా.)                     (వా.)
* CO2 రంగు, వాసన లేని వాయువు. ఇది నీటిలో పాక్షికంగా కరుగుతుంది. విషవాయువు కాదు.
* నీటిలో CO2 కరిగి కార్బోనిక్ ఆమ్లం (H2CO3) ఏర్పడుతుంది. ఇది బలహీన ఆమ్ల ధర్మం కలిగి ఉంటుంది.
* కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని గ్లూకోజ్‌ను ఏర్పరుస్తుంది.
    
* వాతావరణంలో CO2 పరిమాణం బాగా పెరగడం వల్ల హరిత గృహ ప్రభావం పెరుగుతుంది.
* ఘనస్థితిలో ఉండే CO2 ను పొడి మంచు అంటారు.
* CO2 ను శీతల పానీయాల్లో వాడతారు.
* CO2 లోని కార్బన్ sp సంకరీకరణంలో పాల్గొంటుంది.

      
*  ఇది ద్విధృవ భ్రామకం లేని సరళ రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
* CO2 గాలి కంటే బరువైంది. దహనశీలి కాదు, దహన దోహదకారి కూడా కాదు.
* నీలి లిట్మస్‌ను CO2 ఎరుపు రంగులోకి మారుస్తుంది.
* CO2 ను సున్నపు తేటలోనికి పంపినప్పుడు పాల లాంటి తెల్లని అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది.
    Ca(OH)2 + CO2 CaCO3 ↓ +  H2O

వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్
* కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అంటారు. దీన్ని ఇంధన వాయువుగా ఉపయోగిస్తారు.
* వేడిగా ఉన్న కోక్‌పైకి నీటిఆవిరిని పంపితే వాటర్ గ్యాస్ తయారవుతుంది.
    C   +     H2O      CO  +   H2
   (ఘ.)     (వా.)                                వాటర్ గ్యాస్
* కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ వాయు మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు.
* వేడిగా ఉన్న కోక్‌పైకి నీటిఆవిరికి బదులుగా గాలిని (N2) పంపితే ప్రొడ్యూసర్ గ్యాస్ ఏర్పడుతుంది. దీన్ని కూడా ఇంధనంగా ఉపయోగిస్తారు.
 2 C  +  4 N2 + O2    2 CO   +   4 N2
    (ఘ.)    (వా.)   (వా.)                        ప్రొడ్యూసర్ గ్యాస్
* ప్రొడ్యూసర్ గ్యాస్‌లో ముఖ్యంగా 33% CO, 64% N2; 3% CO2, H2 ఉంటాయి.
* వాటర్ గ్యాస్‌లో CO (40% − 50%), H2 (45% − 50%) ఉంటాయి.
* ప్రొడ్యూసర్ గ్యాస్, వాటర్ గ్యాస్‌ల కెలోరిఫిక్ విలువలు వరుసగా 5439 kJ/m3, 13000 kJ/m3గా ఉంటాయి.
* ప్రొడ్యూసర్ గ్యాస్‌ను గ్యాస్ ఇంజిన్‌లో; స్టీల్, గ్లాస్ పరిశ్రమల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. అమ్మోనియాను తయారు చేయడానికి కూడా వాడతారు.
 

హైడ్రో కార్బన్‌లు
* కార్బన్, హైడ్రోజన్‌లు ఉన్న సమ్మేళనాలను హైడ్రో కార్బన్‌లు అంటారు.


* ఎలిఫాటిక్ ధర్మాలున్న కర్బన చక్రీయ సమ్మేళనాలను ఎలిసైక్లిక్ సమ్మేళనాలు అంటారు.

* వలయంలో కర్బనాలతో కలిపి ఇతర మూలకాలు ఉంటే వాటిని హెటిరో సైక్లిక్ సమ్మేళనాలు అంటారు.

* సమతల వలయ నిర్మాణాలున్న కర్బన సమ్మేళనాలు ఎరోమాటిక్ ధర్మాన్ని ప్రదర్శిస్తే వాటిని ఎరోమాటిక్ సమ్మేళనాలు అంటారు.
ఉదా: బెంజీన్

బెంజినాయిడ్ సమ్మేళనాలు

* నాన్ బెంజినాయిడ్ సమ్మేళనాలు ఎరోమాటిక్ ధర్మాన్ని ప్రదర్శించవు.

 సైక్లో పెంటాడైయినైల్ ఆనయాన్
 

* ట్రోపలోన్    
* ఏదైనా పరమాణువు లేదా పరమాణువుల సముదాయం విశిష్ట పద్ధతిలో బంధితమై, ఆ కర్బన సమ్మేళనాలకు ప్రత్యేక రసాయనిక ధర్మాలను కలగజేయడానికి కారణమైనట్లయితే దాన్ని 'ప్రమేయ సమూహం'
 అంటారు.
ఉదా: −OH (ఆల్కహాల్)    -CHO (ఆల్డిహైడ్)        -COOH (కార్బాక్సిలిక్ ఆమ్లం)

సమజాత శ్రేణి: ఒకే ప్రమేయ సమూహం ఉన్న కర్బన సమ్మేళనాలను సమజాత శ్రేణి అంటారు.
* ఒకే సాధారణ ఫార్ములా కలిగి వరుసక్రమంలోని ఏ రెండు సమ్మేళనాల అణుఫార్ములాలో భేదం  - CH2 - గా ఉండి, రసాయనిక ధర్మాల్లో సారూప్యతను, భౌతిక ధర్మాల్లో క్రమత్వాన్ని ప్రదర్శించే సమ్మేళనాల పరంపరను సమజాత శ్రేణి అంటారు.
ఉదా: ఆల్కేన్‌లు - CnH2n + 2
         ఆల్కీన్‌లు -CnH2n
         ఆల్కహాల్ -CnH2n + 2 O
 IUPAC (International Union of Pure and Applied Chemistry) కర్బన సమ్మేళనాలకు ప్రపంచమంతా ఒకే పేరు ఉండాలని నిర్ణయించి, కొన్ని నియమాలను రూపొందించింది.
 ఈ నియమాల ద్వారా IUPAC నామకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని మార్పులతో CAS (Chemical Abstract System)ను ప్రవేశ పెట్టారు.
 

ఆల్కేన్స్: సంతృప్త కర్బన సమ్మేళనాలను ఆల్కేన్‌లు అంటారు. వాటి సాధారణ ఫార్ములా Cn H2n + 2.


* ఆల్కేన్‌లో ఒక హైడ్రోజన్ తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఆల్కైల్ సమూహం అంటారు. దీన్ని -R అక్షరంతో సూచిస్తారు.
ఉదా: - CH3   మిథైల్
         - C2H5 ఈథైల్
         - C3H7 ప్రొపైల్
 Alkaneలో -ane అనే పదాన్ని తొలగించి -yl రాస్తే Alkyl వస్తుంది.
ఉదా: Butane - C4H10                Butyl - C4H9

 

* రెండు సమాన పరిమాణంలో ఉన్న శాఖలు ఉంటే ఎక్కువ ఉప శాఖలున్న శాఖను మాతృ సమూహంగా ఎన్నుకోవాలి.
* శృంఖలాన్ని గుర్తించిన తర్వాత సంఖ్యా సూచికను ప్రతిక్షేపకానికి దగ్గరగా ఉన్న కార్బన్ నుంచి మొదలు పెట్టాలి.
* ఆల్కీన్ పేరులో ఈన్‌ను, ఆల్కైన్ పేరులో ఐన్‌ను పదానుబంధంగా ఉపయోగించాలి.
* ప్రతిక్షేపకాని కంటే ప్రమేయ సమూహానికి తక్కువ సంఖ్య వచ్చేలా సంఖ్యా క్రమాన్ని రాయాలి.
* ప్రమేయ సమూహాల ప్రాధాన్యాత క్రమాన్ని బట్టి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న దానికి తక్కువ సంఖ్య వచ్చేలా రాయాలి.
 

ప్రమేయ సమూహాల ప్రాముఖ్యం తగ్గే క్రమం
  
* శృంఖలంలో (),  (=)లు ఒకే స్థానాల్లో ఉంటే ఆంగ్ల అక్షర క్రమాన్నిబట్టి (=)కు తక్కువ సంఖ్య వచ్చేలా చూడాలి._
 1          2        3         4      5     6       7     సరైంది. హెప్ట్ - 2 - ఇన్ - 5 - ఐన్

  7           6      5         4       3     2     1  తప్పు.
* శృంఖలంలో ఈన్ (=), ఐన్ () లు వేర్వేరు స్థానాల్లో ఉన్నట్లయితే, ఐన్ ()కు ప్రాధాన్యం ఎక్కువ కాబట్టి దానికి తక్కువ సంఖ్య వచ్చేలా చూడాలి.
1           2       3    4        5         6         7          8   సరైంది.
  ఆక్ట్ - 5 - ఈన్ - 2 - ఐన్
8         7     6    5          4        3       2          1  ← తప్పు. 


5 - (2 - ఈథైల్ బ్యుటైల్) - 3, 3 - డై మిథైల్ డెకేన్ (సరైన పేరు)
5 - (2, 2 - డై మిథైల్ బ్యుటైల్) - 8 - ఈథైల్ డెకేన్ (తప్పు)
కారణం మొదటి దానిలో శాఖీయ ప్రతిక్షేపకాలు ఎక్కువగా ఉన్నాయి.


       5 - సెకండరీ బ్యుటైల్ - 4 - ఐసో ప్రొపైల్ డెకేన్ (సరైంది)
       4 - ఐసో ప్రొపైల్ - 5 - సెకండరీ బ్యుటైల్ డెకేన్ (తప్పు)
       కారణం ప్రతిక్షేపకాల పేరులోని ఆంగ్ల అక్షర క్రమాన్ని పాటించాలి.
* సంతృప్త వలయ సమ్మేళనాల్లో ఆల్కేన్ పేరుకు ముందు సైక్లో పదాన్ని చేర్చాలి.

      2, 5, 6  - ట్రై మిథైల్ ఆక్టేన్ (ఒప్పు)
       3, 4, 7 - ట్రై మిథైల్ ఆక్టేన్ (తప్పు)
* C6H5−, హలోజన్‌లు (F, Cl, Br, I), −NO2 గ్రూపులను పూర్వ పదాలుగా గుర్తించాలి.
* రెండు కంటే ఎక్కువ హలోజన్‌లు ఉన్నప్పుడు వాటి ఆంగ్ల అక్షర క్రమాన్ని బట్టి సంఖ్యలను సూచించాలి.
     

        ఒకే రకానికి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు -ane లోని (e) అక్షరాన్ని తొలగించకూడదు.

* CH2 = CH − CH = CH2                     but - 1, 3 - diene
    Br - CH2 - CH = CH2                       3 - bromoprop - 1 - ene
    CH3 - CO - CH2 - COOH                3 - oxo butanoic acid
    CH3 - CO - CH2 - CO - CH3          pentane - 2, 4 - dione
    
    but - 3 - en - 2 - ol

Posted Date : 12-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు