• facebook
  • whatsapp
  • telegram

అలంకారాలు - పాఠ్య పుస్తకం

బింబ.. ప్రతిబింబ భావన సాధిస్తే దృష్టాంతం!


 

ఉపమానం, ఉపమేయం ఒకటే అయితే అనన్వయం. అర్థభేదంతో పదాలు ప్రయోగిస్తే యమకం. మనుషులకు తగినంత అలంకారం, ఆహార్యం ఉంటేనే సమాజంలో గుర్తింపు, విలువ ఉంటాయి. అలాగే కావ్యాలు, పద్యాలకు అలంకారం చేసి, సొబగులద్దే ప్రక్రియలే అలంకారాలు. పదాల కూర్పు మనోహరంగా, పలికేందుకు మురిపెంగా, భావం వినేందుకు వీనుల విందుగా చేసి తెలుగు భాష సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే ఈ అలంకారాలపై పరీక్షార్థులకు పరిజ్ఞానం ఉండాలి. శబ్ద ప్రాధాన్యం ఉన్న శబ్దాలంకారాలు, అర్థ విశేషాల ఆధారంగా వచ్చే అర్థాలంకారాలను వాటి సూత్రాల ఆధారంగా గుర్తించగలగాలి.
 

1.     రమ్మా! మాణవకోత్తమ!

లెమ్మా! నీ వాంఛి తంబు లేదన కిత్తుం

దెమ్మా! యడుగుల నిటు రా

నిమ్మా! కడుగంగ వలయు నేఁటికిఁ దడయన్‌?

పై పద్యంలోని అలంకారం ఏది?

1) ఉపమా        2) అంత్యానుప్రాస   

3) ఛేకానుప్రాస        4) లాటానుప్రాస


2.     ‘నీటిలో పడిన తేలు తేలుతుందా’? ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.

1) వృత్యానుప్రాస          2) లాటానుప్రాస       

3) యమకం          4) ఛేకానుప్రాస


3.     ‘అడిగెద నని కడువడిఁ జను

నడిగిన దను మగుడ నుడుగఁడని నడ యుడుగున్‌

వెడవెడ చిడిముడి తడఁబడ

నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌’

    పై పద్యంలోని అలంకారం ఏది?

1) వృత్యానుప్రాస         2) ఛేకానుప్రాస        3) లాటానుప్రాస    4)  యమకం


4. ‘నగరారణ్య హోరు నరుడి జీవనఘోష’ అనే పద్య   పాదంలోని అలంకారం ఏది?

1) ఉపమా           2) రూపకం         

3) ఉత్ప్రేక్ష              4) ఉల్లేఖం


5. ‘చుక్కలు తల వూవులుగా: నక్కజముగ మేను పెంచి యంబరవీధిన్‌............’ ఈ పద్యంలోని అలంకారం గుర్తించండి.

1) దీపకం           2) ఉపమా       

3) రూపకం         4) అతిశయోక్తి     


6.    ‘విషయం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించే‘ అలంకారం ఏది?

1) అతిశయోక్తి       2) స్వభావోక్తి        

3) దీపకం           4)  యమకం 


7.     వలె, పోలె, అలా, అట్లు, కరణి, రీతి, భంగి...... వంటి, విధము మొదలైనవి-

1) ఉపమానం        2) ఉపమేయం     

3) సమాన ధర్మం       4) ఉపమా వాచకాలు  


8.     ఒకే పద్యంలో ఒకటి కంటే ఎక్కువ అలంకారాలు వాడటాన్ని ఏమంటారు?

1) సమాన ధర్మం      2) సామ్యం     

3) సంసృష్టి       4) స్వభావం


9. ‘స్వభావోక్తి’ని అలంకారంగా అంగీకరించని ఆలంకారికుడు ఎవరు?

1) మమ్మటుడు       2) కుంతకుడు     

3) దండి         4) భామహుడు


10. ‘అతిశయోక్తి సర్వలంకార బీజభూతము’ అన్నది?

1) కుంతకుడు         2) విశ్వనాథుడు       

3) మమ్మటుడు        4) దండి


11.     ‘అలంకారాలన్నీ వక్రోక్తులే’ అన్నది?

1) కుంతకుడు         2) భామహుడు       

3) ఉద్భటుడు          4) జయదేవుడు


12. ఉపమాలంకారంలో 12 బేధాలు చెప్పినవారు యాస్కుడు కాగా, ఉపమాలంకారాన్ని నటితో పోల్చింది ఎవరు?

1) ఉద్భటుడు        2) దండి     

3) విద్యానాథుడు          4) అయ్యప్ప దీక్షితులు


13. అననురూపములైన వానికి ఘటన వర్ణించిన అది ఏ అలంకారం?

1) సారా          2) విషమా         

3) అన్యోన్యాలంకారం      4) స్వభావోక్తి


14. వచియింతు వేములవాడ భీమన భంగి

నుద్దండలీల నొక్కొక్కమాటు

భాషింతు నన్నయ భట్టు మార్గంబున

నుభయ వాక్ప్రౌధి నొక్కొక్కమాటు.... 

అనే పద్యంలోని అలంకారం ఏది?

1) ఛేకానుప్రాస         2) అంత్యానుప్రాస     

3) లాటానుప్రాస       4) ఏదీకాదు


15. ‘మావిడాకులు తెచ్చివ్వండి’ ఇందులోని అలంకారం ఏది?

1) శ్లేష           2) ఉపమా           

3) ఉత్ప్రేక్ష             4) వృత్యానుప్రాస


16. ఎన్నడొస్తవు లేబరీ. 

పాలమూరి జాలరీ!.... ఈ పదాల్లో అలంకారం ఏది?

1) ఉపమా    2) రూపక     

3) అంత్యానుప్రాస       4) ఛేకానుప్రాస


17. లేమా! దనుజుల గెలువగ లేమా! నీ వేల కడగి లేచితివిటురా. ఇందులోని అలంకారం ఏమిటి?

1) అంత్యానుప్రాస       2) ఛేకానుప్రాస    

3) వృత్యానుప్రాస      4) యమకం


18. ‘రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది’.. ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.

1) వృత్యానుప్రాస         2) ఛేకానుప్రాస      

3) యమకం          4) ఉపమా


19. ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది’ ఇందులోని అలంకారాలు?

1) రూపక         2) దీపక    

3) ఉపమా       4) ఉత్ప్రేక్ష 


20. ‘ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్లు ఉన్నాయి.’ ఇందులోని అలంకారం ఏది?

1) ఉపమా           2) రూపక     

3) ఉత్ప్రేక్ష            4) స్వభావోక్తి


21. ‘చంద్రోదయం కాగానే, సరోజాలు జార స్త్రీల ముఖాలు సంకోచిస్తున్నాయి’ ఇందులోని అలంకారం ఏది?

1) తుల్యయోగిత        2) సమాసోక్తి    

3) పరికరం         4) ఉత్ప్రేక్ష


22. ‘చతుర్భుజుడైన దేవుడు, చతుర్విధ పురుషార్థాలనిస్తాడు’ ఇందులోని అలంకారం ఏది?

1) సమాసోక్తి           2) అవృత్తి దీపకం     

3) పరికరాంకురం        4) ప్రస్తుతాంకురం


23. ‘మేఘమాల వర్షము కాసాగింది. ఈ రాత్రి కూడా వర్షం కాసాగింది’ - ఇందులోని అలంకారం?

1) ఉపమా           2) ఉత్ప్రేక్ష      

3) పరికరాంకురం          4) అవృత్తి దీపకం 


24. ‘శత్రువును, మిత్రుని, విపత్తును - జయింపుము, రంజింపుము- భంజింపుము’ - ఇందులోని   అలంకారం.

1) కారణమాల         2) సారాలంకారం        

3) యథాసంఖ్య         4) పరివృత్తి


25. ‘మేఘాలు విషం త్రాగాయి. పథికాంగనలు మూర్ఛిల్లారు’ ఇందులోని అలంకారం ఏమిటి?

1) అధికాలంకారం        2) అసంగతం     

3) అల్పాలంకారం        4) అక్షేపాలంకారం


26. ‘అతడు బుద్ధియందు బృహస్పతి, కీర్తియందు  అర్జునుడు, విలు విద్య యందు భీష్ముడు’ ఇది ఏ అలంకారానికి ఉదాహరణ?

1) సారా         2) పరికర         

3) ఉత్ప్రేక్ష              4) ఉల్లేఖ


27. ‘ఏనుగు మదము చేతను, రాజు ప్రతాపం చేతను ప్రకాశిస్తున్నారు’ ఇందులోని అలంకారం ఏమిటి?

1) ఉల్లేఖ       2) దీపక    

3) దృష్టాంతం        4) అతిశయోక్తి


28. ఒక వస్తువుపై ఉపమాన ధర్మాన్ని ఆరోపిస్తే అది ఏ అలంకారం?

1) ప్రతీపం           2) రూపకం           

3) యమకం           4) ఉల్లేఖం


29. ‘విడిచిన పదాన్ని గ్రహించి చెప్పడం’లో ఉన్న అలంకారం ఏది?

1) యమకం             2) లాటానుప్రాస     

3) ఛేకానుప్రాస           4) ముక్తపద గ్రస్తం


30. ‘సరస్వతీ కంఠాభరణం’ అనే అలంకారశాస్త్ర గ్రంథం రాసింది?

1) రాజశేఖరుడు          2) దండి               

3) భోజుడు           4) మమ్మటుడు


31. వృత్యానుప్రాసాన్ని పన్నెండు విధాలుగా పేర్కొన్న అలంకారికుడు ఎవరు?

1) భోజుడు            2) భామహుడు       

3) దండి           4) రాజశేఖరుడు 


32. సమర్థన ప్రధానంగా ఉన్న అలంకారం ఏది?

1) అతిశయోక్తి           2) అర్థాంతరన్యాసం      

3) స్వభావోక్తి         4) దృష్టాంతô


33. ‘రెండు భిన్న విషయాలకు బింబ ప్రతిబింబ భావం సాధించితే’ - అది ఏ అలంకారం?

1) వ్యతిరేక         2) వినోక్తి        

3) సమాసోక్తి         4) దృష్టాంతô


34. వస్తువు ఉన్నదాని కంటే గొప్పగా చెబితే అది ఏ అలంకారం?

1) దృష్టాంతô           2) ఉపమా          

3) రూపకం          4) అతిశయోక్తి 


35. విషయాన్ని కల్పితమైన ఉపమానంతో పోలిస్తే? అది ఏ అలంకారం?

1) రూపక       2) ద్వీపక   

3) ఉత్ప్రేక్ష       4) వ్యాజనింద


36. ‘నిందతో స్తుతిగాని స్తుతితో నిందగాని చేస్తే? ఇందులో అలంకారం ఏమవుతుంది?

1) వ్యాజస్తుతి       2) వ్యాజనింద   

3) విభావన       4) ఆక్షేపం


37. ‘వస్తువు ఉన్నది ఉన్నట్లు చెబితే’ - అది?

1) వక్రోక్తి       2) స్వభావోక్తి   

3) చేకోక్తి       4) లోకోక్తి


38. ‘ఆకాశ పుష్పమాలికను ధరించి, వారాంగనను వశం చేసుకోవాలి’ ఇందులోని అలంకారం?

1) మిథ్యాధ్యవసితం       2) కారక దీపకం   

3) మాలా దీపకం       4) కారణమాల


39. శిరీష కుసుమ ఫేశలమైన శరీరమెక్కడ? ఆ మదన జ్వరమెక్కడ? - ఇందులో అలంకారం?

1) విశేషోక్తి       2) విషమ   

3) యథా సంఖ్య       4) ఉత్ప్రేక్ష


40. ‘హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, మహాత్ములకు అసాధ్యమేమున్నది’. ఇందులో అలంకారం?

1) అర్థాపత్తి       2) అర్థాంతరన్యాసం   

3) ప్రౌథోక్తి       4) పరివృత్తి


41. ఓ తుమ్మెదా! మాలతి యుండగా? ముళ్లతో నిండిన మొగలి నీకెందుకు? - ఇందులో అలంకారం?

1) అప్రస్తుత ప్రశంస       2) ప్రస్తుతాంకరం   

3) పరికరాంకురం       4) అవృత్తి దీపకం


42. ‘పతివ్రత తనలో స్నానం చేసి, తనను పవిత్రను చేయాలని గంగానది కోరుకుంటున్నది’ ఇందులో అలంకారం?

1) ఉల్లేఖం       2) ఉత్ప్రేక్ష   

3) ఉల్లాసం      4) ఉపమా


43. ‘చంద్రుడు చంద్రుని వలె కాంతిమంతుడు’-

1) అనన్వయం        2) అతిశయోక్తి   

3) దృష్టాంతం       4) రూపకం


44. ‘శీతాంశుధరుడైన శివుడు మీ తాపాన్ని పోగొట్టు గాక!’ ఇందులో అలంకారం?

1) పరికరం      2) శ్లేష   

3) సమాసోక్తి       4) రూపకం


45. ‘కమలం నీ కన్నులతో సమానం’ ఇందులో అలంకారం?

1) ఉపమా     2) ప్రతీపం   

3) లోకోక్తి      4) ఉత్ప్రేక్ష



సమాధానాలు 


1-2; 2-4; 3-1; 4-2; 5-4; 6-2; 7-4; 8-3; 9-4; 10-3; 11-2; 12-4; 13-2; 14-2; 15-1; 16-3; 17-4; 18-1; 19-3; 20-3; 21-1; 22-3; 23-4; 24-3; 25-2; 26-4; 27-2; 28-2; 29-4; 30-3; 31-1; 32-2; 33-4; 34-4;  35-3; 36-1; 37-2; 38-1; 39-2; 40-2;   41-2; 42-3; 43-1; 44-1; 45-2.


 

రచయిత: సూరె శ్రీనివాసులు 
 

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌