• facebook
  • whatsapp
  • telegram

భౌతికశాస్త్రం

అంతరిక్షంలో ఆకాశం నలుపు!


విశ్వం గమనంతోపాటు ప్రకృతిలో కంటికి కనిపించే ప్రతి కదలిక భౌతిక శాస్త్రంతో ముడిపడి ఉన్నదే. పదార్థాన్ని, స్థలకాలాల ద్వారా దాని కదలికలను, ప్రవర్తనను, శక్తిని, బలాలను అధ్యయనం చేసే విస్తృత పరిధి ఉన్న శాస్త్రమిది. ఆధునిక కాలంలో మానవుల అవసరాలకు తగినట్లుగా జరిగే ఉత్పత్తులు, ఆవిష్కరణలతో పాటు శక్తి అవసరాలు తీర్చే సాంకేతికతలన్నీ భౌతికశాస్త్రంలో భాగమే. ఇందులోని ప్రాథమికాంశాలు, నిత్యజీవిత అనువర్తనాలపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. శక్తి రూపాలైన విద్యుత్తు, కాంతి, ఉష్ణం ప్రదర్శించే ధర్మాలు, వాటిని కొలిచే ప్రమాణాలు, లోహ అలోహాల స్వభావాలు, కటకాల ఉపయోగాలు, నిత్యం మనం ఉపయోగించే యంత్రాలు పనిచేసే సూత్రాల గురించి తెలుసుకోవాలి.



మాదిరి ప్రశ్నలు 


1.    అగర్‌బత్తిని వెలిగించగానే దాని సువాసన అంతటా వ్యాపించడానికి కారణం?

1) వ్యాపనం     2) ఉత్పతనం  

3) సంపీడ్యత      4) వ్యాకోచం


2.     చెమట పట్టినప్పుడు, ఫ్యాన్‌ కింద కూర్చుంటే చల్లగా అనిపిస్తుంది. ఇందులో ఇమిడి ఉన్న ప్రక్రియ?

1) గుప్తోష్ణం      2) బాష్పీభవనం  

3) సాంద్రీకరణం      4) విశిష్టోష్ణం


3.     వేసవిలో కుక్కలు లాలాజలాన్ని నాలుకతో బయటకు వదలడానికి కారణమైన ప్రక్రియ?

1) ఉష్ణవహనం      2) ఉష్ణవికిరణం  

3) ఉష్ణసంవహనం      4) ఉష్ణదక్షత


4.     i1 + i3 + i5 = i2 + i4 + i6 ను తెలిపే నియమాన్ని గుర్తించండి.

1) లూప్‌ నియమం       2)  జంక్షన్‌ నియమం  

3) శ్రేణి సంధానం      4) సమాంతర సంధానం


5.     కిందివాటిలో అత్యధిక నిరోధకత ఉన్న లోహం?

1) టంగ్‌స్టన్‌   2) సిలికాన్‌   3) జింక్‌   4) నికెల్‌


6.     సౌర విద్యుత్‌ ఘటాలను దేనితో తయారు చేస్తారు?

1) బంగారం  2) వెండి   3) జింక్‌   4) సిలికాన్‌


7.     నిరోధం, కరెంట్, ఓల్టేజ్‌లను కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) అమ్మీటర్‌      2) ఓల్ట్‌మీటర్‌  

3) మల్టీమీటర్‌      4) గాల్వనోమీటర్‌


8.     కిందివాటిలో విద్యుత్‌ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం?

1) బొగ్గు   2) గ్రాఫైట్‌   3) అయోడిన్‌   4) గాజు


9.     ఫ్యూజ్‌వైర్‌ను ఏ లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు?

1) టిన్, మెర్క్యూరీ     2) లెడ్, కాపర్‌  

3) కాపర్, అల్యూమినియం    4) లెడ్, టిన్‌


10. ఏటీఎం కార్డు, సెక్యూరిటీ చెకింగ్‌ కోసం ఏర్పాటు చేసే ముఖద్వారాలు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి?

1) ఆంపియర్‌ కుడి చేతి నిబంధన    2) ఫ్లెమింగ్‌ ఎడమచేతి నిబంధన

3) ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ    4) కూలుంబ్‌ విలోమవర్గ నియమం


11. ఫొటో విద్యుత్తు ఘటంలో ఏ విధమైన మార్పు జరుగుతుంది?

1) విద్యుత్తుశక్తి ఉష్ణశక్తిగా      2) కాంతిశక్తి విద్యుత్తు శక్తిగా  

3) కాంతిశక్తి ఉష్ణశక్తిగా       4) విద్యుత్తుశక్తి కాంతిశక్తిగా


12. ట్రాన్సిస్టర్‌లో ఉపయోగించే మూలకాన్ని గుర్తించండి.

1) సిలికాన్‌   2) రాగి   3) సిల్వర్‌   4) జింక్‌


13. అనంత సంఖ్యలో ఆవేశాలు ఉన్న భూమి ఫలిత విద్యుత్తు పొటెన్షియల్‌ ఎన్ని ఓల్ట్‌లు?

1) శూన్యం 2) అనంతం 3) స్థిరం 4) చాలా ఎక్కువ


14. వాతావరణంలో అధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన లైట్లను ఉపయోగిస్తారు?

1) సోడియం ఆవిరి దీపాలు  2) పాదరసం ఆవిరి దీపాలు  3) నియాన్‌ దీపాలు  4) ఫ్లోరోసెంట్‌ ఆవిరి దీపాలు


15. అధిక ఉష్ణోగ్రత వద్ద అతివాహకతను ప్రదర్శించే పదార్థం?

1) పాదరసం   2) పింగాణి   3) రాగి  4) స్టీల్‌


16. వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం?

1) వ్యతికరణం          2) పరావర్తనం  

3) సంపూర్ణాంతర పరావర్తనం   4) విక్షేపణం


17. సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణమైన కాంతి ధర్మం?

1) కాంతి రుజుమార్గం      2) వక్రీభవనం  

3) ధ్రువణం      4) వ్యతికరణం


18. అంతరిక్షంలో ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?

1) ఎరుపు  2) నీలం  3) నలుపు  4) తెలుపు


19. మానవుడిపై ఏ కిరణాలు లేదా తరంగాలు పతనమైనప్పుడు విటమిన్‌-D ఉత్పత్తవుతుంది?

1) అతినీలలోహిత కిరణాలు    2) గామా కిరణాలు  

3) రేడియో తరంగాలు      4) పరారుణ కిరణాలు


20. నీటిపై నూనె పడినప్పుడు భిన్న రంగులు కనిపించడానికి కారణమైన కాంతి ధర్మం?

1) వ్యతికరణం       2) ధ్రువణం  

3) పరావర్తనం      4) వివర్తనం


21. శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా, వేడిగా ఉన్నట్లు తెలియజేసేదాన్ని ఏమంటారు?

1) ఉష్ణోగ్రత      2) ఉష్ణం  

3) వాతావరణం      4) శీతోష్ణస్థితి


22. ఒక మూసి ఉన్న పెట్టెలో మీరు ‘హలో’ అని అరిస్తే, అది మీకు హలో ఓఓఓఓ....... అని వినిపించే ధ్వని ధర్మం?

1) అతిధ్వని       2) ప్రతిధ్వని   

3) ప్రతినాదం       4) అనునాదం


23. సమతల దర్పణ లంబంతో ఒక పతన కిరణం 60° కోణం చేస్తే, దర్పణ తలానికి, పరావర్తన కిరణానికి మధ్య కోణం?

1) 0°   2) 30°   3) 60°   4) 90°


24. వస్తువుపై కలగజేసే బలాన్ని స్థిరంగా ఉంచి, దాని స్పర్శతల వైశాల్యాన్ని పెంచినప్పుడు పీడనం?

1) పెరుగుతుంది       2) స్థిరంగా ఉంటుంది   

3) తగ్గుతుంది       4) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది


25. రియర్‌ వ్యూ మిర్రర్‌లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు?

1) నిజ, పెద్దది       2) నిజ, చిన్నది   

3) మిథ్య, పెద్దది       4) మిథ్య, చిన్నది


26. కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశానికి, దూరానికి ఉన్న సంఖ్యాత్మక నిష్పత్తి?

1) ఎల్లప్పుడూ ఒకటి కంటే తక్కువ      2) ఎల్లప్పుడూ ఒకటికి సమానం        

3) ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ       4) ఏదీకాదు


27. యురేనస్‌ తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దొర్లుతున్నట్లుగా కనిపించడానికి కారణం?

1) బాహ్యగ్రహాల్లో ఇదొకటి       2) ఇది భూభ్రమణ అక్షంపై ఉంటుంది

3) భ్రమణాక్షం అత్యధికంగా వంగడం       4) మిగతా గ్రహాల కంటే దూరంగా ఉండటం


28. ఒక మూసి ఉన్న వలయంలో బల్బును బ్యాటరీకి కలపగానే వెలుగుతుంది. అలాంటి మూడు బల్బులను సమాంతరంగా అదే బ్యాటరీకి కలపగా?

1) బల్బు తీవ్రత తగ్గుతుంది       2) బల్బు తీవ్రత పెరుగుతుంది    

3) బల్బు తీవ్రత మారదు  4) బల్బులన్నీ వెలగవు


29. ఆరు అడుగుల పొడవున్న మనిషి ఒక దర్పణంలో తన పొడవును 2 అడుగుల పొడవైన నిటారు ప్రతిబింబంగా చూస్తే అది ఏ దర్పణం?

1) పుటాకార దర్పణం       2) కుంభాకార దర్పణం   

3) సమతల దర్పణం   4) సమతల పుటాకార దర్పణం


30. ఒక కాంతికిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి దర్పణంపై పతనం చెందితే పరావర్తనం కోణం విలువ?

1) 0°    2) 30°    3) 60°    4) 90°


31. ఏ గ్రహాల కక్ష్యల మధ్య ఆస్టరాయిడ్స్‌ ఉంటాయి?

1) కుజుడు, భూమి       2) కుజుడు, గురుడు   

3) గురుడు, శని       4) యురేనస్, నెప్ట్యూన్‌


32. గాలిలో అణువులు ముందుకు, వెనుకకు కదలడం ద్వారా ధ్వని మన చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగిస్తుందని తెలిపిన శాస్త్రవేత్త?

1) న్యూటన్‌       2) గెలీలియో   

3) బేకన్‌       4) పైథాగరస్‌


33. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో సభ్యత్వం ఉన్నవారు?

1) రోనాల్డ్‌రాస్‌       2) సి.వి.రామన్‌   

3) ఆయిర్‌స్టెడ్‌       4) మైకెల్‌ ఫారడే


34. కాంతి సంవత్సరం దేన్ని కొలిచే యూనిట్‌?

1) కాలం       2) దూరం    

3) ఘనపరిమాణం        4) వైశాల్యం


35. పొగమంచులో రంగు వలయాలకు కారణమైన కాంతి ధర్మం?

1) వ్యతికరణం       2) వివర్తనం   

3) పరావర్తనం       4) పరిక్షేపణం


36. నావికులకు అయస్కాంత దిశాధర్మం తెలిపే పరికరం?

1) మానోమీటర్‌       2) దిక్సూచి   

3) బారోమీటర్‌       4) గ్రావిటీమీటర్‌


37. కుంభాకార కటక సామర్థ్యం?

1) ధనాత్మకం       2) రుణాత్మకం   

3) అనంతం       4) శూన్యం


38. పుటాకార దర్పణానికి సంబంధించి సరైంది?

1) షేవింగ్‌ మిర్రర్‌       2) ఈఎన్‌టీ డాక్టర్లు ఉపయోగించే దర్పణం    

3) టార్చ్‌లైట్‌లో ఉపయోగించే దర్పణం       4) పైవన్నీ


39. గృహాల్లో వెలిగే బల్బులు సెకనుకు ఎన్నిసార్లు ఆరిపోయి వెలుగుతాయి?

1) 30 సార్లు       2) 50 సార్లు   

3) 100 సార్లు       4) 120 సార్లు


40. కంటి రెటీనాపై వస్తువు ప్రతిబింబం ఎంత కాలం పాటు నిల్వ ఉంటుంది?


41. కిందివాటిలో సమాచారాన్ని భద్రంగా ఉంచడానికి సహాయపడేది?

1) హాలోగ్రఫి వ్యతికరణ మాపకత   2) హాలోగ్రామ్‌ భద్రత  3) దత్తాంశ సంచయకారి   4) ధ్వని సంబంధ హాలోగ్రఫి 


42. ఖగోళ దూరాలను కొలిచే వాటిలో అతిపెద్ద ప్రమాణం?

1) పార్‌లాక్టిక్‌ సెకండ్‌        2) కాంతి సంవత్సరం  

3) ఆస్ట్రనామికల్‌ యూనిట్‌ 4) త్రిభుజీకరణ పద్ధతి


43. అమెరికాలో భారీ స్థాయి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని మొదటిసారిగా స్థాపించినవారు?

1) మైకెల్‌ ఫారడే   2) థామస్‌ ఆల్వా ఎడిసన్‌   

3) ఆయిర్‌స్టెడ్‌     4) లూగీ గాల్వాని


44. మొదటి థర్మామీటర్‌ను కనుక్కున్న గెలీలియో. దానిలో మొదటగా ఉపయోగించిన పదార్థం?

1) నీరు  2) పాదరసం  3) గాలి  4) ఆల్కహాల్‌


45. కిందివాటిలో ఉరుములు, మెరుపులు ఏర్పడే సమయంలో ప్రభావితమయ్యేవి?

1) టెలివిజన్‌       2) రేడియో   

3) సెల్‌ఫోన్‌       4) మోటార్‌ సైకిల్‌


46. కెల్విన్‌మానంలో ఉష్ణోగ్రతను ఏ విధంగా పిలుస్తారు?

1) విశిష్టోష్ణం       2) గుప్తోష్ణం   

3) ఉష్ణ దక్షత       4) పరమ ఉష్ణోగ్రత


47. ఘనపదార్థాల ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక కొలత?

1) సెంటీమీటర్‌       2) చదరపు సెంటీమీటర్‌   

3) ఘనపు సెంటీమీటర్‌     4) కిలోగ్రామ్‌


48. కిందివాటిలో సాలినాయిడ్‌ అంటే?

1) దండయస్కాంతం  2) చుట్టలు చుట్టిన తీగచుట్ట

3) గుర్రపునాడ అయస్కాంతం       4) సరళరేఖ లాంటి తీగ


సమాధానాలు

1-1; 2-2; 3-3; 4-2; 5-1; 6-4; 7-3; 8-2; 9-4; 10-3; 11-2; 12-1; 13-1; 14-4; 15-2; 16-3; 17-1; 18-3; 19-4; 20-1; 21-2; 22-3; 23-2; 24-3; 25-4; 26-1; 27-3; 28-3; 29-2; 30-1; 31-2; 32-4; 33-3; 34-2; 35-1; 36-2; 37-1; 38-4; 39-3; 40-2; 41-2; 42-1; 43-2; 44-3; 45-1; 46-4; 47-3; 48-2. 

Posted Date : 08-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌